nampally court

21:17 - November 8, 2018

హైదరాబాద్: మద్దెలచెరువు సూరి హత్యకేసులో నిందితుడుగా ఉన్న మంగలికృష్ణను ఈరోజు హైదరాబాద్ లో  వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టుకు హజరై తిరిగి వెళుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. మంగలికృష్ణ పై  హైదరాబాద్ లో దౌర్జన్యం,దాడి,భూకబ్జా కేసులు నమోదయ్యాయి.  హైదరాబాద్ లో  దుర్గారావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని, వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వాలని మంగలికృష్ణ  గత కొంతకాలంగా బెదిరిస్తున్నాడు. ఇందులో భాగంగా మంగలికృష్ణ అనుచరులు దుర్గారావు ఇంట్లో విధ్వంసం సృష్టించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిగా....  కడప జిల్లా పులివెందులకు చెందిన సమీర్ అనే వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. మంగలి కృష్ణ ఆదేశాల మేరకు మరో నలుగురితో కలిసి దాడి చేసినట్లు సమీర్ ఒప్పుకున్నాడు. ఇదే కేసుకు సంబంధించి మంగలికృష్ణ ఈరోజు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లొంగి పోగా న్యాయస్ధానం బెయిల్ మంజూరుచేసింది. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

22:32 - October 24, 2018

హైదరాబాద్ : హీరా గ్రూప్ చైర్‌పర్సన్ నౌహీరా షేక్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నౌహీరా షేక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ప్రాసిక్యూషన్ వాదనలతో సంత‌ృప్తి చెందని కోర్టు.. కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రూ.5 లక్షలతోపాటు రెండు షూరిటీలతో రూ.5 కోట్లను ఈనెల 29లోగా కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సమయానికి డిపాజిట్ చేయకపోతే మాత్రం బెయిల్ రద్దు చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది. దీంతోపాటు కోర్టు అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకూడదని.. నౌహీరా షేక్ పాస్‌పోర్టును సీజ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

నౌహీరా తరపు న్యాయవాది వినీత్‌దండా కోర్టులోకి వస్తున్న సమయంలో బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులపై అతని బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు బౌన్సర్లను పోలీసీులు అరెస్టు చేశారు.  

 

12:05 - September 4, 2018

హైదరాబాద్ : లుంబినిపార్క్, గోకుల్ చాట్ లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నాంపల్లి ప్రత్యేకన్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. ఏ 1, ఏ2 లను దోషులగా తేల్చింది. ఇస్మాయిల్ చౌదరి, షఫీద్ లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఆధారాలు లేవని న్యాయమూర్తి మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. చర్లపల్లి జైలులో జడ్జి తీర్పు వెల్లడించారు. 2007 ఆగస్టు 25న జంట బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. 11ఏళ్లపాటు విచారణ సాగింది. ఇద్దరికి సోమవారం శిక్షలు ఖరారు కానున్నాయి. జంట బాంబు పేలుళ్లతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగర ప్రజలు భయకంపితులయ్యారు. జంట పేలుళ్ల కేసులో.. మొత్తం 42 మంది మృత్యువుఒడిలోకి వెళ్లిపోయారు. లుంబిని పార్క్ లో జరిగిన పేలుడులో 10 మంది, గోకుల్ చాట్ దగ్గర జరిగిన పేలుడులో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది క్షతగాత్రులయ్యారు. 
2007 ఆగస్టు 25న జంట పేలుళ్లు
2007 ఆగస్టు 25వ తేదీ సాయంత్రం... ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరం.. ఏడు గంటల ప్రాంతంలో.. వరుస పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. లుంబిని పార్కులో అత్యంత ఆసక్తిగా లేజర్ షోను వీక్షిస్తున్న పర్యటకులపై ఉగ్రమూక.. బాంబులు పేల్చింది. ఈ ఘటనలో కూర్చున్న వారు కూర్చున్నట్టే 9 మంది మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. లుంబిని పార్క్ వద్ద బ్లాస్ట్ అయిన ఐదు నిమిషాలకే... రాత్రి 7 గంటల 50 నిమిషాలకు కోఠీలో అత్యంత రద్దీ ప్రదేశంలోని గోకుల్‌చాట్‌ బండార్‌లో మరో శక్తివంతమైన పేలుడు సంభవించింది. లోపల టిఫిన్‌ చేస్తున్న వారు మొదలుకుని వెలుపల రోడ్డు వెంట వెళ్తున్న వారికి బాంబు శకలాలు తగిలి మృతి చెందారు. గోకుల్ చాట్ దగ్గర మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి కాళ్లు చేతులు విరిగిపోయి క్షతగాత్రులయ్యారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 42 మంది అమాయకులు, పిల్లలు మరణించగా, వందలాది మంది క్షతగాత్రులు ఆయ్యారు. 

