NRI

15:58 - January 11, 2018

హీరో రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుందంట. త్వరలోనే పట్టాలెక్కబోతుందట. శ్రీనువైట్ల మార్క్‌ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అమెరికాలో ఎక్కువ శాతం సాగే ఈ చిత్రంలో రవితేజ ఎన్‌ఆర్‌ఐగా కనిపించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ ఫైనల్‌ దశలో ఉందని, ఫైనలైజ్‌ అయ్యాక సినిమాను మొదలు పెట్టేందుకు చిత్ర బృందం ముమ్మర సన్నాహాల్లో ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుందట. గతంలో రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో 'నీకోసం', 'దుబారు శ్రీను', 'వెంకీ' చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం రవితేజ 'టచ్‌ చేసి చూడు' చిత్రంలో నటిస్తున్నారు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలు. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. 

12:51 - June 9, 2017

17 సంవత్సరాల ఇంద్రాణిదాస్ కు న్యూరో శోదనాలే ఆమె ఆటవిడుపు ఇటివల అమెరికాలో జరిగిన సైన్స్ టాలెంట్ విజేతగా నిలిచి రూ.1.6 కోట్ల బహుమతి గెలుచుకున్నారు....అమెరికాలో ప్రతిష్టత్మకంగా నిర్వహించిన స్పెల్లింగ్ బీ పోటీలో భారతీయ మూలాలున్న విద్యార్థులు మరోసారి తమ సత్తా నిరూపించుకున్నారు, ప్రథమ, ద్వితీయ స్థానాలను వారే గెలుచుకున్నారు......ఐసీస్ ఉగ్రముకల చేతికి చిక్కిన మహిళల దుస్థితి ఊహించకోవడానికి భీతవహాంగా ఉంటుంది....ఉగ్రవాదుల బారిన పడి మూడేళ్ల తర్వాత స్వంత ఇంటికి చేరింది ఓ యువతి.....త్వరలో భారత ఆర్మీలోకి మహిళలు కాలు పెట్టబోతున్నారు...త్వరలో దీనిని అమల్లోకి తీసుకొస్తామని బీపిన్ రావత్ తెలిపారు....

18:57 - April 18, 2017

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఎన్ ఆర్ ఐ సలహాదారు వేమూరి రవికుమార్ తో '10టివి' ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

17:54 - March 20, 2017

హైదరాబాద్: భారతీయులపై విద్వేషపూరిత దాడులు అమెరికాలోనే కాదు...ఆస్ట్రేలియాలోనూ వెలుగు చూసింది. మెల్‌బోర్న్‌లోని ఓ కాథలిక్‌ చర్చి ఫాదర్‌గా ఉన్న భారతీయుడిపై కత్తితో దాడి చేశారు. 48 ఏళ్ల టామీ కాలాథూర్‌ మాథ్యూ ప్రార్థనలు చేయడానికి అర్హుడు కాదని దాడి చేసిన వ్యక్తి నినాదాలు చేశాడు. ఈ ఘటన జరిగిన సమయంలో చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి క్రైస్తవుడు కాదని, ఓ హిందువో, ముస్లిమో అయ్యుంటాడని దాడి చేసిన వ్యక్తి ఆరోపించాడు. 72 ఏళ్ల ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్వల్పగాయాలతో చర్చి ఫాదర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

13:59 - March 8, 2017

సౌదీలో మరణశిక్ష..లింబాద్రికి పునర్జన్మ..

ఒకటి కాదు..రెండు కాదు..పదేండ్లు...దేశం కాని దేశం..ఆపై మరణశిక్ష..కానీ అతనికి పునర్జన్మ లభించింది. సౌదీ అరేబియాలో మరణశిక్ష..కానీ ఇతనికి పునర్జన్మ లభించింది. ఒకటికి పది సార్లు ఆలోచించి అక్కడకు వెళ్లాలని 'లింబాద్రి' పేర్కొన్నాడు. గల్ఫ్ నుండి మృత్యుంజయుడుగా తిరిగి వచ్చిన అతడితో టెన్ టివి మాట్లాడింది. ఆయనతో పాటు సతీమణి, రక్షించడానికి చర్యలు తీసుకున్న యాదయ్య గౌడ్ కూడా మాట్లాడారు. తాను పనిచేస్తున్న స్థలం వద్ద గడ్డి కోయడానికి తండ్రి..కొడుకులు వచ్చారని, దీనికి తాను అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. వాగ్వాదం జరిగిందని తనను కొట్టడంతో ప్రాణాన్ని రక్షించుకోవడానికి తాను వారిని ఎదుర్కోవడం జరిగిందన్నారు. కానీ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడని వాపోయారు. చివరకు పోలీసులు జైలుకు పంపి మరణశిక్ష విధించారని పేర్కొన్నారు. యాదయ్యగౌడ్, ఇతరుల సహాకారంతో తాను బయటపడ్డాడని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

