Nagarjuna

14:48 - July 28, 2017

వెండితెర‌పై రికార్డుల మ్రోత మోగించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా బిగ్ బాస్ షోతో బుల్లితెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. 12 మంది సెల‌బ్రిటీలు, 70 రోజులు, 60 కెమెరాల మ‌ధ్య ఈ షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఈ షోకి టీ ఆర్పీ రేటింగ్ 16.18 గా వ‌చ్చిన‌ట్టు తెలుస్తుండ‌గా, గ‌తంలో ఏ రియాలిటీ షో కి కూడా ఇంత రేటింగ్ రాలేద‌ని అంటున్నారు. తాజాగా కింగ్ నాగార్జున త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎన్టీఆర్ ని ప్ర‌శంసించారు. 'తొలి వారంలో సాధించిన ఘ‌న‌త‌కి అభినంద‌న‌లు. నీ ఎనర్జీ నాకు ఎంత‌గానో నచ్చుతుంద‌ని' ట్వీట్ చేశాడు నాగ్. దీనికి వెంట‌నే రియాక్ట్ అయిన ఎన్టీఆర్ కింగ్ నాగ్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ.. బుల్లితెర‌పై మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. మా లాంటి వారికి ఓ మార్గం చూపారని రిప్లై ఇచ్చాడు జూనియ‌ర్.

11:29 - July 22, 2017

హైదరాబాద్: రాజుగారి గది-2 అక్టోబర్ 12 న విడుదలకు సిద్ధమవుతోందని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని, పోస్ట్-ప్రొడక్షన్ పనులు శర వేగంగా సాగుతున్నాయని యూనిట్ తెలిపింది. హారర్ కామెడీగా వస్తున్న ఈ సినిమా లో మొట్టమొదటి సారిగా నాగార్జున తన కెరీర్ లోనే వెరైటీ రోల్ పోషిస్తున్నాడు. సమంత ఘోస్ట్ (ఆత్మ) గా నటిస్తుండడం విశేషం. సీరత్ కపూర్ హీరోయిన్. రాజుగారి గది ఫస్ట్ పార్ట్ సీక్వెల్ గా తీసిన ఈ చిత్రంలో రావు రమేష్, వెన్నెల కిషోర్, షకలక శంకర్ ప్రధాన తారాగణం.

16:15 - July 9, 2017

వరుస చిత్రాలతో బిజీ బిజీగా మారిపోతున్న 'కాజల్' కు మరో ఆఫర్ వచ్చినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. స్టార్ హీరోల పక్కన మంచి మంచి అవకాశాలు పట్టేస్తూ ప్రేక్షకులను 'కాజల్' అలరిస్తోంది. మెగాస్టార్ 'చిరంజీవి' సరసన 'ఖైదీ నెంబర్ 150’లో చిందేసిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా బిజీగా ఉంది. గ్లామర్ హీరోయిన్ గా హావా కొనసాగిస్తున్న ఈ భామ 'నాగార్జున' నటిస్తున్న 'రాజు గారి గది 2’ సినిమాలో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో 'సమంత' కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో సైతం పొల్గొందని టాక్. పాత్ర నచ్చడంతోనే నటించేందుకు 'కాజల్' ఒప్పుకుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రధాన పాత్ర పోషిస్తున్న సీరత్ కపూర్ సరసన 'కాజల్' నటించందా ? లేక 'నాగార్జున' సరసన నటించిందా అనేది చూడాలి. 'రానా' సరసన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో 'కాజల్' నటిస్తోంది.

13:24 - June 12, 2017

టాలీవుడ్ మన్మథుడిగా పేరొందిన 'అక్కినేని నాగార్జున' ‘అమల' వివాహ బంధానికి 25 ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా 'నాగార్జున' తమ పెళ్లి ఫొటోను ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ..నేటికి 25 ఏండ్లు అవుతోంది..అని పేర్కొన్నారు. 1987లో 'కిరాయిదాదా' చిత్రంలో నాగార్జున, అమలలు నటించారు. తరువాత 'చిన్నబాబు'..’శివ'..’ప్రేమ యుద్ధం'..’నిర్ణయం'..వంటి చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 1992 జూన్ 11వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహమయ్యాక 'అమల' సినిమాలకు దూరంగా ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చాలా కాలం తర్వాత 2012లో విడుదలైన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌' చిత్రంలో తల్లి పాత్రలో 'అమల' మెరిశారు. 'నాగార్జున' మాత్రం వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ అభిమానుల మన్ననలు పొందుతున్నారు. ప్రస్తుతం 'రాజుగారి గది 2' చిత్రంలో 'నాగార్జున' నటిస్తున్నారు.

