mega star

10:50 - September 19, 2017

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా నర్సింహరెడ్డి' లో టాలీవుడ్ కమెడియన్ 'సునీల్' నటించనున్నారని సోషల్ మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే కొన్ని సంవత్సరాల తరువాత చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఆయన సినిమాల్లో నటించాలని పలువురు నటులు, నటీమణులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

చిరు 151వ సినిమా స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను రాంచరణ్ తేజ్ స్వయంగా నిర్మస్తుండడం విశేషం. ఇటీవలే సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసి అభిమానులను సంతృప్తిపరిచారు. సినిమాలో నటించే వారి విషయాలను తెలియచేశారు.

కానీ విలన్, కామెడీ పాత్రలు ఎవరు పోషిస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. తాజాగా చిత్రంలో కామెడీ నటుడు 'సునీల్' నటించనున్నారనే వార్తలు సోషల్ మాధధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. హీరోగానే కాకుండా ఇతర పాత్రలు చేస్తానని 'సునీల్ ఇటీవలే 'ప్రకటించేసినట్లు తెలుస్తోంది. 'సైరా నరసింహా రెడ్డి'లో తనకి చోటు దొరకడం అదృష్టమని చెప్పాడు. ఈ సినిమాలో తాను ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నానని వెల్లడించాడు.

12:39 - June 2, 2017

బాలీవుడ్ అందాల రాశి 'ఐశ్వర్య రాయ్' వివాహం అనంతరం పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈమెను టాలీవుడ్ కి రప్పించేందుకు తాజాగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రముఖంగా మెగాస్టార్ 'చిరంజీవి' 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రంలో నటింప చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ చిత్రం కోసం 'చిరంజీవి' పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభయ్యే ఈ సినిమాలో హిందీ..తెలుగు భాషల్లో నిర్మాణం కానున్నట్లు సమాచారం. బాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొట్టాలంటే అక్కడి వారు సినిమాలో నటిస్తే బాగుటుందని చిత్ర యోనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఓ కీలక పాత్ర కోసం బిగ్ బి 'అమితాబ్' ను..చిరంజీవి సరసన 'ఐష్'ను నటింప చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు 'రామ్ చరణ్' చిత్రంలో కూడా 'ఐశ్వర్య రాయ్' నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 'చెర్రీ' సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనంతరం 'మణిరత్నం' లో 'రామ్ చరణ్' ఓ సినిమా చేయబోతున్నాడని అప్పటి నుండి ప్రచారం జరుగుతోంది. దీనిని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు, దీనికి 'యోధ' టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఓ కీలక పాత్ర కోసం ఆమెను ఎంపిక చేస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో..తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

10:51 - May 24, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కెరీర్ లో 'తొలి ప్రేమ' ఎలాంటి ఘన విజయం సాధించిందో అందిరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని 'కరుణాకరన్' తెరకెక్కించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో మంచి ప్రేమ కథా చిత్రాలు అందించిన 'కరుణాకరన్' ఇప్పుడు కాస్త వెనుకబడ్డాడు. ఈయన చివరిగా తెరకెక్కించిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనితో చాలాకాలంగా ఆయన సినిమాలు చేయడం లేదు. తాజాగా 'తొలి ప్రేమ' వంటి కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంట. ఈ సినిమాలో 'సాయి ధరమ్ తేజ'ని హీరోగా కనిపించబోతున్నట్లు టాక్. ఇప్పటికే కథను సాయి ధరమ్ తేజకు వినిపించారని, ఇందుకు ఒకే కూడా చెప్పాడని తెలుస్తోంది. యూత్..మాస్ ఆడియన్స్ ను మెప్పించే కథలను ఎంచుకుంటూ వెళుతున్న 'సాయి ధరమ్ తేజ' ప్రేమ కథా చిత్రాన్ని ఎంచుకోవడం గమనార్హం. ప్రస్తుతం 'సాయి ధరమ్ తేజ' 'నక్షత్రం' సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, బీవీఎస్ రవి దర్శకత్వంలో చేస్తోన్న 'జవాన్' షూటింగ్ దశలో ఉంది.

13:36 - May 15, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' మళ్లీ సినిమాలతో బిజీ బిజీగా మారుతుండడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. కొన్ని ఏళ్ల తరువాత ఆయన మళ్లీ మేకప్ వేసుకుని 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అభిమానులను ఎంతగానే అలరించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. దీనితో 'చిరు' నెక్ట్స్ సినిమా ఏమై ఉంటుందబ్బా అని అభిమానులే కాక చాలా మంది ఆలోచించారు. చివరకు 'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి' జీవిత గాథలో నటించబోతున్నాడని, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా 'చిరంజీవి' జపాన్ టూర్ కు వెళుతున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. విశ్రాంతి కోసమే ఆయన అక్కడకు వెళుతున్నట్లు టాక్. బుల్లితెరపై వస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి కార్యక్రమానికి సైతం కొద్దిగా విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. అక్కడి నుండి తిరిగి వచ్చిన అనంతరం చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నట్లు టాలీవుడ్ టాక్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు కూడా రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి జపాన్ టూర్ అనంతరం చిరు లుక్ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో చూడాలి.

