Navdeep

15:42 - November 8, 2018

మిల్కీబ్యూటీ తమన్నా, సందీప్ కిషన్ జంటగా, బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో, రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మిస్తున్న చిత్రానికి నెక్స్ట్ ఏంటి అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నవదీప్, పూనమ్ కౌర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాటలే సినిమాకి టైటిల్స్‌గా పెట్టడం చూస్తున్నాం. నాని హీరోగా నటించిన నేను లోకల్ మూవీలో, నెక్స్ట్ ఏంటి అనే సాంగ్ పాపులర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి అదే టైటిల్ పెట్టారు. కునాల్ కోహ్లి  బాలీవుడ్‌లో, అమీర్ ఖాన్‌తో ఫనా, సైఫ్ అలీఖాన్‌తో హమ్‌తుమ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న నెక్స్ట్ ఏంటి చిత్ర షూటింగ్, లండన్, హైదరాబాద్‌లలో జరగనుంది. తమన్నా ప్రస్తుతం ఎఫ్2, అభినేత్రి 2, క్వీన్ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మితో పాటు, హిందీలో ఖామోషీ అనే సినిమాలు చేస్తుంది. నెక్స్ట్ ఏంటి  మూవీకి లియోన్ జేమ్స్ సంగీతమందిస్తున్నారు. త్వరలో ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు.  

19:52 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. కెల్విన్, ఖుద్దూష్‌‌, వహాబ్‌ను కస్టడీలో విచారించిన సిట్... విచారణలో పలువురు మరికొందరు సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించారు. కెల్విన్ కస్టమర్లలో కొంతమంది టాప్ హీరోలు ఉన్నట్టు సమాచారం. కెల్విన్ కాల్‌డేటాలో 2వేలకు పైగా ఫోన్ నంబర్లు ఉన్నాయి. నిఖిల్‌శెట్టి కాల్‌డేటాలో దాదాపు 1500 పేర్లు ఉన్నాయి. ఈవెంట్ మేనేజర్స్‌తో కలిసి కెల్విన్... డ్రగ్స్ సరఫరా చేశాడు. వీటిని జర్మనీ, నెదర్లాండ్స్‌ నుంచి డ్రగ్స్ తెప్పించినట్టు తెలిపింది. మరోవైపు విచారణ ఆధారంగా ఎక్సైజ్ శాఖ మరో జాబితా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా టాలీవుడ్‌ను తమ గుప్పిట్లో పెట్టుకున్న ఇద్దరు నిర్మాతల..పుత్ర రత్నాలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. యువతను ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు కూడా జాబితాలో ఉన్నట్టు సమాచారం.వ్యాపార రంగంలో సక్సెస్‌ సాధించిన..సినీ నేపథ్యం ఉన్న ఓ అగ్రహీరోకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 

18:22 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కెల్విన్ ను బాలానగర్ ఎక్సైజ్ పీఎస్ తరలించారు. అధికారుల విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం ఉంది. డ్రగ్స్ కేసులో కెల్విన్, అబ్దుల్ ఖుద్దూష్, అబ్దుల్ మహాబ్ తొలిరోజు విచారణ ముగిసింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:30 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ శాఖ రెండో జాబితా సిద్ధం చేసింది. ఇవాళ పలువురికి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నోటీసులు అందుకున్నవారిని ఈ నెల 19నుంచి 27వరకూ విచారించనుంది. కేసు కీలక దర్యాప్తులో ఉండగా అకున్ సబర్వాల్ సెలవులపై వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలావుంటే కొంతమంది సినీ నటులు తమకు నోటీసులు అందలేదని అంటున్నారు. మరికొంతమంది సినీ నటులు తమకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. నోటీసులపై నటుడు సుబ్బరాజు స్పందించారు. తనకు నోటీసులు వచ్చిన వార్త నిజమేనని ఒప్పుకున్నారు. కానీ కెల్విన్ లిస్ట్‌లో తన పేరు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థంకావడంలేదన్నారు. డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చిన వార్త అవాస్తవమన్నారు నటుడు నందు. తనకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్  నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన పేరు లాగొద్దని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని యువ హీరో తనీష్‌ తెలిపారు. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదన్నారు. డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. నోటీసులు అందుకున్న ఐటమ్ గర్ల్ ముమైత్‌ఖాన్‌ కూడా తనకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం లేదని తెలిపారు. డ్రగ్స్‌ మాఫియా సినీ పరిశ్రమకు విస్తరించడం దురదృష్టకరమని సినీయర్ నటులు అన్నారు. డ్రగ్స్ కేసులో తప్పు చేసిన స్టార్స్‌కి మా అసోసియేషన్ నుంచి ఎలాంటి సాయం ఉండబోదని మా అధ్యక్షులు శివాజీరాజా స్పష్టం చేశారు. 

