minister kadiyam srihari

07:42 - March 9, 2018

కనీస వేతనాలు కల్పించాలి. మమ్మల్ని రెగ్యులరైజ్‌ చేయాలి. ఇది తెలంగాణలో ఎప్పటికప్పుడు వినిపిస్తున్న డిమాండ్‌. తాజాగా ఇదే డిమాండ్‌తో గిరిజన మినీ గురుకులాల టీచర్లు, నాన్‌ టీచర్లు ఆందోళన బాట పట్టారు. వీరి ఆందోళనకు గల కారణాలు వీరి సమస్యలపై టెన్ టివి జనపథంలో మినీ గురుకులాల టీచర్స్‌- నాన్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకురాళ్లు నిర్మల, శారద, కవిత విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:58 - March 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుతానికి ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతిచ్చే ఆలోచన లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ రాష్ట్రంలోని 14 వీసీలతో ఆయన సమావేశమై సమస్యలపై చర్చించారు. వర్సిటీల్లో మౌలిక వసతుల కోసం 420 కోట్ల రూపాయలు మంజూరు చేశామని... 31 మార్చిలోపు టెండర్లు పిలిచి పనులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అదేశించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు 6 నెలల్లో అమలు చేస్తామని వీసీలు హామీఇచ్చినా.... ఆశించిన మేరకు అమలు కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేయాలన్నారు. అందుకు అవసరమైన అనుమతులు.. వీసీలకే ఇచ్చినట్లు కడియం తెలిపారు.

 

19:23 - March 5, 2018

హైదరాబాద్ : అవినీతి మయం అయిన దేశరాజకీయాలను చక్కదిద్దే సమర్థత కేసీఆర్‌కు ఉందని డిప్యూటీసీఎం కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్‌ థర్డ్‌ఫ్రంట్‌ ప్రయత్నాలను తాను స్వాగతీస్తున్నాని తెలిపారు. తెలంగాణలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న కేసీఆర్‌ దేశ పరిస్థితులను చక్కదిద్దగలరని అన్నారు. కాంగ్రెస్‌ హాయంలో దేశం కుంభకోణాల్లో కూరుకు పోతే.. బీజేపీ పాలనలో బ్యాంకులను లూఠీ చేస్తున్నారని కడియం విమర్శించారు. ఈపరిస్థితులు మారాలంటే.. దేశంలో కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, దానికి నూటికి నూరుశాతం కేసీఆర్‌ సమర్థుడని కడియం తెలిపారు. 

 

18:08 - January 16, 2018

ఢిల్లీ : రెండోరోజుల కేంద్ర విద్యా సలహా సంఘం సమావేశాలపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలు పూర్తిగా నిరుత్సాహ పరిచాయన్నారు. భేటీలో ప్రాధమిక ఉన్నత విద్యా ప్రమాణాల అభివృద్ధిపై ఉపసంఘాలు ఇచ్చిన ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు.. తీసుకోవాల్సిన భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్రానికి స్పష్టత లేదన్నారు కడియం. 

11:09 - January 2, 2018

హైదరాబాద్ : పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉంది. తిరుపతిరావు కమిటీ చేసిన ప్రతిపాదనలు పేరెంట్స్ కు అనుకూలంగా నిర్ణయాలు లేవని, కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలకు అనుకూలంగా ఉందని స్కూల్ పేరెంట్స్ నేతలు పేర్కొంటున్నారు. మంగళారం డిప్యూటి సీఎం కడియం శ్రీహరిని ప్రతినిధులు కలిశారు. సమావేశం అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవ్చని చెప్పడం దారుణమని, తక్షణమే దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంక్రాంతికి శుభవార్త చెబుతామని గతంలో ప్రకటించారని, బంగారు తెలంగాణలో విద్య అందని ద్రాక్షగా ఉంటుందని సమావేశం అనంతరం అర్థమయ్యిందని తెలిపారు. ఆర్డినెన్స్ జారీ చేసే ప్రతిపాదన ప్రభుత్వంలో లేదని పేర్కొనడం సబబు కాదన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:04 - December 29, 2017

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. బీజేపీ నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరిగితే వర్గీకరణ సాధ్యం అవుతుందా అని మందకృష్ణను ప్రశ్నించారు. జనవరి 5 తర్వాత వర్గీకరణ అంశంపై ప్రధానిని కలుస్తామని మంత్రి కడియం అన్నారు. మందకృష్ణ మాదిగ వ్యవహారం వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని కడియం ప్రశ్నించారు. 

21:20 - December 23, 2017
16:25 - December 23, 2017

హైదరాబాద్ : మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి త్వరలో ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రిని కలుస్తారని తెలిపారు. మేడారం జాతరపై సమీక్ష నిర్వహించిన ఆయన..వచ్చే ఏడాది 15 జనవరి వరకు ఇచ్చిన నిధులు సక్రమంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. జనవరి 31 నుండి జరిగే జాతరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతరకు 80 కోట్లు నిధులు విడుదల చేస్తామన్నారు. జనవరి 18న మరోసారి సమీక్ష నిర్వహిస్తామన్నారు. 

 

13:36 - December 15, 2017

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నగరం పండుగ శోభ నెలకొంది. ఈ మహాసభల ఏర్పాట్ల కీలక బాధ్యతలను ప్రభుత్వం డిప్యూటి సీఎం కడియం శ్రీహరికి అప్పగించారు. ఈ సందర్భంగా మరిన్ని విషయాలు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా డిప్యూటి సీఎం కడియంతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన ఏర్పాట్లు..తదితర విషయాలను ప్రస్తావించారు. గ్రూప్ 1, 2 అర్హత పరీక్షల్లో తెలుగు తప్పనసరి కాబోతుందా ? ప్రజా సాహిత్యాన్ని ఏజెండాలో విస్మరించారా ? తెలంగాణ పాటకు ఎందుకు గౌరవం దక్కలేదు ? గద్దర్, విమలక్క, జయరాజ్, అందెశ్రీలకు ఆహ్వానం అందలేదా ? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:36 - December 11, 2017

హైదరాబాద్ : సీబీఐటీ కళాశాలకు వారం రోజుల పాటు సెలవు ప్రకటిస్తున్నట్లు కళాశాల ప్రిన్స్ పాల్ వెల్లడించారు. ఫీజుల పెంపును నిరసిస్తూ గండిపేట సీబీఐటీ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఈ ఆందోళన కొనసాగుతోంది. సోమవారం శంకర్ పల్లి చౌరస్తాలో సీబీఐటీ కాలేజీకి చెందిన బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.

దీనితో మరోసారి సీబీఐటీ కాలేజీ యాజమాన్యం స్పందించింది. కళాశాలకు వారం రోజుల పాటు సెలవు ప్రకటిస్తున్నట్లు..పరీక్షలన్నీ రద్దు చేశామని ప్రిన్స్ పాల్ రవీందర్ రెడ్డి వెల్లడించారు. దీనికి విద్యార్థులు శాంతించినట్లు సమాచారం. గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తామని, విద్యార్థులు..వారి తల్లిదండ్రులతో మాట్లాడుతామని కళాశాల ప్రిన్స్ పాల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా సమస్య తీరుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - minister kadiyam srihari