mla roja

06:58 - July 28, 2018

చిత్తూరు : నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా తన సొంత నిధులతో వైఎస్‌ఆర్‌ చాంఫియన్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు క్రీడల్లో ప్రతిభ ఉన్నప్పటికీ.. సరైన అవకాశాలు లేక మరుగున పడిపోతున్నారని ఆమె అన్నారు. టోర్నమెంట్‌లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. టోర్నమెంట్‌లో భాగంగా వైసీపీ నేతలు క్రికెట్‌ ఆడి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. 

15:42 - June 28, 2018

విజయవాడ : తెలుగుదేశం పార్టీ పాలనలో మహిళలరకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై జరగుతున్న దాడులతో సీఎం చంద్రబాబు నాయుడు తలదించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. గురువారం విజయవాడలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ...ఉక్కు పరిశ్రమ కోసం దీక్షలు చేస్తే ప్రజలు నమ్మరని తెలిపారు. తెలుగుదేశం నాయకుల వల్లే మహిళలకు రక్షణ లేదన్నారు. విభజన చట్టంలో ఏవీ రాకపోయినా నాలుగేళ్లు బీజేపీతో టిడిపి అంటకాగిందని..మంత్రి పదవులు అనుభవించారని గుర్తు చేశారు. ఇప్పుడు దీక్షలు అంటూ చేస్తున్నారని విమర్శించారు. కడప ఉక్కు..విశాఖ రైల్వే జోన్..వెనుకబడిన జిల్లాల అభివృద్ధి..తదితర అంశాలపై వైసీపీ పోరాడిందన్నారు. 

21:26 - June 18, 2018

అమరావతి : నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోడీతో చంద్రబాబు మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు వక్రీకరించడంపై టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. దైవ దర్శనానికి వెళ్లిన రోజా దేవాలయంలో రాజకీయాలను మాట్లాడటాన్ని అనిత తప్పుబట్టారు. వైసీపీ ఎంపీలు కేసుల మాఫీ కోసం పీఎంవో ఆఫీసులో ప్రధాని కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. ఒంగి ఒంగి దండాలు పెట్టటంలో సీఎం చంద్రబాబు ఒలింపిక్స్ లో మెడల్ ఇవ్వవచ్చు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేయగా..దీనికి ఎమ్మెల్యే అనిత అంతే తీరుగా సమాధానమిచ్చారు. పాదయాత్రలో జగన్ అందరికి ముద్దులు పెడుతున్నారనీ..మరి జగన్ కు ఏ మెడల్ ఇవ్వాలో అని కౌంటరిచ్చారు.

 

17:54 - June 18, 2018

చిత్తూరు : నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రధాని మోదీని నిలదీయని ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి వైసీపీ ఎమ్మెల్యే రోజా తప్పుపట్టారు. ధర్మపోరాట దీక్షల్లో మోదీని విమర్శించిన చంద్రబాబు... ప్రధాని ఎదురుగా ఉన్నప్పుడు విభజన హామీలపై ఎందుకు ప్రశ్నించలేని నిలదీశారు. శ్రీకాళహస్తిలో ముక్కింటిని దర్శించుకున్న రోజా... ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. బయట ప్రగల్బాలు పలికే చంద్రబాబు... నీతి ఆయోగ్‌ సమావేశంలో రాష్ట్ర వాదనలు సరిగా వినిపించలేదని విమర్శించారు. 

16:24 - May 9, 2018

గుంటూరు : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. రోజా రాజకీయాలు మానుకుని సినిమాలు చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. రాజకీయాలంటే జబర్దస్తీ సీరియల్‌ కాదని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే ఒక ఎంటర్‌టైన్‌ మెంట్‌గానే రోజా భావిస్తున్నారంటున్న ఆదినారాయణ రెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. రాజకీయాలకు రోజా తగరని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబుపై నోటికి వచ్చినట్టు రోజా  మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-

15:18 - April 11, 2018

హైదరాబాద్ : టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు చేశారు. నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. తన తప్పులను విపక్షాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  ప్రభుత్వ పథకాల్లో నిధులన్నీ టీడీపీ నేతలు దోచుకుంటున్నారని రోజా ఆరోపించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని రోజా అన్నారు. ఎన్నికలు వస్తున్నందునే సీఎం చంద్రబాబు ప్రత్యేకహోదా అంశాన్ని నెత్తికెత్తుకున్నారని రోజా విమర్శించారు. 30సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఒక్కసారైనా ప్రత్యేక హోదాను అడగలేదన్నారు.

