Mythri movie makers

14:28 - November 16, 2018

మాస్‌ మహారాజా రవితేజ, శ్రీనువైట్ల, కాంబినేషన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (CVM)  నిర్మిస్తున్న సినిమా.. అమర్ అక్బర్ ఆంటొని. టచ్ చేసిచూడు, నేలటికెట్ వంటి రెండు డిజాస్టర్ల తర్వాత, రవితేజకి.. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్ లాంటి హ్యాట్రిక్ డిజాస్టర్ల ఇచ్చిన  శ్రీనువైట్లకి అమర్ అక్బర్  ఆంటొని సక్సెస్ చాలా అవసరం. ఇలాంటి పరిస్ధితుల్లో, భారీ అంచనాల మధ్య ఈరోజు రిలీజైన అమర్ అక్బర్ ఆంటొని ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ :


అమెరికాలో స్ధిరపడ్డ రెండు తెలుగు కుటుంబాలు కలిసి మెలిసి జీవిస్తుంటాయి. కలిసి బిజినెస్ చేస్తుంటారు. మంచితనంతో తమ దగ్గర పనిచేసే నలుగురు వ్యక్తుల్ని కూడా వాటాదారులుగా చేర్చుకుంటారు. వాటాలతో సంతృప్తి పడని ఆ నలుగురు, మొత్తం వ్యాపార సామ్రాజ్యంపై కన్నేస్తారు. అనుకున్నదే ఆలస్యంగా.. ఆ రెండు కుటుంబాలని అంతం చేస్తారు. అప్పుడు, సదరు కుటుంబాలకు చెందిన అమర్ (రవితేజ), ఐశ్వర్య (ఇలియానా) ఆప్రమాదం నుండి తప్పించుకుంటారు. చిన్నప్పుడే విడిపోయినా.. తమ తల్లిదండ్రుల్ని చంపిన వాళ్ళని చంపడమే లక్ష్యంగా బతుకుతుంటారు వీళ్ళిద్దరూ..   అమర్, ఐశ్వర్య  వాళ్ళపై ఎలా పగ తీర్చుకున్నారు, అమర్, ఐశ్వర్య మళ్ళీ కలిసారా, అసలు అమర్ అక్బర్ ఆంటొనిల మధ్యఉన్న సంబధం ఏంటి? అనేది తెరపై చూస్తే బాగుంటుంది.
 

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 


రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జీతో సినిమాని సింగిల్ హ్యాండ్‌తో నడిపించాడు. కామెడీతో, మూడు డిఫరెంట్ క్యారెక్టర్లతో ఆకట్టుకున్నాడు. ఇలియానాని కొద్ది గ్యాప్ తర్వాత స్క్రీన్‌పై చూడడం కొత్తగా అనిపిస్తుంది. ఆమెది పెద్ద రోల్ కాకపోయినా, ఉన్నంతలో.. నటన, గ్లామర్ పరంగా అలరిస్తుంది. సునీల్ సెకండ్‌హాఫ్‌లో బాబీగా నవ్వించగా, హోల్ ఆంధ్రా తెలంగాణా అసోసియేషన్ (వాటా) ఆర్గనైజర్స్‌గా, వెన్నెలకిషోర్, శ్రీనివాస రెడ్డి, గిరి, రఘబాబు.. వాళ్ళకి అసిస్టెంట్‌గా సత్య కాసేపు నవ్విస్తారు. నలుగురు విలన్స్ తమ పాత్ర పరిధి దాటలేదు. థమన్ సాంగ్స్ సోసోగా ఉన్నా, ఆర్ఆర్ మాత్రం బాగుంది. వెంకట్ సి దిలిప్  కెమెరా వర్క్,  మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. శ్రీను వైట్ల.... అమర్ అక్బర్  ఆంటొని కథకి, డిసోసియేటివ్ ఐడెంటిటీ అనే డిసీస్ యాడ్ చేసి నవ్వించే ప్రయత్నం చేసాడు. అది అక్కడక్కడ మాత్రమే వర్కవుటైంది కానీ, ఓవరాల్‌గా కాదు. కథ పరంగా కొత్తగా ట్రైచేసే ప్రాసెస్‌లో, కథనం సంగతి మర్చిపోయినట్టున్నాడు వైట్ల... అందుకే, ప్రేక్షకుడికి సినిమాలో తర్వాత సీన్ ఏంటో ముందే అర్థమైపోతుంది. కథానేపథ్యం బాగున్నా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అయింది. అమర్ అక్బర్ ఆంటొని, ఆడియన్స్‌కి, ఓ మోస్తరుగా అనిపిస్తుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకి, వైట్లకి ఈ మూవీ, కాస్త రిలీఫ్ ఇస్తుందనే చెప్పాలి. 

