Minister Kalva Srinivas

21:05 - July 11, 2018

అనంతపురం : ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీకి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీని గెలిపిస్తే చంద్రబాబు సూచించిన నేత ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరవు నేలపై కేంద్ర వివక్ష పేరుతో అనంతపురంలో టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షలో ప్రసంగించిన ఎంపీలు, మంత్రులు... బీజేపీ, వైసీపీ, జనసేనను టార్గెట్‌ చేశారు. రాయలసీమ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ ప్రజాప్రతినిధులు అనంతపురంలో దీక్ష చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. దీక్షా వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ప్రారంభించారు.
నిరసన దీక్షలో ప్రసంగించిన సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు... ప్రధాని మోదీని టార్గెట్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు 25 మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే... అన్ని హక్కులు సాధించుకోవచ్చన్నారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తప్పేది చంద్రబాబేనని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని చెప్పారు.

రాయలసీమ.. ముఖ్యంగా అనంతపురం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా చూడాల్సిన అవసరం ఉందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన 350 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోడాన్ని ఎంపీ తోట నరసింహం తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఎంపీ నిమ్మల కిష్టప్ప మండ్డిపడ్డారు. కరువు సీమపై కేంద్ర వివక్షకు నిరసనగా టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

16:29 - July 11, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధికి కృషి చేస్తుంటే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకరించడం లేదని టిడిపి ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్రం కల్లబొల్లి మాటలు చెబుతోందని, ఈ గడ్డపై ఎంతో మంది వీరులు పుట్టారని..వారి ఉద్యమ స్పూర్తిని తీసుకొని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అభివృద్ధికి మోడీ సహకరించాలని..కానీ అలా చేయడం లేదన్నారు. కరవు జిల్లా..ఎడారిగా మారుతున్న జిల్లాలో సంకల్పం పూనుకుని కాల్వలు..చెరువులు..నీళ్లతో నింపిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. అనంతపురం జిల్లాలో స్వచ్చమైన నీరు తాండవం చేస్తోందని, ఉద్యోగాలు..ఉపాధి కోసం..కడుపు మంటతో వలసలు వెళ్లిన కుటుంబాలను చూసి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. కియో పరిశ్రమ ఏర్పాటు చేసి వలసల నివారణకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏపీ రాష్ట్రం..జాతిపై చిన్న చూపు చూస్తున్నారని తెలిపారు. 

16:25 - July 11, 2018

అనంతపురం : టిడిపి మంత్రులు..ఎంపీలు జనసేన అధ్యక్షుడు పవన్ ను టార్గెట్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ పై తీవ్ర ఆరోపణలు..విమర్శలు గుప్పించారు. బాబు..లోకేష్ లపై పవన్ చేస్తున్న ఆరోపణలను ఎంపీలు తిప్పికొట్టారు.

పవన్ ను చూస్తే బాధేస్తోందని..ప్రజారాజ్యాన్ని ప్రజలు నమ్మారని..కానీ వారు మాత్రం కోట్ల రూపాయల కొల్లగొట్టారని ఆరోపించారు. పవన్ అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కోట్ల రూపాయలు తీసుకెళ్లి బీఫారాలు తీసుకున్నారని..ఇది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. ఇవన్నీ పవన్ కు తెలియదా ? అని నిలదీశారు. ప్రజల్లో మమేకమవుతే రాజకీయాలు తెలుస్తాయని, కేంద్రంతో డబ్బులు తీసుకుని బీజేపీ ఏది చెబితే అదే చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 

15:59 - July 11, 2018

అనంతపురం : వైసిపి..జనసేన..బిజెపి పార్టీలపై టిడిపి మంత్రులు, ఎంపీలు విమర్శల పర్వం కొనసాగుతోంది. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని... గద్దె నింపే వరకు పోరాటం చేస్తామని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలో ఏపీకి అన్యాయం చేసిన మోడీని గద్దె దింపే వరకు పోరాటం చేస్తామన్నారు. బీజేపీ..జనసేన..వైసీపీ పార్టీలు కుట్రల కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. ఏపీకి జరిగిన అన్యాయంలో వీరు కూడా పావుగా మారుతున్నారని..మోడీకి భజనపరులరని మండిపడ్డారు. ప్రశ్నించాల్సిన పవన్ జగన్ ఫ్యాన్ గాలిగా ఎందుకు మారాడో అర్థం కావడం లేదన్నారు. పోరాటం ఇక్కడితే ఆగదని..ఇంకా ఉధృతంగా సాగుతుందన్నారు. 

20:22 - July 4, 2018

గుంటూరు : ఏపీ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన అఫిడవిట్ లోని అంశాలను గమనిస్తే బాధనిపిస్తుందని.. కేంద్రం సత్యదూరంగా ఉందన్నారు. కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం చూస్తే ఏపీ ప్రయోజనాలను కాలరాయడమే అవుతుందన్నారు. సమాచారం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. సమాచారం తప్పులతడకని,.. బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించారు. ఆర్థిక సమ్యల మధ్య..రాజధాని లేకుండా.. అప్పుల భారంతో ఏర్పడిన రాష్ట్రం ఏపీ అన్నారు. ఆర్థిక లోటు 16 వేల కోట్లుగా ఉందన్నారు. స్టాండెడైజ్డ్ ఎక్స్ పెండేచర్ అంటే ఏమిటో కేంద్రమే చెప్పాలన్నారు. రైతులపై, సహాయంపై కేంద్రం, బీజేపీ నేతలకు నిర్లక్ష్య భావం ఉందని విమర్శించారు. రైతు ఉపశమనం డబ్బులు తిరిగి చెల్లించడం లేదన్నారు. రైతులపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పూనుకుంటుందన్నారు. రాజధాని నిర్మాణం కోసం 1500 కోట్ల రూపాయలు ఇచ్చారని.. మరో వెయ్యి కోట్లు ఇస్తామంటున్నారని తెలిపారు. 2500 కోట్లతో ఢిల్లీని తలదన్నే రాజధానిని ఎలా నిర్మించాలని ప్రశ్నించారు. కేంద్రం పటేల్ విగ్రహానికి 3 వేల కోట్లు,  శివాజీ విగ్రహానికి 4 వేల కోట్లు ఇచ్చారని కానీ ఏపీ రాజధాని నిర్మాణానికి మాత్రం 2500 కోట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రానికి ఇంగింత జ్ఞానం లేదని.. దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ఏపీకి నమ్మక ద్రోహం చేస్తుందని చెప్పారు. 