09:57 - May 24, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'అఖిల్' మొదటి చిత్రం అనంతరం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మొదటి చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయేసరికి చాలా రోజులు విరామం తీసుకుని రెండో సినిమాకు సన్నద్ధం అయిన సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. విక్రమ్ దర్శకత్వంలో 'మనం' చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అఖిల్ పై యాక్షన్ పార్ట్ షూటింగ్ జరిగిన అనంతరం నెక్ట్స్ షెడ్యూల్ హీరోయిన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేకపోవడంతో షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురి అమ్మాయిలను ఫైనలైజ్ చేసినట్లు..అందులో ఒకరిని సెలక్ట్ చేస్తారని టాక్. ఎవరనేది తేలిన తరువాత అఖిల్ సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

10:48 - May 18, 2017

‘కంగ్రాట్స్ కోడలా' అంటూ 'సమంత'ను టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అభినందించారు. నాగార్జున తనయుడు 'నాగ చైతన్య'..’సమంత'లు త్వరలో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అనంతరం ఇరువురు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారారు. నాగ చైతన్య, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సాంగ్స్ ను యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నాగార్జున..సమంతల మధ్య ఫోన్ లో చాటింగ్ జరిగింది. ఈ చాటింగ్ జరిగిన తీరును నాగార్జున సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 'కంగ్రాట్స్‌ కోడలా..' అని నాగార్జున పేర్కొంటే, 'లవ్‌ మామా' అని సమంత మెసేజ్‌ చేసింది. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలో అక్కినేని నాగచైతన్య చాలా బాగున్నాడనీ, 'ఎవ్రిథింగ్‌ వర్క్స్‌' అని సమంత చెప్పుకొచ్చింది.

10:29 - May 17, 2017

వరుస హిట్స్ తో మంచి జోరు మీదున్న 'నాని' వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ దూసుకెళుతున్నాడు. లవర్ బాయ్..ఫ్యామిలీ హీరోగా ముద్ర పడిన ఈ హీరో నచ్చిన పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. 'నిన్ను కోరి'..'ఎమ్ సీఏ' సినిమాలతో బిజీగా ఉన్న 'నాని' ఓ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. మల్టిస్టారర్ సినిమాకు 'నాని' ఓకే చెప్పినట్లు సోషల్ మాధ్యమల్లో తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. యంగ్ హీరోలతో పోట నటిస్తున్న సీనియర్ హీరో 'నాగార్జున' సరసన నటించేందుకు 'నాని' అంగీకరించినట్లు టాక్. ప్రస్తుతం నాగ్ 'రాజు గారి గది-2' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో 'నిఖిల్' తో కలిసి 'నాగార్జున' మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అదే సినిమాను 'నిఖిల్' కు బదులుగా 'నాని'తో చేస్తున్నాడా ? అనేది తెలియరావడం లేదు. దీనికి సంబంధించిన విషయాలు త్వరలోనే తెలియనున్నారు.