తారాగణం : రవితేజ, ఇలియానా, సునీల్, లయ, తనికెళ్ళ భరణి, జయప్రకాష్ రెడ్డి, భరత్ రెడ్డి, రవి ప్రకాష్, ఆదిత్యా మేనన్,           వెన్నెలకిషోర్, శ్రీనివాస రెడ్డి, గిరి, రఘబాబు, సత్య తదితరులు.. 

 కెమెరా    :   వెంకట్ సి దిలిప్ 

ఎడిటింగ్‌  :  ఎంఆర్ వర్మ

 సంగీతం :        ఎస్ఎస్ థమన్

నిర్మాణం :       మైత్రీ మూవీ మేకర్స్ 

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం :   శ్రీను వైట్ల

రేటింగ్  :  2/5

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

10:10 - November 16, 2018

మాస్‌ మహారాజా రవితేజ, శ్రీనువైట్ల, కాంబినేషన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (CVM)  నిర్మిస్తున్న సినిమా.. అమర్ అక్బర్ ఆంటొని. టచ్ చేసిచూడు, నేలటికెట్ వంటి రెండు డిజాస్టర్ల తర్వాత, రవితేజకి.. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్ లాంటి హ్యాట్రిక్ డిజాస్టర్ల ఇచ్చిన  శ్రీనువైట్లకి అమర్ అక్బర్  ఆంటొని సక్సెస్ చాలా అవసరం. ఇక్కడ ఇవాళ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు నిన్న రాత్రి యూఎస్‌లో పడ్డాయి.. అక్కడి నుండి ఒక మోస్తరు టాక్ వచ్చింది. ఫస్ట్‌హాఫ్ అంతా కామెడీగా సాగినా, అక్కడక్కడా రొటీన్‌గా అనిపించిందనీ, ఈ విషయంలో శ్రీను తన పాత పద్ధతినే  ఫాలో అయ్యాడనీ అంటున్నారు. అయితే, ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గరికొచ్చేసరికి హీరోకి సంబంధించిన మూడు క్యారెక్టర్ల విషయంలో డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. సెకండ్‌హాఫ్ అంతా ఒక టెంపోతో సాగిపోవడంతో సినిమా ఆసక్తి కరంగా మారిందని, వైట్ల తన మార్క్ కామెడీకి, రవితేజని కలుపుకుని జనాలని నవ్వించాడని, మిగిలిన కమెడియన్స్ గ్యాంగ్‌తో చేయించిన కామెడీ అదిరిపోయిందని అంటున్నారు. అలాగే, ఇలియానా స్క్రీన్ ప్రెజన్స్, తన తెలుగు డబ్బింగ్ బాగుందని, సాంగ్స్, ఆర్ఆర్, కెమెరా వర్క్ కూడా బాగానే ఉన్నాయని, ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చెయ్యడం వల్ల, అక్కడి వాళ్ళకిది లోకల్ ఫిలిమ్ అనే ఫీలింగ్ కలిగిందని చెప్తున్నారు. మొత్తానికి యూఎస్ నుండి ఒక మాదిరిగా, పర్లేదు అనే మాట వినిపిస్తుంది. మరికాసేపట్లో అమర్ అక్బర్  ఆంటొని హైదరాబాద్ రివ్యూ రానుంది.  

