nandyala

13:40 - December 26, 2017

కర్నూలు : జిల్లాలో.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేయీ ప్రభాకర్‌ నామినేషన్‌ వేశారు. పార్టీ ఆఫీస్‌ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ను వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. కాగా ఇవాళ్టితో నామినేషన్ దాఖల కార్యక్రమం ముగియనుంది. 

21:22 - December 25, 2017

గుంటూరు : రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ పేరును సీఎం చంద్రబాబు ఫైనల్‌ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ప్రకటించింది. తమ పార్టీకి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎక్కువమంది ఉన్నా.. పోటీ చేయట్లేదని తెలిపింది. టీడీపీ మరోసారి డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. LOOKకర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు రెండు విడతలుగా కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు. చల్లా రామకృష్ణారెడ్డి, కేఈ ప్రభాకర్‌, శివానందరెడ్డి తదితరులతో చర్చించారు. ఫైనల్‌గా కేఈ ప్రభాకర్‌ పేరును ఖరారు చేశారు. అవకాశం దక్కని నేతలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

విలువలతో కూడిన రాజకీయాలు
మరోవైపు కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ప్రకటించింది. తమ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎక్కువమంది ఉన్నా.. పోటీ చేయట్లేదని తెలిపింది. తెలుగుదేశం పార్టీ మరోసారి డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని.. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యమని వైసీపీ నేతలు అన్నారు. గతంలో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి మారారు. పార్టీ మారే ముందు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక తప్పనిసరిగా మారింది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌ గడువు మంగళవారంతో ముగియనుంది. ఎమ్మెల్సీ ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ప్రకటించడంతో ఎన్నిక ఇక ఏకగ్రీవం కానుంది.

19:10 - December 25, 2017

గుంటూరు : కర్నూలు జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ ను ఎంపిక చేశారు. కేఈ ప్రభాకర్ పేరును సీఎం అధికారికంగా ఖరారు చేశారు. చంద్రబాబు ఉదయం నుంచి కర్నూలు జిల్లా నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:17 - December 25, 2017

గుంటూరు : కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు మరోసారి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి కేటాయించాలని వారు భేటీలో చర్చించారు. రేపే ఎమ్మెల్సీ నామినేషన్ చివరి తేది కావడంతో నేడు రాత్రి అభ్యర్థి ఫైనల్ చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:49 - December 1, 2017

కర్నూలు : జిల్లాలోని నంద్యాలలో విద్యార్థిని కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. విద్యార్థిని బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వస్తుండగా దుండగులు ఏపీ 21 ఏక్యూ 0006 నెంబర్‌ కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:51 - November 5, 2017

కర్నూలు : జిల్లా నంద్యాల కేంద్రంగా పనిచేస్తున్న ఇండోఫిల్‌ ఇండస్ట్రీస్‌ వరిని ఆశించే తెగుళ్ల నివారణకు కొత్త పురుగు మందును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంప్రెషన్‌ పేరుతో తయారు చేసిన ఈ మందును కంపెనీ జనరల్‌ మేనేజర్‌ టీ నారాయణరెడ్డి మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఇండోఫిల్‌ శాస్త్రవేత్తలు ఆరేళ్ల పరిశోధనల ఫలితమే ఇంప్రెషన్‌ అని నారాయణరెడ్డి చెప్పారు. వరి పంటకు సోకే అగ్గి, పొడ తెగుళ్ల నివారణకు ఇంప్రెషన్‌ పని చేస్తుందని చెప్పారు. 

11:46 - August 30, 2017

గుంటూరు : రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. రాష్ట్రాన్ని విభజించిందన్న కారణంతో ఏపీ ప్రజలు హస్తం పార్టీని గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా శిక్షించారు. 2014 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటి చేస్తే.. అన్నిచోట్లా ఓడించిన ఏపీ ఓటర్లు కాంగ్రెస్‌పై ఉన్న కసిని తీర్చుకున్నారు. 132 ఏళ్ల పార్టీ చ‌రిత్రలో ఎన్నడు లేనంతాగా గత ఎన్నికల్లో ఓట‌మిని మూట‌క‌ట్టుకుంది.