 

17:27 - July 10, 2018

హైదరాబాద్‌ : ఏసీబీ కోర్టులో రిటైర్డ్‌ జడ్జి గాంధీ లొంగిపోయారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్‌ అయిన లేబర్‌ కోర్టు రిటైర్డ్‌ జడ్జి గాంధీకి... సుప్రీంకోర్టు ఇంటీరియం బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయడంతో ఆయన ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. కాగా గతంతో ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి వున్నాడనే ఆరోపణతో ఏసీబీ గాంధీని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో గాంధీ హైకోర్టుకు బెయిల్ పిటీషన్ వేసుకున్నారు. ఈ పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు గాంధీకి బెయిల్ నిరాకరిచింది. దీంతో గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ ఇప్పించాల్సిందిగా కోరారు. దీంతో సుప్రీంకోర్టు కూడా వెంటనే ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని గాంధీని ఆదేశించింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో గాంధీ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో 11 రోజుల రిమాండ్ కోసం చంచల్ గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించనున్నారు. సమగ్ర విచారణ జరిపించాలని న్యాయవాదులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కోసం పనిచేయాల్సిన న్యాయమూర్తులే అవినీతికి పాల్పడతుంటే న్యాయంపై సమాజంలో నమ్మకం పోతుందని అభిప్రాయపడుతున్నారు. నాంపల్లి లేబర్ కోర్టు జడ్జిగా పనిచేసే విషయంలో నగదు డిమాండ్ చేసి అవినీతి ఆరోపణలు రావటంతో న్యాయవాదులు జడ్జిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల నేపథ్యంలో దాదాపు రూ. 300ల కోట్లు అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

హైకోర్టు అనుమతితో వారాసిగూడలోని జడ్జి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. దాంతో పాటు నాంపలి, డీడీ కాలనీ, ఏపీలోని రాజమండ్రి, కొవ్వూరు, ఏలూరు సహా ఏడు ప్రదేశాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. గాంధీని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. దాదాపు రూ.300 కోట్లకు పైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒక బిల్డింగ్, రెండు ప్లాట్లు, కొవ్వూరులో 18 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జడ్జి గాంధీకి చెందిన బ్యాంకు లాకర్‌ను ఏసీబీ అధికారులు తెరిచి లాకర్ లో వున్న నగదును, నగలను స్వాధీనం చేసుకున్నారు. 

13:14 - April 16, 2018

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి న్యాయస్థానం కొట్టివేసింది. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి ఆసీమానంద, భరత్ భాయి, రాజేందర్ చౌదరిలపై అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

పూర్వాపరాలు..
చార్మినార్ సమీపంలోని మక్కా మసీదు ఆవరణలోల గల బాంబు పేలడంతో 9మంది మృతి చెందారు. 58మంది గాయపడ్డారు. 2007 మే 18వ తేదీ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు అనంతరం జరిగిన అలర్లను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో 9 మంది మృతి చెందారు. ఘటన తీవ్రతతో దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ నేపథ్యంలో 2011 ఏప్రిల్ 4వ తేదీన జాతీయ దర్యాప్తు సంస్థకు భారత హోం మంత్రిత్వ శాఖ అప్పగించింది. మొత్తం పదిమంది నిందితులను ఎన్ఐఏ గుర్తించింది. 2014 ఫిబ్రవరి 13న నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. నవంబర్ 19వ తేదీన కీలక నిందితుడు నాబకుమార్ సర్కార్ అలియాస్ ఆసీమానంద చిక్కడంతో కుట్రకోణం వెలుగు చూసినట్లైంది. ఈ పేలుడు ఘటనతో సంబంధం ఉన్న రతేశ్వర్ అలియాస్ భారత్ భాయి, మధ్యప్రదేశ్ కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ పోలీసులకు చిక్కారు. సందీప్ వి డాంగే, రామచంద్ర కల్సంగ్రా రాంజీ లు ఇంకా దొరకలేదు. మరో నిందితుడు సునీల్ జోషి పేలుడు జరిగిన ఏడాదే హత్యకు గురయ్యాడు. 