 

19:34 - July 4, 2018

గుంటూరు : ఒకేసారి 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశం చేసి ఏపీ సర్కార్‌ రికార్డ్‌ సృష్టించబోతుంది. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి సీఎం చంద్రబాబు ఒకేసారి 3 లక్షల పక్కా ఇళ్లకు గృహ ప్రవేశం చేయనున్నారు. 2019 నాటికి 50వేల కోట్లతో 19 లక్షల ఇళ్లు నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నామని... అయితే కోటి ఇళ్లు నిర్మిస్తామన్న కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదంటున్న మంత్రి కాలువతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కేంద్రం సహకరించకపోయినా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని విమర్శించారు. కోటి ఇళ్లు నిర్మిస్తామంటున్న కేంద్రం.. రాష్ట్రంలో పేదలకు నిర్మిస్తున్న ఇళ్లకు..ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించారు. 

 

19:13 - May 26, 2018

గుంటూరు : మూడు రోజల పాటు ఉత్సవంలా మహానాడు నిర్వహించనున్నట్లు మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. తెలుగు రాజకీయాల దశ దిశ మార్చిన నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. జగన్‌, నరేంద్రమోదీ లాలూచీ రాజకీయాలతో పాటు.. ఏపీలోని బీజేపీ నాటకాలను మహానాడు ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు.

 

21:54 - April 17, 2018

విజయవాడ : ఏపీలో ప్రత్యేక హోదా పోరు రసవత్తరంగా సాగుతోంది. 20న దీక్షకు చంద్రబాబు సిద్ధమవుతుంటే.. దీన్ని నాన్సెన్స్‌ రాజకీయమని బీజేపీ విమర్శించింది. దీనికి టీడీపీ కూడా ఘాటుగానే సమాధానమిచ్చింది. ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ... ఢిల్లీలో రాష్ట్రపతి గుమ్మం తొక్కి.. హోదా కోసం అభ్యర్థించింది. 

ఏపీలో ప్రత్యేక హోదా పోరు తీవ్రతరం అవుతోంది. ఏపీకి హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 20న తన పుట్టిన రోజునాడు.. నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడ మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో దీక్షకు సన్నాహాలు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు, మంగళవారం జరిగిన టీడీపీ ముఖ్యుల సమావేశంలో నిర్ణయించారు. 

చంద్రబాబు దీక్షపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నాన్సెన్స్‌ రాజకీయాలు నడుపుతోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణకుమార్‌రాజు విమర్శించారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా టీచర్లంతా నిరసనకు దిగాలంటూ.. ఉన్నతాధికారులతో మంత్రి గంటా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. 

బీజేపీ విమర్శలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఏపీలో 99 శాతం మంది ప్రజలు బీజేపీని నమ్మడం లేదని, ఏపీకి అన్యాయం చేసిన బీజేపికి కర్నాటకలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. 

మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ.. వైసీపీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. విభజన చట్టం అమలు అంశాన్నీ రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. ఇచ్చిన హామీలను కేంద్రం ప్రభుత్వం అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ  కోవింద్‌కు వినతి పత్రం సమర్పించారు.

వైసీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడాన్ని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రత్యేకహోదా పోరును నడపడంలో విఫలమైన వైసీపీ నేతలు... ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

అటు వైసీపీ కూడా టీడీపీని టార్గెట్‌ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. బీజేపీని నాలుగేళ్లపాటు వాడుకున్న చంద్రబాబు ప్రస్తుతం కాంగ్రెస్‌తో జట్టుకట్టడానికి ఆరాటపడుతున్నారని జగన్‌ టీమ్‌ విమర్శిస్తోంది.  టీడీపీ నేతలపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని.. వారు చేసే దీక్షలను ప్రజలను నమ్మరని కామెంట్లు చేస్తున్నారు. 

అటు సామాన్య ప్రజలు కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరులో బుడగజంగాలు వినూత్న నిరసనకు దిగారు.  ఇదిలావుంటే టీడీపీ-బీజేపీ-వైసీపీల తీరును వామపక్షాలు-జనసేన తప్పుబట్టాయి. ప్రత్యేహోదా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో నేతలు ఇలా పార్టీల పరంగా విమర్శలకు దిగడం ఏంటని లెఫ్ట్‌, జనసేన నేతలు ప్రశ్నించారు. 

20:56 - April 17, 2018

గుంటూరు : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 20న 'ధర్మపోరాట దీక్ష' చేస్తారని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు... పుట్టిన రోజు వేడుకలకు దూరంగా 12 గంటలపాటు దీక్ష చేస్తారన్నారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు నిర్వహిస్తున్నామని.. 'నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో తిరుపతి సభ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. 

 

07:31 - April 17, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌ అండ్‌ కామిక్స్‌ పాలసీకి ఏపీ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అమరావతిలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో... విశాఖలో 40 ఎకరాల్లో యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ సిటీకి, ఆక్వా పాలసీకి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పట్టణాల్లో సీఎంఏవై కింద నిర్మించే ఇళ్లకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - Minister Kalva Srinivas