NTR

12:59 - December 8, 2018

NTR కధానాయకుడు మూవీలోకి కొత్త పాత్ర చేరింది. అదే రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడితో ఎన్టీఆర్ అనుబంధాన్ని చూపించబోతున్నారు బాలయ్య. తన పాత్రలో తాను నటించటం లేదు. ఆయన కుమారుడు ప్రకాష్ ను తీసుకున్నారు. తన పాత్రలో కుమారుడిని చూసుకోబోతున్నారు. అడవి రాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు వంటి సూపర్ డూపర్ హిట్స్ ను NTRకి ఇచ్చిన ఘనత రాఘవేంద్రరావుదే. వీరి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చూపించాలని నిర్ణయించిన బాలయ్య.. రెండు నిమిషాల నిడివితో దర్శకేంద్రుడిని చూపించబోతున్నారంట. స్వయంగా రాఘవేంద్రరావుతోనే చేయించాలని భావించినా.. అందుకు ఆయన అంగీకరించకపోవటంతో.. ఆయన కుమారుడు ప్రకాష్ ను తీసుకున్నారు. సినీ ఇండస్ట్రీలోకి ప్రకాష్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత డైరెక్టర్ మారాడు. మళ్లీ ఇప్పుడు తెరపై కనిపించబోతున్నాడు. అది కూడా బయోపిక్ మూవీలో..
క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న NTR కధానాయకుడు, మహానాయకుడు అని రెండు పార్ట్స్ గా మూవీ విడుదల అవుతుంది. పార్ట్ వన్ జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

11:51 - December 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం వస్తుందని అనుకుంటే రాబందుల రాజ్యం వచ్చిందని హిందూపురం ఎమ్యెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర అప్పుల్లోకి నెట్టిందని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బాలయ్య..డిసెంబర్ 2వ తేదీ ఆదివారం వివేకానందనగర్‌లో టీ.టీడీపీ అభ్యర్థి ఆనంద ప్రసాద్‌కు మద్దతుగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించి సామాజిక న్యాయం కోసం పోరాడిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఎలాంటి ఉద్యోగాలు లేక..ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పోరాటం ఎంతో కీలకమని వ్యాఖ్యానించిన బాలయ్య..రాజకీయాలను శాసించే స్థితికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. 17 శాతం అక్షర శాతాన్ని పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాల జరిగితే వారిని పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని..వారి జ్ఞాపకార్థం స్థూపం నిర్మించాల్సిందేనని బాలకృష్ణ డిమాండ్ చేశారు.

10:42 - December 2, 2018

నందమూరి బాలకృష్ణ హీరోగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'ఎన్టీఆర్'. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను రెండు పార్టులుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ''కథానాయకుడు'' పేరుతో తొలి భాగాన్ని, ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంపై ''మహానాయకుడు'' పేరుతో రెండో భాగాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నటీనటుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ సినిమా నుంచి ముఖ్యమైన కొన్ని పాత్రలకి సంబంధించిన ఫస్ట్‌లుక్స్ వచ్చి అంచనాలు పెంచాయి. తాజాగా కథానాయకుడు మూవీకి సంబంధించి తొలి పాటను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ కెరీర్ గురించి.. ఆయ‌న వేసిన పాత్ర‌ల గురించి.. ప్రేక్ష‌కుల్లో ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ వ‌ర్ణిస్తూ కీర‌వాణి తండ్రి, రచయిత శివ‌శ‌క్తిద‌త్తా, మరో రచయిత రామకృష్ణలు పూర్తి సంస్కృత పదాలతో రాసిన ఈ పాట అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఎన్టీఆర్ గొప్ప‌తనాన్ని వ‌ర్ణిస్తూ ఆయన గౌర‌వాన్ని పెంచేలా ఈ పాట ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మ‌ణిదీప‌కా ఓ క‌థానాయకా:
కీర‌వాణి సంగీతానికి కైలాష్ ఖేర్ స్వ‌రం స‌రిగ్గా స‌రిపోయింది. ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర జ‌న‌తాసుధీంధ్ర మ‌ణిదీప‌కా ఓ క‌థానాయకా అంటూ మొద‌లైన ఈ పాట మ‌ధ్య‌లో మ‌రిన్ని అద్భుతమైన ప‌దాల‌ను కూర్చారు శివ‌శ‌క్తిద‌త్తా. ముఖ్యంగా త్రిశ‌కాధికా చిత్ర‌మాలికా ఓ క‌థానాయ‌కా.. ఆహార్యాధ్భుత వాచికా జైత్ర‌యాత్రికా అంటూ ఎన్టీఆర్ చేసిన ప్ర‌తీపాత్ర‌ను త‌న పాట‌లో చూపించారు.
సంక్రాంతి కానుకగా:
క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విఎస్‌ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తొలి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగాన్ని అదే నెలలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది
ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, నారా చంద్రబాబు నాయుడిగా రానా దగ్గుబాటి, హరికృష్ణగా కల్యాణ్ రామ్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.

