naga chaitanya

13:19 - June 12, 2017

'సమంత' జోరు కొనసాగిస్తోంది. పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యమ బిజీగా మారనుంది. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'అక్కినేని నాగ చైతన్య'..’సమంత' మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు నెలల్లో వీరిద్దరి వివాహం జరగనుంది. దీనితో నాలుగు నెలల్లో సినిమాలు కంప్లీట్ చేయాలని 'సమంత' యోచిస్తోందని తెలుస్తోంది. 'రామ్‌చరణ్‌' తో 'రంగ స్థలం 1985' చిత్రం..విజయ్ తో..విశాల్‌కి జోడీగా నటిస్తున్న 'ఇరుంబు థిరై' చిత్రాలుండగా, తాజాగా మరో చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 'శివకార్తికేయన్‌' హీరోగా నటించే చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు ఈనెల 16 నుంచి చెన్నైలో ప్రారంభం కానున్నాయి. పెళ్లి సమయం వచ్చే సరికి ఈ నాలుగు సినిమాలు కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనే లక్ష్యంతో క్షణం తీరిక లేకుండా షూటింగ్‌ల్లో గడిపేస్తున్నట్టు ట్వీట్‌ ద్వారా అభిమానులతో సమంత షేర్‌ చేసుకుంది.

20:04 - May 25, 2017
09:57 - May 24, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'అఖిల్' మొదటి చిత్రం అనంతరం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మొదటి చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయేసరికి చాలా రోజులు విరామం తీసుకుని రెండో సినిమాకు సన్నద్ధం అయిన సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. విక్రమ్ దర్శకత్వంలో 'మనం' చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అఖిల్ పై యాక్షన్ పార్ట్ షూటింగ్ జరిగిన అనంతరం నెక్ట్స్ షెడ్యూల్ హీరోయిన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేకపోవడంతో షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురి అమ్మాయిలను ఫైనలైజ్ చేసినట్లు..అందులో ఒకరిని సెలక్ట్ చేస్తారని టాక్. ఎవరనేది తేలిన తరువాత అఖిల్ సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

11:13 - May 19, 2017

టాలీవుడ్ లో ఓ జంటపై సోషల్ మాధ్యమాల్లో రకరకాలైన వార్తలు వైరల్ అవుతుంటాయి. వారి సంబంధించని విషయాలపై అభిమానులు ఆసక్తి కనబరుస్తుంటారు. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య'..’సమంతల' వివాహం ఈ సంవత్సరంలో జరగనుందని తెలుస్తోంది. ఇటీవలే వారి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను 'సమంత' సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తోంది. కానీ తనకు మాత్రం అలా చేయడం నచ్చదని 'నాగ చైతన్య' పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం నచ్చదని, కానీ శ్యామ్ మాత్రం ఫొటోలూ తీస్తూ పోస్టు చేస్తూ ఉంటోందన్నారు. కానీ అలా నచ్చకపోయినా తాను మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్లు, పెళ్లికి ముందు ఈ ఎమోషన్స్..సెలబ్రేషన్స్ జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయని ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య పేర్కొన్నట్లు సమాచారం. నాగ చైతన్య, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఈనెల 26న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

10:48 - May 18, 2017

‘కంగ్రాట్స్ కోడలా' అంటూ 'సమంత'ను టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అభినందించారు. నాగార్జున తనయుడు 'నాగ చైతన్య'..’సమంత'లు త్వరలో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అనంతరం ఇరువురు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారారు. నాగ చైతన్య, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సాంగ్స్ ను యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నాగార్జున..సమంతల మధ్య ఫోన్ లో చాటింగ్ జరిగింది. ఈ చాటింగ్ జరిగిన తీరును నాగార్జున సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 'కంగ్రాట్స్‌ కోడలా..' అని నాగార్జున పేర్కొంటే, 'లవ్‌ మామా' అని సమంత మెసేజ్‌ చేసింది. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలో అక్కినేని నాగచైతన్య చాలా బాగున్నాడనీ, 'ఎవ్రిథింగ్‌ వర్క్స్‌' అని సమంత చెప్పుకొచ్చింది.

