naresh

16:50 - November 23, 2018

అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 సినిమాల ప్రభావం వల్ల, వాటి తర్వాత తెరకెక్కిన చాలా సినిమాల్లో, సందర్భం ఉన్నా లేకపోయినా, మూతి ముద్దులకు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. అలాంటి టైమ్‌లో కేవలం కిస్సెస్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా రూపొందితే ఎలా ఉంటుంది? 24 కిస్సెస్.. ఆ తరహా సినిమానే. టీజర్, ట్రైలర్‌తో కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేసిందీ సినిమా. ఈ రోజు (నవంబర్ 23) రిలీజైన 24 కిస్సెస్ ఎలా ఉందో చూద్దాం..


కథ :
ఆనంద్ (అరుణ్ అదిత్) చిన్న పిల్లలకి సంబంధించిన ఫిలింస్ తీస్తుంటాడు. పౌష్టికాహార లోపంతో అలమటించే పిల్లల కోసం ఏదైనా చెయ్యాలనుకుంటాడు. తనకి తెలిసిన సినిమా ద్వారానే ఆ సమస్య గురించి సమాజానికి తెలియ చెయ్యాలనుకుంటాడు. ఒక వర్క్‌షాప్‌‌లో ఆనంద్‌కి, శ్రీ లక్ష్మి పరిచయం అవుతుంది. అతని బిహేవియర్ నచ్చి, లవ్‌లో పడుతుంది. ఆనంద్ కూడా ఆమెని ఇష్ట పడతాడు, లివింగ్ రిలేషన్ అయితే ఓకే కానీ, పెళ్ళీ, గిల్లీ జాన్తానయ్ అంటాడు. ఇద్దరూ లవ్‌లో ఉండగానే, శ్రీ లక్ష్మికి ఆనంద్‌కి మిగతా అమ్మాయిలతో ఉన్న ఎఫైర్‌లగురించి తెలిసి అతనితో బ్రేకప్ చేసుకుంటుంది. తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈ కిస్సెస్ స్టోరీ..

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 

అరుణ్ అదిత్ తన రోల్‌కి న్యాయం చేసాడు కానీ, అసలు అతగాడి క్యారెక్టరే గందరగోళంగా ఉండడం వల్ల ఆహా, ఓహో అనడానికేం లేకుండా పోయింది. హెబ్బా పటేల్ కొన్ని సీన్స్ వితౌట్ మేకప్‌తో చెయ్యడం వల్ల డల్‌గా కనిపిస్తుంది. ముద్దు సీన్లు మినహా ఇస్తే, ఆమె గురించి చెప్పడానికేం లేదు. రావు రమేష్, సీనియర్ నరేష్ క్యారెక్టర్లు చెప్పుకోదగ్గవి కాదు. జోయ్ బారువా కంపోజ్ చేసిన పాటలు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. ఉదయ్ గుర్రాల కెమెరా వర్క్ ఆకట్టుకునేలా ఉంది. సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల సినిమాకి తగ్గట్టే ఖర్చు పెట్టారు. ఇక దర్శకుడు అయోధ్య కుమార్ విషయానికొస్తే.. మిణుగురులు సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. దాని తర్వాత అతను చేస్తున్న సినిమా అంటే కాస్తో కూస్తో అంచనాలుంటాయి. ట్రైలర్, మేకింగ్ వీడియోలో ముద్దుల మోత మోగించి, అబ్బే, ఇది ఆ టైపు సినిమాకాదు, ట్రైలర్‌లో ముద్దులే చూసారు, సినిమాలో విషయం ఉంది.. అదీ, ఇదీ అన్నాడు. కట్ చేస్తే అయోధ్య చెప్పిన దాంట్లో ఏమాత్రం వాస్తవం కాదు కదా.. అసలు సినిమాలో విషయమే లేదని తేల్చిపారేసారు ఆడియన్స్.. ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని ముద్దు సీన్లు కుర్రాళ్ళకి నచ్చుతాఏమో కానీ, ఓవరాల్‌‌గా సినిమా అయితే వేస్ట్, వరెస్ట్..
24 కిస్సెస్.. ముద్దులు తప్ప మేటర్ లేదు..

తారాగణం : అరుణ్ అదిత్, హెబ్బా పటేల్, రావు రమేష్, నరేష్ తదితరులు..

