murders

08:11 - June 1, 2017

విజయవాడ : పెళ్లికి వెళ్లి వస్తున్న కానిస్టేబుళ్లు ఆసుపత్రి పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మైలవరం వద్ద ఓ లారీ అదుపు తప్పి కారును ఢీకొంది. పెళ్లికని వెళ్లి వస్తున్న కానిస్టేబుళ్ల కారును ఢీకొంది. దీనితో కారులో ఉన్న ఆరుగురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. అనంతరం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మరో 42గంటలు గడిచేదాక ఎలాంటి పరిస్థితి చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం అందించాలని పోలీసు ఉన్నతాధికారులు వైద్యులకు సూచించినట్లు తెలుస్తోంది.

21:47 - May 25, 2017

కడప : చుట్టూ వందల మంది...ఎవరిపనుల్లోవారు బిజీ...మండుతున్న ఎండమరోవైపు..జనం చూస్తుండగానే ఓ ఘోరం..అందరూ అక్కడే ఉన్నా వేటకొడవలితో నరికి..పన్నెండు సార్లు నరికిన ప్రత్యర్థి..ఒకడు పట్టుకుని ఉండగా..మరొకడు నరుకుతూ..ఏ మాత్రం బెరుకులేకుండా పబ్లిక్‌గా మర్డర్..కోర్టు సమీపంలోనే కిరాతకం...కడప గడపలో మరోమారు మానవత్వం మంటగలిసింది...నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణంగా చంపారు...ఆ తర్వాత అందరూ అక్కడే ఉన్నా ప్రత్యర్థులు తమ ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నారో చూడండి...

పన్నెండుసార్లు వేటకొడవలితో నరికారు..
చనిపోయాడని నిర్ధారించుకున్నా పన్నెండుసార్లు వేటకొడవలితో నరికారు..ఒకడు పట్టుకుని ఉండగా..మరొకడు దారుణంగా నరికాడు..ఇదంతా అక్కడ వందల మంది చూస్తూనే ఉన్నారు...ఎవరికివారు భయంతో వణికిపోయారు కాని...ఏ ఒక్కరూ కాపాడేందుకు ముందుకు రాలేదు.... చుట్టూ అంతమంది ఉన్నా దుర్మార్గులు వేటకొడవళ్లతో వచ్చి ఏ మాత్రం బెరుకులేకుండా అనుకున్నట్లుగానే ఆ వ్యక్తిని దారుణంగా చంపారు...పసిడిపురిలో పైశాచికత్వం...ఆటోలోంచి దిగిన వ్యక్తిపై అటాక్..కత్తులతో పొడిచి..కొడవళ్లతో నరికి...కోర్టులో హాజరయ్యేందుకు మారుతీరెడ్డి వచ్చారు కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి చెందిన 32 ఏళ్ల బోరెడ్డి మారుతీరెడ్డి పాత కేసులకు సంబంధించి ప్రొద్దుటూరు కోర్టులో హాజరయ్యేందుకు నగరంలోకి వచ్చాడు...అప్పటికే మారుతీరెడ్డి కోసం మాటువేసిన ప్రత్యర్థులు ఇక కొన్ని క్షణాల్లో కోర్టు ప్రాంగణంలోకి వెళ్తాడనుకుని ఆటో దిగడంతోనే ఒక్కసారిగా అటాక్ చేశారు...కత్తితోనే దాడి చేయడంతో పడిపోయిన మారుతీరెడ్డిని విచక్షణారహితంగా వేటకొడవళ్లతో నరికి చంపారు...మంటగలిసిన మానవత్వం...అందరూ చూస్తున్నారుగాని ఎవరూ ఆపలేదు..ఒకరికొకరు తోడైతే హత్య జరిగేది కాదు..ఎవరికి వారు భయంతో...కొందరు వీడియో తీస్తూ..ఎందరో చూస్తుండగానే మారుతీరెడ్డిని నరికి చంపారు ప్రత్యర్థులు..మానవత్వంతో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు..ఒకరిని చూసి మరొకరైనా వచ్చేవారు..కాని ఏ ఒక్కరూ ధైర్యం చేయలేదు...మానత్వాన్ని చూపించలేదు...మారుతీరెడ్డిని చంపుతుండగా కళ్లప్పగించి చూశారేగాని ఆపేందుకు ప్రయత్నించలేదు...వందల మంది ఇద్దరికి భయపడి దూరంగా ఉన్నారు..వీడియోలు తీశారు.