11:09 - April 15, 2017

సినిమా ఇండస్ట్రీ లో సెంటిమెంట్స్ ఉంటాయి. లక్కీగా కొన్ని సార్లు వర్క్అవుట్ ఔతాయి కూడా. అక్కినేని ఫామిలీ ఈ విషయాన్నీ బాగా నమ్మినట్టుంది. నాగార్జున కి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో వారసుడి సినిమాకి ఓకే చెప్పి సెట్స్ మీదకి తీసుకెళ్లింది. 'నాగార్జున'కు ఉన్న 'మన్మధుడు' అనే పేరును సార్ధకం చేసిన సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన'. 'నాగార్జున' డ్యూయెల్ రోల్ చేసి మెప్పించిన సోషియో ఫాంటసీ ఫిలిం సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ తో పాటు లావణ్య త్రిపాఠి స్క్రీన్ ని పంచుకున్నారు. ప్రతి ఫ్రేమ్ లో అందాన్ని చూపించిన ఈ సినిమాకి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. హంస నందిని, అనసూయ వంటి హాట్ అండ్ గ్లామర్ బ్యూటీ లని మంచి సాంగ్ లో వాడేసి మాస్ పల్స్ టచ్ చేసాడు డైరెక్టర్. మొత్తానికి ఈ సినిమా నాగార్జున ఖాతాలో హిట్ గా పడింది. 'ప్రేమమ్' సినిమాతో నటనలో పర్ఫెక్షన్ చూపించాడు నాగ చైతన్య. 'అక్కినేని' వారసుల్లో గుడ్ జాబ్ అని ఆడియన్స్ తో అనిపించుకున్న నటుడు నాగ చైతన్య. మలయాళం మూవీ 'ప్రేమమ్' కి తెలుగు టచ్ ఇచ్చి ఆడియన్స్ కి కొత్త ఫీల్ ఉన్న ఫిలింని అందించాడు డైరెక్టర్ చందు మొండేటి. ఈ సినిమాలో 'నాగచైతన్య' వేరియషన్ ఉన్న పాత్ర ప్లే చెయ్యడం వల్ల అతనిలో నటన బాగా హై లెట్ అయింది. 'ప్రేమమ్' సినిమా తెలుగు స్క్రీన్ మీద హిట్ కొట్టింది. 'నాగచైతన్య' ప్రెజెంట్ ఒక ఫామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. షూటింగ్ కూడా స్పీడ్ గా జరిగిపోతోంది. ఈ సినిమాకి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో హిట్ ఇచ్చిన కల్యాణ కృష్ణని రిపీట్ చేశారు అక్కినేని ఫామిలీ. నాగ‌చైత‌న్య హీరోగా ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా 'రా రండోయ్‌..వేడుక చూద్దాం' అనే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. నాగ‌చైత‌న్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాను స‌మ్మ‌ర్ సంద‌ర్భంగా మే 19న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.

10:46 - April 3, 2017

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తనయుడు 'అఖిల్' కొత్త చిత్రంలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఆదివారం రాత్రి ప్రారంభమైంది. అక్కినేని నాగేశ్వరరావు మునిమనువరాలు సత్య సాగరి క్లాప్ నివ్వగా దర్శకుడు కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దేవుడి పటాలపై తొలి షాట్ ను చిత్రీకిరించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ‘మనం' ఎంటర్ ప్రైజస్ పతకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు నాగార్జున. 'ఓపికకు తెరపడింది. అఖిల్ మూవీ ప్రారంభమైంది. పూజ చేసి ప్రాజెక్టు మొదలుపెట్టాం' అని ట్వీట్ చేశారు. హీరో అఖిల్ అక్కినేని, దర్శకుడు విక్రమ్ కె కుమార్, నిర్మాత అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, నాగ చైతన్య, సుప్రియ, ఎ. నాగ సుశీల, సుమంత్, సుశాంత్, యార్లగడ్డ సురేంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'అఖిల్' తన మొదటి చిత్రం పరాజయం కావడంతో చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని 'నాగార్జున' ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

11:56 - March 26, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' మరింత స్టైలిష్ గా మారిపోయారు. తాజా చిత్రం 'రాజు గారి గది -2’ లో 'నాగ్' ను దర్శకుడు ఓంకార్ మరింత స్టైలిష్ గా మార్చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటో ఆకట్టుకొంటోంది. ఓంకార్ సూచనలు చేస్తుండగా 'నాగ్' బైక్ పై ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఓంకార్ సెట్ లో ఏదో లాంగ్ షాట్ కోసం కసరత్తులు చేస్తున్నట్లు ఉంది. మెడలోనూ, చేతికి ప్రత్యేకమైన గొలుసులు తొడిగించి మరోసారి మాస్ అభిమానులను ఆకట్టుకొనేలా ఉంది. ఈ చిత్రాన్ని పివిపి సినిమా మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ ఓక్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ పాండిచ్చేరిలో జరుపుకుంది. ఇప్పటి వరకు చేయని వైవిధ్యమైన పాత్రలో 'నాగ్' కనిపించనున్నారని టాక్. ఇక ఈ చిత్రంలో 'సమంత' కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Pages

Don't Miss

Subscribe to RSS - Nagarjuna