17:09 - April 4, 2017

తెలుగు సినిమాలకు టైటిల్స్ దొరకట్లేదండి .నిజం ..పాటల చరణాలు ,స్టోరీ లైన్ తో సంబంధం లేని టైటిల్స్ తెగ వచ్చేస్తున్నాయి . ఆల్రెడీ సినిమా స్టార్టింగ్ లో వర్కింగ్ టైటిల్ ఒకటి అనుకుంటారు మరి ఆలా అనుకుంటే ఫాన్స్ ఊరుకుంటారా పబ్లిసిటీ తో తమ అభిమాన నటుల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. 'శ్రీమంతుడు' సినిమాతో మంచి జోష్ మీద ఉన్నాడు 'మహేష్ బాబు'. తన కొత్త సినిమా నేషనల్ లెవెల్ లో రిలీజ్ సెలెక్టివ్ లేంగ్వేజెస్ లో రిలీజ్ చెయ్యడానికి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా 'మహేష్ బాబు'కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ని కూడా ఇచ్చింది. గ్రామాలని దత్తత తీసుకుని సర్వీస్ కూడా మొదలు పెట్టాడు ఈ సూపర్ స్టార్. ఇప్పుడు ఒక పవర్ఫుల్ సబ్జెక్టు తో సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో 'రకుల్' హీరోయిన్ గా నటిస్తుంది.

మహేష్..మురుగదాస్..
తమిళంలో సూపర్ హిట్ సినిమాలు చేసి తరువాత 'గజినీ' సినిమాతో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ 'మురుగదాస్'. తెలుగులో కూడా 'గజినీ' సినిమా సూపర్ హిట్ అయింది ఇక్కడ హీరో సూర్యకు మంచి ఫాన్స్ ని సంపాదించి పెట్టింది. ఏ ఆర్ మురుగదాస్ కి సెపరేట్ వర్కింగ్ స్టైల్ అనేది ఉంది. సబ్జెక్టు ఏదైనా యాక్షన్ ని జోడించి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే డైరెక్టర్స్ లో మురుగదాస్ ఒకరు. అందుకే తమిళం లో సూపర్ హిట్ అయిన 'కత్తి' సినిమాని మరో ఆలోచన లేకుండా 'చిరంజీవి' తెలుగులో ఖైదీ నెంబర్ 150గా తెరకెక్కించాడు. 'మహేష్', 'మురుగదాస్' కాంబినేషన్ లో గుడ్ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే సబ్జెక్టు ప్రకారం కధ ప్రకారం ఈ సినిమాకి సోషల్ ఎలిమెంట్ తో సంబంధం ఉండటం వల్ల ఫస్ట్ లో అనేక టైటిల్స్ అనుకున్నారు. ఈ  సినిమా ఫస్ట్ లుక్, ఇప్పటివరకు విడుదల కాలేదు. అయితే అందుకు కారణం టైటిల్ విషయంలో క్లారిటీ రాకపోవడమే అని తెలుస్తుంది. ఇప్పుడు ఆ సమస్య తొలిగిపోయింది. ఈ సినిమా నిర్మాతలు ఎన్.వి ప్రసాద్, ఠాకూర్ మధులు ఇప్పుడు ఫిల్మ్ చాంబర్ లో కొత్త టైటిల్ రిజిస్టర్ చేయించారు.  'స్పై-డర్' అని రిజిస్టర్ చేయించారు నిర్మాతలు. ఒక్క తెలుగు భాషలోనే కాకుండా మలయాళం, హిందీ భాషలకు కూడా ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారు. దాంతో ఇదే టైటిల్ ఖాయమని చెప్పొచ్చు.

09:20 - April 4, 2017

టాలీవుడ్..బాలీవుడ్.. మల్టిస్టారర్ చిత్రాలు తెరకెక్కుతుంటాయి. కానీ టాలీవుడ్ లో మాత్రం అడపదడపా మాత్రమే వస్తున్నాయి. తమ అభిమాను సంతృప్తి పరిచేందుకు అగ్ర హీరోలు ఆయా చిత్రాల్లో ఓ స్పెషల్ రోల్ లో కనిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల తరువాత వెండి తెరపై కనిపించిన 'చిరంజీవి' 151వ చిత్రంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150’ సినిమా ఘన విజయం సాధించింది. 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ద్వారా 'చిరంజీవి' కనిపించనున్నాడని టాక్. దీనిపై అప్పుడే సోషల్ మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘చిరంజీవి' సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంలో విక్టరీ 'వెంకటేష్' ఓ పాత్రలో మెరవనున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో 'ఖైదీ నెంబర్ 150’ సినిమాలో నటించాలని 'వెంకీ'ని 'రాంచరణ్' అడిగినట్లు అప్పట్లో వినిపించింది. అయితే కొన్ని కారణాల వలన 'వెంకటేశ్' ఆ పాత్రను చేయడం కుదరలేదని, ఇప్పుడు మాత్రం 151వ సినిమాలో చేస్తారని టాక్. మరి నిజమా ? కాదా ? అనేది తెలుసుకోవాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.

