marriage

12:47 - October 11, 2017

ఢిల్లీ : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లైన 18 ఏళ్ల భార్యతో కాపురం చేసినా అది రేప్ గానే పరిగణించాలని నిర్ణయించింది. భార్య మైనర్ అయితే  ఆమె అంగీకారం ఉన్న అత్యాచారంగానే భావించాలని కోర్టు అభ్రియపడింది. బాల్యవివాహాల నేపథ్యంలో సుప్రీం ఈ కీలక తీర్పు ఇచ్చినట్టు తెలుస్తోంది. బారత శిక్షాస్మృతి సెక్షన్ 375పై సుప్రీం వివరణతో తీర్పు వెలువరించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:43 - October 6, 2017

విజయనగరం : పెళ్లి సమయానికి వరుడు పరారైన ఘటన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం దళాయివలసలో చోటు చేసుకుంది. మూడేళ్లుగా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన యువకుడు... ఎట్టకేలకు పెద్దల సమక్షంలో పెళ్లికి అంగీకరించాడు. అయితే...కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా... శంకర్‌రావు కనిపించకుండాపోయాడు. దీంతో వధువు బంధువులు లబోదిబోమంటున్నారు. 

10:23 - September 7, 2017

హైదరాబాద్ : పాతబస్తీ సంతోష్‌నగర్‌లో ఓ నిత్యపెళ్లికొడుకు నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రబుద్ధుడు మొదటి భార్యకు విడాకులివ్వకుండానే మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలియగానే మొదటి భార్య.. సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిఖా జరుగుతున్న సమయంలో మొదటిభార్య తన బంధువులతో కలిసి భర్తపై దాడికి దిగింది. ఫంక్షన్‌లో ఏర్పడ్డ గందరగోళంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఆ తర్వాత ఫంక్షన్‌హాల్‌ నుంచి పెళ్లికొడుకు బంధువులు పారిపోయారు. పోలీసులు పెళ్లికొడుకుపై కేసు నమోదు చేశారు. 

16:38 - August 16, 2017

నిర్మల్‌ : జిల్లాలోని ముదోల్‌ మండల కేంద్రానికి చెందిన సవిత అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. గంగాధర్‌ అనే రైతు కుమార్తైన సవిత ఎంబిబిఎస్ పూర్తి చేసి హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో మెడికల్‌ పిజి ఫైనలియర్‌ చదువుతోంది. ఆదివారం స్వస్థలానికి వచ్చిన సవిత సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనకు తానే మత్తు ఇంజక్షన్‌ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోవారు గమనించి భైంసా ఆస్పత్రికి తరలించడంతో అప్పడికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. త్వరలో పెళ్లి కాబోతుండగా తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 

17:02 - July 5, 2017

విశాఖ : తల్లిదండ్రులు వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంటకు చెందిన బిటెక్ విద్యార్ధిని విజయలక్ష్మి. తాను ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశిస్తే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తామని బెదిరిస్తున్నారంటూ  పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఇదే విషయంలో పోలీసులు రాజీ చేసి విజయలక్ష్మిని ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లినా తల్లిదండ్రుల వేధింపులు ఎక్కువయ్యాయని తనపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ విజయలక్ష్మి గోపాలపట్నం పోలీసుల్ని ఆశ్రయించింది. 

 

14:55 - June 20, 2017

2 వేల మంది కూతుళ్లు ఏంటీ ? వారికి వివాహం చేయడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారు. ఇతర అర్థాలు మాత్రం తీసుకోకండి. ఓ తండ్రి నిజంగానే కూతుళ్లు కాని కూతుర్లకు వివాహం చేశాడు. దీని వెనుక ఓ విషాదం దాగి ఉంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలో వజ్రాల వ్యాపారం చేసే మహేష్ సవానికి ఇద్దరు కుమారులున్నారు. కానీ కూతుర్లు లేరు. 2008లో ఆయన సోదరుడు ఈశ్వర్ కూతుళ్ల వివాహం సందర్భంగా నగలు కొనేందుకు ఓ దుకాణానికి వెళ్లాడు. కానీ ఆ నగలకు మొత్తం ఒకేసారి డబ్బు ఇవ్వాలని చెప్పడంతో ఈశ్వర్ గుండెపోటుతో అక్కడికక్కడనే మృతి చెందాడంట. తాను ఎంతగానే ప్రేమించే సోదరుడు ఈశ్వర్ మృతితో మహేష్ తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారంట. ఆయన కుమార్తెల వివాహ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. అంతేగాకుండా వివాహం జరగకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న యువతులకు వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతే 2వేల మంది యువతులకు సర్వం తానై వివాహలు జరిపించారు. ఒక్కో యువతి వివాహానికి సుమారుగా రూ. 4 లక్షళ చొప్పున వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాల కూడా నడుపుతున్నారు. ఇప్పటి వరకు ఆయన పాఠశాలల్లో 8,400 మంది, కళాశాలల్లో 392 మంది విద్యార్థినీల చదువులకు సాయం చేశారు. తనను 'నాన్న' అని పిలిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని మహేశ్ సగర్వంగా చెబుతున్నాడు.

09:06 - June 20, 2017

సిద్దిపేట : సిద్ధిపేట జిల్లా, రాజీవ్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపాక మండలం, తిమ్మారెడ్డి పల్లికి చెందిన గ్రామస్థులు డీసీఎంలో పెళ్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో డీసీఎంలో ఉన్న పెళ్లి బృందంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతావారిని సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. 

15:40 - June 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కుమారుడు నితిన్‌ వివాహం ఇవాళ ఉదయం ఘనంగా జరిగింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

 

19:04 - May 22, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా రామానూజవరంలో విషాదం చొటుచేసుకుంది. కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లికూతురు తల్లి సైదానీబేగం వడదెబ్బతో మృతి చెందారు.సోమవారం మధ్యాహ్నం 12.35 పెళ్లి ఉండగా పెళ్లి పనుల్లో సైదానీకి వడదెబ్బ తగలడంతో మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

 

15:40 - May 22, 2017

రంగారెడ్డి : జిల్లాలో ఓ పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారానికి చెందిన టేకుమట్లు జంగయ్య తన కూతురి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. బంధువుల రాకతో ఇళ్లంతా సందడిగా మారింది. మరికొద్ది సేపట్లో పెళ్లి అనగా జంగయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయాడు. విషయం తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని భావించిన కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత తండ్రి మరణవార్త తెలుసుకున్న వధువు భోరునా విలపించింది. జంగయ్య మృతితో పెళ్లింట విషాదం నెలకొంది.

Pages

Don't Miss

Subscribe to RSS - marriage