mumbai

14:01 - December 14, 2018

ఢిల్లీ : రాఫెల్ స్కామ్ విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాఫెల్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ అంభానీ హర్షం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు పిటీషన్ కొట్టివేయటంతో రాజకీయ కుట్రలకు తెరపడిందని అనిల్ అంబాని పేర్కొన్నారు. ఫ్రాన్స్ నుండి భారత్ కొనుగోలు చేసిన  36 యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో  20 బిలియన్ డాలర్లు అంటే రూ.1,30,000 కోట్లు కుంభకోణం జరిగిందంటు దాఖలైన పిటీషన్స్ ను కొట్టివేస్తు సుప్రీంకోర్టు ఇచ్చినతీర్పుతో ఎన్డీయే ప్రభుత్వంతో పాటు అనిల్ అంబానికి కూడా ఊరట లభించింది. 
సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : అనిల్ అంబానీ
తాజాగా ఈ ఒప్పందంలో రాఫెల్ కంపెనీ భాగస్వామిగా ఉన్న రిలయన్స్ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. రాఫెల్ పై దాఖలైన పిల్స్, పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపారు. వ్యక్తిగతంగా తనతో పాటు రిలయన్స్ గ్రూప్ పై రాజకీయ దురుద్దేశాలతో, సాక్ష్యాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించారు. 
ఫ్రాన్స్ కంపెనీరీ అనిల్ అంబానీ కంపెనీ మధ్య ఒప్పందం..
దేశానికి అత్యంత కీలకమైన రక్షణ రంగం నుంచి కూడా ప్రభుత్వ సంస్థలని తప్పించే క్రమంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని ఫ్రాన్స్ కంపెనీకి అప్పగించారు. అనంతరం ఈ రంగంలో లేని రిలయన్స్ (అనిల్ అంబాని)తో యుద్ధ విమానాలకి సంబంధించిన విడి భాగాలు తయారు చేసే కంపెనీగా రిజిస్టర్ చేయించటం జరిగింది. ఆ తరువాత రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టు పొందిన దస్సాల్ట్ అనే ఫ్రాన్స్ కంపెనీకి అనిల్ అంబాని కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరించటంలో ఎన్డీయే ప్రభుత్వం కీలక పాత్ర వహించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఒప్పందదం ప్రకారం దస్సాల్ట్ కంపెనీ రిలయెన్స్‌కి 50 శాతంవాటా ఇవ్వాలి. ఈ నేపథ్యంలో కొనసాగిన పలు కీలక పర్యవసానాల క్రమంలో అనిల్ అంబానీ కూడా రాఫెల్ కుంభకోణం విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోగా..డిసెంబర్ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ తో ఎన్డీయే ప్రభుత్వంతో పాటు అనిల్ అంబానీ కూడా హర్షం వ్యక్తంచేస్తు సుప్రీం తీర్పును స్వాగతించారు.
 

15:51 - December 13, 2018

జమ్మూకశ్మీర్  :  కశ్మీర్ లో ఉగ్రవాదులకు భద్రతాదళాలకు జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బందిపొరా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోపోర్ పట్టణంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా నిఘా వర్గాలు సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతాబలగాలు నిన్న రాత్రి అంటే డిసెంబర్ 12న ఉగ్రవాదులు నక్కిన ఇంటిని చుట్టుముట్టాయి. అప్పటి నుంచి డిసెంబర్ 13 తేదీ ఉదయం వరకూ కాల్పులు కొనసాగాయి. ఈ భారీ ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాదు  ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఇద్దిరిలో ఒకరు  బాలీవుడ్ సినిమా ‘హైదర్’ లో నటించిన సకీబ్ బిలాల్ అహ్మద్ అనే 17 ఏళ్ల అబ్బాయి కూడా వున్నట్లుగా అధికారులు గుర్తించారు. 
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణ..దానికి ఓ కుటుంబంలోని వ్యక్తి అరెస్ట్..అనంతరం ఎన్ కౌంటర్, అనంతరం ఆ  నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమా చిత్రీకరణలో షాహీద్ కపూర్ చిన్నప్పటి పాత్రలో బిలాల్ నటించాడు. ఈ ఎన్ కౌంటర్ లో బిలాల్ తో పాటు ఉగ్రవాదిగా మారిన ముదసిర్ అహ్మద్ అనే 14 బాలుడు కూడా ఎన్ కౌంటర్ కు గురయ్యాడు. వీరిద్దరూ 2018 ఆగస్టు 31న ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. కశ్మీర్ లో విద్యార్థులను, ముఖ్యంగా మైనర్ యువతను ఆకర్షించేందుకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు పలు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతుండటం సర్వసాధారణంగా మారిపోయింది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ దాదాపు 450 మంది యువకులను లష్కరే తోయిబా సంస్థ ఉగ్రవాదులుగా మార్చినట్లుగా తెలుస్తోంది.

