nede vidudala

18:55 - May 19, 2017

చిన్న సినిమాలకు పెద్ద హీరోగా మారి ..తన బ్లాక్ బస్టర్ రన్ ని కంటిన్యూ చేస్తున్న నిఖిల్ కేశవ అనే ఇంటెన్సిఫైడ్ సబ్జెక్ట్ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోస్టర్స్, టీజర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథవిషయానికొస్తే..హీరో ఫ్యామిలీ మొత్తాన్ని ఒక యాక్సిడెంట్ ద్వారా నాశనం చేసిన పోలీసుల మీద పగతీర్చుకోవడం అనే సింగిల్ ఎలిమెంట్. వినడానికి ఇంత సింపుల్ గా ఉన్న ఈ కథని తన స్క్రీన్ ప్లేతో కొత్తగా మార్చి .. ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చెయ్యాలని చూశాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. కథనం గురించి క్లుప్తంగా చెప్పాలంటే..కేశవ అనే లా స్టూడెంట్ చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్ లో తన తల్లితండ్రులనుకోల్పోతాడు. ఆ యాక్సిడెంట్ కి కారణమైన పోలీస్ ఆఫీసర్స్ ని చంపుతూ.. ఒక్క క్లూ కూడా వదలకుండా..పోలీస్ డిపార్ట్ మెంట్ కి తలనొప్పిగా మారతాడు. అతని కేస్ ని ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ అయిన ఈషాకొప్పికర్ తన తెలివితేటలతో.. ఆ హత్యలు చేసింది కేశవ అని కనుక్కొని అతన్ని అరెస్ట్ చేస్తుంది. ఇంటర్వెల్ లోనే హంతుకుడు అని తెలిసిన కేశవని స్పెషల్ ఆఫీసర్ ఈషా ఎలా డీల్ చేసింది..? అరెస్టయిన కేశవ ఎలా విడుదల అయ్యాడు..? తన పగను తీర్చుకున్నాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల విషయానొకస్తే.. తన పర్ ఫార్మెన్స్ తో సినిమాను నిలబెట్టే సత్తా ఉన్న నిఖిల్ ఈ సినిమాకు కూడా బ్యాక్ బోన్ లా నిలిచాడు. ఓపెనింగ్ టూ ఎండింగ్ ఇంటెన్సిటీ నిండిన చూపులతో , మెచ్యూర్డ్ యాక్టింగ్ తో అద్బుతమైన హావభావాలను పలికిస్తూ.. కేశవ క్యారెక్టర్ ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఓపక్క తన పగ తీర్చుకుంటూ.. మరోపక్క రైట్ సైడ్ హార్టెడ్ పర్సన్ గా తన స్ట్రగుల్ చూపిస్తూ.. రెండు షేడ్స్ ని బాగా పోషించి మెప్పించాడు. పెళ్లిచూపులు సినిమాతో మంచి పర్ఫార్మర్ గా పేరుతెచ్చుకున్న రీతూవర్మకి ఈ సినిమాలో లిమిటెడ్ క్యారెక్టర్ దక్కినప్పటికీ ..దానిక పూర్తి న్యాయం చేసింది. ఇక ప్రియదర్శి, వెన్నెలకిషోర్, సత్య, కామెడీతో నవ్వించారు. ఇక ఒకప్పుడు తన బ్యూటీతో ఆడియన్స్ ని తెగ మెప్పించిన ఈషా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మెప్పించడానికి ట్రై చేసింది. అయితే పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. ఇక రావురమేష్ , అజయ్, బ్రహ్మాజీ, రవిప్రకాష్ , జీవా తదితరులు అందరూ తమ పాత్ర పరిధిమేరకు 100పర్సెంట్ నటించారు.

