narendra modi

12:22 - September 17, 2018

ముంబయి: వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్   తాజాగా రాజకీయాల్లోకి వస్తారన్న కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. ‘‘నేనా రాజకీయాల్లోకా.. అందులోనూ బీజేపీలోకా.. నో.. వే..’’ అంటున్నారు అమీర్‌ఖాన్. ఎన్డీటీవీ నిర్వహించిన యువ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ తన రాజకీయ ప్రవేశంపై వస్తున్నా ఊహాగానాలకు తెరదింపారు.

తాను కేవటం నటుడిని మాత్రమేనని తనకు రాజకీయాలు పడవని స్పష్టం చేశారు. తను స్థాపించిన స్వచ్ఛంధ సంస్థ పానీ (నీరు) గురించి మాట్లాడుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన సేవా కార్యక్రమాలకు మద్ధతుపలకడం సంతోషంగా ఉన్నదని అమీర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో నీటి ఎద్దడిని నివారించి ప్రజలను కరువు బారినుండి రక్షించేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

19:44 - August 28, 2018

ఢిల్లీ : ముందస్తు ఎన్నికలు..జమిలి ఎన్నికలు..త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో గెలుపొందాలంటే ఎలాంటి వ్యూహాలు రచించాలనే దానిపై బీజేపీ దృష్టి సారించింది. మంగళవారం బీజేపీ ఓ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేతలను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాన మంత్రి మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 2019 కంటే ముందుగా ఎన్నికలు వస్తే ఎలాంటి వ్యూహాలు రచించాలి ? అంతకంటే ముందు పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలని..అందుకు అనుసరించాల్సిన వ్యూహాలను రచించాలని పార్టీ పెద్దలు దిశా నిర్దేశం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:23 - October 3, 2017

దేశంలో విమార్శలు సహించలేని శక్తులు ఇలా చేస్తున్నాయని, దేశంలో అసహన వాతావరణం పెరిగిపోయిందని, ప్రకాష్ రాజు అన్నారని, ప్రతిదానికి ట్వీట్టర్ ద్వారా స్పందించే మోడీ ఇప్పుడు గౌరీ లంకేష్ హత్య కేసులో స్పందికపోవడం దారుణమని, లంకేస్ కేవలం పాత్రికేయురాలు కాదని, అన్యాయన్ని ఎదురించే వ్యక్తి అని, పవన్ కన్నా ప్రకాష్ రాజ్ బాగా స్పందించారని, ఈ హత్య సంస్కృతి పోవాలని ప్రముఖ విశ్వేషకులు తెలకపల్లి రవి అన్నారు. పచ్చ కామెర్ల వారికి లోకమంత పచ్చగా కనిపించినట్టు ప్రకాష్ రాజ్ కు ఉందని, ఈయన నటుడు కాబట్టి అందరికి నటులుగా కనబడతారని బీజేపీ నేత ఆచార్య అన్నారు. గౌరీలంకేష్ దేని కోసం పోరాడారు అసమానత్వపై, మహిళ వివక్షపై పోరాడారని, వేముల రోహిత్ ఆత్మహత్య, కంచె ఐలయ్ విషయంలో అదే జరుగుతుందని కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:44 - October 2, 2017

హైదరాబాద్: పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్యపై ప్రధాని మోదీ స్పందించాలని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. గౌరీహత్య వెనుక ఉన్న నిజానిజాలు దేశప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రధాని స్పందించకుంటే తనకు వచ్చిన జాతీయ అవార్డును వెనక్కు ఇచ్చేస్తానని ప్రకాశ్‌రాజ్‌ స్పష్టంచేశారు.

