manavi news

15:34 - August 18, 2017

మహిళా వార్తల సమాహారం..మానవి న్యూస్ తో మీ ముందుకు వచ్చింది.. ఇవాళ్టి మానవి...కామాంధుడి అఘాయిత్యానికి బలైన అబల, చదువుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించిన 91 సం. వృద్ధురాలు, వివాహానికి మేకప్ లేకుండా రెడీ అయితే ఫోటోలు దిగమన్న వధువు కుటుంబీకులు, మేకప్ లేకుండా వివాహానికి హాజరైన వధువు, భారత్, అమెరికన్ దౌత్యవేత్తపై భారతీయుల ప్రశంసలు, కారును వద్దన్న క్రికెటర్ రాజేశ్వరీ గైక్వాడ్, హైదరాబాద్ లో మహిళా కానిస్టేబుల్స్ కు మోటర్ బైక్స్, పెట్రోల్ పంప్ లో 50 రోజులు...3 కోట్లు...చంచల్ గూడ మహిళా ఖైదీలు.....
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:55 - August 15, 2017

బ్రిటీష్ వారి బానిన సంకెళ్లను తెంచి భరతమాత దాస్య విముక్తి కోసం భారతీయులు చేపట్టిన స్వాతంత్ర్య సమరంలో ఎన్నో కీలక ఘట్టాలు. మరెన్నో స్ఫూర్తిదాయక పిలుపులు. ఈ చారిత్రక ఘట్టాలలో పురుషులతో పాటు స్త్రీలు కూడా అద్భుతమైన సాహసాలను ప్రదర్శించారు. బ్రిటీష్ పాలకుల నుండి విముక్తి పొంది స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను జరుపుకుంటున్న ఈ తరుణంలో స్వాతంత్ర్య సమయంలో ఉద్యమ పోరాటపటిమను ప్రదర్శించిన మహిళల కీర్తి కేతనాలపై  మానవి స్పెషల్ ఫోకస్..

మహిళలు బయటికి రావడమే అరుదైన తరుణంలో స్వాతంత్య్ర సంగ్రామ ఉద్యమంలో పురుషులతో సమానంగా ఉద్యమంలో పాల్గొన్నారు. భరతమాత దాస్య సంకెళ్లను తెంచేందుకు  స్వతంత్ర పోరాట ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. తమ ప్రసంగాలతో, పాటలతో, నాటకాలతో, కవితలతో, బుర్రకథలో ఎవరికి వారు బ్రిటీష్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రజలలో స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని రగిలించారు. వీరిలో సరోజినీ నాయుడిని ప్రముఖంగా చెప్పుకోవాలి. 

ఆడపిల్ల అంటే పెండ్లి చేసుకుని పిల్లల్ని కని ఇంటిలో పడివుండే పరిస్థితి ఆనాటి సమాజానిది. బాల్యంలో భర్తను కోల్పోయి వితంతువయినా బేలగా మారలేదు. బేజారుపడలేదు. దేశమాతకోసం స్వతంత్ర్య సమరంలో పాల్గొని జైలు వెళ్ళిన  ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ. 

భయం అంటే ఏమిటో తెలియని స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాభాయి దేశ్ ముఖ్.  మహిళా సాధికారత కోసం పాటుపడిన సామాజిక కార్యకర్తగా ఆమె  పేరుపొందారు. భారత సామాజిక సర్వీస్ మదర్ గా పేరొందిన ఆమె మహిళలకు చేసిన సేవలు అసామాన్యమైనవి.

మాతా శిశుల ఆరోగ్యంగా వుంటేనే దేశం అభివృద్ది చెందుతుంది అని నమ్మే వ్యక్తి వైద్యురాలు  కొమర్రాజు అచ్చమాంబ. వారి ఆరోగ్యమే దేశాభివృద్దికి కొలమానం అని చాటి చెప్పిన ఉద్యమకారణి,  స్వాతంత్ర్య సమర యోధురాలు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ.  

కెప్టెన్ లక్ష్మీ సెహగల్.  భారత స్వతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ తరఫున కదంతొక్కిన వీర వనిత. అభినవ ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరుతెచ్చుకున్న ధీరవనిత లక్ష్మీ సెహగల్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఝాన్సీరాణి రెజిమెంట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలిమహిళగా లక్ష్మీ సెహగల్ చరిత్రలో నిలిచిపోయారు. 

