movie review

16:18 - September 21, 2018

సమ్మోహనం సక్సెస్ తో సుధీర్ బాబు ట్రాక్ లోకి వచ్చాడు. ప్రతిభకి పెద్దపీట వేస్తూ వైవిధ్య భరితమైన సినిమాలు రూపొందించాలని తన పేరుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆర్.ఎస్.నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ నన్నుదోచుకుందువటే చిత్రం చేసాడు. ఈ రోజు రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.. 

కథ : -
ఐటీ కంపెనీలో పనిచేసే కార్తీక్ పనితప్ప వేరే ప్రపంచమేలేదు అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటాడు. ఫ్యామిలీని కూడా సరిగా పట్టించుకోడు. దీంతో కార్తీక్ కి తన మరదలితో పెళ్ళిచెయ్యాలని వాళ్ళ నాన్న డిసైడ్ అవుతాడు. మరదలు వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని తెలిసి, పెళ్లిని తప్పించుకోవడానికి తను కూడా వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి కాలేజ్ లో చదువుతూషార్ట్ ఫిలిమ్స్ లో నటించే మేఘన అనే అమ్మాయిని అప్రోచ్ అవుతాడు. మేఘన కార్తీక్ మరదలుగా నటిస్తుంది. ఆక్రమంలో ఒకరినొకరు ఇష్టపడ్డా పైకి చెప్పుకోరు. అంతలోనే విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. విడిపోయిన కార్తీక్, మేఘన కలిసారా లేదా అనేది మిగతా కథ..

కార్తీక్ గా సుధీర్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా, మేఘనగా నభా నటేష్ తన అందం, నటనతో ఆడియన్స్ ని అలరించింది. నాజర్, పృధ్వీ, తులసి, వైవా హర్ష వారి వారి పాత్రలకి న్యాయం చేశారు. టెక్నికల్ గా కూడా సినిమా ఆకట్టుకుంది. సింపుల్ పాయింటే అయినా దర్శకుడు కొత్తగా చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నిర్మాతగా సుధీర్ బాబు బోణి బాగుంది. మొత్తం మీద నన్ను దోచుకుందువటే సినిమా చక్కటి టైంపాస్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు.

రేటింగ్ : 3/5 

18:44 - November 24, 2017

ఎప్పుడు కొత్త తరహాకథలతో విభిన్న ప్రయోగాలు చేసే నారా రోహిత్ ఇప్పుడు కావాలనే మరి రొటిన్ కమార్షల్ మూవీ చేశాడు అదే బాలకృష్ణుడు. పవన్ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్, రెజీనా జంటగా నటించిన చిత్రం బాలకృష్ణుడు ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఇప్పుడు చూద్దాం...కథ విషయానికొస్తే బాలకృష్ణ అలియాస్ బాలు పోకిరిగా తిరిగే వ్యక్తి అతనికి ఆద్య అనే ఆమ్మాయికి బాడీ గార్డుగా మారి ఆమెను అపదలనుంచి కాపాడే ఆఫర్ వస్తోంది. ఈ ఆఫర్ యక్సెప్ట్ చేసిన బాలు ఆద్య క్లోజ్ అయి ఆమెను ప్రొటెక్టు చేస్తాడు. వారి మధ్య చనువును లవ్ అనుకుంటుంది ఆద్య ఇలా జరిగిపోతున్న కథలో ఓ రోజు ఆద్య పై అటాక్ జరుతుంది. ఇంతకి ఆ అటాక్ చేసింది ఎవరు అనేది తెరపై చూడాల్సిందే...రోహిత్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కానిపిస్తాడు. అతని నటనలో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూడవచ్చు. టీజింగ్ సన్నివేశాల్లో, కామెడీ సన్నివేశాల్లో నారా రోహిత్ బాడీ లాగ్వేజ్ అకట్టుకుంది. ఇకా రెజీనా తన గ్లామర్ తో అలరించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

18:41 - February 24, 2017

టుడే అవర్ రీసెంట్ రిలీజ్  "విన్నర్ ’'. 'సాయి ధరమ్ తేజ్'  హీరోగా నటించిన ‘విన్నర్ ’ సినిమా ఇవాళ్టి మన నేడే విడుదల రివ్యూ టైం లో ఉంది. 'పిల్ల నీవు లేని జీవితం' సినిమాతో తన ఫిలిం కెరీర్ ని స్టార్ట్ చేసిన మెగా ఫామిలీ హీరో 'సాయి ధరమ్ తేజ్'.  యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ తో 'విన్నర్' గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మెగా ఫామిలీలో చాల స్పీడ్ గా సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తూ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైన హీరో 'సాయి ధరమ్ తేజ్'. 'విన్నర్' సినిమాలో తన ప్రేమను గెలిపించుకునే ప్రేమికుడిగా యాక్ట్ చేసాడు.