17:00 - September 28, 2017

ఢిల్లీ : మోది ప్రభుత్వ పనితీరుపై సొంత పార్టీ నేతలే కాదు...ఎన్డీయే మిత్ర పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అభివృద్ధిపై శివసేన మళ్లీ కేంద్రాన్ని టార్గెట్‌ చేసింది. గుజరాత్‌ అభివృద్ధి ఏమైందని తన అధికార పత్రిక సామ్నాలో ప్రశ్నించింది. గుజరాత్ అభివృద్ధి అనేది ఓ పిచ్చి భ్రమ అంటూ... అక్కడి ప్రజలే చెబుతున్నారని...దేశ అభివృద్ధి కూడా గాడి తప్పిందని శివసేన పేర్కొంది. మన్మోహన్‌, చిదంబరం లాంటి ఆర్థికవేత్తలు ఆర్థికవ్యవస్థపై మాట్లాడితే వారిని పిచ్చోళ్ల కింద జమకట్టారని...ఇపుడు బిజెపికి చెందిన మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా నే మోది అభివృద్ధి గాలి తీశారని శివసేన వ్యాఖ్యానించింది. జిడిపి రేటు 5.7 శాతం ఉందని కేంద్రం చెబుతున్నా వాస్తవానికి 3.7 శాతమే ఉందని యశ్వంత్‌ అన్నారు. యశ్వంత్‌ సిన్హా  నిజం చెప్పినందుకు ఆయనకు ఏం శిక్ష విధిస్తారో చూడాలని తెలిపింది. 

 

12:27 - September 8, 2017

ప్రస్తుతం ట్విట్టర్ లో '# బ్లాక్ నరేంద్ర మోడీ’ ట్రెండ్ వైరల్ అవుతోంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్విట్టర్ లో అకౌంట్ ఉన్న విషయం తెలిసిందే. ఈయనకు ట్విట్టర్ లో 33.7 మిలియన్ల మంది ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ను ఫాలో అవుతున్న వారు అన్ ఫాలో లేదా బ్లాక్ చేయడం స్టార్ట్ చేశారు. దీని వెనుక ఓ విషయం ఉంది.

బెంగళూరులో ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమ కారిణి గౌరీ లంకేశ్ ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాపితంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. పలువురు ప్రముఖులు ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ విషయంపై ట్విట్టర్ లో కూడా తమ తమ స్పందనలు తెలియచేస్తున్నారు.

కానీ ఓ వ్యక్తి మాత్రం గౌరీ లంకేశ్ హత్య విషయంలో ట్విటర్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరుష పదజాలం ఉపయోగించి ట్వీట్స్ చేయడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతని ట్విటర్ ను పరిశీలించగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆయన ఫాలో అవుతున్నారని గ్రహించారు. జర్నలిస్టుల హత్యలను ప్రోత్సాహించే వ్యక్తిని మోడీ ఫాలో అవుతున్నారని..పరోక్షంగా అతడికి మోడీ మద్దతిస్తున్నట్లే అని ఓ వ్యక్తి పేర్కొన్నట్లు, అతడిని అన్ ఫాలో చేసే వరకు పీఎం నరేంద్ర మోడీని ఖాతాని అంతా బ్లాక్ చేయాలని పిలుపునిచ్చినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. అందుకే '# బ్లాక్ నరేంద్ర మోడీ' టాగ్ ని వాడుతున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ మారింది. ఒక్కసారిగా పీఎంకు ఫాలోవర్స్ తగ్గుతున్నారు. మరి ప్రధాని మోడీ ఎలాంటి స్పందన వ్యక్తపరుస్తారో చూడాలి. 

21:59 - August 14, 2017

ఢిల్లీ : అసోం, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లో వరదలు ముంచెత్తాయి. బ్రహ్మపుత్ర, బాగ్‌మతి, గండకి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో వరద తాకిడి పెరిగింది.ఈశాన్య రాష్ట్రం అసోంలో భారీ వర్షాలకు బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి ఉధృతి 37వ జాతీయ రహదారి నీట మునిగింది. 23 లక్షల మంది వరదలు ప్రభావం చూపాయి. 2 లక్షల మంది నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. గడచిన 24 గంటల్లో 9 మంది మృతి చెందారు. అసోం నుంచి ఇతర ప్రాంతాలకు రైలు ప్రయాణం తెగిపోయింది. 20 రైళ్లను రద్దు చేశారు. కజిరంగా నేషనల్‌ పార్కు 80 శాతం నీట మునగడంతో జంతువులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. సైనికులు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. త్రిపురలో కూడా లక్షలాది మంది వరద ప్రభావానికి గురయ్యారు.

