myanmar

20:59 - September 13, 2017

కాళ్లకింద భూమి కదిలిపోతోంది. తలపైన ఆకాశం నిప్పుల వర్షం కురిపిస్తోంది. సంద్రం వైపు ఆశగా చూసే కళ్లను తీరం తిరస్కరిస్తోంది. వెరసి ఎవరికీ చెందని అభాగ్యులయ్యారు. మాతృభూమికి, పరాయిదేశానికి మధ్య బతుకు ప్రశ్నార్ధకంగా మారుతోంది. భూమిపై గీతలు గీసుకున్న సరిహద్దులు, నిబంధనలు పేరుతో నిరాకరించి అపహసిస్తున్న పౌరసత్వాలు.. అణచివేతకు పరాకాష్టగా మారిన పరిస్థితులు.. వెరసి రోహింగ్యాలు ఇప్పుడు లెక్కల్లో లేని మనుషులు.. దేశం లేని పౌరులు.. ఉనికి నిరాకరించబడిన దీనులు..ఆధునిక ప్రపంచంలో అణచివేతకు నిజమైన ఉదాహరణగా కనిపిస్తున్న రోహింగ్యాల పరిస్థితిపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..
సొతగడ్డకు బరువయ్యారు.. 
సొతగడ్డకు బరువయ్యారు.. చదువుకునే అర్హతలేదు.. ఉద్యోగాలకు అవకాశం లేదు.. అసలు బతికే పరిస్థితే లేదు.. ఏం చేయాలి? ఎటు పారిపోవాలి..? ఎక్కడ తలదాచుకోవాలి? ఇప్పుడది భూమీ ఆకాశాలు ఏకమైన సుదీర్ఘ విలాపం.  చావుకీ బతుక్కీ మధ్య తేడా తెలియని లక్షలాది ప్రజల దీనత్వం.. జాతులపేరుతో, మతాల పేరుతో విద్వేషాలు పెంచుకునే మానవజాతి హీనత్వం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:04 - September 7, 2017

నేమిథా : భారత్‌-మయన్మార్‌ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోది మయన్మార్‌ ప్రభుత్వ కౌన్సిలర్‌ ఆంగ్‌ సాన్‌ సూకీతో భేటి అయ్యారు. దైపాక్షిక అంశాలపై చర్చించిన అనంతరం ఇరుదేశాలు 11 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో సముద్ర తీర భద్రతకు సంబంధించిన ఒప్పందం అత్యంత ప్రాధాన్యమైనది. మయన్మార్‌లో ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం, ఆరోగ్యం, ఐటి రంగాల్లో భారత్‌ సహకరించనుంది. తమ భూభాగంపై టెర్రరిజాన్ని అంగీకరించేది లేదని ఆంగ్‌ సాన్‌ సూకి స్పష్టం చేశారు. భద్రత, ఉగ్రవాద నిరోధం, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగాల్లో ఇరుదేశాల పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భావిస్తున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్‌ను సందర్శించాలనుకునే మయన్మార్‌ వాసులకు ఉచితంగా వీసాలు ఇస్తామని తెలిపారు. భారత్‌లోని జైళ్లలో మగ్గుతున్న 40 మంది మయన్మార్‌ పౌరులను విడుదల చేస్తామని మోది ప్రకటించారు. ఈసందర్భంగా రోహింగ్యాల వలసలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