డైరెక్టర్ గోపిచంద్..
యాక్షన్ లో లవ్ మిక్స్ చేసి మాస్ ని అట్రాక్ట్ చెయ్యగల డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇతని  డైరెక్షన్ లో వచ్చిన విన్నర్ వరల్డ్ వైడ్ గా ఇవాళ  రిలీజ్ అయింది. ఎనర్జిటిక్ హీరో సాయిధరమ్ తేజ్, బ్యూటీ టాలెంటెడ్ రకుల్ ప్రీత్ సింగ్, ట్రెండీ విలన్ జగపతిబాబు   నటించిన ఈ సినిమాకి నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మాతలు. ఈ సినిమా కి  థమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళింది. ఒక క్యూట్ లవ్ స్టోరీకి హార్స్ రేస్ ని కనెక్ట్ చేసి ఆడియన్స్ని కట్టిపడేసే ప్రయత్నం చేసాడు డైరెక్టర్.

మంచి రెస్పాన్స్..
ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లోనే పవర్ఫుల్ డైలాగ్స్ ని చూపించిన 'సాయి ధరమ్ తేజ్' మంచి మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 'రకుల్ ప్రీత్ సింగ్' అథ్లెట్ గా నటించిన ఈ సినిమాలో స్క్రీన్ మీద గ్లామర్ ని స్ప్రెడ్ చేసింది. ఈ సినిమాలో జగపతిబాబుతో పాటు అనూప్ ఠాకూర్ మరో విలన్ గా నటించారు. మరి ఈ ‘విన్నర్ ’ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసింది ? ఎంత వరకు రీచింగ్ అయ్యింది ? టెన్ టివి రేటింగ్ ఎంతో వీడియో క్లిక్ చేయండి.

19:36 - January 12, 2017

హైదరాబాద్: నటసింహం బాలకృష్ణ వందో చిత్రంగా రూపకల్పన చేసిన చారిత్రక కథనం గౌతమీపుత్ర శాతకర్ణి. ఒక తెలుగు యుద్ధయోధుని రాజసానికి, శాంతికి, అఖండభారత ఆకాంక్షకు మూలాలను గుదిగుచ్చి వెండితెరపై దృశ్యకావ్యంగా ఆవిష్కరించిన సినిమా ఇది. అస్సలు తెలుగు జాతి ఉన్నతిలో గౌతమి, శాతకర్ణి పాత్రలు ఎంత వరకు ఉన్నాయి. సినిమాలో చూపించిన సన్నివేశాలు నిజమేనా? కల్పితమా?, గౌతమీ పుత్ర తెలుగువాడేనా? తెలుగు జాతికి పాల్పడ్డాడా? దర్శకుడు క్రిష్ చేసిన ప్రయత్నం అభినందనీయమేనా? ఈ అంశంపై 'హెడ్ లైన్' షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ చారిత్రక విశ్లేషకులు ఎంఎస్ ఆర్ మూర్తి, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, సినీ విశ్లేషకులు రెంటాల జయదేవ్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

18:43 - January 12, 2017

శతచిత్ర నటుడు బాలకృష్ణ వందో చిత్రంగా రూపకల్పన చేసిన చారిత్రక కథనం గౌతమీపుత్ర శాతకర్ణి. ఒక తెలుగు యుద్ధయోధుని రాజసానికి, శాంతికి, అఖండభారత ఆకాంక్షకు మూలాలను గుదిగుచ్చి వెండితెరపై దృశ్యకావ్యంగా ఆవిష్కరించిన సినిమా ఇది. లోతైన పరిశోధన, సమయోచితమైన,ధీరోదాత్త పాత్రల ఆపాదనతో తీసిన ఈ చిత్రం లో నటీనటులే కాకుండా ప్రతిఫ్రేము వెనుక దర్శకుడు క్రిష్ తపన కూడా కనిపిస్తుంది. హిస్టారిక్ యాక్షన్ డ్రామా తో వచ్చిన ఈ సినిమా కేవలం బాలకృష్ణ అభిమానులకే కాకుండా సినిమా ప్రియులందరికీ కూడా సంక్రాంతి సంబరాన్ని, సందడిని ముందస్తుగానే మోసుకొచ్చేసింది.