14:49 - December 13, 2018

ముంబై :  సెలబ్రిటీస్ సాధారణ ప్రజల్లా పబ్లిక్ లోకి రాలేరు. అందులోను ఆ సెలబ్రిటీలు సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులైతే మామూలుగా వుండదు.  అభిమానులు గుర్తు పట్టారంటే సెలబ్రిటీలైన చుక్కలు చూడాల్సిందే. అందుకే వారు పబ్లిక్ లోకి రారు. కానీ వారు కూడా సాధారణ ప్రజల్లా సినిమా చూడాలని వున్నా థియేటర్ కు రారు. వారి సినిమా ఎలా వుందో మొదటి షోలోనే తెలుసుకోవాలని వారికి ఉత్సాహంగా వుంటుంది. థియేటర్ లో జనం సినిమా చూసి ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవాలని..ఆ స్పందనను చూడాలని అనుకుంటుంటారు. కానీ వీలు పడదు. అందుకు ఈ హీరోయిన్ ఓ చక్కటి ప్లాన్ వేసింది. బురఖా వేసుకుని సినిమా థియేటర్ కు వెళ్లి ప్రేక్షకుల స్పందన తెలుసుకుంది. 
అభిషేక్ క‌పూర్ ద‌ర్శ‌క‌త్వంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, సారా అలీ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం కేదార్‌నాథ్‌. 2013లో కేదార్‌నాథ్‌లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల నేప‌థ్యంతో తెర‌కెక్కింది ఈ కేదార్ నాథ్ సినిమా. ప్రేమ ఓ యాత్ర అన్న ట్యాగ్‌లైన్‌ను సినిమాకు ఫిక్స్ చేశారు. భీక‌ర‌మైన వ‌ద‌ర‌ల మ‌ధ్య ఓ జంట‌లో చిగురించిన ప్రేమ‌ను డైర‌క్ట‌ర్ అత్య‌ద్భుతంగా చూపించారు కేదార్ నాథ్ సినిమాలో. డిసెంబ‌ర్ 7న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళిపోతోంది. సినిమాపై ప్రేక్షకుల స్పంద‌న ఎలా ఉందో స్వ‌యంగా తెలుసుకోవాల‌ని భావించిన హీరోయిన్ సారా బుర్ఖా వేసుకొని ముంబైలోని ఓ థియేట‌ర్‌కి వెళ్లింది. ప్రేక్షకులకు అనుమానం రాకుండా వారి మధ్యే కూర్చొని తన తొలి చిత్రాన్ని ఎంజాయ్ చేసింది. అనంతరం సోషల్ మీడియాలో విషయాన్ని వెల్లడిస్తూ థియేటర్‌లో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇది చూసి షాక్ అయిన ప్ర‌జ‌లు సారా నువ్వు మ‌మ‌ల్ని చీట్ చేశావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