ఇక టెక్నీషియన్స్ విషయానొకస్తే.. స్వామిరారాతో సెన్సేషనల్ హిట్ , దోచెయ్ తో డిజాస్టర్ అందుకున్న డైరెక్టర్ సుధీర్ వర్మ మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, కసిగా, పకడ్బందీగా కేశవ స్క్రిప్ట్ ను తయారుచేసుకున్నాడు. ఈ ధ్రిల్లర్ మూవీని అవసరమైన మేరకు కామెడీతో టచప్ చేస్తూనే .. బాగానే డీల్ చేశాడు. అయితే ఫస్టాఫ్ వరకూ చాలా పక్కాగా , గ్రిప్పింగ్ గా నడిచిన సినిమా.. సెకండాఫ్ లో గాడి తప్పింది. సింగిల్ పాయింట్ తో స్టోరీ అల్లుకోవడం వల్ల, ఇంటర్వెల్ తోనే కథ క్లైమాక్స్ కి చేరుకోవడంతో, ఛాలెంజింగ్ గా మారిన సెకండాఫ్ ని కాస్త తడబడుతూ నడిపించాడు. తాను అనుకున్నంత స్తాయిలో సినిమా అవుట్ పుట్ లేకపోయినా.. చాలావరకూ మేనేజ్ చేశాడు. కెమెరామెన్ దివాకర్ మణి.. ఈ సినిమా డైరెక్టర్ కి చాలా సపోర్ట్ గా నిలిచాడు, కామెడీని, థ్రిల్లర్ మూడ్ ని అతను బ్లెండ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమాలో చాలాచోట్ల అతని పనితనం కనిపిస్తుంది. ఇక సుధీర్ వర్మ కి పర్మెనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన సన్నీ.m.r పాటలకు స్కోప్ తక్కువగా ఉండడంతో.. ఉన్నంతలోనే తన మార్క్ ఎలివేట్ అయ్యేలా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ పిళ్లై సినిమాకి హార్ట్ లాంటి నేపధ్య సంగీతంతో చాలా ప్రయోగాలు చేశాడు. అవన్నీ బాగా వర్కవుట్ అయ్యి సినిమా మూడ్ ని కాపాడాయి. ప్రొడ్యూసర్ అభిషేక్ నామా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాకు అవసరమైన మేర ఖర్చు చేశారు. కష్ణచైతన్య, అర్జున్ కార్తీక్ ఇద్దరూ కలిసి సుధీర్ వర్మ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్ గా సింక్ అయ్యేలా తక్కువ మాటలతో ఎక్కువ భావాలు కన్వే అయ్యేలా చేశారు. మిగతా డిపార్ట్ మెంట్స్ అన్నీ.. డైరెక్టర్ విజన్ ను ఎలివేట్ చేస్తూ.. హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పుట్ ఇచ్చాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే.. ఈ సినిమాకు ఫుల్ ఫామ్ లో ఉన్న నిఖిల్ తో పాటు.. గంటా 59 నిమిషాల షార్ట్ రన్ టైమ్ బాగా హెల్ప్ అయ్యింది. బి, సి సెంటర్స్ లో కాస్త్ అటూ, ఇటూ గా రిసీవింగ్ ఉన్నా,, మల్టీప్లెక్స్ లో మాత్రం బాగా ఫేర్ చేస్తుంది అనడంలో మాత్రం నోడౌట్. థ్రిల్లర్ ఎలిమెంట్స్, కామెడీ పంచెస్, కరెక్ట్ గా కనెక్ట్ అయితే.. సినిమా రేంజ్ మరో విధంగా ఉంటుంది.

 

ప్లస్

నిఖిల్ పర్ఫార్మెన్స్

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే

సినిమాటోగ్రఫీ

కామెడీ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

 

మైనస్..

స్పాన్ లేని కథ

సెకండాఫ్ లో గాడి తప్పిన కథనం

రాంగ్ కాస్టింగ్

తేలిపోయిన క్లైమాక్స్

 

రేటింగ్ కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

18:51 - March 24, 2017

హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా తనకున్న క్రేజ్ తో, తన స్టార్ డమ్ కు ఉన్న పవర్ తో కాసుల వర్షం కురిపించే స్టార్ హీరో పవన్ కల్యాణ్. గత సినిమా సర్ధార్ గబ్బర్ సింగ్ కొని నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు, నిర్మాతలకు లాభాలు అందించడానికి, అభిమానులను అలరించడానికి కాటమ రాయుడుగా పంచె కట్టి కత్తి పట్టి థియేటర్స్ లోకి వచ్చాడు. టీజర్ ట్ర్రైలర్స్ తో తన ప్రభంజనాన్ని చూపించిన పవర్ స్టార్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్స్ అందుకున్నాడో చూద్దాం..

కథ విషయానికి వస్తే నలుగురు అనాధలను చేరదీసి, తన తమ్ముళ్ళుగా చాలా ప్రేమగా చూసుకుంటాడు కాటమరాయుడు. కాని చిన్న తనంలో జరిగిన ఓ సంఘటన వలన లవ్ అన్నా, అమ్మాయి అన్నా అస్సలు పడదు కాటమరాయుడికి. అయితే అతని తమ్ముళ్లు మాత్రం లవ్ లో పడతారు. అన్నయ్యను ఎదురించి పెళ్లి చేసుకోకూడదు అని ముందుగా కాటమరాయుడిని లవ్ ట్రాక్ లోకి లాగడానికి ట్రై చేస్తారు అతని తమ్ముళ్లు. అందుకోసం అవంతికా అనే క్లాసికల్ డాన్సర్ ను ఎంచుకుంటారు. అన్యాయాన్నిచూసి సహించలేని కాటమరాయుడికి వైలెన్స్ అంటే ఆమడ దూరంలో ఉండు అవంతికాకు ప్రేమ పుట్టిందా.... ఆ ప్రేమ సక్సెస్ కావడానికి వీళ్శిద్దరిలో ఎవరు తమ స్వభావాన్ని మార్చుకున్నారు. వైలెన్స్ తో సాగిపోయిన గతం అతనికి, అతని ప్రేమకి ఎలాంటి ప్రోబ్లమ్స్ ను క్రియేట్ చేసింది. వాటిని కాటమ రాయుడు ఎలా ఎదుర్కుని హిరోగా ఎలా నిలబడ్డాడు అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే...