 

ధైర్యంలో నేటి యువత సైతం స్ఫూర్తిగా తీసుకునే వీర వనిత ఝాన్సీ లక్ష్మీ భాయి. అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించినవారిని ఈమెతోనే పోలుస్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె సాహసాలు మహిళలపై ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయో. మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి. 

స్వాతంత్రోద్యమంలో  గాంధీకి వెన్నుదన్నుగా నిలిచి అర్థాంగి అనే పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన చైతన్య శీలి, అద్భుతమైన, అరుదైన మహిళ కస్తూరిబాయి. అంతేకాదు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించిన మహిళ కస్తూర్భా గాంధీ. 

భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విముక్తి చేయటానికి బ్రిటిష్‌ పాలకుల వలస విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ లేకుండ, స్త్రీ-పురుష లింగభేదం లేకుండ భారతీయులు ఏకత్రాటిపై పోరాడారు. స్వతంత్ర సమరంలో పురుషులు జైళ్లకెళితే వారి భార్యల మీద సంసారభారం పడింది. అత్తమామల సంరక్షణ, పిల్లల పెంపకం అన్నీ వారి భార్యలే భరించారు. ఆర్థికస్తోమత లేనివారు పేదరికంతో అష్టకష్టాలు పడి భర్తలు వచ్చేవరకు కుటుంబాలను సాకారు. ఒకప్రక్క పోలీసుల జులుం, మరోప్రక్క గూఢచారుల నిఘా అన్నీ భరించారు.ఈ క్రమంలో వైవాహిక జీవితాలను సైతం వదులుకున్నవారు. 

అరుణ అసఫ్ అలీ స్వాతంత్రోద్యమంలో ఆమె పాత్ర చెప్పుకోదగినది. గాంధీ నమ్మకాన్ని పొంది ఆయన జైలుకెళ్లిన సందర్భంగా ఉద్యమానికి నాయకత్వం వహించిన వనిత అరుణ అసఫ్ అలీ. 

భారత స్వాతంత్య్ర సమరోజ్వల చరిత్రలో ముస్లిం మహిళలు కూడా పురుషులతో దీటుగా తమదైన వీరోచిత పాత్ర నిర్వహించారు. స్వాతంత్రసమరంలో ప్రధాన పాత్ర వహించిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన స్త్రీలు తమ అపూర్వ త్యాగాలతో..చరిత్ర పుటలను ఎరుపెక్కించారు. వారిలో అవధ్‌ రాణి బేగం హజరత్‌ మహల్‌ ను  అగ్రగామిగా చెప్పుకుని తీరాల్సిందే. 

ఆనాటి పోరాటంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువును మట్టు పెట్టేందుకు కదనరంగానికి కదలిన వారిలో బేగం అజీజున్‌ ఒకరు. సాహసిగా పేరొందిన హబీబా బేగం, ఝూన్సీ రాణి కోసం ప్రాణాలర్పించిన ముందర్‌, బ్రిటీషు సైనిక మూకలను సాయుధంగా ఎదుర్కొన్న బేగం రహిమా, మాతృభూమికోసం  సజీవదహనమైన అస్గరి బేగం, ఆంగ్ల సైన్యాలను  ముప్పుతిప్పలు పెట్టిన  బేగం జవిూలా, కత్తిపట్టి కదనరంగాన శతృవును సవాల్‌ చేసిన సాహసి బేగం ఉమ్‌ద్దా.. ఇలా ఎందరో ఎందరో  వీరనారీమణుల పోరాటపటిమను వర్ణించేందుకు మాటలు చాలవు. చరిత్ర నమోదు ప్రకారం స్వతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వందలాది ముస్లిం మహిళలు కాల్చివేయబడ్డారు, ఉరితీయబడ్డారు. తీవ్రమైన  అవమానాలకు,అత్యాచారాలకు గురయ్యారు. 

అలనాటి ముస్లిం మహిళామణుల త్యామయపోరాట చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని బ్రిటీష్‌ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే, ఆ వీరనారీమణుల త్యాగాలు ఎంతటి మహత్తరమైనవో అర్థం చేసుకోవచ్చు.