09:03 - December 13, 2018

ముంబాయి : అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. భారతదేశ కుబేరుడైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ, ఆనంద్ పిరమిల్ జంట ఒక్కటైంది. ముంబయిలోని పెడ్డారేట్ లోని విలాసవంతమైన అంబానీ ఇల్లు యాంటీనాలో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయాలకు పెద్ద పీట వేసిన ఈ పెళ్లిలో అజయ్ పిరమిల్ కుమారుడైన ఆనంద్ పిరమిల్ కు మేళ తాళాల మధ్య బామమరుదులు ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ ఎదుర్కోలు పలికారు. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఆకాశ్, ఆనంత్ గుర్రాల మీద వచ్చి ఆనంద్ ను వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. స్థానిక సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం..ఇషా, ఆనంద్ ల వివాహం జరిగింది. శాస్త్రోక్తంగా జంట ఒక్కటైంది.

ఈ వివాహానికి దాదాపు 600 మంది అతిథులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ మూడు రోజులుగా పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. అంబానీ, పిరమాల్ కుటుంబ సబ్యులకు ఆప్తులు, ఉన్నత హోదాలో ఉన్న రాజకీయ వేత్తలు, అతికొద్దిమంది బాలీవుడ్ ప్రముఖులు విహానికి హాజరయ్యారు.  

అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన ఈ వివాహానికి బిగ్ బి అమితాబ్, అబిషేక్, ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్, అమిర్ ఖాన్, రజినీకాంత్, సైఫ్ అలీఖాన్, కరినా కపూర్, సోనమ్ కపూర్, కిరణ్ రావు హాజరయ్యారు. వీరితోపాటు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని దేవేగౌడ, కాంగ్రెస్ నేత చిదంబరం, ఎన్ సీపీ నేత శరద్ పవార్, ఏపీ సీఎం చంద్రబాబులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, హర్బజన్ సింగ్ కుటుంబ సమేతంగా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

 

20:54 - December 12, 2018

ముంబయి : ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ కూతురు ఈశా అంబానీ పెళ్లికి సర్వం సిద్ధమైంది. ముంబయిలోని ముకేశ్‌ నివాసం యాంటీలియాలో ఇవాళ ఈశా వివాహం ఆనంద్‌ పిరమాల్‌తో జరగనుంది. సోమవారంతో ఈశా ప్రీవెడ్డింగ్‌ వేడుకలు ఉదయ్‌పూర్‌లో ముగిశాయి. అయితే వివాహ ఆహ్వాన పత్రిక నుంచి ప్రతీది అంబానీ కుటుంబం స్థాయికి తగ్గట్టే విలాస వంతంగా ఉండేలా చూసుకున్నారు. అయితే ఇప్పుడీ వివాహానికి సంబంధించి మరో విషయం కూడా చక్కర్లు కొడుతోంది. 
ఈశా వివాహానికి రూ.718 కోట్లు ఖర్చు.. 
ఈశా వివాహానికి 100మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.718 కోట్లు)ఖర్చు పెడుతున్నారట. అయితే ఇందులో నిజం లేకపోలేదని.. ముకేశ్‌ అంబానీకి ఒక్కగానొక్క కూతురు కావడంతో వాళ్ల స్థాయికి తగ్గట్టే ఇంత ఖర్చు పెట్టే అవకాశం ఉందని అంబానీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
సర్వాంగ సుందరంగా యాంటీలియా ముస్తాబు...
బుధవారం జరగబోయే ఈశా వివాహానికి యాంటీలియాను సర్వాంగ సుందరంగా అలంకరించారు. 27 అంతస్తుల ఈ భవనం కాంతులీనుతోంది. అయితే వివాహానికి వచ్చే అతిథులు ఇక్కడికి రావడానికి ప్రత్యేక భద్రత చర్యలను తీసుకుంటున్నారు. పెళ్లికి వచ్చే అతిథులను ఫోన్లు తీసుకురావద్దని, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయద్దని వివాహ ఆహ్వాన పత్రికతో పాటే సమాచారం అందించారట. అయితే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అతిథులు హాజరు కానుండటంతో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు.