తగ్గని విభ‌జ‌న ఆగ్రహం
గత మూడేళ్లుగా టీడీపీ ప్రభుత్వంపై తన దైన శైలిలో పోరాటాన్ని సాగిస్తోంది కాంగ్రెస్‌పార్టీ. ఏపీ ప్రత్యేక హోదాపై పోరాటంతో ప్రజల్లో వచ్చిన స్పందన.. హస్తంపార్టీ నేత‌ల్లో ఆశ‌ల‌ చిగురించేలా చేసింది. హోదా కోసం కోటి సంతకాలు.. డిల్లీలో ధర్నాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయ‌డం..ప్రజ‌ల్లోకి వెళ్ళిన‌ప్పుడు పార్టీలో కొంత జోష్ నింపింది. దీంతో ఇక ప్రజ‌ల్లో త‌మ‌పై ఉన్న విభ‌జ‌న ఆగ్రహం త‌గ్గిందని భావించారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో పార్టీ పుంజుకుంటుంద‌ని పార్టీనేతలు భావించారు. భ‌విష్యత్ ఎన్నిక‌ల నాటికి .. ఇక పార్టీకి మంచి రోజులు వ‌స్తాయని విస్వాసంతో ఉన్న హ‌స్తం నేత‌ల‌కు నంధ్యాల ఉపఎన్నిక‌ ఊహించ‌న షాక్ ఇచ్చింది. గెలుపుపై ఎలాగూ ఆశలు పెట్టుకోని హస్తంపార్టీ నేతలు కనీసం గౌరవప్రదంగా ఓట‌మి ఉంటుంద‌ని నమ్మారు. కాని..నంద్యాల ఓటర్లు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్‌ నేతలకు దిమ్మతిరిగినట్టైంది. మొత్తం నియోజకవర్గంలో 1,73, 187 ఓట్లు పోలయితే.. కాంగ్రెస్‌పార్టీకి దక్కింది 1382 వందల ఓట్లు మాత్రమే. కనీసం 2014లో తెచ్చుకున్న ఓట్లు కూడా దక్కక్కంచుకోలేక కాంగ్రెస్‌పార్టీ చతికిలపడింది. దీంతో ఏపీ ఓటర్లో విభజన ఆగ్రహం ఇంకా చల్లారలేదనేది మరోసారి రుజువైందంటున్నారు.

భష్యత్తుపై బెంగ
నంద్యాల ఉప ఎన్నిక ఇచ్చిన షాక్‌తో ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న లీడర్లకు తమ భష్యత్తుపై బెంగ మొదలైంది. పార్టీ ఇప్పట్లో కోలుకునేలా లేదన్న నైరాశ్యంలో పడిపోయారు. ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీ , వైసీపీలోకి వెళ్లిపోగా.. మెల్లమెల్లగా మార్పు వస్తుందని వేచి చూసిన తమకు భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోందని పలువురు కాంగ్రెస్‌పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.

 

 

07:57 - August 29, 2017

కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఇన్న గని..ఈ నడుం దెబ్బకు సుత్తి దెబ్బ వినకపోతి..చూడకపోతి..సుత్తె..సానం తీసుకుని నడుంపై కొడితే ఉంటదా వెన్నుపూస...కొండ నాలుకకు మందస్తే ఉన్న నాలుక ఊడిచ్చినట్లు వెన్నుపూస నొప్పి బాగు చేయపోతే మొత్తం విరగొట్టిందే అనుకో...ఎట్లుంటది..తలచుకొంటేనే భయం అవుతున్నది. ఒక ముసలాయన వైద్యం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:50 - August 29, 2017