కెమెరా     :   ఉదయ్ గుర్రాల 

సంగీతం  :  జోయ్ బారువా

నిర్మాతలు : సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల 

దర్శకత్వం : అయోధ్య కుమార్

 

 

15:41 - November 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ తరువాత అభ్యర్థుల ప్రకటనలో కాస్త జాప్యం జరిగినా రెండవ జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ కేటాయింపులతో అసంతృప్తులు బైటపడుతున్నాయి. ఎన్నికల వేళ ఇదంతా సాధారనమే అయినా తెలంగాణలో తన పట్టు సాధించుకోవటానికి కమల దళం అసంతృప్తి నేతలతో మల్లగుల్లాలు పడుతోంది. పార్టీలో విబేధాలు బైటపడటంతో వారిని బుజ్జగించేందుకు పెద్దస్థాయి నేతలు ప్రయత్నిస్తున్నారు. అయినా ఊరట చెందని అసంతృప్తి నేతలు తమ నిరసనను పార్టీ కార్యాలయాలపై వ్యక్తంచేస్తున్నారు. 

Image result for serilingampally bjp yoganand28 మందితో భాజపా ఈరోజు రెండో విడత జాబితా విడుదల చేసింది. దీనిలో భాగంగా శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు, నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు రాష్ట్ర అధిష్టానం జాబితా మేరకు కేంద్ర అధిష్ఠానం కేటాయించింది. దీంతో ఈ రెండు స్థానాల్లో టిక్కెట్ల ఆశించి భంగపడిన నేతలు ఆందోళనకు దిగారు. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు కేటాయించడంపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి నరేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న తనను కాదని.. మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన బిల్డర్‌ యోగానంద్‌కు టిక్కెట్‌ ఎలా కేటాయిస్తారంటూ పార్టీ పెద్దలను నిలదీశారు. దీనికి నిరసనగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఎదుట మద్దతుదారులతో కలిసి ఆయన నిరసనకు దిగారు. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను తనకే కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
మరోవైపు నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు కేటాయించడంపైనా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యెండలకు టిక్కెట్‌ కేటాయించడాన్ని నిరసిస్తూ సూర్యనారాయణ గుప్తా అనుచరులు ఆందోళన చేపట్టారు. భాజపా కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు.
 

21:20 - July 26, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లా పల్లెర్లలో నరేష్‌ అస్థిపంజరం లభించింది. స్వాతిని కులాంతర వివాహం చేసుకున్న నరేష్‌ను.. అమ్మాయి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చంపి కాల్చి బూడిదను మూసీలో కలిపానంటూ పోలీసులను తప్పుదోవపట్టించాడు. మరోవైపు విచారణలో పోలీసుల తీరుపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాదాద్రి జిల్లా పల్లెర్లలో కనిపించిన అస్థిపంజరం తమ కుమారుడు అంబోజి నరేష్‌దే అంటున్నారు అతని తల్లిదండ్రులు. అయితే అది నరేష్‌దో ? కాదో? డీఎన్‌ఏ పరీక్షల అనంతరం తెలుస్తుందన్నారు భువనగిరి డీఎస్పీ. పంచనామా చేసి డీఎన్‌ఏ పరీక్షలకు పంపిస్తామని ..పరీక్షల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని ఆయన చెప్పారు. 

20:19 - July 26, 2017

యాదాద్రి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన నరేష్, స్వాతి కేసులో మరో దిగ్ర్భాంతి కలిగించే విషయం వెలుగు చూసింది. నరేష్ అస్థిపంజరం వెలుగు చూడడం కలకలం రేపుతోంది. నరేష్ ను హత్య చేసి కాల్చి చంపిన అనంతరం బూడిదను మూసీ నదిలోకి వేసినట్లుగా చెప్పిన స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి అబద్దాలేనని తెలుస్తోంది. స్వాతి - నరేష్ ప్రేమ..పెళ్లి..విషాదంగా ముగిసిన సంగతి తెలిసిందే. దీనిపై టెన్ టివి వరుసగా కథనాలు ప్రసారం చేసింది. తాజాగా అస్థిపంజరం లభ్యం కావడంపై నిజ నిజాలు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:18 - July 26, 2017
18:46 - July 26, 2017

హైదరాబాద్ : ఇటీవలే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన స్వాతి తండ్రి శ్రీనివాస్ 'దృశ్యం' సినిమా చూపిస్తున్నాడా ? దృశ్యం సినిమాలో తన కూతురును కాపాడుకోవడానికి హీరో చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. కానీ శ్రీనివాస్ ఫక్తు అదే తరహాలో ప్రవర్తిస్తున్నాడా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. స్వాతి నరేష్ ప్రేమ..పెళ్లి విషాదంతమైన సంగతి తెలిసిందే. నరేష్ ను హత్య చేసి తగులబెట్టి బూడిదను మూసీలో పారబోసినట్లు శ్రీనివాస్ చెప్పిన సంగతి తెలిసిందే.