 

09:31 - December 12, 2018

ముంబై : బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ అంతరిక్షానికి వెళ్లనున్నారు. ఏమిటి అంతరిక్షానికి షారూక్ వెళ్లటమేంటి? అనుకుంటున్నారా? అంతరిక్షానికి వెళ్లేది వ్యోమోగాములు కదా? సినిమా హీరో వెళ్లటమేంటి? అనుకుంటున్నారా? సినిమాల కోసం ఈ మధ్య హీరోలు వెళ్లని ప్రాంతమంటు లేదు...దీంతో బాద్ షా సినిమా షూటింగ్ కోసం అంతరిక్షానికి వెళ్లనున్నారు.
 ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ‘జీరో’ డిసెంబర్ 21న విడుద‌ల కానుంది.  ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలతో వున్నారు. మరి బాద్ షా సినిమా అంతే ఆ మాత్రం వుండాలి కదా. ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరుగా వున్న షారూఖ్ విచిత్ర సోదరులు సినిమాలో మన  కమల్ హాసన్ లాగా ‘జీరో మ‌రుగుజ్జుగా క‌నిపించ‌నున్నాడు. 
ఇక ఈ ‘జీరో’ సినిమా తరువాత కూడా షారూఖ్ మరో ప్రతిష్టాత్మక తొలి భారతీయ వ్యోమగామి అయిన రాకేశ్‌ శర్మ పాత్రలో రూపొందుతున్న బ‌యోపిక్‌లో షారూఖ్ న‌టించ‌నున్నాడట. 1984 ఏప్రియల్‌ 3న రష్యాకు చెందిన సోయజ్‌ టి- 11 ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాడు రాకేశ్‌ శర్మ. ఆయన చేసిన సాహసాన్ని భారతీయులకు కళ్ళకు గట్టినట్టు చూపించాలని షారూఖ్ తహతహలాడుతన్నాడు. దీంతో 2019 ఫిబ్ర‌వ‌రి నుండి తన పాత్ర‌కి సంబంధించి ప్రిప‌రేష‌న్స్ చేసుకుటుంటున్నాడు బాద్ షా.
మే లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి ‘సెల్యూట్’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. త‌న కెరీర్‌లో ఈ చిత్రం  నిలిచిపోయేలా షారూఖ్ క‌స‌రత్తులు చేసుకుంటున్నాడ‌ని సినిమా వర్గాల సమాచారం. మ‌హేష్ మ‌హ‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని రొన్ని స్క్రూవాలా, సిద్ధార్ద్ రాయ్ క‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. ఈ చిత్రం తొలి బాలీవుడ్‌ స్పేస్ మూవీగా ఈ చిత్రం రికార్డులకెక్కడం ఖాయమని పలువురు సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఆస్కార్ సైతం ఈ సినిమాను టార్గెట్‌ చేస్తుందని అంటున్నారు. బాలీవుడ్ బాద్ షా నటిస్తున్న చిత్రం..అందునా బయోపిక్ లపై భారీగా అంచనాలుంటాయి. పైగా అంతరిక్షంలో షూటింగ్ ఇంక ఈ సినిమాలో అంచనాలకు మించి వుంటుందటనంలో సందేహం లేదు..బాలీవుడ్ బాద్ షానా మజాకానా? అంటున్నారు సిని విశ్లేషకులు సైతం.
 

 

