mc kcr

15:49 - September 28, 2017

హైదరాబాద్ : పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని ఇండియన్‌ మహిళా క్రికెట్‌టీమ్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ అన్నారు. తెలంగాణ పోలీస్‌లు ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరుల స్ఫూర్తిని తెలియజేస్తూ పోలీస్‌శాఖ 3 ప్రచార రథాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రచార రథాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను డీజీపీ కార్యాలయంలో మిథాలీరాజ్‌ ఆవిష్కరించారు. 15 రోజులపాటు 27 జిల్లాలను ప్రచార రథాలు చుట్టిరానున్నాయి. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డితోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

18:25 - September 25, 2017

కరీంనగర్/పెద్దపల్లి : మారుమూల గ్రామాలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని పాలకులు చెబుతున్నా అవి వాస్తవరూపం దాల్చడం లేదు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో కూనారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మించి మూడేళ్లైనా.. వైద్య సేవలు అందించేందుకు అన్ని పరికరాలు ఉన్నప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. వైద్యం కోసం.. వైద్యుల రాకకోసం కూనారం గ్రామస్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వెంటనే ఆస్పత్రి ప్రారంభించాలని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు మరిన్ని వివరాలు కూనారం నుంచి మా ప్రతినిధి సతీష్‌ అందిస్తారు. 

16:48 - June 5, 2017
16:31 - June 5, 2017
15:51 - June 5, 2017

జనగామ : జిల్లాలోని పెంబర్తికి చెందిన మనోజ్‌కుమార్‌ తన మూఢనమ్మకాలతో గ్రామ ప్రజలను బురిడీ కొట్టించాడు. జాతీయ రహదారి పక్కన భూగర్భంలో శివలింగం ఉందంటూ నమ్మబలికాడు. పది అడుగులు తవ్వితే శివుడు ప్రత్యక్షమవుతాడంటూ మూడేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. ఇంతకాలం తన మాటలను విశ్వసించకపోవడంతోనే  పెంబర్తికి నష్టం జరిగిందంటూ మరోసారి గ్రామ పెద్దలకు నూరిపోశాడు. ఇకపై శివలింగాన్ని తవ్వకపోతే గ్రామానికి అరిష్టమని నమ్మబలికాడు. దీంతో ఈసారి మనోజ్‌ మాటలు నమ్మిన ప్రజలు  పెంబర్తిలో జాతీయ రహదారి పక్కన పదిహేను అడుగుడులమేర తవ్వినా శివలింగం కనిపింలేదు. రోడ్డు తవ్వడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో మనోజ్‌కుమార్‌తోపాటు, ఇతనికి సహకరించిన ఐదుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

07:58 - April 21, 2017

హైదరాబాద్ : ఆర్టీసీలో పొదుపు చర్యలు కార్మికుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కార్యకలాపాల పరంగా వేర్వేరుగా ఉన్నా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ పీఎఫ్‌ ట్రస్టు అధికారికంగా ఇంకా విడిపోలేదు. కార్మికులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఎఫ్ డబ్బులకు మంగళం పాడే ప్రణాళికలు తయారు చేస్తున్నారు ఏపిఎస్‌ఆర్టీసి అధికారులు. తాజాగా అధికారులు తయారు చేసిన ప్రతిపాదనల్లో పదిహేను వేల వరకు పెన్షనబుల్‌ వేతనం ఉన్న కార్మికులు, ఉద్యోగులకు మాత్రమే సంస్థ పీఎఫ్ జమచేస్తుంది. బేసిక్ పే, డీఏ కలిపి 15 వేలు దాటితే తన వాటా పీఎఫ్‌ని చెల్లించే బాధ్యత నుంచి వైదొలగాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గతంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు కార్మిక సంఘాల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. తాజాగా విజయవాడలో జరిగిన ఆర్టీసి పీఎఫ్‌ బోర్డు సమావేశానికి తెలంగాణ ఆర్టీసి యాజమాన్యం ఓ లేఖ రాసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
పూర్తికాని ఆర్టీసీ విభజన...
ఆర్టీసీలో సొంతంగా పీఎఫ్ ఖాతా నిర్వహించుకుంటున్నారు. లక్ష మంది, అంతకు మించి కార్మికులు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే, సొంతంగా ఆ సంస్థ పీఎఫ్ ఖాతా నిర్వహించుకునేందుకు గతంలో కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ విభజన పూర్తికాకపోవడంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులకు ఇదే ట్రస్టు సేవలందిస్తోంది. ఇందులో యాజమాన్యం, కార్మిక సంఘాల నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. పిఎఫ్ కోత విధించడం వల్ల రెండు రాష్ట్రాల్లోని ఆర్టీసిలకు ఆరువందల కోట్లకు పైగా ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కార్మిక సంఘాలు మాత్రం ఈ నిర్ణయం పట్ల తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పీఎఫ్ బాధ్యత నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