పల్లెర్లలో..
తాజాగా నరేష్ దిగా భావిస్తున్న అస్థిపంజరం బయటపడడం కలకలం రేపుతోంది. పల్లెర్లలో ఇది బయటపడింది. నరేష్ ఇంటి నుండి వెళ్లిన సమయంలో వేసుకున్న డ్రెస్ ఆధారంగా అస్థిపంజరం ఖచ్చితంగా నరేష్ దని కుటుంబసభ్యులు, అక్కడి గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీనితో శ్రీనివాస్ చెప్పినవన్నీ అబద్దాలేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఘటనా ప్రదేశానికి పోలీసులు, ఎమ్మార్వో, ఇతర అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ప్రేమ..పెళ్లి విషాదాంతం..
నరేష్ - స్వాతిలు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి భరించలేకపోయాడు. కొన్ని మాటలు చెప్పి స్వాతిని వెనక్కి పిలిపించుకన్నాడు. కానీ నరేష్ మాత్రం కనిపించలేదు. దీనితో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణనను పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపత్యంలో స్వాతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దీనిపై టెన్ టివి వరుస కథనాలు ప్రసారం చేసింది.

టెన్ టివి కథనాలకు స్పందన..
పోలీసుల తీరుతో విసుగు చెందిన నరేష్‌ తల్లిదండ్రులు న్యాయం కోసం... సీపీఎం, ప్రజాసంఘాలతో పాటు 10టీవీని ఆశ్రయించారు. హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కేసు డీజీపీ వరకు వెళ్లింది. హైకోర్టు అక్షింతల అనంతరం కేసును ఎల్బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వర్లుకు అప్పజెప్పడంతో కేసు ముందుకు కదిలింది. అయితే అప్పటికే పోలీసుల నిర్లక్ష్యం.. వేగంగా స్పందించకపోవడం వల్ల స్వాతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆత్మకూరు ఎస్సై శివనాగ ప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. అలాగే.. భువనగిరి ఏసీపీ, డీసీపీతో పాటు.. చౌటుప్పల్‌ ఏసీపీ, రామన్నపేట, భువనగిరి సీఐలకు మెమోలు జారీ చేశారు.

పలు ఆధారాలు..
స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఒత్తిడికి లొంగి పోలీసులు ఆయనకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు మేజర్లు అయిన నరేష్‌-స్వాతిలు ముంబైలో పోలీసుల అనుమతితో వివాహం చేసుకున్నప్పటికీ.. ఆత్మకూరు (ఎం) ఎస్‌ఐ శివనాగప్రసాద్‌ వారిద్దరిని తిరిగి స్వగ్రామం వచ్చేటట్టు చేసిన రాయభారం ఇప్పటికే ఆధారాలతో సహా బయటపడింది. వారిద్దరూ వచ్చిన తర్వాత రామన్నపేట సీఐ శ్రీనివాస్‌ సమక్షంలో పంచాయతీ నిర్వహించి ప్రేమజంటను బలవంతంగా విడదీసేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. 

18:41 - June 9, 2017
17:12 - June 20, 2016

విజయవాడ : ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. జగ్గయ్యపేట మండలం బండిపాలెంకు చెందిన పుట్టా నరేష్ కాలిఫోర్నియాలో ఎమ్మెస్ సెకండియర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి నరేష్ పడవ షికారుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నరేష్ కాల్వలో గల్లంతయ్యాడు. ఇతని కోసం గాలింపులు చేపడుతున్నారు. గల్లంతైన నరేష్ మృతి చెందాడా ? లేదా ? అనేది తెలియరావడం లేదు.
నరేష్ గల్లంతైన విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ..ఇతర విద్యార్థులతో కుటుంబసభ్యులు మాట్లాడినా వివరాలు తెలియరాలేదేని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందిచింది. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి..ఇతర మంత్రులు అక్కడి ఉన్నతాధికారులతో మాట్లాడారు. గల్లంతైన నరేష్ క్షేమంగా రావాలని బండిపాలెం గ్రామస్తులు కోరుకుంటున్నారు. 

07:50 - November 5, 2015

మోహన్‌బాబు, అల్లరి నరేష్‌ హీరోలుగా రమ్యకృష్ణ, మీనా, పూర్ణ హీరోయిన్లుగా శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం 'మామ మంచు - అల్లుడు కంచు'. నాన్నగారు ఇప్పటి వరకు 561 చిత్రాల్లో నటించి మెప్పించారని, ఇప్పుడు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారని మంచు విష్ణు పేర్కొన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న 181వ చిత్రమిదని, నరేష్‌కు యాభైవ చిత్రమన్నారు. డిఫరెంట్‌ కాంబినేషన్‌లో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని, దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. 

Don't Miss

Subscribe to RSS - naresh