manchu manoj

21:45 - March 3, 2017

విజయ దేవరకొండ హీరోగా, పూజా జవేరి హీరోయన్ గా శ్రీనివాస రవీంద్ర రచించి, దర్శకత్వం వహించి తెరకెక్కించిన చిత్రం 'ద్వారక'..ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రద్యుమన్న చంద్రపాటి, గణేష్ పెనుబోతు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరి సినిమా ఎలా ఉంది...? ప్రేక్షకులు ఫీలింగ్స్ ఏమిటీ...? సినిమా రేటంగ్ వంటి వివరాలను వీడియోలో చూద్దాం...

21:41 - March 3, 2017

జోకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ప్రజ్ఞాజైస్వాల్ హీరోయిన్ గా నటించిన సత్య డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం గుంటురోడు ఇవాళ విడుదలైంది. సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులు ఫీలింగ్స్, రివ్యూ, రేటింగ్ వివరాలను వీడియోలో చూద్దాం...

13:40 - March 1, 2017

యంగ్ హీరో లు హిట్ కొట్టాలంటే సీనియర్స్ ని సపోర్ట్ అడగాలి అని తెలుసుకున్నట్టు ఉన్నారు నయా ట్రెండ్ హీరోలు . కామిడి టచ్ తో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా లు ఇండస్ట్రీ లో సేఫ్ జోన్స్ గా మారాయి. మంచు మనోజ్ హీరో  గా వస్తున్నసినిమా గుంటూరోడు. ఎస్ కే సత్య డైరెక్టర్ గా తెరెకెక్కుతున్న ఈ  సినిమా లో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది .ఈ సినిమా యూత్ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సినిమా యూనిట్ చెప్తుంది  .రీసెంట్ గా రిలీజ్ ఐన   ఈ చిత్ర ట్రైలర్ కి, ఆడియో కి యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ రెస్పాన్స్ రావడం విశేషం. ఈ సినిమా కి మెగా ఎట్రాక్షన్ ఒకటి ఆడ్ అయింది .ఈ సినిమా లో ఒక వాయిస్ ఓవర్ వినిపించబోతుందట ఆ వాయిస్ ఓవర్ విశేషాలు గుంటూరోడు టీం తెలియచేసారు. 
మల్టి టాస్కింగ్ లో మెగాస్టార్ బిజీ  
ఒక వైపు హిట్ సినిమా తో రీ ఎంట్రీ ,మరో వైపు టివి ఛానల్ లో రియాలిటీ షోస్ ఇలా మల్టి టాస్కింగ్ లో బిజీ అయిపోయాడు మెగాస్టార్ .సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని ఫిక్స్ ఐన ఈ మెగాస్టార్ ఈ మధ్య చాల ఫ్రీ గా మూవ్ అవుతున్నాడు . హాలీవుడ్ స్టైల్ మేకింగ్ తో ఆడియన్స్ మైండ్ లో ఎక్సపెక్టషన్స్ క్రేయేట్ చేసిన రీసెంట్ ఫిలిం ఘాజి  .ఘాజి సినిమాలో ఒక స్పెషల్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది ఆ వాయిస్ మెగాస్టార్ చిరంజీవిది .గతం లో చిరంజీవి  తన గొంతును ఇచ్చి   సినిమా హైప్ పెంచిన సందర్భాలు ఉన్నాయ్ .హనుమాన్ అనే యానిమేటెడ్ ఫిలిం కి వరుడు ,రుద్రమ దేవి ప్రస్తుతం హిట్ కొట్టిన  ఘాజి.. ఈ సినిమాలకి తన వాయిస్ ఇచ్చాడు చిరంజీవి .
గుంటూరోడు సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ 
ఇప్పుడు మంచు మనోజ్ నటిస్తున్న గుంటూరోడు సినిమా కి కూడా చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.ఫస్ట్ ఈ వాయిస్ ఓవర్ కోసం రామ్ చరణ్ తేజ్ ని అనుకున్నా రామ్ చరణ్ అవైలబుల్ గా లేదని చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించినట్టు సినీ ఇన్ఫర్మేషన్ .సినిమా స్వర్ణోస్త్సవ వేడుకలనుండి కూడా చిరంజీవికి మోహన బాబుకి మధ్య వీలు దొరికినప్పుడల్లా  మాటల యుద్ధం అవుతూ ఉంది . మోహన్ బాబు కి చిరంజీవికి మధ్య విబేధాలు అప్పుడప్పుడు బయటపడుతున్న గాని అవేమి లేవు మేము ఎప్పటికైనా మిత్రులమే అని చెప్పటానికి ఇదో ఎగ్జామ్పుల్ అనుకోవచ్చు .సినిమా ఇండస్ట్రీ లో యూనిటీ అనేది పెంచడానికి చిరు ఇలా స్టెప్ వేశాడా అనేది డిస్కషన్ పాయింట్ అయింది .ఏది ఏమైనా ఎప్పటినుండో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న మంచు ఫామిలీకి ఈ సరైన గుంటూరోడు హిట్ ఇస్తాడో లేదో చూడాలి .   