09:29 - November 27, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు టీడీపీ సిద్ధమయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు  ప్రచారం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ స్టార్ క్యాంపెయిన్స్ తో టీడీపీ ప్రచారానికి కొత్త ఊపు వచ్చే అవకాశముంది. సెటిలర్స్ ఎక్కువగా వుండే ప్రాంతమైన కూకట్ పల్లిలో జూనియన్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో ప్రచారం చేయించేందుకు టీడీపీ సన్నద్ధమైంది. అలాగే తెలంగాణలోని 13 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనున్న నేపథ్యంలో అటు టీడీపీ ఇటు మహాకూటమి గెలుపే లక్ష్యంగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జాతీయ టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడులు సంయుక్తంగా రోడ్ షోలు, సభలు నిర్వహించనున్నారు.
కాగా టీడీపీ గ్రేటర్ పరిధిలోని స్థానాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో 2014 జీహెచ్ ఎంసీ పరిధిలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న టీడీపీ గ్రేటర్ పై పట్టు నిలుపుకునేందుకు గ్రేటర్ స్థానాల గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. నందమూరి వంశంలో నుండి వచ్చిన అభ్యర్థి సుహాసిని కూకట్ పల్లి స్థానం నుండి పోటీకి దిగటంతో ప్రత్యేకించి నందమూరి వంశాంకురాలు ఆ స్థానంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా కూకట్ పల్లిలోనే ఎక్కువగా ప్రచారం చేయనున్నారు.
మరోపక్క మహాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. దీంతో ఈ నెల 29,30 తేదీల్లో చంద్రబాబు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇదే తేదీల్లో రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో సుహాసిని గెలుపు కోసం సోదరులు ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లతో పాటు బాలకృష్ణ, అలాగే మంత్రి పరిటాల సునీత కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ తెలంగాణలో ప్రచార హోరును వేడెక్కించనుంది.

12:58 - November 20, 2018

దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందబోయే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్, హైదరాబాద్, కోకాపేట్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో నిన్న ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గరినుండి, టైటిల్ గురించీ, కథ గురించీ రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో, వాటికి చెక్ పెడుతూ, షూటింగ్ స్టార్ట్ అంటూ, జక్కన్నే రెండు ఫోటోలతో, ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చాడు. షూటింగ్ స్పాట్ నుండి, చెర్రీ, తారక్‌తో కలిసి ఫోటోకి పోజిచ్చిన దర్శకధీరుడు, ఫస్ట్‌టేక్ అప్పుడు కూడా వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ముగ్గురూ కలిసి, కేవలం కాళ్ళు మాత్రమే కనబడేలా తీసిన మరో ఫోటో కూడా అదిరిపోయింది. స్వయంగా రాజమౌళినే ఫస్ట్‌డే షూట్ అప్‌డేట్ ఇవ్వడంతో,  ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతుంటే, గాసిప్ రాయుళ్ళు మాత్రం.. అరరే, పుకార్లు పుట్టించడానికి మాకు చాన్స్ ఇవ్వలేదే.. అని తెగ ఇదైపోతున్నారు. మొత్తానికి, ఆర్ ఆర్ ఆర్‌కి సంబంధించిన అప్‌డేట్ ఏదైనాసరే, అది అఫీషియల్‌గా మూవీ యూనిట్ నుండి వస్తేనే బాగుంటుంది. బాహుబలి విషయంలో ఒకసారి ఇబ్బందిపడ్డ జక్కన్న, ఈ ఆర్ ఆర్ ఆర్ సెట్‌లో ఎటువంటి లీకేజ్‌లకు చోటు లేకుండా, చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాడు. సెట్‌లో నో మొబైల్స్, యూనిట్ మెంబర్స్ అందరూ ఐ.డి కార్డ్స్, వాకీటాకీలు వాడుతున్నారు.  సెట్‌లోకి  కొత్త వాళ్ళు నాట్ అలౌడ్. దాదాపు రెండువారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, డి.వి.వి.దానయ్య ఈ మూవీని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నిర్మిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సాంకేతిక విభాగం..  కథ : వి.విజయేద్ర ప్రసాద్, మాటలు : సాయి మాధవ్ బుర్రా, కర్కి, సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : కె.కె.సెంథిల్ కుమార్, స్టైలింగ్ : రమా రాజమౌళి, ఎడిటింగ్ :  శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ విజన్ : వి.శ్రీనివాస మోహన్,  ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్