నటీ నటుల విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని తన బుజాలపై వేసుకుని అభిమానులు కోరుకునే అంశాలతో పాటు ఆడియన్స్ ఎక్స్ పర్డ్ చేసే ఎలిమెంట్స్ మిక్స్ చేసి, అన్ని వేరియేషన్స్ ను నీట్ గా ప్రజంట్ చేశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్ పవన్ కల్యాణే... గబ్బర్ సింగ్ లో ఆడియన్స్ నుఅలరించిన శృతి హాసన్ ఈ సినిమాలో మాత్రం నటన పరంగా, ఎపీరియన్స్ పరంగా కూడా అంత ఇంప్రెసీవ్ గా అనిపించలేదు. గ్లామర్ పరంగా మాత్రం కొంచెం ఓవర్ డోస్ ఇచ్చింది. అలాగే ఎప్పుడూ ఫిట్ గా ఉండే శృతీ హాసన్ సినిమాలో బొద్దుగా షేప్ అవుట్ గా కనిపించింది. ఇక పవన్ తమ్ముళ్ళుగా నటించిన అజయ్, శివబాలాజి, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తమ క్యారక్టర్స్ పరిది మేరకు న్యాయం చేశారు. ఆలీ పంచెస్ వర్కౌట్ అయ్యాయి. పృధ్వీ క్యారక్టర్ రొటీన్ గా ఉన్నా ఓకే అనిపిస్తుంది. ఇక నాజర్, అతని కుటుంబం అంతా గ్రాండ్ ఇయర్ కోసం పెట్టిన సెటప్ లా కనిపిస్తుంది. రావు రమేష్ క్యారక్టర్, ఆ క్యారక్టర్ లో అతని నటన కొత్తాడా ఉంది. విలన్స్ ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా... తమ క్యారక్టర్లలో తేలిపోయారు...

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే అందరికంటే ఎక్కువ మార్కులు వేయించుకుంది సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళ. సినిమా కంటెంట్ ను డ్రైవ్ చేసుకుని పవన్ ప్రజెంటేషన్ పై ప్రత్యేక శ్రధ్ద పెట్టాడు. బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ సినిమాకు రిచ్ నెస్ తీసుకు వచ్చింది. రామ్ లక్ష్మన్ ఫైట్స్ పవన్ ఫాన్స్ తో పాటు, మాస్ ఆడియన్స్ అందరిని విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తాయి.... అనూప్ రుబెన్స్ సంగీతం అప్ టూ ద మార్క్ లేదు అనేది అందరూ ఒప్పుకుకే నిజం... పాటలు అంతత మాత్రంగానే ఉన్నాయి... ఆర్ ఆర్ పర్వాలేదు అనిపించినా కంటెంట్ ను పూర్తిగా ఎలివేట్ చేయలేకపోయింది. డాన్స్ లుఅన్నీ పవన్ కల్యాణ్ స్టెప్ లతో.. శృతీ హాసన్ గ్లమరస్ లుక్ తో అలా అలా సాగిపోయారు.. పవన్ తో ఇంతకు ముందు గోపాల గోపాల తీసిన డైరక్టర్ డాలి, ఈ సారి కూడాపవన్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ అన్ని విషయాలలో పుల్ ప్లజ్డ్ గా నడిపించిన డాలి. సెకండ్ ఆఫ్ విషయంలో తడబడ్డాడు అని చెప్పాలి. యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఎమోషన్స్ పై ఇంకొంచె కేర్ తీసుకుని ఉంటే సినిమాకు చాలా ప్లస్ అయ్యేది. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ చాలా బావున్నాయి...

ఓవర్ ఆల్ గా సమ్మర్ సీజన్ ను స్టార్ట్ చేసి కాటమ రాయుడు, టాక్ పరంగా కొంచెం అటూ ఇటూ ఉన్నా కలెక్షన్స్ పరంగా దుమ్ము దులపడం కాయం.. ఎందుకంటే ఫాన్స్ పండుగ చేసుకునే అంశాలతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యేలా, అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా సెట్ అయ్యాయి...

ప్లస్ పాయింట్స్

పవన్ స్క్రీన్ ప్రజెంట్స్

కామెడీ

ఫైట్స్

ప్రొడక్షన్ వ్యాల్యూస్


 

మైనస్ పాయింట్స్

బలం లేని ఎమోషన్స్

సాంగ్స్

సెకండ్ ఆఫ్ స్క్రీన్ ఫ్లే

రేటింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:57 - February 10, 2017

అన్నమయ్య శ్రీ రామదాసు లాంటి చరిత్రలో నిలిచిపోయే భక్తిరస చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాఘవేంద్రరావు చివరి సినిమా అంటూ ఓం నమో వెంకటేశాయను తెరకిఎక్కించారు. నాగార్జున రాఘవేంద్రరావు ల సక్సస్ఫుల్ కాంబినేషన్ లో మహేష్ రెడ్డి నిర్మించిన ఓం నమో వెంకటేశాయ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది .

కధ విషయానికి వస్తే శ్రీవారి పరమ భక్తుడు హాథీరాం బావాజీ జీవిత చరిత్రను తెరకెక్కించారు అయితే అయన చరిత్రకు సంబంధించిన నిజానిజాలు ఆధారాలు తక్కువగా ఉండటం తో ఎక్కువ భాగం కల్పితం గా మలచాల్సి వచ్చింది .హాథిరామ్ బావాజీ చిన్న తనం నుండి దేవుడిని చూడాలని గురువు దగ్గర విద్యను అభ్యసించి కఠోర తపస్సు చేస్తాడు అయితే ఆ తపస్సుకి మెచ్చి వచ్చిన వెంకటేశ్వర స్వామి ని గుర్తించలేక వెళ్లిపొమ్మంటాడు ..తరువాత జరిగిన తప్పు తెలుసు కొని తిరుమలకు తిరిగి వెళతాడు .కానీ అతని అవతారం ఆహార్యం చూసి పిచ్చోడిగా అందరూ భ్రమపడతారు కానీ కృష్ణమ్మా మాత్రం అతనిలోని భక్తుడిని గుర్తించి ఆశ్రయం కలిపిస్తుంది .ఆ తరువాత హాథిరామ్ బావాజీ తిరుమలలో ఎం చేసాడు .శ్రీవారికి ఎందుకంత ప్రియభక్తిడిగా మారాడు, శ్రీ వారితో పాచికలాట వెనక పరమార్ధం ఏంటి ? చివరికి ఏమయ్యాడు అనే మూల కధని ఆసక్తికరంగా తనదైన శైలిలో చెప్పాడు డైరెక్టర్ రాఘవేంద్రరావు.

టీనటుల విషయానికి వస్తే ఈ సినిమా కర్త కర్మ క్రియ నాగార్జున అనే చెప్పాలి.మొద్దని ఫ్రేమ్ నుండి క్లైమాక్స్ వరకు ఎక్కడ నాగార్జునని చూస్తున్నామని ఫీలింగ్ కలగాకుండా హాథిరాంబావాజీ నే చూస్తున్నామని అనిపించేలా పాత్రలో ఒదిగిపోయాడు .ఆహార్యం ,డైలాగ్ డెలివరీ ఇలా ప్రతివిషయం లో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు .ఇక అనుష్క విషయానికి వస్తే పూర్తిగా కల్పిత పాత్ర కావడం తో చాలా షేడ్స్ చూపించడానికి ట్రై చేసారు .అనుష్క కూడా పాత్రకు పూర్తి న్యాయం చేసింది .ఆమె నటనలో కానీ ఎక్స్ప్రెషన్స్ లో కానీ ఎక్కడ వంక పెట్టడానికి లేదు కాకపోతే ఆమె శరీరం లోని భారీతనం ఆమెకు కూడా భారంగా నే తయారైంది . ప్రజ్ఞ జైస్వాల్ జగపతిబాబులు పాత్ర పరిధిమేరకు బాగానే చేసారు .ఇక శ్రీవారిగా నటించిన సౌరబ్ జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి .అతను పలికించిన హావభావాలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దిగివచ్చాడా అన్నట్టు అనిపించాడు.శ్రీదేవి భూదేవి గా నటించిన విమల రామన్, అస్మిత పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు .రావు రమేష్ తన మేనరిజానికి పూర్తి విరుద్ధంగా విభిన్నమైన పాత్రను పోషించారు .మిగతా సీనియర్ నాటినటులంతా ఆకట్టుకున్నారు .

టెక్నిషన్స్ విషయానికి వస్తే సినిమా కి ప్రాణం గా నిలిచాడు సంగీత దర్శకుడు కీరవాణి .పాటలపరంగా కొంత మేరకే ఆకట్టుకున్న కీరవాణి ఆర్ ఆర్ పరంగా 100 శాతం న్యాయం చేసాడు ముక్యంగా క్లైమాక్స్ సీన్స్ అయితే అతని ఆర్ ఆర్ వలన ప్రతి ప్రేక్షకుడి కంట్లో నీళ్లు తిరుగుతాయి. కెమెరామన్ ఎస్ గోపాల్ రెడ్డి కష్టం నిజాయితీ ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది. కష్టమైన లొకేషన్స్ లో కూడా చాల వైవిధ్యమైన ఫ్రేమింగ్ తో అలరించాడు ముఖ్యంగా విశ్వరూప దర్శనం వంటి ఫ్రేమ్ లలో గోపాల్ రెడ్డి ప్రతిభ ఎంత గొప్పదో అర్ధం అవుతుంది. అలానే ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ చాల రియలిస్టిక్ సెట్టింగ్స్ తో నాలుగు వందల సంవత్సరాల క్రితం తిరుమల ఎలా ఉండేదో అలానే చూపించారు. దానివల్ల సినిమాకి మంచి ఫీల్ వచ్చింది. ఇక ఇరవై నాలుగు విభాగాలను అనుసంధానం చేస్తూ తన మొత్తం ఎక్సపీరియన్సు ను అంత వాడి టెక్నికల్ గా కూడ అప్డేట్ అయ్యి రాఘవేంద్రరావు గారు తెరకు ఎక్కించిన ఈ సినిమా అయన గత చిత్రాలతో పోలిస్తే ఒక అద్భుత దృశ్య కావ్యం గా నిలిచిపోయింది

ఓవర్ అల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఫీల్ పరంగా అన్నమయ్యను కూడా దాటేసింది అనే ఒప్పుకోవాలి అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు అతిశయోక్తి అనిపించే సన్నివేశాలు ఉన్న కూడా ఓవర్ అల్ గా మాత్రం ప్రతి ప్రేక్షకుడికి భక్తి రసాత్మక అనుభూతిని ఇస్తుంది ఓం నమో వెంకటేశాయ ..