20:26 - February 28, 2017

ప్రజ్ఞాజైస్వాల్ తో 10 టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన సినిమా అనుభావాలును తెలిపారు. తన సినీ కెరీర్ గురించి వివరించారు. ఆమె పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆమె తెలిపిన మరిన్ని విశేషాలను వీడియోలో చూద్దాం....

 

09:56 - January 23, 2017

'మంచు మనోజ్ ' సీనియర్ స్టార్ తో పోటీకి సై అంటున్నాడు. అసలే సక్సెస్ లు లేని ఈ 'మంచు' బాబు వరుస సక్సెస్ ల్లో ఉన్న సీనియర్ స్టార్ తో పోటీ పడుతుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది . అయితే కంటెంట్ కాపాడుతుందని 'మంచు' హీరో కాన్పిడెంట్ గా ఉన్నాడు. 'మంచు మనోజ్' 'పోటుగాడు’, 'కరెంటు తీగ' సినిమాలతో రెండేళ్ల కిందట మంచి ఊపులో కనిపించాడు. కానీ గత ఏడాది 'శౌర్య’, 'ఎటాక్' సినిమాలు ఈ 'మంచు' హీరోని బాగా నిరాశపరిచాయి. 'శౌర్య'తో కొత్తగా ట్రై చేద్దామని ప్రయత్నించి ఫెయిలవడంతో ఈసారి తనదైన స్టయిల్ లో 'గుంటూరోడి'గా మాస్ మసాలా సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ 'గుంటూరోడి'పై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ మూవీని ఓ సీనియర్ స్టార్ మూవీకి పోటీగా రిలీజ్ చేస్తుండడమే అనుమానాలకు తావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం 'గుంటూరోడు' ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తుందట.

భక్తిరసం..మాస్ మసాల..
ఇదే డేట్ కి 'నాగార్జున' 'ఓం నమో వెంకటేశాయ' కూడా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అసలే 'నాగ్' వరుస సక్సెస్ లతో పుల్ స్వీంగ్ లో ఉన్నాడు. దీనికి తోడు రాఘవేంద్రరావు లాంటి సీనియర్ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించడం కూడా 'నమో వెంకటేశాయా' సినిమాకు ప్లస్ పాయింట్. అయితే నాగార్జునతో బాక్సాఫీసు పోటీలో నిలుస్తున్నప్పటికి మంచు మనోజ్ తన సినిమా కంటెంట్ పై కాన్పిడెంట్ గా ఉన్నాడు. 'నాగార్జున' సినిమాతో 'మనోజ్' పోటీగా రావడానికి కాన్సెప్ట్ లే రీజన్ గా కనిపిస్తున్నాయట. 'నాగ్' మూవీ 'ఓం నమో వెంకటేశాయా' ఆధ్యాత్మిక భక్తి రస చిత్రం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే 'మనోజ్' 'గుంటూరోడు' మాత్రం పక్కా మాస్ మసాలా సినిమాగా తెరకెక్కింది. ఈ రెండు సినిమాలకు ఎక్కడ పోంతనే లేదు. ఈ కారణం వల్లనే 'మనోజ్' తన సినిమాపై కాన్పిడెంట్ గా ఉన్నాడట. అన్నట్లు రెండు సినిమాల్లో హీరోయిన్ గా 'ప్రగ్యా జైస్వల్' నటించడం విశేషం.