కథ విషయానికొస్తే....

ఈ సినిమాలో కథ విషయానికొస్తే ... ముక్కలు ముక్కలుగా, చీలికలు, పేలికలుగా చిన్నాచితక రాజ్యాలతో నిరంతరం యుద్ధాలతో సతమతమవుతుంటుంది భారత దేశం. దేశాన్నంతటినీ ఏకతాటిపైకి తేవాలనుకుంటాడు శాతకర్ణి. అప్పుడే శాంతిని సాధించడం సాధ్యమవుతుందని బాల్యంలోనే కలగంటాడు . దానిని నెరవేర్చుకునేందుకు రణం అనే యుద్ధతంత్రంతో శరణమన్న వాడిని సామంతుడిని చేసుకుంటూ జైత్రయాత్ర సాగిస్తాడు. 32 రాజ్యాలను జయించి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతాడు. అతని యుద్ధ పిపాసకు, రాజ్యకాంక్షకు తద్వారా సాధించే సుస్థిర శాంతికి తల్లి గౌతమి ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. దేశంలో అత్యధిక భాగాన్ని జయించిన తర్వాత విదేశీయులైన యవనుల నుంచి వచ్చే దురాక్రమణ శాతకర్ణికి సవాల్ గా నిలుస్తుంది. దాదాపు తన సైన్యానికి మూడు రెట్లు ఉన్న ఆ విదేశీ మూకలను ఎలా ఎదుర్కొన్నాడు? వారిని తరిమి కొట్టడం ద్వారా దేశ ఖ్యాతిని ఎలా నిలిపాడు అన్నదే క్లైమాక్స్. రాజనీతి, రణనీతి, బీభత్స , భయానక యుద్ధ సన్నివేశాలు, మాతృప్రేమ , కపట మాయోపాయాలు ... కథలో అంతర్భాగంగా సాగిపోయే సంఘటనాత్మక దృశ్యాలు.కథనంలో బిగి ..పట్టు విడవకుండా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. యుద్ధ ఘట్టాలు ఒళ్లు గగుర్పాటు కలిగిస్తాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే....

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయాన్ని తరచి చూస్తే బాలకృష్ణ తన వందో చిత్రానికి 100 పెర్సంట్ న్యాయం చేసేందుకు పాత్రలో పూర్తిగా లీనమయ్యేందుకు కృషి చేశారు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో చారిత్రక చిత్రాలకు తన ఆహార్యం, హావభావాలు చక్కగా సరిపోతాయన్న భావనను నిజం చేసి నిరూపించాడు. సీనియర్ నటి హేమామాలిని గౌతమి పాత్రలో కుమారుడిని తీర్చిదిద్దడంలోనూ, అతని కల నేర్చడంలోనూ, రాజ్యంలో తలెత్తుతున్న అసంతృప్తభావనలకు సరైన రీతిలో బదులు చెప్పడంలోనూ హుందాతో కూడిన పరిణత ప్రజ్ణను తన నటనలో కనబరిచారు. ఒకవైపు భర్త యుద్ధకాంక్ష, మరోవైపు కుమారుడని సైతం పణంగా పెట్టాల్సిన దుస్థితిలో కరుణ రసాత్మకమైన మాతృత్వభావనను ఆర్ద్రపూరితంగా పోషించారు వశిష్టాదేవి పాత్రలో శ్రియాశరణ్. మిగిలిన పాత్రలకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా కథను నడపడంలో , నాయక పాత్ర ఔచిత్యాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లడంలో సందర్భోచితంగా నటీనటులందరూ తమవంతు పాత్రల్లో జీవించారు.

టెక్నీషియన్ల విషయంలో...