 

ప్లస్ పాయింట్స్

నాగార్జున

డైరెక్షన్

కెమెరా పనితనం

బ్యాగ్రౌండ్ మ్యూజిక్

నిర్మాణ విలువలు

 

మైనస్ పాయింట్స్

కొన్ని కల్పిత దృశ్యాలు

ఎలివేట్ కాని కామెడీ ట్రాక్

 

రేటింగ్ 3/5

16:41 - December 9, 2016

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' లేటెస్ట్ మూవీ 'ధృవ'. తమిళ్ సినిమా 'తనీ ఒరువన్' రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సురేంద్రరెడ్డి దర్శకుడు. మరి 'రామ్ చరణ్' 'ధృవ'గా ఎలా మెప్పించాడు? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వబోతోంది.. తెలియాలంటే .. చదవాల్సిందే..

బ్రూస్లీ డిజాస్టర్..
'బ్రూస్లీ' డిజాస్టర్ తో 'రామ్ చరణ్' పూర్తిగా డిఫెన్స్ లో పడ్డాడు. అందుకే మినిమమ్ హిట్టు కొట్టే సత్తా కలిగిన 'తనీ ఒరువన్' కథను ఏరికోరి మరీ ఎన్నుకున్నాడు. గతంలో ఎన్నడూ రాని ఒక యూనిక్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా స్ర్కీన్ ప్లే బేస్డ్ గా సాగే ఇలాంటి కథలు జనాన్ని బాగా కూర్చోబెడతాయి. 'ధృవ' ఆ విషయంలో బాగానే తన సత్తా చూపించింది. తమిళ్ కథను ఏ మాత్రం మార్చినా మెయిన్ సోల్ దెబ్బతింటుంది. అందుకే తమిళ్ సినిమాను యాజిటీజ్ షాట్ టు షాట్ దించేసారు. అయితే తమిళ్ లో 'జయం రవి' మామూలు హీరో కాబట్టి అందులో ఎమోషన్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక్కడ హీరో 'రామ్ చరణ్' కాబట్టి, జనాన్ని అంతగా ఎమోషన్స్ తో కదలించలేదనిపిస్తుంది. మొత్తం మీద 'రామ్ చరణ్' తన స్టైలిష్ యాక్షన్ తోనూ, సురేంద్రరెడ్డి స్టైలిష్ టేకింగ్ తోనూ, రత్నవేలు అద్బుతమైన ఛాయాగ్రహణంతోనూ సినిమాను నిలబెట్టేసారు.

కథ...
'ధృవ'కి చిన్నతనం నుంచి పోలీస్ అవ్వాలని యాంబినేషన్. ఆ యాంబిషన్ తోనే తన కోలీగ్స్ తో కాకుండా తనే ఒంటరిగా ఒక కేసును ఇన్వెస్ట్ గేట్ చేస్తాడు. ఎన్నో లింకుల్ని ఛేదించుకొని అసలైన నేరస్థున్ని గుర్తిస్తాడు. ఇక అతడ్ని అరెస్ట్ చేయడమే తరువాయి అనుకుంటూండగా.. అనుకోని విధంగా హీరో ఫ్రెండ్ చనిపోతాడు. అప్పుడే హీరోకి కూడా అనుకోని ఎదరుదెబ్బ తగులుతుంది. చివరికి 'ధృవ' ఆ కేసును ఎలా పరిష్కరించాడు. మైండ్ గేమ్ తో నేరస్థుణ్ణి ఎలా పట్టుకున్నాడన్నదే మిగతా కథ. విలన్, హీరో ఎత్తుకు పై ఎత్తులు తో సాగే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని కదలనీయకుండా కూర్చోబెడుతుంది. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే వల్ల సినిమాలో ఆడియన్స్ తమకు తెలియకుండానే లీనమైపోతారు.

పాత్రల తీరు తెన్నులు..
'ధృవ' పాత్రకు అతను బాగా సూటయ్యాడు. మామూలుగా 'చరణ్' సీరియస్ సన్నివేశాల్లో బాగా చేస్తాడు. 'ధృవ' కథ.. పాత్ర కూడా ఆ తరహావే కావడంతో ఎక్కడా పెద్దగా ఇబ్బంది పడలేదు. పాత్రకు తగ్గట్టుగా నటించాడు. ఎప్పట్లాగే యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఇక 'అరవింద్ స్వామి' గురించి చెప్పేదేముంది. సినిమా చూశాక అతను వెంటాడుతాడు. చాలా కాలం గుర్తుంటాడు. అతడి లుక్.. బాడీ లాంగ్వేజ్.. కాస్ట్యూమ్స్.. నటన.. అన్నీ చాలా రిఫ్రెషింగ్ గా.. ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇషికా పాత్రలో 'రకుల్ ప్రీత్' కూడా బాగా చేసింది. చలాకీ నటనతో ఆకట్టుకుంది. ఓ పాటలో ఆమె గ్లామర్ విందు చేసింది. ఐతే ఐపీఎస్ ట్రైనీగా ఆమె ప్రవర్తించే తీరు కొంచెం చిత్రంగా ఉంటుంది. ఇక్కడ పాత్ర ఔచిత్యం దెబ్బతింది. గౌతమ్ పాత్రలో 'నవదీప్' ఆకట్టుకున్నాడు. 'పోసాని' పాత్ర బాగుంది. అక్కడక్కడా ఆ పాత్ర నవ్విస్తుంది. ఐతే చివర్లో ఆ పాత్రను మరీ వెర్రి వెంగళప్పను చేసేశారు. 'నాజర్’.. 'షాయాజి షిండే'. వీళ్లంతా ఓకే. టోటల్ గా 'ధృవ' జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. 'తనీ ఒరువన్' సినిమా చూడని వాళ్లకైతే ఈ సినిమా గొప్పగా అనిపిస్తుంది. ముఖ్యంగా బి, సి జనం ఈ సినిమాతో బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, స్ర్కీన్ ప్లే
రామ్ చరణ్ నటన
అరవింద స్వామి పెర్ఫార్మెన్స్
క్లైమాక్స్
ఛాయా గ్రహణం
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :
ఎమోషన్ తక్కువగా ఉండడం
సంగీతం

రేటింగ్ : 2.5 / 5..

