MP vinod

15:51 - March 8, 2018

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రాష్ట్ర శాసన సభలో రిజర్వేషన్ల అంశాన్ని పెట్టి, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తీర్మానం చేశామని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. ఈ తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదంతో రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రతుల్ని పంపినప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో నిరసన చేపట్టామన్నారు. 

15:36 - October 13, 2017

ఢిల్లీ : హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్‌ మండిపడ్డారు. ఈ విషయంలో ఎన్ డీఏ ప్రభుత్వం నిర్లక్ష వైఖరి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సర్కారు తీరును వినోద్‌ ఖండించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో  ఈ రెండు అంశాలపై ఎన్ డీఏ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.  ఖమ్మం జిల్లాలోని ఏడు మండలను ఏపీలో కలుపుతూ రాజకీయ నిర్ణయం తీనున్న మోదీ సర్కారు... హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఎందుకు తీసుకోవడంలేదని వినోద్‌ ప్రశ్నించారు. 

14:30 - July 17, 2017

ఢిల్లీ : టీఆర్‌ఎస్ ఎంపీలంతా రాష్ట్రపతి ఎన్నికకు ఓటు వేశామని ఎంపి వినోద్ పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని వినోద్ చెప్పారు. మరోవైపు ఏపీ, తెలంగాణలకు హైకోర్టును కేటాయించాల్సిన అవసరం ఉందని ఈ అంశంపై కూడా పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని వినోద్ తెలిపారు. సిద్ధంగా ఉన్న అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు రెండు, మూడు రోజుల్లో పార్లమెంటుకు వస్తుందని భావిస్తున్నట్లు ఎంపి వినోద్ చెప్పారు.

15:25 - January 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని ఎంపీ వినోద్ అన్నారు. కరీంనగర్ డెయిరీ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్‌ఎస్ నాయకులతో పాటు ఉద్యోగులు పరుగెత్తలేకపోతున్నారని చెప్పారు. కరీంనగర్ డెయిరీ సామర్థ్యాన్ని 5 లక్షల లీటర్ల ఉత్పత్తికి పెంచాలని అన్నారు. 

16:41 - November 27, 2016

హైదరాబాద్ : ఇన్నాళ్లు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతాయని ఆశపడ్డ నేతల్లో.. ఇప్పుడు కలవరం మొదలైంది. కేంద్ర ప్రకటనతో వారంతా అయోమయంలో పడ్డారు. 2026 సంవత్సరం వరకూ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేయడంతో.. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల్లో అనుమానాలు, ఆందోళనలు రెట్టింపయ్యాయి. 
భారీ ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందన్న ధీమాతో రెండు రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీలు భారీ ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపాయి. నియోజకవర్గాల పెంపును దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల నేతలను పెద్ద ఎత్తున తమతమ పార్టీల్లోకి చేర్చుకున్నాయి. అయితే 2026 వరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే ప్రసక్తే లేదని కేంద్రం తాజాగా ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. 
టీఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన
కేంద్రం ప్రకటన టీఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళనలు మొదలయ్యాయి. సీట్ల పెంపు 2026 సంవత్సరం వరకు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టమైన సమాధానం ఇచ్చింది. దీంతో వలస నేతల పరిస్థితి మరింత అయోమయంగా కనిపిస్తోంది. అయితే... నియోజకవర్గాల పెంపు తర్వాతే ఎన్నికలు జరుగుతాయని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ఎంపీ వినోద్‌కుమార్‌ చెబుతున్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరమంటూ కేంద్రమంత్రి చేసిన ప్రకటనను తోసిపుచ్చారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ కవలం చిన్న సవరణతో ఇది సాధ్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అన్న అంశం రాజకీయ వర్గాల్లో మాత్రం కొత్త టెన్షన్‌ సృష్టిస్తోంది. 

 

14:43 - September 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై టి.కాంగ్రెస్ పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. ఈ మేరకు సోమవారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను కలిసింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ కాంగ్రెస్ పై పలు విమర్శలు గుప్పించారు. భారీ దోపిడి అన్న ఉత్తమ్...
తెలంగాణలో ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని.. బలవంతపు భూసేకరణకు మాత్రమే వ్యతిరేకమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మల్లన్నసాగర్ బలవంతపు భూసేకరణపై గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుచేశారు. ప్రాజెక్టుల పేరిట తెలంగాణలో భారీ దోపిడీ జరుగుతుందని.. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడండని గవర్నర్‌కు విజ్ఞప్తిచేశామని ఉత్తమ్ తెలిపారు.
హస్తం నేతలు మట్టి కొడుతున్నారు - ఎంపీ వినోద్..

తమ పార్టీ భవిష్యత్‌ కోసమే కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. 2013 భూసేకరణ చట్టం తెచ్చిన మూడునెలలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందని.. చట్టాన్ని కాంగ్రెస్ నాయకులు ఆధ్యయనం చేయలేదని విమర్శించారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ రైతుల నోట్లో హస్తం నేతలు మట్టికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

12:20 - June 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ కు ప్రత్యేక  హైకోర్టు  లేనందువల్లే న్యాయవాదులకు అన్యాయం జరుగుతోందని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. చీఫ్ జస్టిస్ వెంటనే గతంలో ఇచ్చిన ఆదేశాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయమూర్తులు.. న్యాయవాదులు సామూహిక సెలవులకు  పిలుపివ్వడం సబబయిందేనన్నారు. తెలంగాణకు ముమ్మాటికి అన్యాయం జరుగుతున్నప్పుడు దానిని అరికట్టకపోవడం శోచనీయమని వినోద్ అన్నారు. సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ కు కేంద్రమంత్రులకు విన్నవిస్తామన్నారు.   

16:09 - April 29, 2016

ఢిల్లీ : నీట్‌ పరీక్షపై తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందవద్దని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ సూచించారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. 

 

16:37 - December 23, 2015

ఢిల్లీ : రైతుల ఆత్మహత్యలు జరుగుతుండగా అయిత చండీయాగం నిర్వహించడం ఏంటనీ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మండిపడింది. దిగ్విజయ్ సింగ్ పాలించిన మధ్యప్రదేశ్ లోనే రైతుల ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయని ఆ పార్టీ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. ముందుగా అక్కడి పరిస్థితిని చూసుకోవాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ నిర్వహిస్తున్న అయిత చండీగాయానికి ప్రభుత్వానికి మధ్య సంబంధం లేదన్నారు. యాగానికి ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని ఎంపీ వినోద్ తెలిపారు.

16:17 - December 23, 2015

హైదరాబాద్ : లోక్ సభలో పది బిల్లులపై టీఆర్ఎస్ ఎంపీలు చర్చించినట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. లోక్ సభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు ప్రైవేటు బిల్లులను ప్రవేశ పెట్టినట్లు, రాష్ట్రం విడిపోయిన అనంతరం శాసనసభలో సీట్ల సంఖ్యను పెంచుకొనే వెసులు బాటు ఇవ్వాలని బిల్లులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విభజన చట్టం చెప్పినా హైకోర్టు విభజన ఇంకా జరగలేదని, అంతేగాక సమయం పొందుపర్చలేదన్నారు. హైకోర్టు విభజన కోసం ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టడం జరిగిందని ఎంపీ వినోద్ పేర్కొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - MP vinod