టెక్నీషియన్ల విషయంలో నంబర్ ఒన్ మార్కులు దర్శకుడు క్రిష్ కొట్టేస్తాడు. ’అన్ సంగ్‘ హీరోగా తెలుగు వాళ్లకే పెద్దగా తెలియక ఎక్కడో చరిత్ర మూలల్లో పడిపోయిన గౌతమీపుత్ర శాతకర్ణి కథను వెలికి తీసిన ఘనత ఆయనదే. ఎన్నెన్నో దేశాలు, ప్రదేశాలు తిరిగి , గ్రంథాలయాల్లో శోధించి తాళపత్ర, తామ్ర , శిల్ప శాసనాలను పరిశోధించి దొరికిన ఆధారాలకు అందమైన అల్లికను జోడించి ఒక మంచి చలనచిత్రంగా , చారిత్రక దృశ్య కావ్యంగా మలచిన శిల్పి క్రిష్ . అతితక్కువ కాలవ్యవధిలో నిర్మించినా సెట్టింగులు , గ్రాఫిక్స్ విషయంలో కథకు తగ్గ హంగులు సమకూర్చడంలో క్రిష్ చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. ప్రేక్షకుడిని కథతో పాటు భావనా ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో చిరంతన్ భట్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఎస్సెట్ గా నిలిచింది. బాలకృష్ణ అభిమానులు ఆశించే డైలాగుల పదును , అదే సమయంలో కథలో పాత్ర ఔచిత్యం రెంటినీ దృష్టిలో పెట్టుకుని రెండు వైపులా పదునున్న కత్తిలా భాషను పంచ్ లుగా విసరడంలో ..అందులోనూ పౌరుషం ధ్వనింపచేయడంలో రచయిత సాయిమాధవ్ కృతకృత్యుడయ్యాడు. యుద్ధసన్నివేశాల్లో రౌద్రం, వీరరసం, బీభత్సం తొణికిసలాడేలా సాదృశ్యమానం చేయడంలో కెమెరా పనితనం కేక పుట్టిస్తుంది. మొత్తమ్మీద ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులకు పండగే. స్వయంగా బాలకృష్ణకు ఆత్మసంతృప్తినిచ్చే సార్థక చిత్రం . తెలుగు సినీ అభిమానులకు మధురమైన తీయని అనుభూతి. గతకాలపు తెలుగు జాతి వైభవానికి, చరిత్రలోని ఒక పార్శ్వానికి తెరనిండైన సాక్ష్యం.

 

ప్లస్ పాయింట్స్ :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం

పదునైన సంభాషణలు

నేపథ్య సంగీతం

పాత్రోచిత నటన

 

మైనస్ పాయింట్స్ :

కాసింత నిడివి ఎక్కువ

కథావేగానికి బ్రేక్ వేసిన పాటలు

ప్రధానపాత్రలతో పోలిస్తే ప్రతినాయక పాత్రలు తేలిపోవడం

 

మరి '10 టివి' ఇచ్చే రేటింగ్, కత్తి మహేష్, మరియు 10టీవీ న్యూస్ ఎడిటర్ సతీష్ విశ్లేషణలు చూడాలనుకుంటే వీడియోను క్లిక్ చేయండి....

16:13 - December 23, 2016

కమెడియన్ గా మంచి పొజిషన్ లో ఉన్న సప్తగిరి తొలిసారిగా హీరోగా ఎంట్రి ఇచ్చిన కామెడీ మూవీ సప్తగిరి ఎక్స్ ప్రెస్. తమిళ్ సినిమా తిరుడన్ పోలీస్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా జనాన్ని మెప్పించిందా..? నవ్వులతో ముంచెత్తిందా ? తెలియాలంటే .. రివ్యూ లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్స్ గా ప్రూవ్ చేసుకున్న సప్తగిరిని ప్రధాన పాత్రగా కామెడీ ని పండించి క్యాష్ చేసుకున్నాయి బోలెడన్ని సినిమాలు. అయితే సప్తగిరి కూడా అందరి కమెడియన్స్ లాగానే హీరోగా వస్తాడని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. హీరో అవ్వాలని తన సొంత డెసిషనో లేక బలవంతం మీద వచ్చాడా అనే విషయాలు పక్కన పెడితే సప్తగిరిని హీరోగా జనం చూస్తారు ఫర్వాలేదు అనిపించుకున్నాడు ఈ సినిమాతో. అయితే ఈ సినిమా అందరూ ఊహిస్తున్నట్టు పక్కా కామెడీ మూవీయే కాకుండా ఎమోషన్ ను కూడా బాగానే క్యారీ చేసారు. సీరియస్ కథతో వచ్చిన తమిళ్ సినిమా తిరుడన్ పోలీస్ కు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం సప్తగిరి ఎక్స్ ప్రెస్. తమిళ్ సినిమా నుంచి మంచి కాన్సెప్ట్ ను మాత్రమే తీసుకొని దానికి కామెడీ తో కలరింగిచ్చి బాగానే తెరకెక్కించారు. అయితే అనవసరమైన కామెడీ సీన్స్ తో మంచి కథను స్పాయిల్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది కొన్ని కొన్ని సీన్స్ లో అయితే ఎమెషనల్ సీన్స్, కామెడీ సీక్వెన్సెస్ జనాన్ని బాగానే కూర్చోబెడతాయి. అయితే సినిమా బిగినింగ్ లో వచ్చే నాటకం సీన్, తండ్రి దగ్గర చెప్పే దానవీర శూరకర్ణ డైలాగ్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.

