Mukesh Ambani

19:23 - December 9, 2018

రాజస్థాన్: భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కూతరు ఈషా అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అంతర్జాతీయ అతిథులు వేడుకలకు తరలివచ్చారు. ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్‌ ఉదయ్‌విలాస్‌ వేదికగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈశా అంబానీ సంగీత్‌ వేడుకల్లో సినీ తారలే కాదు కుటుంబసభ్యులు కూడా డ్యాన్సులతో దుమ్మురేపారు. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. అనంతరం ఈశా అంబానీ, ఆనంద్‌ పిరమాల్‌లు సైతం పలు బాలీవుడ్‌ పాటలకు డ్యాన్సులు చేశారు. దీంతోపాటు నీతా, ఆకాశ్‌, అనంత్‌లు సైతం మరోసారి ఈశా కోసం స్టెప్పులేశారు. గులాబీ రంగు గ్రాండ్‌ లెహంగాలో పెళ్లికూతురు ఈషా జిగేల్‌మంది. ఈశా-ఆనంద్‌ల చెయ్యి పట్టుకుని స్వయంగా ముకేష్ అంబానీ వేదిక మీదకు తీసుకొచ్చారు. అన్నదమ్ములు ముకేష్‌, అనిల్‌ అంబానీలు స్వయంగా దగ్గరుండి అతిథులకు స్వాగతం పలికారు.
హిల్లరీ క్లింటన్‌, వివిధ సంస్థల సీఈవోలు, బాలీవుడ్‌ ప్రముఖులు షారుక్‌ ఖాన్ దంపతులు‌, సల్మాన్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా దంపతులు, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌, జాన్వి, అమీర్‌ఖాన్ దంపతులు తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. డిసెంబర్ 8న ప్రారంభమైన రెండు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలు డిసెంబర్ 9తో ముగియనున్నాయి. 12న ముంబైలోని అంబానీ నివాసం యాంటీలియాలో ఈషా-ఆనంద్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.

18:14 - December 9, 2018

రాజస్థాన్: ప్రపంచ కుబేరుల్లో ఆయనొకరు. భారత్‌లో నెంబర్ 1 సంపన్నుడు. అలాంటి వ్యక్తి ఇంట వివాహం అంటే మాములుగా ఉంటుందా. భారత బిజినెస్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇషా అంబానీ, ఆనంద్ పిరమాల్ వివాహం డిసెంబర్ 12న ముంబైలోని అంబానీ నివాసం యాంటీలియాలో జరగనుంది. పెళ్లికి ముందు రెండు రోజుల వేడుకను ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరుపుతున్నారు. శనివారం రాత్రి ప్రారంభమైన వేడుకలు నేటితో(డిసెంబర్ 9) ముగియనున్నాయి. ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్‌ ఉదయ్‌విలాస్‌ వేదికగా జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు, అంతర్జాతీయ అతిథులు తరలివచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ కూడా విచ్చేశారు.
తారల ఆటాపాటా:
ఈషా అంబానీ సంగీత్‌లో బాలీవుడ్ తారలు సందడి చేశారు. తమ ఆటపాటలతో ఉర్రూతలూగించారు. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్ దంపతులు ఆడిపాడారు. షారుక్ తన భార్య గౌరీ ఖాన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ కపుల్.. స్టెప్పులతో ఉత్సాహం నింపారు. వీరి డ్యాన్సులు సంగీత్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. తారల డ్యాన్సుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ముద్దుగుమ్మలు కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, కరిష్మా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు కూడా వేడుకకు తరలివచ్చారు.