13:08 - May 25, 2017
09:51 - May 25, 2017

.గో : ఏలూరు ద్వారకానగర్‌లో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. నాగపద్మాపతి, సంతోషి రూప, సాయి సిద్దార్థ, సాయిరాం ఈ నెల 18వ తేదీన ఊరు వెళ్తున్నామని చెప్పి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోనుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

13:28 - May 23, 2017
12:29 - May 22, 2017

కర్నూలు : వైసీపీ నేత నారాయణరెడ్డి హత్యకు నిరసనగా కర్నూలు జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. మరోవైపు నారాయణరెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం నారాయణరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. ఇక బంద్‌ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

10:21 - May 22, 2017

హైదరాబాద్: కర్నూలు జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఆదివారంనాడు వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్యకు గురయ్యారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ హాజరు కానున్నారు. అంతే కాకుండా నేడు జిల్లా వ్యాప్తంగా వైసీపీ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.

09:12 - May 22, 2017

కర్నూలు : పత్తికొండ వైసీపీ ఇన్ ఛార్జీ నారాయణరెడ్డి హత్యకు గురికావడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ హత్య పక్కా పథకంతో జరిగిందని, ప్రభుత్వ కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. నారాయణరెడ్డి..సాంబశివుడులను ప్రత్యర్థులు దారుణంగా హత మార్చిన సంగతి తెలిసిందే. ఈ హత్యలను నిరసిస్తూ సోమవారం కర్నూలు జిల్లా బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది. బస్ డిపోల ఎదుట వైసీపీ నేతలు..కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో పికెటింగ్ లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ గవర్నర్ ను కలిసి హత్యా రాజకీయాలపై ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం కర్నూలుకు జగన్ పయనం కానున్నారు. నారాయణరెడ్డి అంత్యక్రియల్లో జగన్ పాల్గొననున్నారు. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కృష్ణగిరి పీఎస్ లో నారాయణరెడ్డి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 15 మందిపై వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

07:57 - May 22, 2017

పత్తికొండ వైసీపీ ఇంఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కర్నూల్‌ జిల్లాలో సంచలనం రేపింది. నారాయణరెడ్డి హత్య ఘటనలో దుండగులు పక్కాపథకం ప్రకారం వ్యవహరించినట్లు తెలుస్తోంది. మరో వైపు తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో భయం నెలకొందని చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో దుర్గా ప్రసాద్ (టిడిపి), అద్దెపల్లి శ్రీధర్ (బీజేపీ), సీ.హెచ్.బాబురావు (సీపీఎం), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), కరణం ధర్మశ్రీ (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

21:16 - May 17, 2017

కృష్ణా : విజయవాడ నగరంలో డాక్టర్ల హవాలా దందా కలకలం రేపుతుంది...ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది...ఈ దందాలో సహకరించిన పోలీసులపై కూడా వేటుపడింది...తక్కువ వడ్డీకి ఆశపడి లక్షలు పొగొట్టుకున్న డాక్టర్లు ఇందుకు కారణమైన ఓ ఏజెంటును కిడ్నాప్ చేయడంతో దారుణాలు వెలుగుచూస్తున్నాయి...కిడ్నాప్ చేసిన ఏజెంట్‌ను మామిడితోటకు తీసుకువెళ్లి కిరాతకంగా దాడికి పాల్పడ్డారు...

మొన్నటివరకు కుదిపేసిన కాల్‌మనీ...