కథ..
సినిమా నటుడౌదామని నాటకాలతోనూ, చిల్లర వేషాలతోనూ కాలక్షేపం చేస్తుంటాడు సప్తగిరి. అతడి తండ్రి సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్. తన లాగే తన కొడుకును కూడా పోలీస్ ను చేసి మురిసిపోదామనుకుంటాడు. కానీ సప్తగిరి చేష్టలు ఆయన్ను బాగా బాధపెడతాయి. ఇదిలా ఉండగా కొన్ని అనూహ్యపరిస్థితుల్లో సప్తగిరి తండ్రి మరణిస్తాడు. తండ్రి ఉద్యోగం కొడుక్కి ఇస్తారు. కానిస్టేబుల్ గా డ్యూటీ లో చేరతాడు. అప్పుడు ఆ ఉద్యోగంలో తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఆయనది సహజ మరణం కాదని, తన తండ్రిని ఎవరో మర్డర్ చేసారని దానికి కారకులు కూడా ఎవరో తెలుసుకుంటాడు. తండ్రి గొప్పతనం తెలుసుకున్న సప్తగిరి చివరికి రివెంజ్ ఎలా తీర్చుకున్నాడన్నదే మిగతా కథ. తమిళ్ సినిమాను యాజిటీజ్ గా తీసుకున్నా సరే తమిళ్ లో ఉన్న ఎమోషన్ ఈ సినిమాలో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఎన్ని కష్టాలున్నాయో హీరో తెలుసుకునే క్రమంలో వచ్చే సీన్స్ అంత ఎఫెక్టివ్ గా లేవనిపిస్తుంది. కొత్త దర్శకుడు అరుణ్ పవార్ అనుభవరాహిత్యం ఆ సీన్స్ లోనే తెలుస్తుంది. మొత్తం మీద సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని హిలేరియస్ గా నవ్విస్తాయి.

పాత్రల తీరుతెన్నులు...
కానిస్టేబుల్ సప్తగిరిగా సప్తగిరి బాగానే నటించాడు. అయితే అతి లేకుండా, హీరో బిల్డప్పుల్లేమీ లేకుండా మామూలు హీరోగానే నటించడం వల్ల పర్వాలేదనిపిస్తుంది. హీరోయిన్ సంగతి అయితే చెప్పుకోడానికి ఏమీలేదు. అసలు ఆమె హీరోయిన్ మెటీరియలే కాదనిపిస్తుంది. అంతేకాదు, ఆమె పాత్రను ఈ సినిమాలో లైట్ తీసుకున్నారనిపిస్తుంది. ఇక ఇల్లీగల్ బిజినెస్ లు చేయించే సి.ఐ గా కన్నింగ్ విలన్ గా పోసాని కృష్ణమురళి పర్వాలేదనిపిస్తాడు. అజయ్ ఘోష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనిపిస్తుంది. అసలు ఆయన్ను దర్శకుడు ఏమాత్రం ఉపయోగించుకోలేక పోయాడనిపిస్తుంది. హీరో తండ్రి పాత్రలో డా.శివప్రసాద్ బాగా నటించారు. ఇక హీరో ఫ్రెండ్ గా మరో కానిస్టేబుల్ పాత్రలో షకలక శంకర్ ఈ సినిమాకు ఎంతో రిలీఫ్ గా అనిపిస్తాడు. అతడు పండించిన కామెడీ జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక గేస్ గా నటించిన జబర్దస్త్ కమెడియన్స్ గ్యాంగ్ చేసే కామెడీ కూడా బాగానే నవ్విస్తుంది. టోటల్ గా ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ నే హిలేరియస్ గా పేలాయి. అయితే తమిళ్ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమాను అంతగా ఎంజాయ్ చేయలేరు. కానీ బి, సి సెంటర్స్ జనం మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. మొత్తం మీద హీరోగా సప్తగిరి ఓకె అనిపించుకున్నాడు.