 

13:32 - April 11, 2018

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. అంతా ఇచ్చేశారంటూ మోడీ..జైట్లీని ఆకాశానికెత్తేసి అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేశారని ప్రశ్నించారు. తప్పులు చేసింది ప్రభుత్వమయితే తమపై ఎందుకు బురద చల్లుతున్నారని, విభజన హోదా అమలు కోసం వెళ్లేలేదని..వెళితే వినతిపత్రాలు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. లోక్ సభలో వైసీపీ ఎంపీలు ధైర్యంగా రాజీనామాలు చేశారని, ప్రత్యేక హోదా సాధించడమే వైసీపీ లక్ష్యమయితే హోదాకు వెన్నుపోటు ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఓ పత్రికలో పథకాలపై 71 శాతం సంతృప్తిగా ఉన్నట్లు ఓ వార్త ప్రచురితమైందని..ఇది అసత్యమని తెలిపారు. 

13:50 - April 9, 2018

ఢిల్లీ : ఏపీకి న్యాయం చేయాలని వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్షకు దిగితే.. టీడీపీ ఎంపీలు ఢిల్లీ రోడ్లమీద పబ్లిసిటీ కోసం స్టంట్‌ చేశారని వైసీపీ నేతలు రోజా, విజయమ్మ విమర్శించారు. దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలపై టీడీపీ నేతల చౌకబారు కామెంట్లు చేస్తున్నారని విజయమ్మ అన్నారు. ప్రధాని మోదీతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తోందని చంద్రబాబేనని ఆరోపించారు. ఏపికి న్యాయం కోసం వైసీపీ నిజాయతీగా పోరాడుతోందన్నారు

 

18:24 - April 6, 2018

ఢిల్లీ : పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడినా టిడిపి ఎంపీలు నిరసన చేపడుతూనే ఉన్నారు. లోక్ సభలో ఆందోళన చేస్తున్న వీరిని స్పీకర్ పిలుస్తున్నారంటూ బయటకు వచ్చే విధంగా చేసి..లోక్ సభ తలుపులకు తాళాలు వేశారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లేసరికి స్పీకర్ లేకపోవడంతో టిడిపి ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అవమానపరిచారంటూ స్పీకర్ కార్యాలయంలోనే ఆందోళన చేపట్టారు. గత కొద్దిగంటలుగా వీరి ఆందోళన కొనసాగుతోంది. దీనితో వీరిని బయటకు తరలించేందుకు మార్షల్స్ సిద్ధమయ్యారు. కానీ స్పీకర్ వచ్చి తమ సమస్యలు వినాలని టిడిపి ఎంపీలు పేర్కొంటున్నారు. మహిళా ఎంపీలను తరలించేందుకు మహిళా మార్షల్స్ మోహరించారు.

ఇదిలా ఉంటే ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శుక్రవారం సాయంత్రం ఉరుములు..మెరుపులు..ఈదురుగాలులతో భారీగా వర్షం కురిసింది. దీనితో ఆంధ్రా భవన్ వద్ద వైసీపీ ఏర్పాటు చేసిన దీక్షా స్థలి టెంట్ కూలిపోయింది.

 

14:45 - April 6, 2018

ఢిల్లీ : టిడిపి ఎంపీలు చేస్తున్న పోరాటం..ఆందోళనను కేంద్రం తేలికగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీల అమలు చేయాలంటూ పార్లమెంట్..వెలుపలా..లోపల ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం వాయిదా పడిన అనంతరం కూడా టిడిపి ఎంపీలు సభలోనే ఉండిపోయారు. శుక్రవారం లోక్ సభ నిరవధికంగా వాయిదా పడడంతో టిడిపి ఎంపీలందరూ సభలోనే ఉండిపోయి ఆందోళన నిర్వహించారు. వీరిని బయటకు పంపించేందుకు మార్షల్ పలు ప్రయత్నాలు చేసింది. చివరకు స్పీకర్ సుమిత్రా మహజన్ పిలుస్తున్నారంటూ కబురు పంపించడం...వెంటనే ఎంపీలు బయటకు రావడం జరిగిపోయాయి. ఇదే అదునుగా భావించిన మార్షల్స్ లోక్ సభ తలుపులు మూసివేశారు. స్పీకర్ కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడ స్పీకర్ లేకపోడంతో ఎంపీలు అక్కడే ఆందోళన చేపట్టారు. వీరిని బయటకు తరలించేందుకు భారీగా మార్షల్స్ మోహరించారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - mla roja