manthani

18:48 - May 2, 2018

కరీంనగర్ : మంధనిలో ఓ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేత, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో కాకతీయ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. మంథనిలోని తమ్మిచెరువు కట్ట ఆధునీకరణ పనులను కాంట్రాక్టర్ చేపడుతున్నాడు. చెరువు కట్టపైనున్న అతి ప్రాచీనమైన శివలింగాన్ని..మహానంది విగ్రహాన్ని తొలగించడంతో కలకలం రేగింది. కాంట్రాక్టర్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని, ఎనిమిది శివలింగాల్లో ఈ విగ్రహం పురాతనమైందని టీఆర్ఎస్ నేత సునీల్ రెడ్డి పేర్కొన్నారు. వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, శివలింగాన్ని పునప్రతిష్ట చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 

17:40 - January 3, 2018

పెద్దపల్లి : టెన్‌టీవీ ప్రజలతో మమేకమై... ప్రజా మన్ననలు పొందుతోందని మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ అన్నారు... అదే ఒరవడిని కొనసాగిస్తూ... మరింతగా సమస్యలను వెలుగులోకి తేవాలని కోరారు... టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మధుకర్... టెన్‌టీవీ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా నిలవాలన్నారు.

16:12 - January 1, 2018

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా మంథని ప్రబుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను మంత్రి ఈటల ప్రారంభించారు. ఈటల కాలేజీ నుంచి వెళ్లిపోగానే తరగతి గదిలో కాంట్రాక్టర్ శ్రీనివాస్ సహచరుడు మద్యం సేవించాడు. శ్రీనివాస్ మద్యం తాగుతున్న కాలేజీ సిబ్బంతి పట్టించుకోవడం లేదు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:43 - December 30, 2017

పెద్దపల్లి : జిల్లాలోని మంథనిలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్‌ రెడ్డి 10టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కరానికి 10 టీవీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. 10 టీవీ కార్యక్రమాలు ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించేలా ఉన్నాయని, రెండు రాష్ట్రాల ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకుందన్నారు. ఈ సందర్భంగా 10 టీవీ ప్రేక్షకులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 

10:48 - November 3, 2017

పెద్దపల్లి : జిల్లాలోని మంథనిలో అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలపై స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సునీల్‌రెడ్డితో పాటు వ్యక్తిత్వ వికాస నిపుణుడు లక్కరాజు శ్రీచరణ్‌, పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తమ ట్రస్ట్ ద్వారా విద్యార్ధులు కోరుకున్న అంశాల్లో శిక్షణ ఇచ్చి నిపుణులుగా తీర్చిదిద్దుతామని ట్రస్ట్‌ చైర్మన్ సునీల్‌రెడ్డి తెలిపారు. 

08:03 - October 20, 2017

కరీంనగర్/పెద్దపల్లి : మంథని టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే పుట్ట మధు, టిఆర్ఎస్ యువ నేత చంద్రుపట్ల సునీల్ రెడ్డి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మంథనిలో పార్టీ విస్తృతికి సునీల్‌రెడ్డి కుటుంబం పనిచేసినప్పటికీ గత ఎన్నికల్లో చుక్కెదురైది. మాజీ మంత్రి శ్రీధర్ బాబు ను ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం పుట్ట మధుకు టిక్కెట్‌ ఇచ్చింది. ఈవిషయంలో కేసీఆర్‌ కుమార్తె కవిత చక్రం తిప్పారు. పార్టీ కోసం శ్రమించిన సునిల్ రెడ్డి, ఈయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి టీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని షాక్ ఇవ్వడంతో మూడేళ్ల అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ క్రియాశీలకంగా మారిన సునీల్‌రెడ్డి తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో మంథని టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి.

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెడ్డ పేరు
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్ట మధు చేతిలో శ్రీధర్‌బాబు ప్రజా వ్యతిరేకత కారణంగా ఓడిపోయారు. మధుకు బీసీ మద్దతు ఉండటంతో విజయం సాధించారు. మధు గెలుపుతో మంథని అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని భావించిన నియోజకవర్గ ప్రజలకు నిరాశే ఎదురైంది. కొన్ని వివాదాలు ఇటు మధుతోపాటు, అటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. పద్ధతి మార్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు సందర్భాల్లో మధును హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడం.. పార్టీ అధినాయకత్వం ఇతని విషయాలను నిశితంగా పరిశీలిస్తోంది. మధుకర్‌ అనుమానాస్పద మృతి, అధికారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు, కాంగ్రెస్‌ నేతలపై దాడుల కేసులు, మంథనిలో విగ్రహాల ధ్వంసం కుట్రల వెనుక ఎమ్మెల్యే పుట్ట మధు హస్తం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

132 మంది తాత్కాలిక ఉద్యోగులు తొలగింపు
ఎమ్మెల్యే మధు వ్యవహర శైలిపై టీఆర్‌ఎస్‌లో చాలా మందికి నచ్చడంలేదు. మంథని జెఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీలో 132 మంది తాత్కాలిక ఉద్యోగులు తొలగింపు వివాదం కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పరిణమించింది. కమాన్‌పూర్ మండల టీఆర్‌ఎస్‌ నేతలను పార్టీని నుంచి సస్పెండ్ చేయాడం ప్రస్తుతం వివాదంగా మారింది. సస్పెండ్ అయిన వారంత సెల్ టవర్ ఎక్కి ఆందోళన కోనసాగించి సునీల్ రెడ్డి నేతృత్వంలో మధుకు వ్యతిరేకంగా పార్టీ అధినాయకత్వానికి పిర్యాదు చేయాలని నిర్ణయించడం ఎమ్మెల్యేకి నష్టం కలించే అంశంగా భావిస్తున్నారు. వీరంతా ఇప్పుడు ఎమ్మెల్యేకు ఎదురు తిరుగుతున్నారు. కార్మికుల ఫీఎఫ్‌ సోమ్మును కాజేసిన మార్కెట్ కమిటి చైర్మన్ ఆకుల కిరణ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే మధు పరువు తీసిన ఎంపీపీ కమల తనయుడు శ్రీధర్ నకిలీ ఎస్ ఐ అవతారం ఎత్తి ...పోలీసులకు దొరికి... ఎమ్మెల్యే పేరును వాడుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఇసుక దందాలు, సెటిల్ మెంట్లు చేస్తున్నా ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీస్తున్నారు.