 

10:06 - November 11, 2018

మాస్‌ మహారాజా రవితేజ, శ్రీనువైట్ల, కాంబినేషన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (CVM)  నిర్మిస్తున్న సినిమా.. అమర్ అక్బర్ ఆంటొని. నిన్న రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఉదయం ఆన్‌లైన్‌లో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసారు. ఇంతకుముందు విడుదలైన టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఈ ప్రపంచంలో, శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేని వాళ్ళు కొందరుంటే, శక్తి మేరకు నయవంచన చేసేవాళ్ళు కోకొల్లలు అంటూ, శ్రీనువైట్ల వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అవుతుందీ ట్రైలర్. రవితేజ జైలునుండి రిలీజవడం, ఐ యామ్ ఆంథోని, డాక్టర్ మార్క్ ఆంథోని అనగానే, వెన్నెల కిషోర్.. ఇలియానాని రవితేజకి పరిచయం చేస్తూ, ఈ అమ్మాయి పేరు థెరిస్సా, మథర్ థెరిస్సా అని కౌంటర్ ఇవ్వడం, వెన్నెల కిషోర్, ఇలియానాల మధ్య లవ్ ట్రాక్, రఘుబాబు, సత్య, జయప్రకాష్ రెడ్డి, నవ్వులు పూయించడం బాగుంది. రవితేజ విలన్లని వెతుక్కుంటూ వెళ్ళడం, విలన్లు రవితేజని వెతకడం, ట్రైలర్ చివర్లో రవితేజ చెప్పిన..  దిస్ ఈజ్ నాట్ ఎ రివేంజ్, ఇట్స్ రిటర్న్ఎ గిఫ్ట్ అనే డైలాగ్ బాగుంది. శుభలేఖ సుధాకర్, షియాజి షిండే, సునీల్, లయ, శ్రీనివాస్ రెడ్డి, గిరి, తనికెళ్ళ భరణి, తరుణ్ అరోరా, ఆదిత్య మేనన్ తదితరులు నటించిన అమర్ అక్బర్  ఆంటొని ఈ శుక్రవారం రిలీజ్ అవనుంది.   

 

15:01 - November 2, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన సవ్యసాచి.. దీపావళి కానుకగా, ఈరోజుప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. శైలజారెడ్డి అల్లలుడు తర్వాత చైతు చేస్తున్న సినిమా కావడం, ప్రేమమ్ తర్వాత చైతు, చందూమొండేటిల కాంబినేషన్ అవడంతో, ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, సవ్యసాచి ఆ అంచనాలను అందుకుందో, లేదో చూద్దాం.

కథ : 

విక్రమ్ ఆదిత్య (నాగచైతన్య) వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ (ఒకే దేహంలో ఇద్దరు) అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి కారణంగా, ఆనందం వచ్చినా, ఆందోళనగా ఉన్నా, అతని ఎడమ చేయి అతని కంట్రోల్‌లో ఉండదు. చిత్ర (నిధి అగర్వాల్)‌ని ప్రేమిస్తాడు. ఒక రీజన్‌తో ఆరేళ్ళ పాటు ఆమెకి దూరమవుతాడు. యాడ్‌‌ఫిలిం మేకర్ అయిన విక్రమ్, షూటింగ్ నిమిత్తం న్యూయార్క్ వెళ్ళి వచ్చేటప్పటికి, ఒక ప్రమాదంలో అతని బావ, మేనకోడలు చనిపోతారు. మొదట యాక్సిడెంటల్‌గా భావించిన విక్రమ్‌కి, తన మేనకోడలు బ్రతికే ఉందని, తన బావ చావుకి ఒక వ్యక్తి  కారణం అని తెలుస్తుంది. అతనెవరు, అతని దగ్గరి నుండి, పాపని ఎలా సేవ్ చేసాడు అనేది కథ.