ప్లస్ పాయింట్స్
కామెడీ
సప్తగిరి నటన
మైనస్ పాయింట్స్
ల్యాగ్ సీన్స్
హీరో్యిన్
సంగీతం
రేటింగ్ : 2 / 5...

19:06 - December 16, 2016

తొలిసారిగా కామెడీ స్టార్ 30 ఇయర్స్ పృథ్వీ లీడ్ రోల్ లో నటించిన 'మీలో ఎవడు కోటీశ్వరుడు' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ సినిమా ' మీలో ఎవరు కోటీశ్వరుడు'. కామెడీ నటుడు పృథ్వీ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, శృతిసోథీ, సలోనిలు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. తొలిసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పృథ్వీకి మీలో ఎవరు కోటీశ్వరుడు సక్సెస్ అందించిందా..? సత్తిబాబు, తన కామెడీ ఫార్ములాతో మరోసారి ఆకట్టుకున్నాడా..? లేదా అనే విషయం తెలుసుకోవాలా. టెన్ టీవీ అ సినిమాకు ఎంత రేటింగ్ ఇచ్చిందో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.. 

18:40 - November 11, 2016

'ప్రేమమ్' తో బ్లాక్ బస్టర్ హిట్టు ఖాతాలో వేసుకున్న 'అక్కినేని నాగచైతన్య' లేటెస్ట్ గా మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో'తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడిచేస్తోంది. 'ఏ మాయ చేశావె' లాంటి క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్, నాగచైతన్యతో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నాడు. 'ప్రేమమ్' విజయం తర్వాత 'నాగచైతన్య' నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకుల అభిప్రాయాలు..సినిమా రివ్యూ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:10 - October 7, 2016

హీరో అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్లో చేసిన తాజా చిత్రం ‘ప్రేమమ్’. ఇటివల విడుదలైన పాటలు, ట్రైలర్లు జనాలకు బాగా కనెక్టవడంతో ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ప్రేమమ్’ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అసలు ప్రేమమ్ కధేమిటి సినిమా ఏలా ఉందో తెలుసుకొవాలంటే రివ్యూ లోకి వెళ్ళాలిసిందే.

ప్రతి మనిషి జీవితంలో లవ్ అనేది కామన్. కాని ఓకే మనిషి జీవితంలో 3సార్లు ప్రేమ పుడితే ఏమవుతుందనేదే ప్రేమమ్.ఈ సినిమాకి ట్యాగ్ లైన్ అయిన 'లవ్ స్టోరిస్ ఎండ్ బట్ ఫీలింగ్స్ నాట్ ' అనేదే ఈ సినిమా. కధగా చెప్పినప్పుడు కొత్త పాయింట్ అనిపించకపొయినా దాన్ని డిల్ చెసిన విధానంలో, వర్క్ అవుట్ చెసిన ఫీల్ తో గొప్ప సినిమాగా మారింది మలయాళ ప్రేమమ్. అదే సినిమాని కాస్త నిడివి తగ్గించి యాజ్ టీజ్ గా నిజాయితిగా తెలుగులో రిమేక్ చేశారు.
కధ విషయానికొస్తే...విక్రమ్ అనే కుర్రాడు టినేజ్ లో సుమ తో లవ్ లో పడతాడు.కాని అనుకొని కారణాల వలన ఫేయిల్ అవుతుంది. తరువాత కాలేజ్ లైఫ్ లో లేక్చరర్ సితార తో లవ్ లో పడతాడు. అదీ కుడా నాట్ ఏ హ్యాపి ఎండింగ్.తరువాత లైఫ్ లో సెటిల్ అయ్యి హ్యాపిగా సాగిపొతుండగా ఓక అనెక్స్ పెక్టేడ్ పర్సన్ ఎదురవుతుంది. అమెతో లవ్ లో పడతాడు. ఇంతకి అమె ఎవరు? ఫైనల్ గా ఆ ప్రేమైనా సక్సెస్ అవుతుందా లేదా? వంటీ ఫీల్ గుడ్ పాయింట్ తో హత్తుకొనేలా సాగిపొయే ప్యూర్ లవ్ స్టొరీ "ప్రేమమ్".