14:39 - April 18, 2017

మయన్మార్ లో జరిగిన వాటర్ ఫెస్టివల్ శ్మశాన వాటికగా మారిపోయింది. సంతోషంగా జరుపుకొనే పండుగ దుఖాన్ని మిగిల్చింది. నాలుగు రోజుల పాటు జరిగిన తింగ్యాన్ వాటర్ ఫెస్టివల్ లో 285 మంది మృత్యువాత పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. కొత్త సంవత్సరంలో వేసవి ముగుస్తుందనగా ఈ వేడుకను అక్కడి ప్రజలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది చేసిన పాపాలు ఈ ఏడాది నూతన సంవత్సరంతో నీటితో కడిగేసుకొంటే పోతాయనేది అక్కడి వారి నమ్మకం. ఒకరిపై ఒకరు నీళ్లతో కొట్టుకుంటూ వేడుకను నిర్వహించుకుంటుంటారు. గురువారం నుండి శనివారం వరకు ఫెస్టివల్ జరిగింది. ప్రమాదవశాత్తు 285 మంది మృత్యువాత పడడం సంచలనం సృష్టించింది. మరో 1073 మందికి గాయాలయ్యాయి. అత్యధికంగా యంగూన్ ప్రాంతంలో 44 మంది, మాండాలే‌లో 36 మంది, బగోలో 37 మంది, షాన్ రాష్ట్రంలో 28 మంది, అయేవాడే రీజియన్‌లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. సాగింగ్ ప్రాంతంలో 26 మంది, నై పీ తావ్‌లో 10 మంది, తానిత్యారీలో 11 మంది, మాంగ్వేలో 11 మంది, మాన్‌లో 20 మంది, రిఖైనేలో 17 మంది మరణించారు. గతేడాది జరిగిన ఉత్సవాల్లోనూ 272 మంది ప్రాణాలు కోల్పోయారు.

12:44 - October 18, 2016

ఢిల్లీ : మయన్మార్ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షురాలు, ఆ దేశ విదేశాంగ మంత్రి అంగ్ సాన్ సూకీ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో సూకీకి భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. అనంతరం సూకీ సైనిక వందనం స్వీకరించారు. గోవాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ - బిమ్స్ టెక్ (బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ కోఆపరేషన్) సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం సూకీ గోవాకు వచ్చారు. బ్రిక్స్ కు అనుబంధంగా ఏర్పాటైన ఈ గ్రూప్ లో బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. సాంకేతికాభివృద్ధిలో పరసర్పం సహకరించుకోవడమే బిమ్స్ టెక్ లక్ష్యం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లతో సూకీ చర్చలు జరుపనున్నారు. 

16:49 - August 24, 2016

బీహార్ : తూర్పు ఈశాన్య భారతంలో భూ ప్రకంపనలు సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది. పాట్నా, కోల్ కతా, గౌహతి, రాంచి మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లలో భూప్రకంపనలు సంభవించాయి. మయన్మార్ భూకంప కేంద్రంగా గుర్తించారు. పశ్చిమబెంగాల్, జార్ఖండ్ లలో కూడా భూమి కంపించినట్లుగా సమాచారం. దీంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. 

07:48 - March 16, 2016

మయన్మార్ నూతన అధ్యక్షుడిగా హితిన్‌ క్యా ఎన్నికయ్యారు. ఎన్‌ఎల్‌డి నేత ఆంగ్ సాన్ సూకి మాజీ డ్రైవర్ గా పనిచేసిన హితిన్‌ క్యా అత్యంత నమ్మకస్తుడు. చాలా కాలం తర్వాత సూకి నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆర్మీ కొత్త రాజ్యాంగం వల్ల సూకి అధ్యక్షురాలయ్యే అవకాశం కోల్పోవడంతో 70 ఏళ్ల హితిన్‌క్యాను అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేశారు. టిన్, సూకీతో కలిసి చదువుకున్నారు. చారిటబుల్ సంస్థ నిర్వహణలో ఆమెకు సహకారం అందిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ భారీ విజయం సాధించింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత మయన్మార్‌లో సైనిక పాలనకు తెరపడి ప్రజాస్వామ్య ప్రభుత్వం అవతరించింది. మయన్మార్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన యూ హితిన్‌ క్యాకి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-మయన్మార్‌ దేశాల సత్సంబంధాలను బలోపేతం చేయడానికి కలిసి పని చేద్దాం.. అంటూ మోడీ ట్వీట్‌ చేశారు. 