 

 

 

 

16:20 - December 6, 2018

ముంబై  (మహారాష్ట్ర) : శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే అంతా హడావిడే. ఎక్కడ చూసినా రిచ్ లుక్సే. ఏది చేసినా ఘనంగా వుండాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి వివాహాలు ఎక్కడా జరగలేదబ్బా అనుకునేంత గొప్పగా..రిచ్ గా వుండాలి. దాని కోసం ఫుడ్, కాస్ట్యూమ్స్, ఎకామిడేషన్,  నుండి అన్ని అరేంజ్ మెంట్స్ అన్నీ అంటే అన్నీ ఘనంగా వుండాలి.అటువంటిది అంబానీవారింటో పెళ్లి అంటే మాటలా? ఎంతటి రిచ్ గా వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యంకానంత రిచ్ గా వుండబోతోంది అంబానీగారి గారాల పట్టి ఇషా అంబాని వివాహం. 
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ‘ఆంటిల్లా’లో వీరి పెళ్లిని అంగరవైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భారీ నుండి అతి భారీగా జరుగుతున్నాయి. అంబానీల ఇంట పెళ్లంటే.. ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అంబానీ, పిరమాళ్ కుటుంబాలు ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అతిథులను తీసుకెళ్లడానికి అంబానీ ఫ్యామిలీ 30 నుంచి 50 చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించనున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో రోజుకు 19 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఎన్నికల ఎఫెక్ట్, అంబానీ కూతురి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కారణంగా ఆ విమానాశ్రయానికి రద్దీ భారీగా పెరగనుంది. ఉదయ్‌పూర్‌లో భారీ సంఖ్యలో ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా అంబానీ కుటుంబం బుక్ చేసిసేసారు. ఇషా పెళ్లి వేడుకలను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించనున్నారు. ప్రియాంక-నిక్, అనుష్క-విరాట్‌ల పెళ్లికి కూడా ఆయనే ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఉదయ్‌పూర్‌లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత ముంబైలో నాలుగు రోజులపాటు అంబానీ కూతురి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గతంలో కర్ణాటక మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగినా ఎంత ఘనంగా చేశాడో తెలిసిన విషయమే. 

 

10:23 - November 28, 2018

చిత్తూరు : రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో త్వరలో భాజాభజంత్రీలు మోగనున్నాయి. ఆయన కుమార్తె ఈషా అంబానీ వివాహం డిసెంబర్ 12న జరుగనున్న సంగతి తెలిసిందే.  పిరామల్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ అజయ్‌ పిరామల్‌ కుమారుడు ఆనంద్‌‌తో ఈషా వివాహం జరుగనుంది. ఇప్పటి నుండే పెళ్లి ఏర్పాట్లలో అంబానీ ఫ్యామీలీ బిజీబిజీగా ఉంది. అత్యంత ఖరీదైన పెళ్లికార్డును అతిథులకు అంబానీ దంపతులు అందచేస్తున్నారు.
Image result for Isha Ambani's Wedding Cardఈ సందర్భంగా పెళ్లికార్డును తిరుమల శ్రీవారి చెంత ఉంచేందుకు ముఖేష్ అంబానీ, కుమారుడు అనంత్ అంబానీలు తిరుమలకు విచ్చేశారు. నవంబర్ 27వ తేదీ ఉదయం వచ్చిన వీరు మహాద్వారం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం వీరు అర్చన సేవలో పాల్గొన్నారు. వివాహ ఆహ్వాన పత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి టీటీడీ అర్చకుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. డిసెంబరు 8, 9 తేదీల్లో ఈషా వివాహ వేడుకలు అత్యంథ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అక్టోబరులో ఇటలీలోని లేక్‌ కోమోలో ఆనంద్‌-ఈషా నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగిన సంగతి 

09:00 - October 23, 2018

ఢిల్లీ : గడిచిన మూడేళ్ళలో దేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరిగిపోయింది. 81వేల మంది కోటి రూపాయలకు పైగా వార్షిక ఆదాయం ప్రకటించారని  కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు పదిహేను శాతానికి పైగా  పెరిగాయని, ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటిదాకా  నాలుగు  లక్షల కోట్లకు పైగా  చేరాయని సీబీడీటీ వెల్లడించింది. మరోవైపు  భారతీయులు విదేశాల్లో దాచిన అక్రమ సొమ్ముపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు మూడో వారానికి దేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.7శాతం పెరిగాయన్న సీబీడీటీ... ఇయర్‌-ఆన్‌-ఇయర్‌ ప్రాతిపదికన పన్నుల రూపంలో రూ.4.89లక్షల కోట్లు ఖజానాకు జమ అయినట్లు తెలిపింది. మార్చి 31, 2019 నాటికి రూ.11.5లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో ఖజానాకు జమ అవుతాయని సీబీడీటీ లక్ష్యంగా పెట్టుకుంది. 
 