20:48 - March 4, 2016

కొత్తరకం వంటకం చేయాలని బిర్యానీలో బెల్లం వేస్తే దరిద్రంగా ఉంటుంది. అలాగే...ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నామనే పేరుతో తలతిక్క ప్రయోగాలను చేస్తే తిరస్కరిస్తాం. తన ఇమేజ్ కు భిన్నంగా మంచు మనోజ్ చేసిన శౌర్య...ఇలాగే తలతిక్కగా తయారైంది. తన సినిమా కాని సినిమాను దశరథ్, తన ఇమేజ్ కు పనికిరాని సబ్జెక్ట్ ను మనోజ్ చేయడం వల్ల శౌర్య ఎవరికీ అర్థం కాని సినిమాగా తయారైంది. 
కథ....
శౌర్య విదేశాల్లో డిగ్రీ చదివిన కుర్రాడు. ఇక్కడ ఇనిస్ట్యూట్స్ లో పనిచేస్తుంటాడు. నేత్ర అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఓ పెళ్లి సందర్భంలో కలిసిన శౌర్యను నేత్ర కూడా ఇష్టపడతుంది. వీళ్లిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. నేత్ర పెళ్లికి వెళ్లిన ఇంట్లో...పెళ్లికూతురు మరో కుర్రాడితో లేచిపోతుంది. ఈ విషయంలో పెళ్లి కూతురికి శౌర్య సహకరిస్తాడు. శౌర్య  ఫ్రెండ్ అయినందువల్ల నేత్రను కుటుంబ సభ్యులంతా నిందిస్తారు. ఐతే  పెళ్లి కూతురుకు లవ్ మ్యారేజ్ చేయడంలో వాస్తవాన్ని తెల్సుకున్న నేత్ర ..శౌర్యను అర్థం చేసుకుంటుంది. వీళ్లిద్దరి స్నేహం ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ వ్యవహారం నచ్చని నేత్ర బాబాయ్ సుబ్బరాజు నేత్రను హత్య చేయిస్తాడు. ఐతే...ఆ హత్య  నేనే చేశానని కోర్టులో చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేస్తాడు శౌర్య. తన ప్రేమికురాలిని తానే హత్య చేశానని శౌర్య ఎందుకు చేశాడు..అసలు జరిగిందేంటి అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
శౌర్య సినిమాను థ్రిల్లర్ గా ప్రచారం చేసుకున్నాడు దర్శక నిర్మాతలు ఐతే..ఇందులో థ్రిల్లింగ్ చేసే అంశాలేవీ ఉండవు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో మొదలైన ఈ సినిమా...ఎటు నుంచి ఎటు వెళ్తుందో అర్థం కాదు. ఫ్లాష్ బ్యాక్ లో మళ్లీ రెండు మూడు ఫ్లాష్ బ్యాక్ లు ఉండటం వల్ల ఇంటర్వెల్ టైం కే...అంతా గందరగోళంగా తయారయ్యింది. నేత్ర, శౌర్య ఒకరినొకరు ఇష్టపడ్డా.. సగం సినిమా అయ్యేదాకా చెప్పుకోరు. దీంతో లవ్ ట్రాక్ ఎక్కేందుకే హాఫ్ పార్ట్ అయిపోతుంది. స్లో నెరేషన్ సినిమాను చంపేసింది. థియేటర్లోకి వెళ్లిన కాసేపటికే సినిమా ఎప్పుడు పూర్తవుతుందిరా బాబోయ్ అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత పనికిమాలిన బ్రహ్మానందం ఎపిసోడ్ ఒకటి తగిలించి ప్రాణాలు తీస్తారు. హీరోను వదిలేయాలి కాబట్టి...అన్ని హత్యలు చేసినా..హీరోను పోలీసులు వదిలేస్తారు. మనోజ్ బాగా ఉబ్బిపోయి ఉన్నాడు. హార్వర్డ్ లో చదివిన యువకుడిలా అస్సలు లేడు. రెజీనా బాగా ఎడవడానికి పనికొచ్చింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెత్తగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సీరియల్ ను తలపించాయి. డైలీ సీరియల్ ఇంతకంటే బాగుంటుందేమో. శౌర్య దర్శకుడిగా దశరథ్ కు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. నటుడిగా మనోజ్ కూ అంతే. ఈ డైరక్టర్ తనకు వచ్చిన ఫ్యామిలీ సబ్జెక్టులే చేసుకుంటే బెటర్. ఇక మనోజ్ బాబు థ్రిల్లర్ అనే పేరుతో ఇలాంటి విష ప్రయోగాలు ప్రేక్షకుల మీద చేయకుండా ఉంటే ఇంకా మంచిది.
 

