New Couple

17:40 - September 22, 2018

జనగామ : తెలంగాణ రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకోవద్దా ? చేసుకున్న వారిని చంపేస్తారా ? దాడులకు..బెదిరింపుకు దిగుతారా ? గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో పరువు హత్యలు తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. నల్గొండ జిల్లాలో ప్రణయ్ హత్య ఘటన మరువకముందే హైదరాబాద్ లో ఓ ప్రేమ జంటపై కూతురి తండ్రే హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలు తీవ్ర సంచలనం రేకేత్తిస్తున్నాయి. దీనితో పలువురు ప్రేమికులు తీవ్ర భయాందోళనకులకు గురవుతున్నారు. 

తాజాగా జనగామ జిల్లలో కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట అడవిలో తల దాచుకొంటోంది. గుండాల మండలం మరిపడిగలో రెండు నెలల క్రితం ప్రశాంత్ - సంధ్యలు ప్రేమ వివాహం చేసుకున్నారు. గ్రామంలోకి వస్తే చంపేస్తామని బెదిరింపులకు దిగడంతో వారు అడవిలో తల దాచుకున్నారు. పోలీసులకు చెప్పినా న్యాయం జరగడం లేదని ప్రేమికులు ఆవేదన తెలియచేస్తున్నారు. వరుస హత్యలు జరుగుతుండడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 

14:57 - April 24, 2018

సిద్ధిపేట : జిల్లాలో విషాదం జరిగింది. జిల్లాలోని కొత్తబస్టాండ్‌లో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు ఇద్దరినీ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రియుడు సంతోష్‌ రెడ్డి మృతి చెందగా, ప్రియురాలు రాణి పరిస్థితి విషమంగా ఉంది. అయితే వీరి కులాలు వేరు అయినందున తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోరని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.  

15:11 - January 11, 2018

నేరాల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనేక కారణాలున్నా ఆర్థిక కారణాలతో నేరాలు జరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ప్రియుడుతో కలిసి భర్తలను చంపిన భార్యల వార్తలు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో చేస్తున్నారా ? లేక ఆవేశంతో చేస్తున్నారా ? అనేది పక్కన పెడితే వీటికి మూల కారణాలు ఏంటీ ? ఇంతటి భయంకరమైన పరిస్థితులకు అసలు కారణాలు ఏంటీ ? వివాహేతర సంబంధాల కేసుల్లో మహిళలను నిందితురాలిగా చేయాలన్న అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలనకు తీసుకోవడం యాదృచ్చకమైనా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భర్తల హత్యలు హల్ చల్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత మూడు నెలల కాలంలో పది హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. నేరం ఎవరు చేసిన మహిళలు చేసిన నేరంపై ఎందుకు పెద్దగా మాట్లాడుకోవాల్సి వస్తోంది ? వారి పిల్లల భవిష్యత్ ఏంటీ ? తదితర అంశాలపై టెన్ టివి ఫోకస్ ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో దేవి (సామాజిక కార్యకర్త) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:35 - January 11, 2018

చిత్తూరు : ప్రేమ హత్యలు..ప్రేమ మరణాలు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే పలు దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం మండలం క్రిష్టాపురంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు ఇంకొకరిని వివాహం చేసుకుందని ఓ ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుప్పంలో నివాసం ఉండే స్నేహాంజలితో తిరుపతి నివాశి దామోదర్ కు పరిచయం అయ్యింది. గత కొన్ని రోజులుగా స్నేహాంజలిపై ప్రేమను పెంచుకున్నాడు. కానీ స్నేహాంజలి కూడా ప్రేమించిందా ? లేదా ? అనేది తెలియరాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట కుప్పంకు చెందిన ఓ వ్యక్తితో స్నేహాంజలికి వివాహం జరిగింది. స్థానికంగా టీచర్ ఉద్యోగం కూడా చేస్తోంది. వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న దామోదర్ జీర్ణించుకోలేకపోయాడు. తిరుపతి నుండి కుప్పంకు వెళ్లిన దామోదర్..స్నేహాంజలి ఇంటి ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటికున్నాడు. స్థానికులు ఇతడిని ఆసుపత్రికి తరలించారు. 75 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బతికే అవకాశం లేదని వైద్యులు పేర్కొంటున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:19 - January 11, 2018

హైదరాబాద్ : ప్రేమోన్మాదానికి మరో యువతి బలైపోయింది. ప్రేమను తిరస్కరించినందుకు.. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో జానకి అనే అమ్మాయిని .. ఓ ప్రేమోన్మాది దారుణంగా హత్య చేశాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గుయ్యనవలస గ్రామానికి చెందిన బోను జానకి కేపీహెచ్‌బీలోని డీమార్ట్‌ సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తోంది. మూసాపేట హబీబ్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో రూప అనే మరో యువతితో కలసి ఉంటోంది. అయితే అదే సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తున్న...అనంతప్ప అలియాస్‌ ఆనంద్‌.. తనను ప్రేమించాలంటూ.. జానకి వెంటపడ్డాడు.. ! అతని ప్రేమను జానకి తిరస్కరించింది. దీంతో రగిలిపోయిన ఆనంద్‌.. ఆమెను తిట్టాడు, కొట్టాడు.

10 రోజుల క్రితం జానకి ఇంటికి వెళ్లి..
10 రోజుల క్రితం జానకి ఇంటికి వెళ్లి.. తనను ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన రూపకు .. అపస్మారస్థితిలో ఉన్న జానకి కనిపించింది. ఆమె కడుపులో కత్తితో పొడిచిన గాయాలు కనిపించాయి. దీంతో రూప.. స్థానికులు, సహోద్యోగుల సహాయంతో .. జానకిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి జానకి మృతిచెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన జానకి.. డబ్బులు దాచుకుని.. పెళ్లిచేసుకుందామనుకుందని.. కానీ ఇంతలో ఇలా జరిగిపోయిందని.. ఆమె బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు ఆనంద్‌ను కూకట్‌ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్‌ రంగారెడ్డి జిల్లా..పెద్దేముల్‌ సమీపంలోని మారెపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

13:23 - January 10, 2018
12:12 - January 10, 2018
11:59 - January 10, 2018

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి మృతి చెందింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన జానకి.. కూకట్‌పల్లిలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. కాగా కొంతకాలంగా ఆనంద్‌ అనే యువకుడు ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ప్రేమకు నిరాకరించిందన్న కారణంతో జానకిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన జానకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

10:52 - January 10, 2018

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి మృతి చెందింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన జానకి.. కూకట్‌పల్లిలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. కాగా కొంతకాలంగా ఆనంద్‌ అనే యువకుడు ప్రేమించాలంటూ యువతిని వేధిస్తున్నాడు. జానికి ప్రేమకు నిరాకరించింది. ప్రేమకు నిరాకరించిందన్న కారణంతో అనంద్ జానకిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన జానకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

18:39 - May 13, 2017

పశ్చిమ గోదావరి : భీమవరం వైసీపీ నియోజకవర్గ కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్‌ కుమారుడు సాగర్‌ దంపతులను వైసీపీ అధినేత జగన్‌ ఆశీర్వదించారు. ఈనెల తొమ్మిదో తేదీన సాగర్‌, సుధల వివాహం జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ పెళ్లికి జగన్‌ హాజరుకాలేకపోయారు. ఈరోజు వారి ఇంటికి వెళ్లి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

Don't Miss

Subscribe to RSS - New Couple