16:25 - October 20, 2018

ఢిల్లీ : భారత టెలికాం రంగంలో జియో ఓ సంచలనం. ఓ చరిత్ర. ఓ రికార్డ్. టెలీకాం రంగంలోని పేరుతో అడుగుపెడుతూనే రిలయన్స్ సంస్థ ప్రకంపనలు సృష్టించింది. అతి స్వల్ప కాలంలోనే ఏకంగా 10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకుని సరికొత్త రికార్డును నెలకొల్పింది. తాజాగా దీపావళి పర్వదినం సందర్భంగా వినియోగదారులకు రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది. ‘మై జియో’ యాప్ ద్వారా రూ.149 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రిచార్జీ చేసుకునే వారికి 100 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తామని తెలిపింది. 

Image result for my jio appఇలా రీచార్జ్ చేసుకుంటే రిడీమ్ కూపన్లు లభిస్తాయనీ, వీటిని రిలయన్స్ డిజిటల్, డిజిటల్ ఎక్స్ ప్రెస్ మినీ స్టోర్లలో వాడుకోవచ్చని వెల్లడించింది. రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేసేవారికే ఇది వర్తిస్తుందని తేల్చిచెప్పింది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ నవంబర్ 30 వరకూ అందుబాటులో ఉంటుందని రిలయన్స్ తెలిపింది. అలాగే రిడీమ్ కూపన్లను డిసెంబర్ 31లోపు వాడుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.మరోవైపు రూ.1,699తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే కొత్త ప్లాన్‌ను జియో ఆవిష్కరించింది. దీంతో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు1.5 జీబీ 4జీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్‌ఎంఎస్ లు, అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ ఏడాది పాటు పొందవచ్చు.
 

 

16:36 - October 3, 2018

ఢిల్లీ :  సాధారణ స్థాయి నుండి ప్రధాన మంత్రి స్థాయికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనే విషయం అందరికి తెలుసు. క్రమేపీ పార్టీలో ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రి..అనంతరం ప్రధానమంత్రి అయిన ప్రధాన మోదీని నమ్మిన ప్రజలు ప్రధానికి చేశారు. కానీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన మోదీ డీమానిటేష్ వంటి పథకాలతో అప్పతిష్టను మూటకట్టుకోవటమే కాక..భారతదేశపు ఆర్థిక వ్యవస్థనే ఛిన్నా భిన్నం చేసేసారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ఎన్నికల ప్రధాన అస్త్రంగా ఎన్డీయే వైఫల్యాలను అస్త్రాలుగా చేసుకున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతు..నరేంద్ర మోదీని నమ్మిన ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వగా, ఆయన దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారని..నమ్మిన ప్రజలను మోదీ మోసం చేశారని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తనను నమ్మాలని కోరారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి మహాత్మాగాంధీ ఎంతో కృషి చేస్తే, ఇప్పటి ప్రధాని విభజించి పాలించాలన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.
"మీరు మోదీకి మద్దతిచ్చారు. ఆయన మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, మహాత్మా గాంధీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లి దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉన్న కాంగ్రెస్ ను నమ్మండి" అని ఆయన వ్యాఖ్యానించారు. రాఫెల్ డీల్ ను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థను వదిలేసి, అంబానీల సంస్థను ఎంచుకోవడం వెనకున్న కారణం ఏంటో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.