ACTION!!

The first shot of the MASSIVE  MULTISTARRER has been DONE. #RRRShootBegins @tarak9999 #RamCharan @ssrajamouli @srinivas_mohan @DOPSenthilKumar  @DVVMovies pic.twitter.com/eUkWYuFRZF
— RRR Movie (@RRRMovie) November 19, 2018

11:02 - November 19, 2018

దర్శకుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందబోయే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్, హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ ఉదయం ప్రారంభమైంది. బాహుబలి తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడం, ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండంతో, ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే నేషనల్ లెవల్లో ఈ సినిమా గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సెట్‌లో మొదటి రెండురోజులూ టీజర్‌కి సంబంధించిన షూట్ చేస్తారని ఫిలింనగర్ వర్గాల టాక్. దాదాపు రెండువారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారం.. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, డి.వి.వి.దానయ్య ఈ మూవీని  దాదాపు, రూ.300 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నిర్మించబోతున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కి చాన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకి కథ : వి.విజయేద్ర ప్రసాద్, మాటలు : సాయి మాధవ్ బుర్రా, కర్కి, సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : కె.కె.సెంథిల్ కుమార్, స్టైలింగ్ : రమా రాజమౌళి, ఎడిటింగ్ :  శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ విజన్ : వి.శ్రీనివాస మోహన్,  ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్

09:02 - November 17, 2018

హైదరాబాద్: కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ(17వ తేదీ) ఉదయం 11.21 గంటల సమయంలో సుహాసిని తన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా బాబాయ్ బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో కలిసి నందమూరి సుహాసిని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. సుహాసినిని గెలిపిస్తే ఎన్టీఆర్, హరికృష్ణకు నివాళి అర్పించినట్టే అని ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ది అనుకున్నది సాధించే తత్వం అని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ పార్టీకి సేవలందించారని బాలకృష్ణ గుర్తు చేశారు. టీడీపీ మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు. సుహాసినికి కూకట్‌పల్లి టికెట్ ఇచ్చి చంద్రబాబు మహిళలను గౌరవించారని పేర్కొన్నారు. నందమూరి ఇంటి నుంచి ఓ మహిళ ముందుకొచ్చి పోటీ చేస్తున్నారని.. ఎన్టీఆర్, హరికృష్ణ స్ఫూర్తితో ముందుక సాగుతామని బాలయ్య చెప్పారు.

18:31 - November 16, 2018

హైదరాబాద్ : అనుకోకుండా అదృష్టం వరించి రావటమంటే ఇదే. ఏమాత్రం రాజకీయ అనుభవం లేదు..అసలు ఆమె ఎవరో ప్రజలకు తెలీదు. ఎన్నికల్లో సీట్ కోసం నేతలు నానా పాట్లు పడుతుంటే  రాత్రికి రాత్రే ఎమ్మెల్యే అభ్యర్థిగా అవతంరించింది దివంగత నేత, టీడీపీ మాజీ ఎంపీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయానా బావమరిది అయిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని. చంద్రబాబు ఆమెను కుకట్ పల్లి సీట్ కేటాయించటంతో సుహాసిని ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ ప్రతినిధులు ఆమెకు నామినేషన్ పత్రాలను అందించారు. రేపు ఉదయం తాత ఎన్టీఆర్, నాన్న హరికృష్ణలకు నివాళి అర్పించిన అనంతరం ఆమె నామినేషన్ వేయనున్నారు. మరోవైపు, సుహాసిని సడన్ ఎంట్రీతో కూకట్ పల్లి నియోజకర్గ ఎన్నికల పర్వం వేడెక్కింది. టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఆమె తరపున ప్రచారానికి ఆమె సోదరులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు కూడా వచ్చే అవకాశం ఉంది.

