minister jogu ramanna

12:25 - July 30, 2018

ఆదిలాబాద్ : ఆగస్టా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రారంభానికి వచ్చిన మంత్రి జోగు రామన్నకు ప్రమాదం తప్పింది. మంత్రి జోగు రామన్న, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి పార్టీ నేతలు..ఆసుపత్రి సిబ్బంది తాకిడి ఎక్కువగా ఉంది. వీరిలో కొంతమంది లిఫ్ట్ లో ఎక్కారు. ఒక్కసారిగా కేబుల్ తెగిపోయింది. కింది ఎత్తులోనే లిఫ్ట్ కుప్పకూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓవర్ లోడ్ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. 

22:05 - December 12, 2017

హైదరాబాద్ : బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటుపై మంత్రి జోగురామన్న బీసీ కులాల అభిప్రాయాలను రేపు... సీఎం కేసీఆర్‌కు నివేదించనున్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు ఇది మొదటి ప్రతిపాదనగా మంత్రి తెలిపారు. మొత్తం 20 ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వనున్నట్లు జోగు రామన్న స్పష్టం చేశారు.

17:21 - November 15, 2017

సంగారెడ్డి : నియోజకవర్గ ప్రజలను టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని..ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగ్గారెడ్డిపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో రూ. 1100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని..ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధిని జగ్గారెడ్డి అథోగతి పాలు చేశారని విమర్శించారు. ఈ విమర్శలపై జగ్గారెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. 

21:17 - November 14, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ సమస్యపై తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఉద్యోగాల భర్తీ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై స్పందించిన మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మిగిలిన ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం... తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై హాట్‌హాట్‌ డిస్కషన్ జరిగింది. అప్పుల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి.. ఆరోపించారు. కార్పొరేషన్లు, కో ఆపరేటివ్‌ ఫెడరేషన్స్‌ కోసం ఎంత అప్పుతీసుకున్నారో ఆర్థికశాఖ దగ్గర లెక్క ఉందా అని ప్రశ్నించారు. వచ్చే బడ్జెట్‌ నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు 2 లక్షల 20 వేల కోట్లు అవుతుందని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత జానారెడ్డి ఆరోపించారు. రాష్ట్రం సర్‌ప్లస్‌లో ఉందని గొప్పలు చెప్పుకోవడం కాదు...లెక్కలతో సహా చూపించాలన్నారు. అయితే ఈ ఆరోపణలను ఆర్థిక మంత్రి ఈటల ఖండించారు. రాష్ట్రం రెవెన్యూలో సర్‌ప్లస్‌లో ఉన్న మాట వాస్తవమే అని మంత్రి ఈటల అన్నారు. ఏ అప్పులు చేసినా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడే చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

మధ్యాహ్నం నుంచి నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంపై చర్చ మొదలైంది. ప్రభుత్వం ఎన్నికల నాటి హామీలను మర్చిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగులు రోడ్ల మీదకొచ్చి ఉద్యోగాలు ఇమ్మని అడిగే పరిస్థితి కల్పించకూడదన్నారు.

విపక్ష పార్టీల నేతలను మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. లక్షా 12 వేల ఉద్యోగాల నియామకాలన్నీ వచ్చే 20 నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తమ మేనిఫేస్టోలో ఉన్న అంశాలు 90 శాతం అమలు చేశామని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 27, 744 ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి ఈటల రాజేందర్ సభకు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా 5,932 ఉద్యోగాలు, సింగరేణిలో 7, 266 పోస్టులు విద్యుత్‌ శాఖలో 1, 427, పోలీస్‌ శాఖలో 12, 157 పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. మిగతా ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల 20 వేల మంది కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం సభ బుధవారానికి వాయిదాపడింది.

16:15 - August 15, 2017

అదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వాడ, వాడల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకలకు అటవీశాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. 21 శాతం ఆదాయ వృద్ధిరేటుతో తెలంగాణ.. దేశంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు జోగు రామన్న. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన సాంస్కృతి కార్యక్రమాలు, విద్యార్థులు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

 

20:26 - August 13, 2017
17:41 - July 24, 2017

హైదరాబాద్ : కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా బీసీ గురుకుల పాఠశాలలు విద్యను అందిస్తున్నాయని మంత్రి జోగు రామన్న అన్నారు. బీసీల్లోని పేదలకు కార్పొరేట్‌ విద్య అందించేందుకే ఈ వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం 119 గురుకుల పాఠశాలు ప్రారంభించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఈ స్కూళ్లకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రైవేటు స్కూళ్లలోని విద్యార్థులు కూడా గురుకులాల్లో చేరుతున్నారని తెలిపారు. సంచార జాతులకు బేషరతుగా ఈ పాఠశాల్లో సీటు కేటాయిస్తున్నట్టు చెప్పారు. 

21:28 - July 11, 2017

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూడో విడత హరిత హారం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్‌ జిల్లా వేదికగా మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అంబేడ్కర్ స్టేడియంలో పెద్దఎత్తున సభను నిర్వహించనున్నారు. దీనికోసం పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. తొలిరోజే ఇక్కడ 25 వేల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన లోపాలను పునారవృతం కాకుండా ...ఈసారి హరితహారం విజయవంతంగా నిర్వహించేందుకు పాలకులు, అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఈ విడత మొత్తం 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం నర్సరీలలో 42 కోట్ల మొక్కలను సిద్ధం చేశారు. అలాగే నాటిన మొక్కల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హరిత దళాలను.. హరిత సైనికులను ఏర్పాటు చేశారు. హరితహారంపై ప్రజల్లో కూడా అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టామని మంత్రి జోగు రామన్న చెప్పారు. ప్రతి మొక్కకు 15 రూపాయలు చొప్పున ఖర్చు చేస్తున్నామన్నారు. అలాగే ఈ హరితహారలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. పెద్ద సంఖ్యలోమొక్కలు నాటే వారికి అవార్డులు.. నగదు బహుమతులు ప్రకటించనుంది.

20:16 - July 10, 2017

హైదరాబాద్ : కరీంనగర్ పట్టణంలో ఈనెల 12న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న తెలంగాణ హరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి జోగు రామన్న చెప్పారు. మూడో విడత హరితహారంలో పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తామని ఆయన అన్నారు. ఈసారి హరిత రక్షణ కమిటీలు ఏర్పాటుచేశామని.... ప్రతీ 500 మొక్కలకు ఒక హరిత సైనికుడు ఉంటాడని మంత్రి జోగు రామన్న అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

22:01 - April 11, 2017

జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా ప్రజాశక్తి మాజీ ఎడిటర్ ఎస్.వినయ్ కుమార్ తో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వూ నిర్వహించింది. పూలే గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'మహిళా వ్యవస్థపై పోరాడిన లొతి సంఘ సంస్కకర్త పూలే. బ్రాహ్మణ మహిళా కష్టాలపై పోరాటం చేసిన పూలే. పూలే, మార్క్స్ సమకాలీకుడు. ప్రస్తుత సామాజిక సమకాలీన అంశాలకీ పూలే సిద్ధాంతమే ప్రాతిపదిక. ఒకరి గురించి ఒకరికి తెలియకున్నా.. ఇద్దరి పిలుపులో సారాంశం ఒక్కటే. మహాజన భావనకు ఆవిష్కకర్త పూలే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

Pages

Don't Miss

Subscribe to RSS - minister jogu ramanna