నటి నటుల విషయానికొస్తే...నాగచైతన్య మెచ్యూరిటి లెవల్స్ బాగున్నాయి. ఓరిజనల్ ప్రేమమ్ లో ఉన్న హిరోని అనుసరించాడు. చాలా వరకు సక్సెస్ అయ్యాడు. హిరొయిన్స్ శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొనా సెబాస్టియన్ ముగ్గురు కుడా పాత్రల్లో లాగా కాకుండా పక్కింటి అమ్మాయిలు లాగా కనిపించడంతో ప్రేక్షకులు ఈజిగా కనెక్ట్ అయిపొతారు. శృతి, నాగ చైతన్య పెయిర్ బాగుంది. కంటేంట్ లో జనరేట్ అయిన కామెడి నాచురల్ గా అనిపించింది. మిగతా నటినటులందరూ తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు. అదనపు అకర్షణలుగా నాగార్జున, వెంకటేష్ లు అతిధి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ధ్రిల్ చేశారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే...దర్శకుడు చందు మొండేటి మలయాళ ప్రేమమ్‌ని సొల్ మిస్సవ్వకుండా తెలుగులో మలచి ఘన విజయాన్ని అందుకున్నాడు.ఇక కెమెరామెన్ కార్తిక్ ఘట్టమనేని ప్రేమమ్ ఒరిజినల్ ఫిల్ ని తెలుగులో తిసుకురావడంలో కీ రోల్ పొషించాడు.గొపి సుందర్, రాజేశ్ మురూగేశన్ లు అందించిన సంగీతం సినిమాకి ప్రాణం పొసింది. ప్రొడక్షన్ వాల్యూస్ బ్యానర్ కు తగ్గట్లూ చాలా రిచ్ గా వున్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. అన్ని డిపార్ట్మెంట్లు బాగా పని చేశాయి. ప్రేమమ్ ను అందరు ప్రేమించే విధంగా వుంది. మిల్కీ బ్యూటీ తమ్మన్న 'అభినేత్రి' సునీల్ నటించిన ఈడు గోల్డ్ ఎహే' సినిమా రివ్వ్యూల కోసం ఈ వీడియోను చూడండి....

18:56 - September 9, 2016

ఊహలు గుసగుసలాడే చిత్రంతో సెన్సిటివ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న శ్రీనివాస్ అవసరాల మలిచిన మరో హ్యూమరస్ అటెమ్ట్ జ్యో అత్యుతానంద. నారా రోహిత్, నాగశౌర్య, రెజినా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా నేడే థియేటర్స్ లోకి వచ్చింది. ఇంతకీ శ్రీనివాస్ అవసరాల రెండో ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా ....? ఊహలు గుసగుసలాడే చిత్రంతో శ్రీనివాస్ అవసరాల తానో సెన్సిటివ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. హ్యూమరస్ ట్రీట్ మెంట్ తో రొమాంటిక్ ప్రేమకథాచిత్రంగా మలిచి మంచి సక్సెస్ సాధించాడు. రెండో సినిమా జ్యో అత్యుతానంద కూడా అదే జానర్ లో వెళతాడని అనుకున్నారు కానీ, ఇదో అన్నదమ్ముల కథగా మనం చెప్పుకోవాలి. అన్నదమ్ముల మధ్య చిలిపి తగాదాలు, చిరు గొడవలు నేపధ్యంలో ఈ సినిమాని కూడా చాలా అద్భుతమైన హ్యూమరస్ ట్రీట్ మెంట్ తో ఆద్యంతం నవ్వించాడు. ముఖ్యంగా చమత్కారపు డైలాగ్స్ తో జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేసాడు. సినిమా టేకాఫ్ లోనే తాను దర్శకుడిగా ఎంత ప్రత్యేకమో చాటుకున్నాడు. ఫస్టాఫ్ అంతా హాయిగా ఎలాంటి హర్డిల్స్ లేకుండా తమాషా సన్నివేశాలతో కథనం సాగుతుంది. సెకండాఫ్ లో వేగం మందగించినా బోర్ మాత్రం కొట్టదు. హ్యూమర్ తో ఎమోషన్స్ మిక్స్ చేసి క్లీన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్నితీర్చిదిద్దాడు దర్శకుడు. కానీ ఇదో పక్కా మల్టిప్లెక్స్ మూవీ. ఇందులో లవ్ స్టోరీ పెద్దగా ఉండదు కాబట్టి, దీనికి మాస్ పీపుల్ కనెక్ట్ అవుతారని చెప్పలేం. ముఖ్యంగా బి,సి సెంటర్లలో ఈ సినిమా మనుగడ కష్టమనిపిస్తుంది.