08:23 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ రెండో జాబితా సిద్ధం చేసింది. ఇవాళ పలువురికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈనెల 19 నుంచి 27 వరకూ నోటీసులు అందుకున్నవారిని అధికారులు విచారించనున్నారు. 19 నుంచి రోజుకు ఒకరిని విచారించాలని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:14 - July 15, 2017

డ్రగ్స్ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని వక్తలు అన్నారు. డ్రగ్స్ రాకెట్ అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రజినేష్ గౌడ్, ప్రముఖ విశ్లేషకులు వినయ్ కుమార్, టీఆర్ ఎస్ నేత నాగేందర్ గౌడ్ పాల్గొని, మాట్లాడారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉండగా అకున్ సబర్వాల్ సెలవులపై వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

07:20 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ రాకెట్‌ టాలీవుడ్‌ వణుకు పుట్టిస్తోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న కొంతమంది టాలీవుడ్‌ స్టార్స్‌ నోటీసులపై స్పందించారు. డ్రగ్స్‌తో తమకేం సంబంధంలేదని స్పష్టం చేస్తున్నారు. అయితే కొందరి వల్లే సినీ పరిశ్రమపై చెడ్డపేరు వస్తుందని టాలీవుడ్ పెద్దలు చెప్తున్నారు. 
టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు 
టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్‌ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్స్‌కు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు జారీచేయడంతో  సినీ పరిశ్రమలో ఒక్కసారిగా అలజడి రేగింది.
నాకు నోటీసులు అందాయి : సుబ్బరాజు
ఈ నోటీసులపై నటుడు సుబ్బరాజు స్పందించారు. తనకు నోటీసులు వచ్చిన వార్త నిజమేనని ఒప్పుకున్నారు. కానీ కెల్విన్ లిస్ట్‌లో తన పేరు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థంకావడంలేదన్నారు.
నాకు నోటీసులు వచ్చిన వార్త అవాస్తవం : నందు 
డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చిన వార్త అవాస్తవమన్నారు నటుడు నందు. తనకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్  నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన పేరు లాగొద్దని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి విజ్ఞప్తి చేశారు. 
నాకు ఎలాంటి నోటీసులు అందలేదు : హీరో తనీష్‌ 
డ్రగ్స్‌ కేసులో సిట్‌ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని యువ హీరో తనీష్‌ తెలిపారు. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదన్నారు. డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. 
డ్రగ్స్‌ వ్యవహారంతో నాకు సంబంధం లేదు : ముమైత్ ఖాన్  
నోటీసులు అందుకున్న ఐటమ్ గర్ల్ ముమైత్‌ఖాన్‌ కూడా తనకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం లేదని తెలిపారు. డ్రగ్స్‌ మాఫియా సినీ పరిశ్రమకు విస్తరించడం దురదృష్టకరమని సినీయర్ నటులు అన్నారు.  
వారికి ఎలాంటి సాయం ఉండదు : శివాజీరాజా 
డ్రగ్స్ కేసులో తప్పు చేసిన స్టార్స్‌కి మా అసోసియేషన్ నుంచి ఎలాంటి సాయం ఉండబోదని మా అధ్యక్షులు శివాజీరాజా స్పష్టం చేశారు. వాళ్లకు చట్టం ఎలాంటి శిక్ష విధిస్తుందో..అసోసియేషన్ అంతే శిక్ష వేస్తుందన్నారు. మొత్తానికి టాలీవుడ్ స్టార్స్‌ డ్రగ్స్‌ మత్తులో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఈ డ్రగ్స్‌ మత్తులో మరెంతమంది టాలీవుడ్ స్టార్స్‌ చిత్తవుతారో చూడాలి. 