18:40 - November 11, 2016

'ప్రేమమ్' తో బ్లాక్ బస్టర్ హిట్టు ఖాతాలో వేసుకున్న 'అక్కినేని నాగచైతన్య' లేటెస్ట్ గా మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో'తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడిచేస్తోంది. 'ఏ మాయ చేశావె' లాంటి క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్, నాగచైతన్యతో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నాడు. 'ప్రేమమ్' విజయం తర్వాత 'నాగచైతన్య' నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకుల అభిప్రాయాలు..సినిమా రివ్యూ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:44 - November 4, 2016

హాయ్ హలో వెల్కం టు సెన్సేషనల్ ఫిలిం రివ్యూ షో నేడే విడుదల....ఈ రోజు నేడే విడుదలలో మనం మాట్లాడుకుబోయేది సుమంత్ హీరోగా వస్తున్న నరుడా..డోనరుడా.. అండ్.. ఆర్.పి పట్నాయక్ హీరోగా మనలో ఒకడు సినిమాల గురించి. లేట్ గా వస్తున్నా..లేటెస్ట్ గా డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు సుమంత్. చాలా గ్యాప్ తర్వాత హిందీ రీమేక్ మూవీ..నరుడా..డోనరుడా సినిమాతో ఆడియన్స్ ని పలకరించనున్నాడు.. ఈ సినిమా పర్ ఫెక్ట్ రివ్యూ షోలో 10 టివి ఇచ్చిన రేటింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

23:19 - October 28, 2016

తమిళ స్టార్ హీరో కార్తీక్ కథనాయకుడిగా నయనతార, శ్రీదివ్య, వివేక్ ప్రధాన పాత్రదారులుగా గోకుల్ దర్శకత్వంలో పీవీపీ, ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన హారర్ కామెడీ చిత్రం కాష్మోరా. తమిళంతోపాటు తెలుగులోనూ కార్తీక్ కు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని రెండు భాషల్లో ఈ సినిమా రెండు వేలకు పైగా థియేటర్లలో రీలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా వుందో తెలుసుకోవాలంటే.. రివ్యూలోకి వెళ్లాల్సిందే... సినిమా రేటింగ్.. వంటి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:41 - October 22, 2016

నటి..గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన మహిళా దర్శకురాలు..సూపర్ స్టార్ కృష్ణ భార్య అయిన విజయ నిర్మలకు మనువడు, సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా 'నందిని నర్సింగ్ హోం' శుక్రవారం రిలీజైంది. పి.వి.గిరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పూర్తి రొమాంటిక్ కామెడీగా సాగింది. కథలోకి వెళ్తే.. మధ్యతరగతి కుర్రాడైన చంద్రశేఖర్ అలియాస్ చందు (నవీన్ విజయ కృష్ణ) వైజాగ్ లోని ఓ బ్యాంకులో రికవరీ మన్ గా పని చేస్తుంటాడు. ఆ బ్యాంకు పక్కనే గర్ల్స్ హాస్టల్.. ఇంకేం.. ఆ హాస్టల్ నుంచి వచ్చే స్వీట్ వాయిస్ కి ఐసై పోతుంటాడు. ఆ హాస్టల్ లోని అమూల్య (శ్రావ్య) అనే అమ్మాయిదే ఆ గొంతు అని తెలుసుకుంటాడు. పరిచయాలు ఏర్పడతాయి. అయితే ఇద్దరి దృక్పథాలు వేరు. డబ్బే ముఖ్యం అన్నది అమూల్య ఫిలాసఫీ అయితే డబ్బు కన్నా బంధాలు, బాంధవ్యాలు గొప్పవి అని చందు నమ్ముతుంటాడు.ఈ నేపథ్యంలో సాగిన నందిని నర్శింగ్ హోం సినిమా కు టెన్ టీవీ ఇచ్చిన రేటింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడయో చూడండి..

19:46 - October 21, 2016

నందమూరి కళ్యాణ్ రామ్ , పూరీ తొలి కలయిక లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఇజం. పటాస్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకొచ్చిన కళ్యాణ్ రామ్ , పూరీతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. పూరీ తనదైన స్టైల్లో కళ్యాణ్ రామ్ ను సరికొత్త మేకోవర్ తో చూపిస్తూ రూపొందించిన ఈ సినిమా జనం అంచనాల్ని అందుకుందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం...