12:12 - April 16, 2018

హైదరాబాద్ : మక్కా మసీదు పేలుళ్లు..11 ఏళ్ల తరువాత తీర్పు వచ్చేసింది. సోమవారం నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తుది విచారణ జరిపింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఐదుగురు నిందితులు నిర్దోషులుగా ప్రకటించేసింది. దీనితో ఏ 1 దేవేందర్ గుప్తా, ఏ 2 లోకేశ్ శర్మ, ఏ 6 స్వామి ఆసీమనందా, ఏ7 భరత్ భాయ్, ఏ 8 రాజేందర్ లు విడుదల కానున్నారు. సందీప్ డాంగే, రామచంద్ర కళా సంగ్రా, అమిత్ చౌహాన్ లు పరారీలో ఉన్నారు. ఆధారాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంటూ నిందితుందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు వద్ద మీడియాను అనుమతించలేదు.

మక్కా మసీదులో ప్రార్థనల సమయంలో... 2007 మే 18న పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఆనాటి ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్ల తర్వాత పాతబస్తీలో చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో 58 మంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐయే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

13:32 - April 15, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ మక్కా మసీదు పేలుళ్ల కేసులో సోమవారం తుది తీర్పు వెలువడనుంది. పదహారు మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈ కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. కేసు దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ... హిందూ రైట్‌ వింగ్‌ సభ్యులు పేలుళ్లకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. ఈ కేసులో సోమవారం తుది తీర్పు వెలవడనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు, విచారణ పూర్తి కావడానికి దాదాపు 11 సంవత్సరాలు పట్టింది. మక్కా మసీదులో ప్రార్థనల సమయంలో... 2007 మే 18న పేలుళ్లు జరిగాయి. ఆనాటి ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్ల తర్వాత పాతబస్తీలో చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో 58 మంది గాయపడ్డారు. చికిత్సపొందుతూ వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐయే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మక్కా మసీదు పేలుళ్ల ఘటనపై హుస్సేనీ ఆలం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐయేకి అప్పగించారు. ఈ కేసుతో సంబంధం ఉందన్న అభియోగంపై ఎన్‌ఐయే కొందరు మైనారిటీ యువకులను అరెస్టుచేసి, కోర్టులో చార్జ్‌షీటు వేసింది.

అయితే కేసు విచారించిన నాపంల్లి ప్రత్యేక న్యాయస్థానం.. మక్కా మసీదు పేలుళ్ల కేసులో వీరికి సంబంధంలేదని తీర్పు ఇవ్వడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు. ఆ తర్వాత మళ్లీ కేసు విచారణ చేపట్టిన ఎన్‌ఐయే.. హిందూ రైట్‌ వింగ్‌ సభ్యులు పేలుళ్లుకు పాల్పడినట్టు తేల్చింది. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న స్వామి అసమానంద, లక్ష్మణ్‌దాస్‌ మహరాజ్‌, శ్రీకాంత్‌ పురోహిత్‌ సహా 11 మందిపై ఎన్‌ఐయే కేసు నమోదు చేసింది. అభినవ్‌ భారత్ సంస్థ నిర్వాహకులు స్వామి అసమానంద, లోకేశ్‌శర్మ పేలుళ్లకు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మరో నిందితుడు జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మొత్తం 226 మంది సాక్షులను విచారించింది. సోమవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో నిందితులు కోర్టుకు హాజరుకానున్నారు. దీంతో నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.

21:01 - January 25, 2018

హైదరాబాద్ : మైనర్ హత్యకేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పాతబస్తీకి చెందిన పదవ తరగతి విద్యార్ధి అభయ్ హత్య కేసులో ముగ్గురు మైనర్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2016 మార్చి 18న అభయ్‌ను ఇందుగమల్లి శేషకుమార్, నంబూరి మోహన్, పొందర రవి అనే మైనర్లు కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేశారు. అభయ్‌ మృతదేహాన్ని  ఓ సూట్‌కేసులో పెట్టి పడేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 48 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిపై విచారణ అనంతరం కోర్టు యావజ్జీవిత ఖైదు విధించింది. 

 

15:28 - January 19, 2018

హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్ల పాటు రద్దు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాకుండా రూ.2100 జరిమానా కూడా విధించింది. గత డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రదీప్ పట్టుబడ్డాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:30 - January 11, 2018

హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఏ2 నింధితులరాలు పార్వతి ఇంకా పరారీలోనే ఉందని, బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - nampally court