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 

సినిమా సినిమాకి నటుడిగా ఇంప్రూవ్ అవుతున్నాడు నాగ చైతన్య. ఎడమ చేయి తన మాట విననప్పుడు చైతు నటన ఆకట్టుకుంటుంది. రొమాంటిక్, కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నిటినీ తన స్టైల్‌లో చేసాడు. లగ్గాయిత్తు సాంగ్‌లో చైతు వేసిన స్టెప్పులు అభిమానులను అలరిస్తాయి. ఫైట్స్‌లోనూ చైతు బాగా చేసాడు. విభిన్న తరహా చిత్రాలు చేసే నటుడు మాధవన్, సవ్యసాచితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. అదికూడా విలన్ పాత్ర కావడం విశేషం. సినిమా అంతా, చైతు, మాధవన్‌ల చుట్టూ తిరుగుతుంది. తనదైన శైలి నటనతో, తనకంటే ఇంకెవరూ ఈ పాత్ర చెయ్యలేరు అన్నంతగా క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయ్యాడు. నిధి అగర్వాల్‌కిది తెలుగులో బెస్ట్ డెబ్యూ అని చెప్పొచ్చు. యాక్టింగ్, డాన్స్, గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటుంది.
దేవయాని, భూమిక ఉన్నంతలో బాగా చేసారు. వెన్నెల కిషోర్, సుదర్శన్, విద్యుల్లేఖ ఉన్నంతలో కామెడీ చేసారు. ఎమ్.ఎమ్.కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం బాగానే ఉంది. యువరాజ్ కెమెరా సినిమాకి అందాన్నద్దింది. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. చందూమొండేటి ఎంచుకున్న వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే అంశం కొత్తదే కావచ్చుగానీ, వివరంగా చెప్పడంలో తడబడ్డాడు. ఎడమ చేయి కంట్రోల్‌లో ఉండదు అని, సినిమా స్టార్టింగ్‌లో చెప్పి, ఇంటర్వెల్ ముందు వరకు, అసలు కథ‌లోకి తీసుకెళ్ళలేదు.  సెకండ్‌హాఫ్‌లో సినిమా సీరియస్‌గా సాగుతున్న టైమ్‌లో కామెడీ చేయించడం, డ్యాన్సులు వేయించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా స్పీడ్ అందుకుంటుంది. హీరో, విలన్‌ల మధ్య జరిగే మైండ్ గేమ్‌ని ఆసక్తి కరంగా మలిచిన విధానం బాగుంది కానీ, చివరకు సినిమా రివేంజ్ డ్రామాగా తయారయింది. నాగచైతన్య, మాధవన్‌ల నటన, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
 మైండ్‌గేమ్‌‌తో కూడిన రివేంజ్ డ్రామా... సవ్యసాచి

  తారాగణం : నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమికాచావ్లా, దేవయాని,  వెన్నెల కిషోర్, సుదర్శన్, విద్యుల్లేఖ రామన్ 

  కెమెరా    :  యువరాజ్

 సంగీతం   :  ఎమ్.ఎమ్.కీరవాణి 

ఎడిటింగ్‌  :  కోటగిరి వెంకటేశ్వర రావు 

నిర్మాణం   : మైత్రీ మూవీ మేకర్స్ 

కథ, స్క్రీన్‌ప్లే,మాటలు, దర్శకత్వం :  చందూమొండేటి

రేటింగ్  :  2.5/5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

10:27 - November 2, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం, సవ్యసాచి.. రోజు ఇక్కడ రిలీజవుతుండగా, యూ.ఎస్ లో నిన్న రాత్రే ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన అక్కడి ఆడియన్స్ రెస్పాన్స్ ఈ విధంగా ఉంది. ఫస్ట్‌హాఫ్ కాలేజ్ సీన్స్, చైతు, నిధిల లవ్ ట్రాక్, కామెడీ సీన్స్, సాంగ్స్‌తో సరదాగా సాగిపోతూ, ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి, సెకండ్‌హాఫ్‌లో హీరో, విలన్‌ల మధ్య ఇంట్రెస్టింగ్ వార్, ఫ్యామిలీ ఎమోషన్స్, అలరించే లగ్గాయిత్తు సాంగ్ రీమిక్స్, అద్భుతమైన ఎండింగ్ ఇచ్చి, దర్శకుడు చందూమొండేటి మంచి సినిమా తీసాడని, ఓవర్సీస్ ఆడియన్స్ చెప్తున్నారు. మొత్తానికి, సవ్యసాచితో చైతు సక్సెస్ కొట్టాడన్నమాట. మరి కాసేపట్లో పూర్తి రివ్యూ రాబోతుంది. 