సామాజిక వర్గాల మద్దతు
మూడేళ్లుగా సైలెంట్ గా ఉన్న సునీల్ రెడ్డి వచ్చే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని క్రియాశీలకంగా మారారు. ఎమ్మెల్యే వ్యతిరేకులను ఏకం చేస్తున్నారు. సామాజిక వర్గాల మద్దతు కూడగడుతున్నారు. ఈ పరిణామాలు ఎమ్మెల్యే మధుకు మింగుడు పడటంలేదు. కాటారంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పుట్ట మధు, సునీల్‌రెడ్డి వర్గీయుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ అధినాయకత్వం దృష్టికి వెళ్లాయి. మంథని నియోజకవర్గంలో సునీల్‌రెడ్డి దూకుడు వెనుక పార్టీ అధినాకుల ప్రోదల్బం ఉందని భావిస్తున్నారు. సునీల్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. అయితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంథని ఎమ్మెల్యే మధు కూడా టికెట్‌ ఇస్తారా.. అన్న అంశంపై టీఆర్‌ఎస్‌ నాయకుల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు మంథనిలో ఇద్దరు టీఆర్‌ఎస్‌ నేతల మధ్య జరుగుతున్న వివాదాన్ని మాజీ మంత్రి శ్రీధర్ బాబు తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో చేజార్చుకున్న మంథని స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని శ్రీధర్ బాబు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

10:21 - October 6, 2017

పెద్దపల్లి : గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కార్మికులు విజయాన్ని అందించారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మల్లయ్య అంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటున్న మల్లయ్యతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత ఇంటి కల నెరవేరుస్తామన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందిస్తామని చెప్పారు. కారుణ్య నియామకాల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. సింగరేణిలో కార్మికుల సంఖ్య పెంచుతామని పేర్కొన్నారు. 

 

06:35 - October 6, 2017

హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. మొత్తం 11 ఏరియాల్లో 9 చోట్ల టీబీజీకేఎస్‌, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించాయి. మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, శ్రీరాంపూర్‌, రామగుండం 1,2,3 , బెల్లంపల్లిలో టీబీజీకేఎస్‌ గెలుపొందింది. భూపాలపల్లి, మందమర్రిలో ఏఐటీయూసీ విజయం సాధించింది. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సంబరాల్లో మునిగిపోయారు. సింగరేణిలో మొత్తం ఓట్లు 52,534కు గాను 49,873 ఓట్లు పోల్ అయ్యాయి. 17 కార్మిక సంఘాలు పోటీపడ్డాయి. టీబీజీకేఎస్‌, ఏఐటీయూసీ మధ్యే పోటీ నడిచింది. 

 

21:20 - October 5, 2017

పెద్దపల్లి/మంచిర్యాల/భూపాలపల్లి/కొత్తగూడెం: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ముగిశాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్‌ నిర్వహించారు. రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నాయి. సింగరేణి కాలరీస్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో పోలింగ్‌ నిర్వహించారు. ఎన్నికల కోసం 92 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద కార్మికులు బారులు తీరారు. ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సింగరేణలో ఓటు హక్కు ఉన్న 52,534 మంది కార్మికులకు గాను 49,873 మంది ఓటు వేశారు. మొత్తం 94.93 శాతం పోలింగ్‌ నమోదైంది.

బరిలో 15 కార్మిక సంఘాలు
మొత్తం 15 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, సీపీఐ అనుబంధ ఏఐటీయూసే మధ్య ఉంది. ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ, కాంగ్రెస్‌ అనుంబంధ ఐఎన్‌టీయూసీ, తెలంగాణ టీడీపీ అనుంబంధ టీఎన్‌టీయూసీ కలిసి ఐక్య కూటమిగా పోటీ చేశాయి. మరోవైపు సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిందని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచిపెట్టారని, కార్మికులను ప్రలోభాలకు గురిచేశారని మండిపడ్డారు. అటు చివరి దశలో ఒక నిమిషం ఆలస్యంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన కొంతమంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించేలేకపోయారు. ఇలాంటివారు నిరుత్సాహంతో వెనుతిరిగారు. 

20:03 - October 5, 2017

హైదరాబాద్ : సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. కార్మికులు 11 డివిజన్లలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 11 డివిజన్లలో మొత్తం 94.93 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 52,534 ఓట్లకుగాను 49,873 ఓట్లు నమోదయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 12 గంటల వరకు తుది ఫలితం వెలువడనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరేణి ఎన్నికల్లో బొగ్గుగని కార్మిక సంఘం సహా 16 సంఘాలు బరిలో ఉన్నాయి. టీబీజీకేఎస్‌తో పాటు.. ఏఐటీయూసీ, ఎన్‌ఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీలు కూటమి బరిలో ఉన్నాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - manthani