21:34 - February 1, 2016

మయన్మార్‌ : 50 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీలతో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. మిలిటరీ పాలనలో మగ్గిపోయిన మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం ఆంగ్‌సాన్‌ సూకీ పోరాడారు. ఆమె నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీ ఇటీవలి ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించింది. విదేశీ పౌరసత్వం కారణంగా ఆంగ్‌సాన్‌ సూకీ అధ్యక్ష పదవి పొందే అవకాశం లేదు. అక్కడి రాజ్యాంగ నిబంధనలు ఇందుకు అంగీకరించవు. మయన్మార్‌ పార్లమెంటు సీట్లలో మిలిటరీకి 25శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మార్పిడి సాఫీగా సాగేందుకు సూకీ ఇప్పటికే సీనియర్‌ మిలిటరీ నేతలతో చర్చలు జరిపారు. 

22:03 - November 22, 2015

బర్మా : మయన్మార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కచిన్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో పెనునష్టం వాటిల్లింది. ఈ దుర్ఘటనలో 100 మంది మృతి చెందారు. 50మందికి పైగా గ్రామస్తులు గల్లంతయ్యారు. గనులపై చరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. గనుల్లో పనిచేస్తున్న కార్మికులు కొందరు దుర్మరణం పాలయ్యారు. పెద్ద ఎత్తున మట్టిపెల్లలు విరిగిపడడంతో గల్లంతైనవారు బతికుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గల్లంతైనవారికోసం భద్రతాచర్యలు కొనసాగుతున్నాయి.

 

 

 

08:38 - November 13, 2015

హైదరాబాద్ :ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఎందుకు సర్దుబాటు ధోరణి లో వ్యహరిస్తున్నారని గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ లో ప్రశ్నించారు. ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో గతంలో చెప్పిన మాటలకు ఇప్పటి మాటలకు తేడా ఏమిటి? రాజకీయ పార్టీల అవసరాల కోసం ప్రజలను రెచ్చగొడతారు? బాక్సైట్ తవ్వకాలపై పవన్ దోబూచులాటలు ఆడుతున్నాడా? నిర్ధిష్టంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యలపై చంద్రబాబు నుండి స్పష్టమైన హామీ పవన్ కు వచ్చిందా? పరీక్షల కోసం చదివే విద్యార్థులు ఎలా ఫెయిల్ అవుతాడో ఎన్నికల కోసం పుట్టే పార్టీలు కూడా ఫెయిల్ అవుతాయని తెలిపారు.

దశాబ్ధాల పాటు మయన్మార్ ప్రజలు సాగించిన పోరాటం విజయం సాధించింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మయన్మార్ దేశం కీలకం. మయన్మార్ లో పౌర ప్రభుత్వం ఏర్పడినా... ఆ ప్రభుత్వంలో మిలటరీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంగ్ సాన్ సూకీ ని దేశాధ్యక్ష పదవి చేపట్టడానికి ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ అంశాలపై ప్రొ.కె నాగేశ్వర్ విశ్లేషణ చేశారు? పూర్తి విశ్లేషణను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:39 - November 10, 2015

హైదరాబాద్ : మయన్మార్ ప్రజాభిష్టమైన పాలన మొగ్గ తొడిగింది. సైన్యం అడుగుజాడల్లో నడుస్తున్న అరాచక పాలనకు తెరపడింది. తన జాతి కొరకు వెలుగెత్తిన విప్లవ యోధురాలికి 3 కోట్ల జనం పట్టం కట్టారు. శాంతి కపోతానికి రెక్కలు తొడిగారు. మయన్మార్ చారిత్రాత్మక ఎన్నికల్లో... సూకీ పార్టీ ఘన విజయం సాధించింది. మయన్మార్ లో సూకీ పార్టీ ముందు ఉన్న సవాళ్లు ఏమిటి? ప్రజల ఆకాంక్షలు ఏమిటి? నేటి వైడాంగిల్ లో చర్చించారు. మరి పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - myanmar