Natural Tips

12:18 - October 11, 2017

మహిళలు అవాంఛిత రోమాలతో బాధ పడుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా డబ్బును కూడా ఖర్చు చేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలతో అవాంఛిత రోమాల నుండి బయటపడవచ్చని పలువురు సూచిస్తున్నారు. తిరిగి పెరుగుతున్న జుట్టు నుండి సహజ రెమెడీలున్నాయి. బొప్పాయి..శనగపిండి..పసుపు మూడు పదార్థాలను కలుపుకోవాలి. అవాంఛిత రోమాలున్న చోట రాసి స్నానం చేయాలి. అలోవెరా..శనగపిండి కూడా సహాయ పడుతుంది. ఎందుకంటే వీటిని వాడడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మం మెరుపు దనం వచ్చే అకాశం ఉంది. పచ్చి బొప్పాయిలో ఒక శక్తివంతమైన ఎంజైమ్ ఉంది. నిరంతరం ఉపయోగించడం వల్ల అవాంఛిత రోమాలను అరికట్టవచ్చు. ట్రై చేసి చూడండి. 

12:48 - November 14, 2016

చర్మం ముడతలుగా మారుతోందా ? నివారించడానికి ఎన్నో మందులు..క్రీములు వాడారా ? అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి.
పచ్చిపాలు చర్మానికి తేమనందిస్తాయనే విషయం తెలిసిందే. ఇది నల్లమచ్చలున్నా తగ్గుతాయి. బాగా మగ్గిన అరటిపండును తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులో ఓ చెంచా పెరుగూ, కొద్దిగా తేనె వేసుకుని బాగా కలపాలి. దీన్ని కొద్దిగా వేడిచేసి ఆ తరవాత ముఖం, మెడకూ పూతలా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
ఎనిమిది బాదం గింజలు తీసుకుని ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు పచ్చిపాలు పోసుకుంటూ మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి అరగంట తరవాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో రెండుమూడుసార్లు చేస్తుంటే ముడతలు పెరగకుండా ఉంటాయి. బాదంలో ‘విటమిన్‌ ఈ’ తోపాటూ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి.
గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం, చెంచా తేనె కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. కొద్దిసేపటి అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. 

10:43 - July 6, 2016

ఇళ్లు మంచి సువాసనతో..పరిమళభరితంగా ఉండాలని మహిళలు కోరుకుంటూ ఉంటుంటారు. కానీ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం..వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంటుంది. సువాసగా ఉండేందుకు మార్కెట్లో దొరికే వస్తువులను వాడుతుంటారు. కానీ రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించవచ్చు.
వంట చేసిన తరువాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు పోవాలంటే ఓ గిన్నె నిండా నీళ్లు తీసుకుని అందులో దాల్చిన చెక్క వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది.
దుస్తులన్నీ ఒకే చోట పోగుపడి ఉండి..దుర్వాసన వెదజల్లుతుంటుంటే నిమ్..లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలను ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచండి.
ఒక అర బకెట్ నీళ్లు తీసుకుని అందులో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం కలిపి గదిలో కాస్త చల్లండి..గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది.
కిటికి అద్దాలు దుమ్ము పట్టి ఉంటే కప్పు వెనిగర్ కు చెంచా లావెండర్ ను జోడించాలి. ఓ బట్టను అందులో ముంచి కిటికిలను తుడిస్తే సరిపోతుంది.
కార్పెట్లు మురికిగా ఉంటే కప్పు బేకింగ్ సోడాకు చెంచాడు ఏదైనా సుగంధ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

10:06 - June 8, 2016

కొంతమంది మహిళలకు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి..అధిక వత్తిడికి లోనవుతుంటారు. దీనితో నొప్పిని నివారించడానికి మందులు వాడుతుంటారు. కానీ ఇలా వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం తెలిసినా మందులు వేసుకుంటూ అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ సమస్య ఎదుర్కొంటున్న వారికి కొన్ని టిప్స్...

  • అల్లం ముక్కను తీసుకుని దానిని మెత్తగా చేసి నీళ్లలో వేయాలి. ఇలా ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాల్సి ఉంటుంది. తరువాత ఈ నీళ్లను వడగొట్టి అందులో కొద్దిగా తేనె, నిమ్మరం కలిపి తాగేయాలి.
  • దాల్చిన చెక్క తో చేసిన టీ సేవించడం వల్ల బాగుంటుంది. నెలసరి మొదలవడానికి రెండు రోజుల ముందర నుండి దాల్చిన చెక్క టీని రెండు లేదా మూడు కప్పులు తప్పనిసరిగా తాగాలి.
  • వేడీ టీ తాగడం వల్ల కండరాల నొప్పి నుండి విముక్తి కలుగుతుంది. అల్లం, పిప్పర్ మెంట్, లావెండర్, గ్రీన్ టీ, లెమన్ గ్రాస్ వంటి హెర్బల్ టీలు తాగితే చాలా మంచిది.
  • నీరు కూడా ముఖ్యం. ఎంత నీరు తాగితే అంత మంచిది. కనీసం ఆరు నుండి ఏడు గ్లాసుల నీరు తాగాలి.
  • ఈ సమయంలో కాఫీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒక వారం ముందు నుండి కాఫీ తాగడం మానేస్తే చాలా మంచిది.
11:14 - November 17, 2015

మీ పాదాలు అందంగా ఆకర్షణీయంగా ఉండాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి. వారానికి ఒక్కసారి శుభ్రంగా పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యుటికల్‌ క్రిము లేదా రెండు చెంచాలా ఆలివ్‌ ఆయిల్‌, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కల గ్లిజరిన్‌ బాగా కలిపి చేతులకు, పాదాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో హెర్బల్‌ షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాలమీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది. పాదాలను నీళ్ళలోనే ఉంచి ప్యూమిక్‌స్టోన్‌తో పాదాలమీద, మడమల మీద ఏర్పడిన పగుళ్ళపై మూడు-నాలుగు నిమిషాల పాటు రుద్దండి. దీనివలన పాదాలపై పేరుకున్న మట్టి వచ్చేస్తుంది. మంచినీళ్ళతో పాదాలను సబ్బుతో కడిగిన తర్వాత మరోసారి బాగా రుద్దుతూ కడగాలి. రోజూ రాత్రి పూట హ్యాండ్‌క్రీమ్‌ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా నునుపుగా ఉంటాయి. కాలి మడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే రాత్రి పూట పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సు ధరించి నిద్రించడం మంచిది. కాలి వేళ్ళ గోళ్ళను ఎప్పటికప్పుడు కత్తిరించడం మంచిది. పొడిచర్మం గలవారు వారానికి ఒకసారి గోరువెచ్చటి నూనెలో పాదాల్ని కాసేపు వుంచాలి. ఇలా చేస్తే మీ పాదాలు మృదువుగా తయారవుతాయి.

Don't Miss

Subscribe to RSS - Natural Tips