 

12:06 - November 1, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం, సవ్యసాచి.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, ధియేట్రికల్ ట్రైలర్‌,‌ సాంగ్స్ అండ్ సాంగ్ ప్రోమోస్‌కి వెరీగుడ్ రెస్పాన్స్ వస్తోంది. ఈరోజు సవ్యసాచి సుభద్ర పరిణయం టీజర్‌ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. కాలేజ్‌లో హీరో అతని ఫ్రెండ్స్‌తో కలిసి సుభద్ర పరిణయం నాటకాన్ని ప్రదర్శించి, కడుపుబ్బా నవ్వించబోతున్నాడని క్లూ ఇచ్చింది సినిమా బృందం. కృష్ణా, బలరాముడంటే రాముడికి చుట్టమా? అని ధర్మరాజు అడిగితే, కృష్ణుడు, సుదర్శన చక్రం సర్వీసింగ్‌కిచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకుండేదిరా దరిద్రుడా అనడం.. బలరాముడు చెలికత్తెలతో సరసాలాడుతూ, అర్జునుడితో, ఇందులో(పోటీలో) మొత్తం మూడు రౌండ్లుంటాయ్ అంటే, అయ్యో బలరామ్ బావా, నాకు రెండు రౌండ్లకే కళ్ళు తిరిగిపోతాయి అని అర్జునుడు అమాయకంగా అనడం భలే పేలింది. ఇక అర్జునుడు, మూడు పరీక్షలు గెలిస్తే ఏంటి? అనడిగితే, సుభద్రను చేసుకోవచ్చు అని బలరాముడు చెప్పగానే, మరి ఓడిపోతే? అని ధర్మరాజు ప్రశ్నిస్తే, చెలికత్తెను చేసుకోవచ్చు అనడం, దానికి ధర్మరాజు ఇన్‌డైరెక్ట్‌గా చచ్చిపోవచ్చని చెప్తున్నారు అంటూ కౌంటర్ వెయ్యడం అదిరిపోయింది. సవ్యసాచి దీపావళి కానుకగా, రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.    

11:41 - October 30, 2018

మాస్‌రాజా రవితేజ, శ్రీనువైట్ల, కాంబినేషన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, రూపొందుతున్న సినిమా.. అమర్ అక్బర్ ఆంటొని.. గోవా బ్యూటీ ఇలియానా కథానాయిక. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ముగింపు వ్రాసుకున్నతర్వాతే కథ మొదలు పెట్టాలి అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన అమర్ అక్బర్ ఆంటొని  టీజర్, ఆద్యంతం ఆసక్తి కరంగా ఉంది. అమర్, అక్బర్, ఆంటొనిగా.. మాస్‌రాజా మూడు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించాడు. మనకి నిజమైన ఆపద వచ్చినప్పుడు, మనల్ని కాపాడేది మనచుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్, వివిధ ప్రాంతాల్లో, డిఫరెంట్ గెటప్స్‌లో వెళ్ళి, రౌడీలను రఫ్ఫాడించడం చూస్తుంటే, మాస్‌రాజా అండ్ శ్రీనువైట్ల ఆర్ బ్యాక్ అనిపిస్తుంది. టీజర్‌లో శ్రీనువైట్ల మార్క్ కామెడీ లేదు కాబట్టి, ఈసారి కొత్త ప్రయత్నం ఏదో చేసాడనిపిస్తుంది. ఇలియానా బొద్దుగా బాగుంది. టీజర్‌కి థమన్ ఇచ్చిన ఆర్ఆర్ హైలెట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. విడుదల చేసిన తక్కువ టైమ్‌లోనే, టీజర్‌కి మూడు మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది..ఎక్కువ శాతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంది. అమర్ అక్బర్ ఆంటొని నవంబర్ 16న విడుదల కానుంది..   

