MLA Dr Laxman

21:25 - December 4, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ సమస్యకు కచ్చితమైన పరిష్కారం లభించేంతవరకు ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కొలువులకై కొట్లాట సభ సక్సెస్‌ అయ్యిందన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌లో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొలువులన్నీ భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ... మూడేళ్లైనా ఆ హామీని నెరవేర్చలేదన్నారు. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. నిరుద్యోగ సమస్యను ఎజెండాపైకి తీసుకురావడం కేసీఆర్‌ సర్కార్‌కు నచ్చడం లేదన్నారు. అందుకే ఉద్యమకారులను, టీజేఏసీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

20:26 - December 4, 2017

మన ఉద్యోగాలు..మనవే..నినాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి..అంకె భారీగా ఊరిస్తూనే ఉంది.. అమలుపైనే అసలు సందేహాలు..ఓ పక్క సమర్ధింపులు.. మరోపక్క కొట్లాటలు..మూడున్నరేళ్లు గడుస్తుంది.. ఇంకెప్పుడని రోడ్డెక్కుతున్నారు.. ఆందోళనకు దిగుతున్నారు.. తెలంగాణలో నిరుద్యోగులకు ఒరిగిందేమిటి? లక్షల ఉద్యోగాలంటూ ప్రభుత్వం చెప్పేది కాకి లెక్కలేనా? నిరుద్యోగుల ఆశలు నెరవేరేదెపుడు? కొలువుల కొట్లాట ఏ దారిలో నడవనుంది? కొలువు దొరుకుతుందన్న నమ్మకం లేదు. సర్టిఫికెట్లు దేనికీ పనికి రానివిగా మారిపోతున్నాయి. కోచింగ్ సెంటర్లలో ఏళ్లు గడిచిపోతున్నాయి.. ఆశలు తీరవు..హామీలు ఆగవు.. బతుకుపోరు నానాటికీ బరువుగా మారుతున్న దృశ్యం..

 

అసలు తెలంగాణలో ఎందరు నిరుద్యోగులున్నారు? ఎన్ని ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? సర్కారు గతంలో ఏం చెప్పింది.. ఇప్పుడేం చెప్తోంది?తెలంగాణ ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో ఎన్ని ప్రభుత్వోద్యోగాలు కల్పించింది? ప్రైవేటురంగం ఎన్ని ఉద్యోగాల కల్పనకు అవకాశాలు ఇచ్చింది? అంకెలు స్పష్టంగా కనపడుతున్నాయి.. నిరుద్యోగుల సంఖ్య స్పష్టంగా కనిపిస్తోంది. సర్కారు దాటవేతలూ స్పష్టమౌతున్నాయి.. ఉపాధి కల్పన సర్కారు బాధ్యత కాదా? ఉద్యోగాలు జనరేట్ అయ్యే పరిస్థితులు కల్పించాల్సిన ప్రభుత్వాలు ఒప్పందాల ఆడంబరాలకే పరిమితమౌతున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారమేనా?దేశంలో ప్రభుత్వోద్యోగాలు తగ్గిపోతున్నాయి. సర్కారు తన బాధ్యతలను వదుల్చుకుంటున్న తరుణంలో, పబ్లిక్ సెక్టార్ నుంచి చాలా బాధ్యతలు ప్రైవేటు పరం అవుతున్నాయి.. కానీ, ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయని ప్రభుత్వాలు ప్రైవేటు రంగాన్ని కూడా అంతే నిర్లక్ష్యం చేయటం ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం.. చిన్నా చితకా పని దొరకటానికే నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి. ఆ మధ్య పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏలు చదివిన వారు కూడా రావటం పరిస్థితి తీవ్రత అద్దం పడుతోంది.

 

ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వానిదే. ఉపాధి అవకాశాలు పెరిగే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ప్రభుత్వ రంగ ఖాళీలను భర్తీ చేయాల్సిన పని సర్కారుదే.. కానీ, సరళీకరణ విధానాల పరుగులో ప్రభుత్వాలు పెట్టుబడులు, లాభాలు అంటూ నేలవిడిచి సాము చేస్తూ ప్రజాసంక్షేమాన్ని గాలికొదులుతున్నాయి. మాటలకే పరిమితమౌతూ కార్పొరేట్ పెద్దలకు అనుకూల నిర్ణయాలతో నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నాయి.. ఈ పరిస్థితిలో మార్పు రాకపోతే … తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ లోకానికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమించటమే మార్గం అవుతుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

 

 

 


 

 

17:23 - December 4, 2017

హైదరాబాద్ : కోదండరాం స్వలాభం కోసం నిరుద్యోగ సమస్యపై పోరాడటం లేదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. ఇది నిరుద్యోగులందరి సమస్య అని చెప్పారు. నిరుద్యోగ సమస్యను ఏజెండాపైకి తీసుకురావడమే కోదండరాం చేసిన తప్పా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అరెస్ట్‌లు, నిర్బంధాలతో ఉద్యమాలను ప్రభుత్వం ఎప్పుడూ ఆపలేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని గుర్తించాలని, వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమమంతా విద్యార్థుల త్యాగాల ఉద్యమమేనని ప్రజాగాయకుడు, యుద్ధనౌక గద్దర్‌ అన్నారు. కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని.... కొట్లాడే కొలువులు తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. పోరాటంతోనే హక్కులు సాధించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాటలుపాడి నిరుద్యోగులను ఉత్సాహపరిచారు. 

15:52 - December 4, 2017

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్యాలెండర్ ఇయర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొలువులకై కొట్లాట సభకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.