సింగ‌పూర్ కాల్ మ‌నీకి ముఖ్య కేంద్రంగా మారింది బెజవాడ....ఈ రాకెట్‌లో ఒక‌ కార్పొరేట్ ఆసుప‌త్రికి చెందిన కొంద‌రు వైద్యులు, దానికి సంబంధించి వారు కూడా సింగ‌పూర్ నుంచి అతి త‌క్కువ వ‌డ్డీకి న‌గ‌దు అందిస్తామ‌ని చెపుతున్న బ్రోక‌ర్ చేతిలో మోస‌పోయారు...ప‌ట‌మ‌ట‌కు చెందిన శివ‌బ్రహ్మాజీ కాల్ మ‌నీ వ్యాపారం చేసేవాడు...ఆ తర్వాత కాల్‌మనీ దందాపై పోలీసులు కొరఢా ఝుళిపించడంతో ఈ దందా తగ్గింది...దీంతో రూటు మార్చిన బ్రహ్మాజీ సింగపూర్‌ నుంచి తక్కువ వడ్డీకి కోట్ల రూపాయలు వస్తాయంటూ కార్పోరేట్ డాక్టర్లను నమ్మించాడు...దీంతో గవర్నర్‌పేట హెల్ప్ ఆస్పత్రి ఎండి పువ్వాడ రామకృష్ణ, అశోక్ న‌గ‌ర్ లోని టైమ్స్ ఆసుప‌త్రిలో ఒక న్యూరాల‌జిస్టు, అదే ఆసుప‌త్రికి చెందిన ఎండి మైనేని హేమంత్ కుమార్ లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు..

మోసం జరిగిందని తెలుసుకున్న డాక్టర్లు...

ఇదిలా ఉంటే బ్రహ్మాజీ చెప్పినదాంట్లో మోసం ఉందని గ్రహించినవారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది..వెంటనే ఏజెంట్‌ బ్రహ్మాజీని కిడ్నాప్ చేసి మామిడితోటకు తీసుకువెళ్లి చెక్కులు..బాండ్‌ రాయించుకుని తీవ్రంగా కొట్టారు..దీంతో బ్రహ్మాజీ వారి దెబ్బలకు తట్టుకోలేక అపస్మారకస్థితికి చేరడంతో ఆస్పత్రిలో చేర్పించి చేతులు దులుపుకున్నారు...

ఇద్దరు అధికారులపై వేటు..

బెజవాడలోని కొందరు డాక్టర్ల హవాలా దందా బయటపడ్డంతో పాటు పోలీసులపై కూడా ఆరోపణలు వచ్చాయి..దీంతో వెంటనే కమిషనర్ గౌతం సవాంగ్ దీనిపై విచారణ చేస్తే నిజాలు బయటపడ్డాయి...వెంటనే ఇందుకు సంబంధించిన పటమట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ కెన్నడీని వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు...డివిజన్ ఏసీపీ రామచంద్రరావును విధులనుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు...డాక్టర్ల హవాలా వ్యాపారంపై పోలీసులు విచారణ ను వేగవంతం చేస్తున్నారు...

కిడ్నాప్ కేసులో కారు స్వాధీనం...

మరోవైపు ఈ వ్యవహారం పెద్దది కావడంతో పోలీసులు వెంట వెంటనే చర్యలకు రంగంలోకి దిగారు... కిడ్నాప్ కు యత్నించిన కార్ ను స్వాధీనం చేసుకొని డాక్టర్ పువ్వాడ రామకృష్ణతో సహా 7 గురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు..

కేసు నీరుగార్చే యత్నాలు షురూ..

డాక్టర్ల హవాలా దందా బయటపడ్డంతో ప్రముఖులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది...ఈ వ్యవహారం ఇక ఇంతటితో ముగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది...హవాలా దందాతో ఎందరికో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది...బయటపడ్డ వాస్తవాలను కప్పిపుచ్చుతూ...కేసును నీరుగార్చేయత్నాలు మొదలయినట్లు తెలుస్తోంది...

Pages

Don't Miss

Subscribe to RSS - murders