 

14:33 - October 28, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం, సవ్యసాచి.. మొన్న రిలీజ్ చేసిన ధియేట్రికల్ ట్రైలర్‌‌కీ, సాంగ్స్‌కీ, వెరీగుడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సవ్యసాచి చిత్రం ఒక తమిళ సినిమా కాపీ అనే వార్తలు, తమిళ సినిమా అభిమానుల మధ్య వినబడుతున్నాయి. గతేడాది కోలీవుడ్‌లో రిలీజ్ అయిన పీచాంకై అనే సినిమాకీ, సవ్యసాచికి దగ్గర పోలికలున్నాయట. ఆర్ఎస్ కార్తీక్ హీరోగా నటించిన పీచాంకైలో, అంజలి రావు కథానాయిక. ఆ మూవీలో హీరో..అలైన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతుంటాడు. అతని ఎడమ చేయి అతని ఆధీనంలో ఉండదు.. సవ్యసాచిలో చైతన్యది కూడా ఎడమ చేయి సమస్యే కావడంతో, సవ్యసాచి కథ, పీచాంకై సిమిమాకి కాపీ అంటున్నారు. ఈ విషయంపై సవ్యసాచి టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.  

12:47 - October 27, 2018

మాస్‌రాజా రవితేజ, శ్రీనువైట్ల, కాంబినేషన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, రూపొందుతున్న సినిమా.. అమర్ అక్బర్ ఆంటొని.. గోవా బ్యూటీ ఇలియానా, కొంత గ్యాప్ తర్వాత ఈ మూవీతోనే తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. శ్రీనువైట్ల పుట్టినరోజు సంధర్భంగా, గ్లిమ్స్‌ఆఫ్ అమర్ అక్బర్ ఆంటొని పేరుతో రవితేజ లుక్‌ని రిలీజ్ చెయ్యగా, మంచి స్పందన వస్తోంది.. మాస్‌రాజా మూడు డిఫరెంట్ గెటప్‌లలో కనిపిండంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా టీజర్ రిలీజ్ చెయ్యబోతోంది మూవీ యూనిట్.. అలాగే, దీపావళి నాడు రవితేజ, వి.ఐ.ఆనంద్‌ల కాంబోలో, డిసెంబర్‌లో ప్రారంభం కాబోయే డిస్కోరాజా(వర్కింగ్ టైటిల్) ఫస్ట్‌లుక్ లేదా, కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చెయ్యనున్నారు. నభా నటేష్ హీరోయిన్.. రెండు సినిమాల అప్‌డేట్స్‌తో, ఈ దీపావళికి డబుల్ ధమాఖా ఇవ్వబోతున్నాడు మాస్‌రాజా.. అమర్ అక్బర్ ఆంటొని నవంబర్ 16న విడుదల కానుంది..   

 

11:31 - October 27, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం, సవ్యసాచి.. మొన్న రిలీజ్ చేసిన ధియేట్రికల్ ట్రైలర్‌‌కి వెరీగుడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సవ్యసాచి సాంగ్స్ జూక్‌బాక్స్‌ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. సవ్యసాచి ఆల్బమ్‌లో మొత్తం ఏడు పాటలున్నాయి.. ఇంతకుముందు విన్న టైటిల్ ట్రాక్, ఒక్కరంటే ఒక్కరు, వైనాట్ పాటలతో పాటు, నాగార్జున అల్లరి అల్లుడులోని, నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు పాట రీమిక్స్ కూడా ఉంది.. ఈ పాటని అల్లరి అల్లుడులో ఎస్పీబీ, చిత్ర పాడగా, వేటూరి లిరిక్స్ వ్రాసారు.. వేటూరి లిరిక్స్‌తో పాటు, రీమిక్స్‌లో కొన్ని పదాలు రామజోగయ్య శాస్త్రి వ్రాసారు.. కీరవాణి, పృథ్వీచంద్ర, మౌనిమ చంద్రభట్ల చక్కగా పాడారు.. సినిమాలో లగ్గాయిత్తు పాట ఏ రేంజ్‌లో ఉంటుందోనని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. నవంబర్ 2న సవ్యసాచి రిలీజ్ అవనుంది..

 

Pages

Don't Miss

Subscribe to RSS - Mythri movie makers