nda government

22:03 - July 19, 2017
21:32 - July 19, 2017

చెన్నై : తమిళనాడులో కరువు బారిన పడ్డ రైతులు రుణమాఫీ కోసం అల్లాడుతుంటే...ఎమ్మెల్యేలు మాత్రం బంపర్‌ ఆఫర్‌ కొట్టేశారు. తమిళనాడు ఎమ్మెల్యేల జీతభత్యాలు ఏకంగా వందశాతం పెంచేశారు. ప్రస్తుతం నెలకు 50 వేలు వేతనం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ఇక నుంచి లక్షా ఐదు వేలు డ్రా చేయనున్నారు. ఒక్కసారిగా 50 వేలు పెరిగిందన్నమాట. సాలరీ ఒక్కటే కాదు ఎమ్మెల్యేల పెన్షన్‌ కూడా పెంచేశారు. ప్రస్తుతం 12 వేలు ఉన్న పెన్షన్‌ను 20 వేలకు పెంచేశారు. అసెంబ్లీ నియోజకవర్గం ఫండ్‌ను రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్లకు పెంచారు. ఎమ్మెల్యేల జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో ప్రకటించారు. ఎంపీల జీతాలు కూడా పెంచాల‌ని ఇవాళ పార్లమెంట్‌లో స‌మాజ్‌వాదీ, కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. 

 

20:49 - July 19, 2017

ఢిల్లీ : సమస్యలపై రైతు సంఘాలు గళమెత్తాయి. గిట్టుబాటు ధర కల్పించాలంటూ... రుణమాఫీ కోరుతూ... రైతులు.. జంతర్‌మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు రైతులు పాల్గొన్నారు. రుణమాఫీ చేయాలని చాన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్న తమిళనాడు రైతులు... పుర్రెలతో నిరసన తెలిపారు. ఓవంక రుణమాఫీ కోసం తమిళరైతులు పోరాటం చేస్తుంటే... మరోవంక ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు... జీతభత్యాలు రెట్టింపు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో... ఎమ్మెల్యే నెలసరి వేతనం 50 వేల రూపాయల నుంచి లక్షా 5 వేలకు పెరిగింది.  

 