ఫ్లస్ పాయింట్స్

ఏమీ లేవు

మైనస్ పాయింట్స్

1. మనోజ్ యాక్టింగ్
2. నేలబారు ప్రొడక్షన్ వ్యాల్యూస్
3. క్లారిటీ లేని దర్శకత్వం
4. గందరగోళమైన స్క్రీన్ ప్లే 
5. విసుగెత్తించే స్లో నెరేషన్
6. బ్రహ్మానందం సీన్స్

11:57 - February 28, 2016

హైదరాబాద్ : సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే ఆయా దేశాలు అభివృద్ధి చెందుతాయన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో రోట్‌కాన్‌ 10కే జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్‌రెడ్డి, సినీ హీరో మంచు మనోజ్‌ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు. 10కే రన్‌లో పెద్ద ఎత్తున యువత పాల్గొంది. వంద శాతం అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేస్తామని జగదీష్‌రెడ్డి అన్నారు. ఇక ప్రైవేట్‌ విద్యాసంస్థలు కూడా తాము ఆర్జించే సంపాదనలో 25 శాతం సమాజం కోసం ఖర్చు చేయాలని హీరో మంచు మనోజ్ అన్నారు. 

19:37 - February 7, 2016

చిత్తూరు : జిల్లాలోని చంద్రగిరి మండలం రామిరెడ్డి గారిపల్లెలో ఈ ఉదయం పెద్ద ఎత్తున జల్లికట్టు పోటీలు జరిగాయి. నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు హీరో మనోజ్ ఈ వేడుకకు హాజరయ్యారు. పోటీల అనంతరం మోహన్‌బాబు మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఈ పోటీలు సాంప్రదాయంగా వస్తున్న ఆచారాలని జంతువులకు ఏ హానీ జరగకుండా పోటీలు నిర్వహించారని మంచు మనోజ్‌ అన్నారు.

 

10:22 - February 2, 2016

మంచు మనోజ్‌, రెజీనా జంటగా దశరథ్‌ దర్శకత్వంలో బేబీ త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన మంచు మోహన్‌బాబు ఆడియో బిగ్‌ సిడీని రిలీజ్‌ చేయగా, బి.గోపాల్‌ పాటల సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, 'మనోజ్‌తో దశరథ్‌ మా బ్యానర్‌లో 'శ్రీ' అనే సినిమా చేశారు. ఇప్పుడు 'శౌర్య' చేస్తున్నారు. మనోజ్‌ ఎలాంటి పాత్ర చేస్తే చూడాలనుకున్నానో అలాంటి క్యారెక్టర్‌ ఈ చిత్రంలో చేస్తున్నాడు. సంగీత దర్శకుడు వేదా చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. భవిష్యత్‌లో తను గొప్ప మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుతాడు. నిర్మాత శివకుమార్‌ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. దర్శక, నిర్మాతలకు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమవుతుంది' అని అన్నారు. 'మంచి కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని బి.గోపాల్‌ తెలిపారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ, 'శివకుమార్‌ మంచి అభిరుచి ఉన్న నిర్మాత. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలొస్తాయి' అని చెప్పారు. మనోజ్‌ మాట్లాడుతూ, 'సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కచ్చితంగా ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను' అని చెప్పారు.

 

13:46 - January 27, 2016

మంచు మనోజ్‌, రెజీనా జంటగా దశరథ్‌ దర్శకత్వంలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి బ్యానర్‌పై శివకుమార్‌ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. త్వరలో ఆడియో విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, ' థ్రిల్లర్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మనోజ్‌ సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో ఇప్పటి వరకు నటించిన డిఫరెంట్‌ లుక్‌తో కనిపించబోతున్నారు. క్లాస్‌ దర్శకుడు, మాస్‌ హీరోగా కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మనోజ్‌ నటన, రెజీనా గ్లామర్‌ సిని మాకు హైలైట్‌గా నిలుస్తుంది. వేదా.కె.సంగీతం అందిం చిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జనవరి 31 శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వ హించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం' అని అన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - manchu manoj