15:46 - December 10, 2018

హైదరాబాద్ : అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ, నీతా దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ వివాహం ఈ నెల 12న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుక దేశీయ ప్రముఖులే కాకుండా విదేశాల నుండి వ్యాపార దిగ్గజాలు కూడా వేంచేయనున్నారు. అంబానీవారి ఇంట పెండ్లి సందడికి ప్రముఖ రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ తారలు..క్రీడా ప్రముఖులు ఇలా ఒకరేంటి అన్ని వర్గాల ప్రముఖులు సందడి చేయనున్నారు.పెళ్లి వేడుకల్లో భాగంగా ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించిన సంగీత్‌లో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. షారుక్‌ ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, కత్రినాకైఫ్‌, కరీనా కపూర్‌, ఐశ్వర్యరాయ్‌ వేసిన స్టెప్పులతో ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ హోరెత్తిపోయింది. హాలీవుడ్‌ పాప్‌ గాయని బియాన్స్‌, బాలీవుడ్‌ నటీమణి రేఖతో పాటు సచిన్‌ టెండూల్కర్‌, ఆయన భార్య అంజలి కూడా పాల్గొన్నారు. 
ఐదురోజుల పాటు జరగనున్న అజయ్‌ పిరమాల్‌- స్వాతి పిరమాల్‌ల కుమారుడు ఆనంద్‌ పిరమాల్‌..అంబానీ, నీతా దంపతుల గారాలపట్టి ఇషా వివాహం ఆహ్వానం అందుకోవాలంటే కూడా ఓ రేంజ్ వుండాలి.  అంబానీ ఇంట వివాహ వేడుకల్లో బాలీవుడ్ తారలే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్తారు? అన్న ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. అయితే దీనికి సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈషా అంబానీ పెళ్లికి ‘బాహుబలి’ ప్రభాస్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభాస్ ఒక్కడికే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాఫీ విత్ కరణ్ కార్యక్రమం షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్ 12వ తేదీన ఈషా అంబానీ-ఆనంద్ పిరమాల్ వివాహానికి హాజరుకానున్నట్లు సమాచారం. 
 

 

16:20 - December 6, 2018

ముంబై  (మహారాష్ట్ర) : శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే అంతా హడావిడే. ఎక్కడ చూసినా రిచ్ లుక్సే. ఏది చేసినా ఘనంగా వుండాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి వివాహాలు ఎక్కడా జరగలేదబ్బా అనుకునేంత గొప్పగా..రిచ్ గా వుండాలి. దాని కోసం ఫుడ్, కాస్ట్యూమ్స్, ఎకామిడేషన్,  నుండి అన్ని అరేంజ్ మెంట్స్ అన్నీ అంటే అన్నీ ఘనంగా వుండాలి.అటువంటిది అంబానీవారింటో పెళ్లి అంటే మాటలా? ఎంతటి రిచ్ గా వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యంకానంత రిచ్ గా వుండబోతోంది అంబానీగారి గారాల పట్టి ఇషా అంబాని వివాహం. 
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ‘ఆంటిల్లా’లో వీరి పెళ్లిని అంగరవైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భారీ నుండి అతి భారీగా జరుగుతున్నాయి. అంబానీల ఇంట పెళ్లంటే.. ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అంబానీ, పిరమాళ్ కుటుంబాలు ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అతిథులను తీసుకెళ్లడానికి అంబానీ ఫ్యామిలీ 30 నుంచి 50 చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించనున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో రోజుకు 19 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఎన్నికల ఎఫెక్ట్, అంబానీ కూతురి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కారణంగా ఆ విమానాశ్రయానికి రద్దీ భారీగా పెరగనుంది. ఉదయ్‌పూర్‌లో భారీ సంఖ్యలో ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా అంబానీ కుటుంబం బుక్ చేసిసేసారు. ఇషా పెళ్లి వేడుకలను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించనున్నారు. ప్రియాంక-నిక్, అనుష్క-విరాట్‌ల పెళ్లికి కూడా ఆయనే ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఉదయ్‌పూర్‌లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత ముంబైలో నాలుగు రోజులపాటు అంబానీ కూతురి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గతంలో కర్ణాటక మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగినా ఎంత ఘనంగా చేశాడో తెలిసిన విషయమే. 