11:48 - November 15, 2018

దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందబోయే ఆర్ ఆర్ ఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 19 నుండి హైదరాబాద్‌లో  స్టార్ట్ కాబోతోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, డి.వి.వి.దానయ్య ఈ మూవీని  దాదాపు, రూ.300 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నిర్మించబోతున్నాడు. బాహుబలి తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడం, ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండంతో, ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. నేషనల్ లెవల్లో ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. పనిలో పనిగా రోజుకొక గాసిప్ కూడా పుట్టిస్తున్నారు గాసిప్ రాయుళ్ళు. ఇన్ని రోజులూ, ఈ మూవీ కథ గురించి, తారక్, చెర్రీల క్యారెక్టర్ల గురించి రకరకాల వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని కూడా అన్నారు. రీసెంట్‌గా ఆర్ ఆర్ ఆర్‌లో మరో ఆర్ యాడ్ అవబోతుందని ఫిలింనగర్ టాక్. ఛలో, గీత గోవిందం, దేవదాసు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ రష్మిక‌ని ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఎంపిక చెయ్యనున్నారని అంటున్నారు. కానీ, మూవీ యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సినిమా పూర్తయ్యేలోపు ఇంకెన్ని గాసిప్‌లు పుట్టుకొస్తాయో చూడాలి. ఈ సినిమాకి, కథ : వి.విజయేద్ర ప్రసాద్, మాటలు : సాయి మాధవ్ బుర్రా, కర్కి, సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : కె.కె.సెంథిల్ కుమార్, స్టైలింగ్ : రమా రాజమౌళి, ఎడిటింగ్ :  శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ విజన్ : వి.శ్రీనివాస మోహన్,  ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్

15:42 - November 14, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల్లోను సీట్ల లొల్లి కొనసాగుతోంది. మహాకూటమిగా ఏర్పడిన పార్టీల్లో సీట్ల కేటాయింపే పెద్ద ఎన్నికల కసరత్తుగా మారిపోయిన నేపథ్యంలో పొత్తుల మధ్య వుండాల్సిన సర్దుబాటుతో ఆయా పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు పెద్ద టాస్క్ లా మారిపోయింది. మరోవైపు ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. మరోపక్క టీఆర్ఎస్, బీజేపీ నేతలు నామినేషన్ల పర్వం కూడా జరుగుతోంది. అయినా కూటమిలో సీట్ల లొల్లి తీరలేదు. ఈ నేపథ్యంలో రెండో జాబితాతో తెలంగాణ టీడీపీ నేతలు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా జూబ్లిహిల్స్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీకి ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాటతప్పిందని మండిపడుతున్నారు.

Related imageఖైరతాబాద్ టికెట్ ను టీడీపీకి కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కు కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్ కు ఎదురుగా లంకాల దీపక్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. గత 20 ఏళ్లుగా టీడీపీకి సేవ చేసిన దీపక్ రెడ్డికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో మజ్జు అనే కార్యకర్త ఎన్టీఆర్ భవన్ ఎదురుగా ఉన్న విద్యుత్ పైలాన్ ను ఎక్కాడు. తమ నాయకుడికి కూటమి తరఫున టికెట్ కేటాయిస్తేనే కిందకు దిగివస్తానని..లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఎవరైనా పైకి వస్తే ఇప్పుడే దూకేస్తానని హెచ్చరించాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మజ్జుతో పాటు టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్ వద్ద టెన్షన్ టెన్షన్ పరిస్థితి నెలకొంది. కాగా, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్ ను విష్ణువర్దన్ రెడ్డికి, ఖైరతాబాద్ టికెట్ ను దాసోజు శ్రవణ్ కు కేటాయించిన సంగతి తెలిసిందే.

Pages

Don't Miss

Subscribe to RSS - NTR