21:47 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసుల నోటీలసుల విషయంలో నటులు స్పందించారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

21:45 - July 14, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం కొనసాగుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో తగిలిన డ్రగ్స్‌ తీగను పట్టి లాగితే.. సినిమా పరిశ్రమలో డొంక కదులుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌ అందించిన సమాచారం ఆధారంగా.. ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఇప్పటికే డజనుకు పైగా సినీరంగ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్‌ఖాన్‌, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్‌, కెమెరామెన్‌ శ్యాం కె.నాయుడు, హీరోలు నవదీప్‌, తరుణ్, తనీష్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా తదితరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్‌ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని, సెక్షన్‌ 67 కింద జారీ చేసిన ఆ నోటీసుల్లో సూచించారు.

50 మంది వరకూ సినీ ప్రముఖుల పాత్ర
డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు నోటీసుల జారీ ప్రక్రియను ఇకపై కూడా కొనసాగించాలని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిర్ణయించింది. డ్రగ్స్‌ వ్యవహారంలో సుమారు 50 మంది వరకూ సినీ ప్రముఖుల పాత్ర ఉందని డైరెక్టరేట్‌ అనుమానిస్తోంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన వారిని.. సిట్‌ ఆఫీసులోనే విచారిస్తామని.. హీరోయిన్లను మాత్రం వారు కోరిన చోట విచారిస్తామని, డైరెక్టరేట్‌ ప్రకటించింది. అయితే నోటీసులు అందుకున్న వారందరూ డ్రగ్స్‌ తీసుకుంటున్నారా? లేదా.. వాటి క్రయవిక్రయాల్లో పాలుపంచుకుంటున్నారా అన్నది తేలాల్సి ఉంది. వీటన్నింటిని లోతుగా విచారించేందుకే నోటీసులు జారీచేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. డ్రగ్స్‌ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పియూష్ అనే సివిల్‌ ఇంజనీర్‌తో పాటు, మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 13కు చేరింది. ఎల్‌ఎస్‌డీ కేసులో 11 మందిని, కొకైన్‌ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.

కొందరికి అందని నోటీసులు
అయితే టాలీవుడ్‌లో డ్రగ్స్‌ తీసుకుంటున్న వారందరికి నోటీసులు అందలేదని సమాచారం. ఇందులో బడా నిర్మాతలు, దర్శకుల కొడుకులను తప్పించినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. కొంతమందికే నోటీసులిచ్చి ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేతులు దులుపుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, రాష్ట్ర రాజధానిలో డ్రగ్స్‌ మాఫియా గుట్టును బట్టబయలు చేయడంలో ముక్కుసూటిగా వెళుతున్న..ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ అనూహ్యంగా సెలవుపై వెళుతుండడం..పలు అనుమానాలకు తావిస్తోంది.

సబర్వాల్ పై ఒత్తిళ్లు
పాఠశాలల్లో డ్రగ్స్‌ విక్రయంపై మొదలైన విచారణ.. సినీ పరిశ్రమ వరకూ సాగింది. ఈ క్రమంలో.. ప్రభుత్వంపై సినీ ప్రముఖులు ఒత్తిడిని పెంచారని, అందుకే, ప్రభుత్వ పెద్ద ఒకరు అకున్‌ సబర్వాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పది రోజుల సెలవులో వెళుతున్నారని తెలుస్తోంది. అయితే.. గతంలో దరఖాస్తు చేసుకున్న మేరకే సెలవు మంజూరైందని అకున్‌ చెబుతున్నారు. మొత్తానికి రకరకాల మలుపులతో.. డ్రగ్స్‌ వ్యవహారం.. సినిమా ఫక్కీలో రసవత్తరంగా సాగుతోంది. ఈ డ్రగ్స్‌ సినిమాకు క్లైమాక్స్‌ మరియు ముక్తాయింపు ఎలా ఏంటాయోనని సినిమా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

19:42 - July 14, 2017

హైదరాబాద్ : టెన్ టివిలో సినీఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై నిర్వహించిన చర్చలో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాబుమోహన్ ఫోన్ లైన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియా పై ఫైర్ అయ్యారు. ఒకరి తప్పు చేస్తే అందరికి అపదించద్దని అన్నారు పూర్తి వివరాలకు కోసం వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - Navdeep