21:47 - January 31, 2017
15:44 - January 31, 2017
13:10 - January 31, 2017

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. హెచ్ -1 వీసాల నిబంధనలు ఇక కఠినతరం చేస్తున్నారు. దీంతో భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీలకు గడ్డుకాలం ఏర్పడే అవకాశాలు కనిపిస్తోంది. హెచ్ 1 బీ వీసాలున్న వారి జీవిత భాగస్వామి వర్క్ పర్మిట్ రద్దు చేసే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా 85 వేలకు పైగా హెచ్ 1 బీసాలను అమెరికా జారీ చేస్తోంది. దీంతో శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.

14:00 - January 25, 2017
14:32 - January 23, 2017

విజయవాడ : అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ...అనుకోని విధంగా మృత్యు ఒడికి చేరుకున్నాడు. అబ్బాయి పుట్టినరోజు వేడుకల కోసం వచ్చి...అనూహ్యంగా మృతి చెందాడు. విజయవాడలో.. ఓ సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ మరణం ...అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.

దిగ్భ్రాంతికి గురిచేస్తున్న ఎన్‌ఆర్‌ఐ మరణం....

మాజేటి భరత్ కుమార్‌ గుంటూరులోని మంగళగిరిలో జన్మించి...అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా సెటిల్‌ అయ్యాడు. నాలుగేళ్ల క్రితం విజయవాడ హనుమాన్‌ పేటకు చెందిన మహిళను వివాహం చేసుకుని...ఆమెతో కలిసి అక్కడకు వెళ్లిపోయాడు. తమ ఏడాది బాబు పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకోవాలని పదిరోజుల క్రితం విజయవాడకు వచ్చారు . జనవరి 22న బర్త్‌డే నిర్వహించాలని భావించి ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. ఈలోగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది...ఆకస్మికంగా భరత్‌కుమార్‌ కాలువలో శవమై తేలాడు.

20న అత్తమామల ఇంటికి వెళ్లిన భరత్‌....

బాబు బర్త్‌డే కోసం ఇండియా వచ్చిన భరత్‌ కుమార్‌... 20వ తేదీ శుక్రవారం వాళ్ల అత్తమామల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో తాను మంగళగిరి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం సాయంత్రం 5.30 గంటల సమయంలో తండ్రికి ఫోన్ చేసి తాను ఇచ్చిన డబ్బులో సగభాగాన్ని తన భార్య, బిడ్డకు అందజేయాలని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఎన్నడూలేని విధంగా తన కుమారుడు ఈ విధంగా మాట్లాడేసరికి తండ్రి కంగారుపడి విషయాన్ని అందరికీ తెలియజేశాడు. దీంతో రెండు కుటుంబాలు భరత్ కుమార్ కోసం ఆరా తీశారు. ఎక్కడా భరత్ కుమార్ ఆచూకీ లభ్యం కాలేదు.

21న గర్నవర్‌పేట పోలీసులకు ఫిర్యాదు....

భరత్‌ కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులకు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన బ్యాగ్, చెప్పులు సీతమ్మపాదాల వద్ద లభ్యమయ్యాయి. దీంతో జనవరి 21వ తేదీ మధ్యాహ్నం విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కాలువలో మృతదేహం కనిపించింది. మృతదేహం భరత్ కుమార్ దేనని బంధువులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు భరత్ కుమార్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ అనుకోని ఘటనతో భార్య.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

మానసిక ఆందోళనతో బాధపడుతున్న భరత్...

అయితే భరత్‌ కుమార్‌ కొన్ని రోజులుగా మానసిక ఆందోళనతో బాధపడుతున్నట్టు.. పోలీసుల విచారణలో తేలింది.. ఆ మేరకు డాక్టర్‌ పట్టాభిరాం వద్ద కూడా కౌన్సెలింగ్‌ ఇప్పించినట్టు బంధువులు చెప్పారని పోలీసులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఏదిఏమైనా ఈ అనుకోని సంఘటన...అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వేడుకల కోసం వచ్చిన వ్యక్తి అనంతలోకాలకు చేరడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Pages

Don't Miss

Subscribe to RSS - NRI