15:35 - December 4, 2017

హైదరాబాద్ : విద్యార్థులో నిరాశ నెలకొందని ప్రముఖ విద్యవేత్ చుక్కా రామయ్య అన్నారు. ప్రభుత్వం దేని కోసమైతే ఏర్పాడిందో అది చేయడం లేదని, కోదండరామ్ పై విమర్శలు చేయడంపై సరికాదని, ఆయన అతని కోసమో, పదవి కోసమో పోరాటం చేయడంలేదని విద్యార్థుల కోసమే పోరాటం చేస్తున్నారని రామయ్య అన్నారు.

14:44 - December 4, 2017

హైదరాబాద్ : కొలువులకై కొట్లాట సభలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పు పట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశ పాలనకు ఈ నిర్బంధమే నిదర్శనమని సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు అనుమతిలో నిర్వహిస్తున్న కొలువులకై కోట్లాట సభకు పోలీసులు ఆటంకాలు కల్పించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు మార్చివేశారని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌ ఆరోపించారు. 

13:43 - December 4, 2017

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌లో కొలువుల కొట్లాట సభ ఇవాళ మధ్యహ్నం ఒంటిగంటకు జరగనుంది. సభకు రాకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులపై పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. టీప్రభుత్వం తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. సభకు రాకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారని..ఈనేపథ్యంలో ఇప్పటికే సభ విజయంతం అయిందన్నారు. 
విద్యార్థులు
'నీవు.. నీ కొడుకుకు మా ఉసురు తగిలుతుంది. కేసీఆర్..ఉస్మానియా యూనివర్సిటీలో బొందపెడ్తం. కేసీఆర్ ఖబడ్తార్... దొర అహంకారాన్ని అణిచివేస్తాం...దొర తనానన్ని ప్రజలు సహించం. ప్రభుత్వానికి సిగ్గులేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తలేరని అనేకమంది ఆత్మబలిదానం చేసుకుంటున్నారని.. వారి ఉసురు మీకు తగుల్తది. ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ప్రభుత్వాన్ని వెంటాడి, వేధిస్తాం. 2019ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడిస్తామని' హెచ్చరించారు.  

 

13:30 - December 4, 2017

హైదరాబాద్‌ : మరికాసేపట్లో హైదరాబాద్‌లో కొలువులకై కొట్లాట సభ ప్రారంభం కానుంది. జిల్లాల వ్యాప్తంగా పోలీసులు నిర్బంధాలను కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ జేఏసీ నేతలను అరెస్టు చేస్తున్నారు. పోలీలసు తీరుపై టీజాక్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని విమర్శిస్తున్నారు. తెలంగాణ సాధించింది విద్యార్థుల అరెస్టులకేనా..అని ప్రశ్నించారు. అరెస్టులను ఖండించారు. అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులపై సీఎం కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. రాత్రి 12 గంటలకు విద్యార్థులపై దాడులు చేసి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు బాధాకరమన్నారు. విద్యార్థులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా... పోలీసులు అడ్డుకుంటూ నిర్బంధిస్తున్నారని వాపోయారు. ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీకి రూః.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరంగల్, నల్గొండ జిల్లాలతోపాటు పలు జిల్లాల నుంచి సభకు వస్తున్న నిరుద్యోగులు, విద్యార్థులను అడ్డుకుంటున్నారు. మరిన్నివివరాలను వీడియోలో చూద్దాం...

 

12:58 - December 4, 2017

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌లో కొలువుల కొట్లాట సభ ఇవాళ మధ్యహ్నం ఒంటిగంటకు ఉంటుందని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. సభకు నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కోదండరాం పిలుపునిచ్చారు. జేఏసీ ఉద్యమాన్ని చూసి భయపడుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. అడుగుడుగునా నిర్బంధాలు విధిస్తోందని ఆరోపించారు. నిర్బంధాలు ఎన్ని ఉన్నా సభను జరిపి తీరుతామని కోదండరాం స్పష్టం చేశారు. 
నిరుద్యోగులు, విద్యార్థులు 
'కొలువుల కొట్లాట సభకు విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. స్టేడియం లోపలికి వచ్చే మార్గంలో డీఎస్ పీతోపాటు పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ..లోపలికి రాన్విడం లేదు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు కలిగించినా కొలువుల కొట్లాట సభ నిర్వహిస్తాం. కోదండరాంను చూసి కేసీఆర్ భయపడుతున్నడు. ప్రొ.జయశంకర్, కోదండరాం లేకపోతే కేసీఆర్ ఎక్కడిది. కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా ఆత్మ బలిదానం చేశారా ? కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులకు మంత్రి పదవులు ఇచ్చారు. కూతురు కవితను ఎంపీ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగుతుంది. నియంత పాలనకు చరమ గీతం పాడుతాం. సభకు కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ పోలీసులు నిర్బంధిస్తున్నారు. పోలీసులను అండగా పెట్టుకుని ప్రభుత్వం పాలన సాగిస్తోంది. విద్యార్థి ఉద్యమాలను ఆపలేరు. కోదండరాంను చూస్తే కేసీఆర్ కు చమలు పడ్తున్నాయి. కోదండరాం కార్యకర్త కాదు.. శక్తి. సభకు రాకుండా పోలీసులు, ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీని మృతదేహాన్ని  సినీ ఫక్కీలో తరలించారు. విద్యార్థులపై అర్ధరాత్రి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీ.ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాం. 2019 ఎన్నికలలో ఓటుతో కేసీఆర్ కు సమాధానం చెబుతామని' హెచ్చరించారు. 

 

12:37 - December 4, 2017

సిద్ధిపేట : నిన్న ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం దౌలాబాద్‌కు తరలించారు. ఈసందర్భంగా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ ఎంసీఏ విద్యార్థి మురళీ నిన్న ఓయూ హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

 

Pages

Don't Miss

Subscribe to RSS - MLA Dr Laxman