పటాస్ తో కళ్యాణ్ రామ్ హిట్టుకొట్టగానే స్టార్ స్టాటస్ వచ్చేసినట్టే ఫీలయ్యారు అభిమానులు. అయితే పూరీ లాంటి డైరెక్టర్ నుంచి హిట్టు పడితేనే స్టార్ డమ్ వచ్చినట్టు అని ఫీలయ్యాడో ఏంటోగానీ , తన సొంత బ్యానర్ లోనే పూరీ డైరెక్షన్ లో ఇజం అనే సినిమా ను యన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద సొంతంగా తీసుకున్నాడు కళ్యాణ్ రామ్ . అయితే కళ్యాణ్ రామ్ పాత సినిమాలతో పోల్చితే ఈ సినిమా రేంజ్ ఎక్కువ, పూరీ పాత సినిమాలతో పోల్చితే ఈ సినిమా రేంజ్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కథేమీ లేదు, కథనంతో సినిమా ను నెట్టుకురావాలనే ఉద్దేశంతో కొన్ని మంచి సీన్సే రాసుకున్నాడు. కాకపోతే పూరీ ఇదివరకు తీసిన సినిమాల తాలూకు వాసనలు కనిపిస్తాయి. ముఖ్యంగా పోకిరి, కెమెరా మేన్ గంగతో రాంబాబు సినిమాల ఛాయలు కొంత వరుకూ కనిపిస్తాయి. మొత్తానికైతే పూరీ కొత్త గా తీసిన ఈ సినిమా యాజిటీజ్ గా ఆయన పాత సినిమాలాగానే అనిపించడమే విచిత్రం.

సత్యనారాయణ మార్తాండ్ అనే జర్నలిస్ట్ కొందరి అక్రమాల్ని బైటపెడతాడు. ఆ ప్రయత్నంలో ఆయన రెండు కాళ్ళూ పోగొట్టుకుంటాడు. దాన్ని కళ్లారా చూసిన ఆయన కొడుకు కక్షతో హిడెన్ జర్నలిస్ట్ అవుతాడు. ఎవరి కంటా పడకుండా అతి పెద్ద నెట్ వర్క్ తో గ్రాండ్ లీక్స్ పేరుతో పెద్ద పెద్ద వాళ్ల అవినీతుల్ని బైట పెడుతూ ఉంటాడు. అందులో ఇంటర్నేషనల్ మాఫియా డాన్ జావేద్ ఇబ్రహీం ఒకడు. బ్యాంక్ ఆఫ్ పేరడైజ్ లో డిపాజిట్ చేసుకున్న పెద్ద పెద్ద వాళ్ల అకౌంట్లను హ్యాక్ చేసి వాళ్ల వేల కోట్లను ఇండియాలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి పేదవాడి అకౌంట్ లోకి హీరో ట్రాన్స్ ఫర్ చేయడమే మిగతా కథ. అయితే సాధారణమైన హీరో , ఏకంగా ఇంటర్నేషనల్ డాన్ కూతుర్ని లైన్ లో పెట్టడం తేలికగా పడగొట్టేయడం లాంటి సీన్స్ కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. అంతేకాదు హై టెక్ సెక్యూరిటీ ఉన్నవిలన్ ఇంట్లోకి హీరో దూరడం కూడా లాజిక్ లెస్ అనిపిస్తుంది. ఇలాంటి కొన్ని సీన్స్ తప్ప ఫస్టాఫ్ అంతా తాపీగా నడిచిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆసక్తిగానే ఉంటుంది.

ఇక లవ్ ట్రాక్ రొటీన్ గానే అనిపిస్తుంది. జగపతి బాబు ఎంట్రీ కూడా పెద్ద గా ఎఫెక్ట్ ఇవ్వదు. ఆయన్ను ఫవర్ ఫుల్ గా చూపించడంలోనూ పూరీ విఫలమయ్యాడు. క్లైమాక్స్ ను మరీ సిల్లీగా , ఇల్లాజికల్ గా తీసాడు పూరీ. కానీ డైలాగ్స్ కొన్ని జనంచేత కేకపెట్టిస్తాయి.

ఇజం సినిమాకి అతి పెద్ద ప్లాస్ పాయింట్ కళ్యాణ్ రామ్ మేకోవర్. అతడి డిక్షన్ , బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని పూరీ భలేగా మార్చేసాడు. మంచి ఈజ్ తో కూడా పెర్ఫార్మ్ చేసి , తరువాత సినిమాలకి చక్కటి బాట వేసుకున్నాడు కళ్యాణ్ రామ్ . ఇక హీరోయిన్ గా నటించిన అదితి ఆర్య పర్వాలేదనిపిస్తుంది. విలన్ జగపతి బాబు పాత్ర ను పవర్ ఫుల్ గా రాసుకున్నాడు కానీ, చూపించడంలో పూరీ కొంచెం గాడి తప్పినట్టు అనిపిస్తుంది. ఇందులో జగపతి బాబు కొత్తగా చేసిందేమీ ఉండదు. ఇక మినిస్టర్ గా నటించిన పోసాని, హీరో తండ్రిగా నటించిన తనికెళ్లభరణి పాత్రలు మామూలుగానే అనిపిస్తాయి. టోటల్ గా ఈ సినిమాకి ఇంటర్వెల్ ఎపిసోడ్ , ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కళ్యాణ్ రామ్ కోర్ట్ సీన్ జనాన్ని బాగా కుర్చీలో కూర్చోబెడుతుంది. లైవ్ లో పెద్ద వాళ్ల అకౌంట్లలోని డబ్బుల్ని పేదవాళ్ల అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసే సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిపోతుంది. మరి ఈ సీన్ వల్లగానీ, కళ్యాణ్ రామ్ నటన వల్లగానీ జనం ఈ సినిమాని పూర్తిగా కాకపోయినా కొంతైనా ఆదరిస్తారేమో మరి చూడాలి. ఇజం సినిమా.రేటింగ్ కోసం ఈ వీడియో చూడండి..