 

13:09 - December 4, 2018

ఢిల్లీ : కిల్లర్ గేమ్ బ్లూ వేల్ ఛాలెంజ్‌ గురించి తెలిసిన విషయమే. ఈ గేమ్ కు బలైపోయినవారు ఎంతమందో. ఈ గేమ్ లో ఇచ్చిన టాస్క్ లను రీచ్ అయ్యే క్రమంలో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారనే వార్తలు గతఏడాదిలో హల్ చల్ చేశాయి. ఆత్మహత్యకు ప్రేరేపించే ఈ ఆటకు యువత ఆకర్షితులై ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు లేకపోలేదు. గేమ్ అనేది వికాశం పెంచేదిగా వుండాలి తప్ప ప్రాణాలు తీసేంతగా వుండకూడదు. మైండ్ గేమ్ తో మైండ్ మరింతగా షార్ప్ అవ్వాలి తప్ప దానికి బానిసగా మారిపోకూడదు. ఇటువంటి ప్రాణాలు పోగొట్టుకునే ఘటనలకు బ్లూవేల్ చాలెంజ్ గేమ్ బలైపోయిన ఘటనలు జరిగాయి. 
ఈ క్రమంలో ఈ బ్లూవేల్ గేమ్ ను చాలా  దేశాల్లో నిషేధించారు. బ్లూ వేల్ గేమ్ ఆడటం వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ముంబైలో 2017 జులై 30న తొలి పోలీస్ కేసు నమోదైంది. ఆ తరవాత దేశ వ్యాప్తంగా చాలా మంది పిల్లలు ఈ గేమ్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బ్లూ వేల్ ఛాలెంజ్ అనేది ఇంటర్నెట్‌లో ఓ మోసమని నిపుణులు అంటున్నారు. ఈ గేమ్‌లోని ‘రోజ్’ ఛాలెంజ్ కారణంగా ఎంతో మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది కేవలం కల్పితం కాదని నిరూపణ కూడా అయ్యింది. దీనికి సంబంధించి ఓ కీవర్డ్స్  సాక్ష్యంగా కనిపిస్తోంది. 
ఆత్మహత్యల వివరాలు తెలియజేసే కీవర్డ్స్..
యువత ఈ బ్లూ వేల్ ఛాలెంజ్‌ను స్వీకరించినట్లు పోలీసులు ఇప్పటికే ఖరారు చేశారు. అయితే ఈ సంఖ్య చాలా తక్కువ. బ్లూ వేల్ ఛాలెంజ్ ద్వారా ఆత్మహత్యలకు యత్నించిన వారి వివరాల గురించి గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ‘Police confirms Blue Whale Challenge’ అనే కీవర్డ్స్ ద్వారా చాలా వివరాలు పొందొచ్చు. కాగా ఇదిలా ఉంటే, బ్లూ వేల్ ఛాలెంజ్‌కు సంబంధించి కిందటేడాది వైరల్ అయిన మెసేజ్ ఒకటి ప్రస్తుతం తమిళనాడులో వాట్సాప్ గ్రూపుల్లో సర్య్కులేట్ అవుతోంది. విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఆ మెసే ఇదే..మీరు కూడా చూడండి..

Image result for Blue Whale Challenge Game: Viral Whatsapp Message ..

12:17 - December 3, 2018

ఢిల్లీ : గత కొంతకాలంగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు ఊరటినిస్తున్నాయి.  అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ప్రభావంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు డిసెంబరు 3న మరోసారి తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాలల్లో  కూడా ఈ ప్రభావం కనిపించింది. హైదరాబాద్ లో పెట్రల్ : 76.20లు వుండగా విజయవాడలో రూ.75.70లు గా వుంది. 

దేశ రాజధాని ఢిల్లీలో 30 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధరరూ.71.93 కి చేరింది. డీజిల్ ధర 36 పైసలు తగ్గి రూ.66.66 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో 30 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.77.50 కి చేరగా.. డీజిల్ ధర 38 పైసలు తగ్గి రూ.69.77 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌ 62.45 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 53.77 డాలర్ల వద్ద కొనసాగుతోంది.  ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 31 పైసలు తగ్గి రూ.76.26 ఉండగా.. డీజిల్ ధర 39 పైసలు తగ్గి రూ.72.42 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర 31 పైసలు తగ్గి రూ.75.70ఉండగా.. డీజిల్‌ ధర 38 పైసలు తగ్గి రూ.71.46 వద్ద కొనసాగుతోంది. 
 

Pages

Don't Miss

Subscribe to RSS - mumbai