08:10 - August 14, 2016

హైదరాబాద్ : మూసినదిపై ఈస్ట్ వెస్ట్ కారీడార్ కాగితాలకే పరిమితం అయ్యింది. ఎలివేటేడ్ మార్గంలో ఆరులైన్ల రోడ్డు మార్గం.. పాతనగరానికి కొత్త శోభ.. ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి పాత బస్తికీ విముక్తి... ఇవీ సరిగ్గా ఏడాది క్రితం మూసి రోడ్డు ప్రాజెక్టుపై ప్రభుత్వం చెప్పిన మాటలు. ఈ  మాటలు ఒట్టి మాటలుగానే మిగలనున్నాయి. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 
కంచికి చేరిన మూసీ కారిడార్ ప్రాజెక్టు?
టీఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పడినప్పటి నుంచి  హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని చెబుతూనే ఉన్నారు.  అంతటితో ఆగకుండా గ్రేటర్ ఎన్నికల ముందు హామీలతో ఊదగొట్టారు. అధికార పార్టీ గ్రేటర్ పీఠం చేజిక్కించుకుని 6 నెలలు పూర్తయ్యింది. ఎన్నికలలో ఇచ్చిన హామీలు మాత్రం కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు తాజాగా మూసీపై నిర్మిస్తామన్నా ఈస్ట్ వెస్ట్ కారిడార్ కథ కంచికి చేరినట్లు తెలుస్తుంది.
42 కి.మీ మూసీ కారిడార్‌కు ప్రణాళికలు
42 కిలోమీటర్ల నిర్మించనున్నా మూసీ కారిడార్‌ రోడ్డు నార్సింగ్ ఔటర్‌ రింగ్ రోడ్డు నుంచి బీబీ నగర్ వద్ద గల కొర్రెముల వరకు ఆరులైన్ల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. ఇక దీని కోసం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చైనా ప్రతినిధుల బృందం ఏరియల్ సర్వే కూడా చేసింది. అన్ని ప్రాంతాలను కలపడానికి ఈ రోడ్డులో 12 ప్రధాన జంక్షన్లు ఉంటాయని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 8వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
జీహెచ్‌ఎంసీకి భారీ ఆదాయం వస్తుందని ప్రగల్భాలు
ఇక ఈ కారిడార్ వల్ల మూసికి ఇరువైపులా ఉండే భూములకు భారీ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. 42కిలో మీటర్ల మేర దాదాపు 25వేల ఎకరాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.. ఈ స్కైవే అందుబాటులోకి వచ్చాక జీహెచ్ఎంసీకి వివిధ రూపాల్లో భారీ ఆదాయం వస్తుందని.. స్కైవే వెంబడి అభివృద్ధి చెందే ప్రాంతాల్లో భారీ నిర్మాణాలకు వీలుంటుందని అధికారులు అంచనా వేశారు. అనుమతుల ఫీజుల ద్వారా దాదాపు 30 వేల కోట్లు జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరడమే కాకుండా భవిష్యత్తులో ప్రతి ఏటా దాదాపు 600 కోట్ల ఆస్తిపన్ను రూపంలో బల్దియాకు ఆదాయం వస్తుందని ప్రగల్భాలు పలికారు.  
నిధులు లేక అట్టకెక్కనున్న  ప్రాజెక్టు?
ఈ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయం నిర్మాణ సంస్థలతో కూడా ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది.  అవసరమైతే నిధుల సమీకరణ కోసం న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, బ్రిక్స్ బ్యాంకును సంప్రదించాలని డిసైడ్ చేశారు. ఇక గతంలో చైనా పర్యాటనలో భాగంగా బ్రిక్స్ చైర్మన్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూసి ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి చేసారు. అయితే ఇవన్నీ ఒకప్పటి మాటలు.. కాని ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ప్రాజెక్టు పట్టాలు ఎక్కడం కోసం ఆర్థికంగా చేయూత నివ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని సమాచారం. ఇక నదిలో చేపట్టబోయే ఈ నిర్మాణానికి పర్యావరణ అనుమతులతోపాటు పలు అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాజెక్టు అటకెక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కనబడుతోంది.

 

Don't Miss

Subscribe to RSS - mc kcr