19:10 - October 7, 2016

హీరో అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్లో చేసిన తాజా చిత్రం ‘ప్రేమమ్’. ఇటివల విడుదలైన పాటలు, ట్రైలర్లు జనాలకు బాగా కనెక్టవడంతో ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ప్రేమమ్’ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అసలు ప్రేమమ్ కధేమిటి సినిమా ఏలా ఉందో తెలుసుకొవాలంటే రివ్యూ లోకి వెళ్ళాలిసిందే.

ప్రతి మనిషి జీవితంలో లవ్ అనేది కామన్. కాని ఓకే మనిషి జీవితంలో 3సార్లు ప్రేమ పుడితే ఏమవుతుందనేదే ప్రేమమ్.ఈ సినిమాకి ట్యాగ్ లైన్ అయిన 'లవ్ స్టోరిస్ ఎండ్ బట్ ఫీలింగ్స్ నాట్ ' అనేదే ఈ సినిమా. కధగా చెప్పినప్పుడు కొత్త పాయింట్ అనిపించకపొయినా దాన్ని డిల్ చెసిన విధానంలో, వర్క్ అవుట్ చెసిన ఫీల్ తో గొప్ప సినిమాగా మారింది మలయాళ ప్రేమమ్. అదే సినిమాని కాస్త నిడివి తగ్గించి యాజ్ టీజ్ గా నిజాయితిగా తెలుగులో రిమేక్ చేశారు.
కధ విషయానికొస్తే...విక్రమ్ అనే కుర్రాడు టినేజ్ లో సుమ తో లవ్ లో పడతాడు.కాని అనుకొని కారణాల వలన ఫేయిల్ అవుతుంది. తరువాత కాలేజ్ లైఫ్ లో లేక్చరర్ సితార తో లవ్ లో పడతాడు. అదీ కుడా నాట్ ఏ హ్యాపి ఎండింగ్.తరువాత లైఫ్ లో సెటిల్ అయ్యి హ్యాపిగా సాగిపొతుండగా ఓక అనెక్స్ పెక్టేడ్ పర్సన్ ఎదురవుతుంది. అమెతో లవ్ లో పడతాడు. ఇంతకి అమె ఎవరు? ఫైనల్ గా ఆ ప్రేమైనా సక్సెస్ అవుతుందా లేదా? వంటీ ఫీల్ గుడ్ పాయింట్ తో హత్తుకొనేలా సాగిపొయే ప్యూర్ లవ్ స్టొరీ "ప్రేమమ్".

నటి నటుల విషయానికొస్తే...నాగచైతన్య మెచ్యూరిటి లెవల్స్ బాగున్నాయి. ఓరిజనల్ ప్రేమమ్ లో ఉన్న హిరోని అనుసరించాడు. చాలా వరకు సక్సెస్ అయ్యాడు. హిరొయిన్స్ శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొనా సెబాస్టియన్ ముగ్గురు కుడా పాత్రల్లో లాగా కాకుండా పక్కింటి అమ్మాయిలు లాగా కనిపించడంతో ప్రేక్షకులు ఈజిగా కనెక్ట్ అయిపొతారు. శృతి, నాగ చైతన్య పెయిర్ బాగుంది. కంటేంట్ లో జనరేట్ అయిన కామెడి నాచురల్ గా అనిపించింది. మిగతా నటినటులందరూ తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు. అదనపు అకర్షణలుగా నాగార్జున, వెంకటేష్ లు అతిధి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ధ్రిల్ చేశారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే...దర్శకుడు చందు మొండేటి మలయాళ ప్రేమమ్‌ని సొల్ మిస్సవ్వకుండా తెలుగులో మలచి ఘన విజయాన్ని అందుకున్నాడు.ఇక కెమెరామెన్ కార్తిక్ ఘట్టమనేని ప్రేమమ్ ఒరిజినల్ ఫిల్ ని తెలుగులో తిసుకురావడంలో కీ రోల్ పొషించాడు.గొపి సుందర్, రాజేశ్ మురూగేశన్ లు అందించిన సంగీతం సినిమాకి ప్రాణం పొసింది. ప్రొడక్షన్ వాల్యూస్ బ్యానర్ కు తగ్గట్లూ చాలా రిచ్ గా వున్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. అన్ని డిపార్ట్మెంట్లు బాగా పని చేశాయి. ప్రేమమ్ ను అందరు ప్రేమించే విధంగా వుంది. మిల్కీ బ్యూటీ తమ్మన్న 'అభినేత్రి' సునీల్ నటించిన ఈడు గోల్డ్ ఎహే' సినిమా రివ్వ్యూల కోసం ఈ వీడియోను చూడండి....

Pages

Don't Miss

Subscribe to RSS - nede vidudala