అసలు సర్పంచ్ అంటే ఏందీ ? ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు. దేశానికి ప్రధాన మంత్రి ఎట్లనో..రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో..ఒక ఊరికి గ్రామ సర్పంచ్ అట్లే. అసొంటి సర్పంచ్ ఆధ్వర్యంలో ఏ మీటింగ్ అయినా..ఏ అభివృద్ధి కార్యక్రమమమైనా జరగాలి..అది ప్రొటోకాల్. కానీ సంగారెడ్డి జిల్లాలో అధికారుల అత్యుత్సాహమా ? లేక అధికార పార్టీ ఓవర్ యాక్షన్ తెల్వదు. ఒక దళిత మహిళ సర్పంచ్ ఉన్న ఊర్లే ఆమెకు తెల్వకుంట అభివృద్ధి కార్యక్రమాలు చేసిండంటే ఆమెను అవమానించుడు కాకపోతే ఏందో చెప్పండి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

07:23 - August 29, 2017

విజయవాడ : మొన్నటి దాకా నంద్యాల ఉప ఎన్నిక.. మూడేళ్ల టీడీపీ పాలనకు రెఫరెండమన్న వైసీపీ అధినేత జగన్‌ ఇప్పుడు మాటమార్చారు. 200 కోట్ల డబ్బు ప్రవాహంతో సాగిన ఈ ఉప ఎన్నిక రెఫరెండం కానేకాదంటున్నారు. ఓట‌మిని అంగీకరించకపోగా...ఫిరాయింపు నేతలతో రాజీనామా చేయించి మళ్లీ ఉప ఎన్నికలకు రావాలని సీఎం చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నారు.

నంద్యాల ఉప ఎన్నికల పోరు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా మాటలదాడితో నేతలు పొలిటికల్‌ హీట్‌ పెంచారు. నంద్యాల బైపోల్‌ను ప్రతిష్టాత్మకంగా భావించిన టీడీపీ, వైసీపీ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 13 రోజులు ప్రచారం కోసం నంద్యాలలో మకాం వేశారు. ప్రచారం కోసం మంత్రులను రంగంలోకి దింపిన సీఎం చంద్రబాబు.. రెండు రోజులు తాను క్యాంపెయిన్‌ చేశారు. ప్రజలు అభివృద్ధి మంత్రానికే ఓటు వేయడంతో.. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రభంజనం సృష్టించారు. దీంతో నంద్యాల ఉపఎన్నిక రెఫరెండం అని ప్రచారంలో హోరెత్తించిన వైసీపీ...సడెన్‌గా యూ టర్న్‌ తీసుకుంది. నంద్యాల ఉపఎన్నికల్లో 200 కోట్లు ఖర్చు చేశారని.. డబ్బు ప్రవాహంతో గెలిచారని.. ఇది ముమ్మాటికీ రెఫరెండం కాదని వైసీపీ అధినేత అంటున్నారు.

ఇక నంద్యాల ఉపఎన్నికల ఫలితాల్లో ఆది నుంచి ప్రతి రౌండ్లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం కనబరిచారు. 16వ రౌండ్‌ మినహా టీడీపీకి ఫ్యాన్‌ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఒకవేళ ఓడిపోయినా స్వల్ప మెజార్టీతోనే అని భావించిన వైసీపీ నేతలకు.. ఫలితాలు షాక్‌ ఇచ్చాయి. 27,466 ఓట్ల భారీ మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించడంతో...వైఎస్సార్‌ కాంగ్రెస్ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించి ఎన్నిక‌లకు రావాలని... అప్పుడు తమ సత్తా ఎంటో చూపిస్తామని జ‌గ‌న్ స‌వాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో అయితే టీడీపీ గెలిచేది కాదని.. ఉప ఎన్నిక అయినందుకే విజయం సాధించిందని జగన్‌ అంటున్నారు. మరి జగన్‌ సవాల్‌ను సైకిల్‌ పార్టీ నేతలు ఎలా స్వీకరిస్తారో చూడాలి.  

Pages

Don't Miss

Subscribe to RSS - nandyala