10:12 - May 17, 2017

టాలీవుడ్ లో 'నాగ చైతన్య'..'సమంత'లు నటించిన '100% లవ్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమెక్ చేయనున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హీరో జి.వి.ప్రకాష్ కుమార్ ఇందులో హీరోగా నటించనున్నారని టాక్. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే హీరోయిన్ గా 'తమన్నా'నే తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ మాత్రం ఖరారు చేయలేని ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

11:28 - May 10, 2017

అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగచైతన్య క్షమించాలని కోరడం ఏంటీ ? అని అనుకుంటున్నారా ? ఓ సినిమాను ఆలస్యంగా చూసినందుకు క్షమాపణలు చెప్పారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి -2' సినిమా విడుదలై విజదుందుంభి మ్రోగించిన సంగతి తెలిసిందే. చరిత్రలో ఏ సినిమా సాధించని రికార్డులు ఈ సినిమా సాధించింది. ఏకంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రాన్ని చూసిన పలువురు చిత్ర ప్రముఖులు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ..నటులపై ప్రశంసల జల్లుకు కురిపించారు. ఇటీవలే 'నాగచైతన్య' ఈ చిత్రాన్ని చూసి చిత్ర యూనిట్ ను అభినందించారు. ట్విటర్‌ వేదికగా ఆ చిత్ర యూనిట్‌ సభ్యులకు సెల్యూట్‌ చేశారు. ఆలస్యమైనందుకు క్షమించమన్నారు. ప్రస్తుతం ఆయన కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

15:11 - May 7, 2017

అక్కినేని నాగార్జున తనయుడు 'నాగ చైతన్య' మెగా ఫ్యామిలీ వారు వెళుతున్న దారిలో వెళుతున్నాడా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలే మెగా హీరోలు నటించిన పలు చిత్రాల ఆడియో వేడుకలు నిర్వహించకుండానే యూ ట్యూబ్ లలో రోజుకొకటి..రెండు రోజుల ఒకటి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 'నాగ చైతన్య' నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా పాటలను కూడా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు. 'బుగ్గచుక్క పెట్టుకుంది సీతమ్మా. సీతమ్మా!.. కంటి నిండా ఆశలతో మా సీతమ్మ... తాళిబొట్టు చేతబట్టి.. రామయ్యా!.. రారండోయ్ వేడుక చూద్దాం. సీతమ్మను, రామయ్యను ఒకటిగా చేద్దామంటూ'.. .సాగే టైటిల్‌ సాంగ్‌ను శనివారంనాడు ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు.
నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో బేనర్‌లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'సోగ్గాడే చిన్నినాయన' ఫేమ్‌ కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఈ పాటకు సంబంధించిన 30 సెకన్ల టీజర్‌ రిలీజ్‌ చేస్తామని, త్వరలోనే ఇదే పాటకు 90 సెకన్ల వీడియోను విడుదల చేస్తామని నిర్మాత నాగార్జున వెల్లడించారు.

16:33 - May 6, 2017

యంగ్ హీరో, అక్కినేని నాగర్జున తనయుడు నాగచైతన్య నటిస్తోన్న కొత్త చిత్రం ' రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం టైటిల్ సాంగ్ ఈ రోజు విడుదలైంది. అక్కినేని నాగర్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు పక్కన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకగా నటిస్తోంది. 'బుగ్గన చుక్క పెట్టుకుంది సీతమ్మ కంటి నిండ ఆశలతో ...రారాండోయ్ వేడుక చూద్దాం' అంటూ సాగుతున్న ఈ చిత్ర పాట అభిమానులకు అదిరిపోయేలా అనిపిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

11:38 - May 1, 2017

టాలీవుడ్ లో త్వరలో ఒక్కటి కాబోతున్న 'నాగ చైతన్య -సమంత'లపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా 'సమంత' పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలో పలువురు పాల్గొని 'సమంత'కు విషెస్ తెలియచేశారు. సెంటరాఫ్ అట్రాక్షన్ గా 'నాగ చైతన్య'..’అఖిల్' నిలిచారు. వారి సమక్షంలో సమంత కేక్ ను కట్ చేసింది. ఈ బర్త్‌డే పార్టీకి వెళ్లిన ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి అక్కడ దిగిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. పార్టీలో సమంత కేక్‌ కట్‌ చేస్తున్న వీడియో ఒకటి ట్విటర్‌లో చక్కర్లు కొడుతోంది. ‘మై డార్లింగ్‌ వదిన సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది ఉత్తమంగా ఉండబోతోంది. లవ్యూ’ అని అఖిల్‌ ట్వీట్‌ చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - naga chaitanya