20:30 - February 23, 2017

విశాఖ : మెగా హీరోల మల్టీస్టారర్ మూవీపై సుబ్బిరామిరెడ్డి మరోసారి స్పందించారు. మల్టీస్టారర్‌ మూవీ కోసం చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ ఒప్పుకున్నారని.. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారన్నారు. కథ సిద్ధం కాగానే.. షూటింగ్‌ ప్రారంభిస్తామని సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు. 

08:58 - February 9, 2017

మెగాస్టార్ చిరంజీవితో తీసిన 'ఖైదీ నెంబర్ 150’ సినిమా విజయం వి.వి.వినాయక్ కు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. చిరంజీవి 150వ చిత్రం కావడంతో అభిమానులు..టాలీవుడ్ లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అందరి అంచనాలకు తగ్గట్టే చిత్రం ఘన విజయం సాధించింది. కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే చిత్రం రూ. 150 కోట్లు సాధించిందని తెలుస్తోంది. అనంతరం వి.వి.వినాయక్ తదుపరి చిత్రంపై కసరత్తులు ప్రారంభించాడు. అందులో భాగంగా మెగా కౌంపౌండ్ నుండి వచ్చిన 'సాయి ధరమ్ తేజ్' తో వినాయక్ చిత్రం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా కంటే ముందుగానే వినాయక్ ఓ కథను రూపొందించారంట. ప్రస్తుతం 'తేజ్' తో చిత్రాన్ని చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న 'విన్నర్' చిత్రంలో త్వరలోనే విడుదల కానుంది. అంతేగాకుండా 'జవాన్'..'నక్షత్రం'..సినిమాల్లో నూ కూడా 'తేజ్' నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల తరువాత వినాయక్ చిత్రం ఉంటుందా ? లేక ముందే ఉంటుందా ? అనేది తెలియరావడం లేదు.

10:50 - January 11, 2017

విజయవాడ : ప్రపంచవ్యాప్తంగా ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలైంది. థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కొన్ని థియేటర్లలో బెన్ ఫిట్ షో వేశారు. మరిన్ని కొన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. సినిమా చూచిన ఫ్యాన్స్ మూవీ బ్లాక్ బ్లస్టర్ అంటున్నారు. డ్యాన్సులు, ఫైటింగ్స్ అప్పుడు ఎలా ఉన్నాయో.. ఇప్పుడ ఇలాగే ఉన్నాయి. బాస్ ఈజ్ బ్యాక్, బాస్ ఈజ్ రియల్ బ్యాక్... అంటున్నారు. చిరంజీవి నటన వైవిధ్యంగా ఉందన్నారు. డ్యాన్సులు అదుర్స్ అంటున్నారు. చిరంజీవి 149 సినిమాలు ఒక ఎత్తు... 150 సినిమా ఒక ఎత్తు అని అంటున్నారు. పది సం. ముందుకు ప్రస్తుతానికి ఏం తేడా లేదని.. అదే డ్యాన్స్ లు, స్టైలు అంటూ సంబరపడిపోతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:36 - January 11, 2017

గుంటూరు : మెగాస్టార్ సినిమాలోకి చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం విడుదల సందర్భంగా తిరుపతిలోని పలు థియేటర్ల వద్ద చిరు అభిమానులు కోలాహలం చేస్తున్నారు. ఖైదీ నంబర్ 150 మూవీ ధియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే కొన్ని థియేటర్లలో సినిమా విడుదలైంది. మెగా అభిమానులు, ప్రేక్షకులు సినిమా హాళ్లకు బయలుదేరుతున్నారు. ఏ థియేటర్ చూసినా అభిమానులతో కోలాహలంగా మారింది. 
ఫ్యాన్ అభిప్రాయాలు...
సినిమా చాలా బాగుంది. అప్పుడు ఎలా డ్యాన్స్ చేశారో..ఇప్పుడూ అలాగే చేశారు. అదే జోష్ తో ఉన్నారు. చిరంజీవి డ్యాన్స్ చేస్తుంటే.. 25 ఏళ్ల కుర్రాడు డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. 10 సం.ల తర్వాత చేసిన చిరంజీవి సినిమా హిట్ అవుతుంది.  ఎవ్వరూ చిరంజీవి ప్రభంజనం సృష్టించలేరు. 2017 కి చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ. ప్రతి సం. మాకు ఒక చిరంజీవి సినిమా కావాలి. బెన్ ఫిట్ షోలు ఆపాలని చూశారు.. కానీ ఇండస్త్రీ రికార్డులు బద్దలు కొట్టేది చిరంజీవే. మెగాస్టార్ కు మించినవారు ఇక లేరు. చిరంజీవి పూర్తిగా సినీ ఫీల్డ్ లోకి రావాలి. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - mega star