కథ..
అత్యుత్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో హెచ్ .ఆర్ గా పనిచేస్తుంటాడు, అతడి తమ్ముడు ఆనంద్ మెడికల్ రిప్రజెంటేటివ్స్. వీళ్లిద్దరూ తమ ఇంటిపక్కన కొత్తగా అద్దెకు దిగిన జ్యో ని చూసి ఎట్రాక్ట్ అవుతారు. ఇద్దరూ ఒకిరి తెలియకుండా ఒకరు ఆ అమ్మాయిమీద ప్రేమ పెంచుకుంటారు. ఇద్దరూ అవ్ లెటర్స్ ఇస్తారు. కానీ ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఇద్దరికీ సారీ చెబుతుంది. ఇంతలో చిన్న డిస్ట్రబెన్స్ . అత్యుత్ , ఆనంద్ తండ్రికి గుండెపోటు వస్తుంది. ఈ విషయం జ్యో వాళ్లనాన్నకి చెప్పడం వల్లే గుండెపోటు వచ్చిందని అపార్ధం చేసుకొని ఆ అమ్మాయిని హర్ట్ చేస్తారు.కట్ చేస్తే ఆ అమ్మాయి అమెరికావెళ్ళిపో్తుంది. వీళ్లిద్దరికీ పెళ్లిళ్ళు అయిపోతాయి. అయితే వాళ్లభార్యల మధ్య జ్యో ప్రస్తావన వస్తుంది. దాన్ని కవర్ చేసుకోడానికి అన్నదమ్ములిద్దరూ పడే పాట్లే ఈ సినిమా మిగతా కథ. సినిమా స్టార్టింగ్ లో వీళ్లిద్దరికీ పెళ్లిళ్ళు జరిగిపోయినట్టుగానే చూపించి. ఫ్లాష్ ఎపిసోడ్స్ గా జ్యో అత్యుతానంద ల కథను చెప్పాడు దర్శకుడు. 

 పాత్రల తీరుతెన్నులు... 
నారా రోహిత్, నాగశౌర్యలు ఒకరికొకరు పోటీ పడుతూ మరీ ఈ సినిమాలో కామెడీ పండించారు. అన్నదమ్ములు గా వీరిద్దరి కెమిస్ట్రీ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అదే మూడ్ ను సినిమా ఆద్యంతం కంటిన్యూ చేసారు. సినిమా బిగిన్ అయిన కొద్దిసేపటికే వీరిద్దరి నటనకు కనెక్ట్ అయిపోతారు ప్రేక్షకులు. ఇక రెజినా గురించి చెప్పాల్సింది పెద్దగా ఏమీలేదు. గ్లామరస్ గా కనిపించింది తక్కువ, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అంతగా ఏమీ ఉండదు కానీ, ఓకె అనిపిస్తుంది. ఇందులో విలన్స్ ఎవరూ ఉండరు, కానీ కొన్ని ట్విస్టులు మాత్రం జనానికి భలే ఎంటర్ టైన్ మెంట్ నిస్తాయి. ఇక సినిమాలో మూడొంతుల కథ వీరి ముగ్గురు చుట్టూనే నడుస్తుంది. రోహిత్, నాగశౌర్యల భార్యలు గా నటించిన అమ్మాయి లు కూడా ఉన్నంతలో బాగా నటించారు. ఇక సినిమా కి ప్రధాన డ్రా బ్యాక్ ఏంటంటే. లవ్ స్టోరీ ఏమీ లేకపోవడం, డ్యూయెట్స్ అసలు లేకపోవడం అద్భుతమైన డైలాగ్స్ తో , వినసొంపైన సంగీతంతో మాత్రం ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు అవసరాల. ఇందులో ఇద్దరికీ హీరోయిన్స్ గా గ్లామరస్ ముఖాలు ఎవరూ లేరు కాబట్టి, ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ కాబట్టి మాస్ జనానికి నచ్చడం కష్టం కావచ్చు.

ప్లస్ పాయింట్స్ :
నారారోహిత్, నాగశౌర్యల నటన
సంగీతం
డైలాగ్స్
క్లాసీ స్ర్కీన్ ప్లే.
క్లైమాక్స్ .
మైనస్ పాయింట్స్ :
ప్రేమకథ లేకపోవడం
సెకండాఫ్ స్లో అవడం
రేటింగ్ : 2/5

Pages

Don't Miss

Subscribe to RSS - movie review