ఆబాది బానో బేగం  బాటలో నడిచిన ఎందరో మహిళా మణులున్నారు.  నిషాతున్నీసా బేగం, షౌకత్‌ అలీ భార్య  అంజాదీ బేగం, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు స్ఫూర్తిగా నిల్చిన జులేఖా బేగం, స్వాతంత్రేచ్ఛను రగిల్చే సాహిత్యాన్ని సృష్టించిన కవయిత్రి జాహిదా ఖాతూన్‌, ఆలోచనాత్మక ప్రసంగాలకు పెట్టింది పేరైన అక్బరీ బేగం. బ్రిటీష్‌ పోలీసులు గుర్రాలచేత తొక్కించినా, లాఠీలతో రక్తసిక్తం చేసినా పోరుబాట వీడని  హవిూదా తయ్యాబ్జీ, అవిూనా తయ్యాబ్జీ, షఫాతున్నిసా బేగం, ఆదర్శ జాతీయవాదిగా ఖ్యాతిగాంచిన మజీదా బాను, బానిసత్వం కంటే మరణమే మేలని చాటిన బేగం మహమ్మద్‌ ఆలంలు జాతీయోద్యమంలో ప్రముఖపాత్ర వహించారు.  మాతృదేశ విముక్తికోసం ప్రాణాలర్పించిన  మహిళా కేతనాలకు మానవి జోహార్లర్పిస్తోంది. 

15:02 - August 11, 2017
14:50 - July 27, 2017
13:43 - June 30, 2017

మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్ కు స్వాగతం...దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా వార్తలను వీడియోలో చూద్దాం....

12:51 - June 9, 2017

17 సంవత్సరాల ఇంద్రాణిదాస్ కు న్యూరో శోదనాలే ఆమె ఆటవిడుపు ఇటివల అమెరికాలో జరిగిన సైన్స్ టాలెంట్ విజేతగా నిలిచి రూ.1.6 కోట్ల బహుమతి గెలుచుకున్నారు....అమెరికాలో ప్రతిష్టత్మకంగా నిర్వహించిన స్పెల్లింగ్ బీ పోటీలో భారతీయ మూలాలున్న విద్యార్థులు మరోసారి తమ సత్తా నిరూపించుకున్నారు, ప్రథమ, ద్వితీయ స్థానాలను వారే గెలుచుకున్నారు......ఐసీస్ ఉగ్రముకల చేతికి చిక్కిన మహిళల దుస్థితి ఊహించకోవడానికి భీతవహాంగా ఉంటుంది....ఉగ్రవాదుల బారిన పడి మూడేళ్ల తర్వాత స్వంత ఇంటికి చేరింది ఓ యువతి.....త్వరలో భారత ఆర్మీలోకి మహిళలు కాలు పెట్టబోతున్నారు...త్వరలో దీనిని అమల్లోకి తీసుకొస్తామని బీపిన్ రావత్ తెలిపారు....

12:36 - May 26, 2017
12:41 - May 12, 2017
12:56 - May 3, 2017

హైదరాబాద్ : ఇటివలి నిర్వహించిన ఒక సర్వేలో వరకట్నపు వేధింపులతో రోజుకు 20 మరణిస్తున్నారని తెల్చింది. దీంట్లో అగ్ర స్థానంలో నిలిచింది ఢిల్లీ ....ఎందుకు ఈ వరకట్న వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి...వరకట్నపు వేధింపులకు సంబంధించి ఏ చట్టలు ఉన్నాయి...మహిళలు ఏవిధంగా ఆశ్రయించాలో తెలపాడానికి అడ్వకేట్ పార్వతి గారి న్యాయ సలహాలు, సూచనలు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

 

17:33 - April 13, 2017

ఇంటిముందు అడుకుంటున్న చిన్నారి ఒకేసారి కనిపించకుండా పోతుంది. పక్కింటికి వెళ్లిన కుతూరు తిరిగిరాదు. ఇటువంటి సంఘటనలు నిత్యం జరుగుతుంటాయి. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు అదృశ్యం అవుతున్నారు. ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి ? పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

Pages

Don't Miss

Subscribe to RSS - manavi news