19:36 - July 19, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కౌలు రైతుల గోడు పట్టడం లేదు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా.. ఇప్పటికీ కౌలు రైతులకిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదు. మరోవైపు ప్రభుత్వ విధానాలు కూడా వ్యవసాయ రంగాన్ని నష్టాల్లోకి నెట్టుతుండడంతో.. అప్పులు చేసి కౌలు రైతులు రోడ్డున పడుతున్నారు. 
పట్టణాలకు వలస వెళ్తోన్న పెద్ద రైతులు 
పట్టణీకరణ రోజురోజుకీ పెరుగుతోంది. పిల్లల చదువులు, ఉద్యోగాల పేరుతో గ్రామాల్లోని పెద్ద రైతులు పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారు. దీంతో వారి భూములను కౌలుకు తీసుకుని సాగుచేసి.. రాష్ట్ర అభివృద్ధిలో కౌలు రైతులు కీలకంగా మారారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇపుడు వ్యవసాయం కౌలు రైతుల కష్టం మీదే ఆధారపడి ఉందని చెప్పాలి. అలాంటి అన్నదాతలు ఇప్పుడు రోడ్డున పడుతున్నారు. 
కౌలు రైతుల పరిస్థితి దయనీయం 
నెల్లూరు జిల్లాలో ఎక్కువ శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పచ్చని పంటపొలాలతో కళకళలాడుతున్న.. ఈ జిల్లాలో సుమారు లక్ష మంది కౌలు రైతులున్నారు. లక్షలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. అయితే  వ్యవసాయం రంగం సంక్షోభంలో ఉండడంతో పాటు,  ప్రభుత్వ విధానాల వల్ల ఇపుడు కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పూట గడవడమే కష్టంగా మారుతోంది. 
వడ్డీలేని రుణం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు 
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కౌలు రైతులకు ఎన్నో హామీలిచ్చారు. కౌలు రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. గుర్తింపు కార్డులిచ్చి రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారో.. అవన్నీ కౌలురైతులకు కూడా వర్తించేలా చేస్తామని హామీ ఇచ్చారు. వడ్డీలేని రుణం, ఇన్ పుట్ సబ్సిడీలు కల్పిస్తామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడిచిపోయింది. కానీ ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. జిల్లాలో లక్ష మంది కౌలు రైతులుంటే 30 వేల మందికి ఎలాంటి ఉపయోగంలేని గుర్తింపు కార్డులిచ్చారు. 2011లో ప్రభుత్వం కౌలు రైతుల చట్టం తీసుకొచ్చినా దాంట్లోని ఏ అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించలేదు. 
బయోమెట్రిక్ విధానం ద్వారా ఎరువులు, మందులు, విత్తనాలు 
కౌలు రైతులకు తలనొప్పిగా ప్రభుత్వ విధానాలు  
మరోవైపు ప్రభుత్వ విధానాలు కూడా కౌలు రైతులకు తలనొప్పిగా మారాయి. బయోమెట్రిక్ విధానం ద్వారా ఆన్ లైన్ లో ఎరువులు, మందులు, విత్తనాలు అందించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియలో పట్టాదారు పుస్తకాలను ఆధార్‌కు లింకు చేస్తారు. దాని ఆధారంగా వ్యవసాయాధికారి గుర్తించి పర్మిషన్‌  ఇస్తాడు. దానిని ఆన్ లైన్ ద్వారా అనుమతి తీసుకుని డీలర్ల వద్దకు వెళ్తే.. అపుడు ఎరువులు, మందులు, విత్తనాలు సబ్సిడీకి అందిస్తారు. ఈ ఆన్ లైన్ విధానం వల్ల వ్యవసాయం సాగడం కష్టమని.. ఒక వేళ సబ్సిడీలో దొరక్కపోతే బ్లాక్‌లో కొనుగోలుచేయాల్సి వస్తుందని రైతు సంఘం నాయకులంటున్నారు. యూరియా సబ్సిడీలో 300 రూపాయలుంటే బ్లాక్‌లో 1500 రూపాయలని, అదే డిఏపి సబ్సిడీలో 1300 ఉంటే బ్లాక్‌లో 3500 లకు లభిస్తుండడంతో బాగా నష్టపోవాల్సి వస్తోందని చెబుతున్నారు. 
రైతులకు అందని ఇన్ పుట్ సబ్సిడీ  
అలాగే ఇన్ పుట్ సబ్సిడీ కూడా కౌలు రైతులకు అందడంలేదు. వ్యవసాయం చేయని రైతుకే అందుతోంది. భూమి మీద ఎవరు వ్యవసాయం చేస్తున్నారో వారికే సబ్సిడీ ఇవ్వాలన్న డిమాండ్ ఉన్నా అవేమీ నెరవేరడంలేదు. కౌలు రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం జాతాలు, బహిరంగ సభలు, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో కౌలు రౌతులు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. 

 

15:57 - July 19, 2017
17:28 - July 18, 2017

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోది రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని ప్రధాని హామి ఇచ్చినా ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించడానికి కేంద్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఏచూరి చెప్పారు. రైతుల సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఆయన స్పష్టం చేశారు.

17:27 - July 18, 2017

ఢిల్లీ: పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని, రైతులకు పెన్షన్‌ విధానం అమలు చేయాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రైతులు భారీ ధర్నా చేపట్టారు. అఖిల భారత రైతుపోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు దేశవ్యాప్తంగా అన్నదాతలు తరలివచ్చారు. రైతుల న్యాయమైన డిమాండ్లకు సీపీఎం, సీపీఐ, జేడీయూ, ఆప్‌ సహా ప్రతిపక్షాలన్నీ మద్దతు తెలిపాయి.

13:32 - July 18, 2017

ఢిల్లీ : రాజ్యసభలో దళితులపై దాడుల అంశంపై మాయావతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సహరాన్‌పూర్‌ అల్లర్లను మాయావతి ప్రస్తావించింది. దళితుల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చకు అనుమతించకపోవడంపై నిరసనగా సభనుంచి వాకౌట్‌ చేసి నిరసన తెలిపింది. అంతేకాదు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని హెచ్చరించింది. 

12:43 - July 18, 2017

ఢిల్లీ : విపక్షాలకు ప్రధాని ఇచ్చిన వాగ్దానాలను రాజ్యసభలో అమలు చేయడం లేదని గులాంనబీ ఆజాద్‌ ఆరోపించారు. సమస్య ఏదైనా చర్చకు అనుమితిస్తామని చెప్పి..ఇప్పుడు అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. దళితులపై దాడుల అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

12:09 - July 18, 2017

ఢిల్లీ : వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ విపక్షాల ఆందోళన మధ్య మళ్లీ వాయిదా పడింది. స్పీకర్ ఆమీద్ అన్సారీ సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు. మరింత సమచారం వీడియో చూడండి.

 

Pages

Don't Miss

Subscribe to RSS - nda government