09:36 - September 28, 2018

పశ్చిమగోదావరి :  ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, ఉంగుటూరు నియోజకర్గం గణపవరంలలో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ పవన్ పలు  వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల రూపాయలు ఉంటే రాజకీయాలు చేయొచ్చని కొందరు అనుకుంటున్నారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విమర్శించారు. ఒకవేళ అదే నిజమనుకుంటే వైసీపీ అధినేత జగన్ ఎప్పుడో సీఎం అయి ఉండేవారని, ముఖేశ్ అంబానీనో, లేదంటే టాటా, బిర్లానో దేశానికి ప్రధాని అయి ఉండేవారని పవన్ అన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే కావాల్సింది డబ్బు కాదని, ప్రజా బలమని అన్నారు. తనకు అది పుష్కలంగా ఉందని పవన్ పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో తాను పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయన్న ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్ చెప్పారు. కానీ తాను అనుకున్నది ఒకటి, అయింది మరొకటని అన్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నారని, సీఎంగా తొమ్మిదేళ్లు శాంతిభద్రతలను కాపాడారనే ఉద్దేశంతోనే చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. లోకేశ్‌లా తండ్రిని కేంద్రానికి పంపించి, తాను ముఖ్యమంత్రిని అయిపోవాలనుకోవడం లేదని పవన్ వ్యంగ్యంగా అన్నారు. 
 

08:42 - September 24, 2018

ఢిల్లీ :  అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ వ్యాఖ్యలతో...రాఫెల్‌ స్కాం కేంద్ర ప్రభుత్వ మెడకు చుట్టుకుంది. రాఫెల్ స్కాం కాంగ్రెస్ విమర్శల దాడి పెంచడంతో....మోడీ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ దీన్నుంచి బయట పడేందుకు కొత్త నాటకాలు ప్రారంభించింది. ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు....డసాల్ట్ కంపెనీతో....రిలయన్స్ సంస్థకు యూపీఏ హయాం నుంచి భాగస్వామ్యం ఒప్పందం ఉందంటూ సరికొత్త వాదనకు తెరతీసింది. 2012లో యూపీఏ హయాంలోనే  డసాల్డ్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుందంటూ....రక్షణ శాఖ ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నిస్తోంది.

యూపీఏ హయాంలో 126 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు టెండర్లలో అతి తక్కువ బిడ్‌ వేసిన డసాల్డ్ .. కేవలం రెండు వారాల్లోనే రక్షణ రంగంలో తన భాగస్వామిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్ తో  ఒప్పందం కుదుర్చుకుందంటూ వచ్చిన మీడియా కథనాలను ప్రస్తావించింది. అయితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనిల్‌ అంబానీది కాదు. అది ముఖేశ్‌ అంబానీది. ముఖేశ్‌ అంబానీకి చెందిన రక్షణ సంస్థ పేరు రిలయన్స్‌ ఏరోస్పేస్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌. గతంలో ఇది రిలయన్స్‌ గ్యాస్‌ మార్కెటింగ్‌ పేరిట కార్యకలాపాలు నిర్వహించేది. 2012 మేలో దాని పేరును రిలయన్స్‌ ఏరోస్పేస్ గా మార్చారు ముఖేశ్ అంబానీ. 2014 తర్వాత నుంచి ఈ కంపెనీ రక్షణ రంగంలో వ్యాపార లావాదేవీలేమీ జరపడం లేదు. 

21:35 - February 13, 2018

గుంటూరు : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్ అంబానీ... అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అంబానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌లో అమరావతి చేరుకుని.. నేరుగా రియల్‌ టైం గవర్నెన్స్‌ కేంద్రానికి వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రియల్‌ టైం గవర్నెన్స్‌ పనితీరును పరిశీలించారు. ఈ భేటీ అనంతరం సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అంబానీ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాయలసీమలో సెల్‌ఫోన్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆయా కంపెనీలను ఒప్పించాలని ముఖేశ్‌ను మంత్రి లోకేష్‌ కోరారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తే.. రెండువారాల్లోగానే సెల్‌ఫోన్‌ల కంపెనీకి శంకుస్థాపన చేస్తామని ముఖేశ్‌ అంబాని తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Mukesh Ambani