బిహార్‌లో వరదలు ముంచెత్తాయి
గత కొన్ని రోజులుగా నేపాల్‌లోని తరాయి, బిహార్‌లోని సీమాంచల్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు నేపాల్‌లోని వాల్మీకీనగర్‌ గండక్ బ్యారేజీలో భారీగా నీరు చేరడంతో సుమారు 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో బిహార్‌లో వరదలు ముంచెత్తాయి. కిషన్‌గంజ్‌, గోపాల్‌గంజ్, పూర్ణియా, అరరియ, కటిహార్ తదితర 12 జిల్లాలు వరదలకు ప్రభావితమయ్యాయి. అధికారులు తీరప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.భారీ వర్షాల కారణంగా రైలు, కరెంట్, టెలికాం సేవలు నిలిచిపోయాయి. పలుచోట్ల రైల్వే ట్రాక్‌లు నీట మునగడంతో యూపీ-బిహార్‌ల మధ్య 30 రైళ్లను రద్దు చేశారు.వరద ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని బిహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

సరిహద్దుల్లో ఎడతెరపి లేని వాన
ఉత్తరప్రదేశ్‌-బిహార్‌-నేపాల్‌ సరిహద్దులో గత 72 గంటలుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. గంగ, కోసి, మహానంద నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. గోరఖ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో రన్‌వే నీట మునగడంతో విమానాల రాకపోకలను రద్దు చేశారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రను నిలిపివేశారు. మల్సా జిల్లాలో వరదల కారణంగా ముగ్గురు మృతి చెందారు. యాత్రకు వెళ్లిన వారిలో ఏడుగురు తప్పిపోయినట్లు సమాచారం. ప్రయాణికులతో పాటు నలుగురు పారాఫోర్స్ జవాన్లు గల్లంతయ్యారు. ప్రయాణికులు, పారాఫోర్స్ జవాన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

06:28 - June 26, 2017

హైదరాబాద్: రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో వాషింగ్టన్‌ డీసీ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం శ్వేతసౌధంలో అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీకానున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికేందుకు శ్వేతసౌధం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్‌.. ట్విటర్‌ వేదికగా ఘన స్వాగతం పలికారు. మోదీ రాకకోసం శ్వేతసౌధం ఎంతగానో ఎదురు చూస్తోందని.. నిజమైన మిత్రుడితో ముఖ్యమైన వ్యూహాత్మకమైన విషయాల గురించి చర్చలు జరుపుతామంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అయితే ట్రంప్‌ ట్వీట్‌కు మోదీ రీట్వీట్‌ చేస్తూ ఎంతో అప్యాయంగా వ్యక్తిగతంగా స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మీతో సమావేశమై చర్చలు జరిపేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య మరింత బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడనున్నాయి. వాణిజ్యం, ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు, రక్షణశాఖకు సంబంధించిన కీలకమైన విషయాలు వీరి భేటీలో చర్చకురానున్నాయి. హెచ్‌1బీ వీసా అంశంపైనా వీరు చర్చించే అవకాశముంది. ఇక వైట్‌హౌస్‌లో మోదీ కోసం ట్రంప్‌ ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు.

 

21:59 - April 16, 2017
13:37 - April 15, 2017

ఢిల్లీ : 'మోడీ..ఆదుకో..కేంద్రం కనికరించాలి..మమ్మల్ని ఆదుకోండి'..అంటూ తమిళనాడు రైతులు చేస్తున్న ఆవేదన కేంద్రం చెవికి ఎక్కడం లేదు. కరవు సాయం ప్రకటించాలని..ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని గత కొన్ని రోజులుగా రైతులు హస్తినలో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరు చేస్తున్న ఆందోళనకు పలు పార్టీల నేతలు సంఘీభావం కూడా తెలియచేశాయి. కానీ కేంద్రం స్పందించకపోవడంతో వారు వినూత్నంగా నిరసనలు తెలియచేస్తున్నారు. చనిపోయిన రైతుల పుర్రెలతో నిరసన తెలియచేసిన రైతులు మొన్న నగ్నంగా ఆందోళన చేపట్టారు. తాజాగా శనివారం ఉదయం నిండుగా చీరలను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మెడలో ఉన్న తాళులను తెంపుతూ ఏడుస్తూ..ఆదుకోవాలంటూ నినదించారు. 100రోజుల నిరసన ప్రణాళికలో భాగంగా రోజుకో రీతిలో రైతులు తమ ఆవేదనను తెలుపనున్నారు. ఇప్పటికైనా కేంద్రం కనికరిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

 

Pages

Don't Miss

Subscribe to RSS - narendra modi