ntr ghat

12:28 - November 4, 2018

హైదరాబాద్: దేశం కోసం అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాంటిది..  కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దివంగత ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి కాంగ్రెస్-టీడీపీ కలయికను తీవ్రంగా తప్పుపడుతున్నారు. 

ఎన్టీఆర్‌కు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తూ కేంద్ర నాయకుల వద్ద మోకరిల్లారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పొట్టుకోవడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబుకి వైఖరికి నిరసనగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నిరసన తెలిపారు. చంద్రబాబు రాజకీయాలను ఎండగడుతూ.. తనతో తన భర్త ఎన్టీఆర్‌ చెప్పిన మాటలు నాలుగు పేజీల లేఖ రూపంలో ఎన్టీఆర్ సమాధి వద్ద ఉంచారామె.

Image result for lakshmi parvathi letter‘మహనీయుడైన ఎన్టీఆర్‌ పేరును కూడా ఉచ్ఛరించే అర్హత చంద్రబాబుకు లేదు. ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు గానీ, ఫోటో గానీ పెట్టుకొనే హక్కు టీడీపీ కోల్పోయింది. ఏనాడూ కేంద్రానికి దాసోహం అవకుండా, ఎవరికీ తలవంచకుండా ఎన్టీఆర్ పాలించారు. నేడు కేవలం తన స్వార్థం కోసమే చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టారు. కళ్ల మందే విలువల్ని వలువలుగా పూడ్చుకొని, పూర్తి నగ్నంగా కాంగ్రెస్ వాకిట్లో నిలబడ్డ మీ పార్టీని చూసి నిన్న చాలా సేపు దు:ఖించా. స్వామీ మీరు మళ్లీ పుట్టరా.. ఈ వెన్నుపోటుదారులను, అవినీతి చక్రవర్తులను, స్వార్థం కోసం నీతిని అమ్ముకునే కుహనా నాయకులను దేశం నుంచి తమికొట్టరా.. పూజ్యులైన మీ పాద పద్మములకు నమస్కరిస్తూ.. మీ భార్య లక్ష్మీ పార్వతి’ అంటూ ఘాటు వ్యాఖ్యలతో కూడిన లేఖను లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ సమాధి వద్ద ఉంచారు. అయితే తాను ఎన్టీఆర్ భార్యగానే వచ్చాను తప్ప రాజకీయాలు చేయడానికి కాదని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.

Related imageచంద్రబాబు తప్పులు చేస్తున్నా ఎన్టీఆర్‌ అభిమానులంతా పార్టీకి అండగా నిలబడుతూ వచ్చారని, ఏ సిద్ధాంతం మీద పార్టీని స్థాపించారో ఆ పునాది కూలిపోయిందని లక్ష్మీపార్వతి వాపోయారు.

 
09:15 - May 28, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కుట్రలను సీరియల్స్ వెల్లడిస్తానని లక్ష్మీ పార్వతి వెల్లడించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆమె ఎన్టీఆర్ ఘాట్ కు విచ్చేసి ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...గతంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ మార్గం ఎంతో కళకళలాడుతూ ఉండేదని, ప్రస్తుతం ఈ రోడ్డు అంతా బోసి పోయిందన్నారు. బ్యానర్స్..ఘనంగా స్వాగతం పలికే విధంగా చేయాల్సిన ఏర్పాట్లు టిడిపి ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. ఎన్టీఆర్ ను టిడిపి ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందని, భారతరత్న రాకుండా అడ్డుకొంటోంది బాబేనని కుండబద్ధలు కొట్టారు. 

14:20 - March 12, 2018
15:29 - November 14, 2017

హైదరాబాద్ : తన అనుమతి లేకుండా సినిమా తీస్తున్నారంటూ లక్ష్మీస్‌ వీరగ్రంథం నిర్మాతపై లక్ష్మి పార్వతి మండిపడ్డారు. తన పేరు పక్కన తనకు సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టి సినిమా తీయడం, ఎన్టీఆర్‌ను అవమానించడమేనని లక్ష్మిపార్వతి అన్నారు. సినిమా నిర్మాతపై న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద షూటింగ్ చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధిపై పాలు పోసి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతితో టెన్ టివి ముచ్చటించింది. నిర్మాతపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:53 - October 26, 2017

హైదరాబాద్ : ఎన్టీఆర్ ఘాట్ వద్ద వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చేరుకున్నారు. అక్కడ మౌనదీక్ష చేపట్టారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవిత చరిత్రపై 'లక్ష్మీ వీరగ్రంధం' సినిమా తీయడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు. తన అనుమతి లేక ఉండా సినిమా నిర్మిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో 'లక్ష్మీ వీరగ్రంధం' సినిమా రూపొందనుంది. తన అనుమతి లేకుండా సినిమాను నిర్మించడం చట్ట విరుద్ధమని, దీనిపై పోరాటం చేస్తానన్నారు. తనను ఎవరూ సంప్రదించలేదని, జీవిత చరిత్రను తీయడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. బురదచల్లే విధంగా సినిమా ఉంటుందని తెలిపారు. వైసీపీకి చెందిన పార్టీ నాయకులు ఆమె వెంట రాలేదు. కేవలం కుటుంబసభ్యులు మాత్రమే లక్ష్మీ పార్వతి వెంట ఉన్నారు. 

10:00 - May 28, 2016

హైదరాబాద్ : స్వర్గీయ నందమూరి తారకరామారావు 94వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, తారకరత్నలతో పాటు కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు నివాళులర్పించారు. తెలుగుజాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ సజీవంగా నిలిచి ఉంటారని హరికృష్ణ అన్నారు. తెలుగు జాతి గుర్తింపుకు, మనుగడకు స్వర్గీయ ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే స్వర్గీయ ఎన్టీఆర్ కు ఇచ్చే నిజమైన నివాళి అని హరికృష్ణ అన్నారు. ఆయన భార్య లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు.. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలను చేసిన సేవలు ఎన్నటికీ మరువలేమని కొనియాడారు.. ఆ మహానటుడు ప్రజలగుండెల్లో చిరస్థాయిగా నిలిచిఉంటారన్నారు.

14:28 - January 18, 2016

హైదరాబాద్ : తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున నివాళి అర్పించకపోవడాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తప్పుపట్టారు. ఘాట్‌ దగ్గర ఎన్టీఆర్ కు ఆయన నివాళి అర్పించారు. తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో ఎన్టీఆర్ కు స్థానం కల్పించాల్సి ఉందన్నారు. మరోవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చిరిస్తున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావుపై టిటిడిపి అధ్యక్షుడు రమణ మండిపడ్డారు. 

08:26 - January 18, 2016

హైదరాబాద్ : నేడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 20వ వర్ధంతి. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయనకు కుటుంబసభ్యులు నందమూరి హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ తదితరులు నివాళులు అర్పించారు. సినీ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి కూడా ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. గ్రామాలకు రహదారులు, బస్సు సౌకర్యాలు కల్పించింది ఎన్టీఆర్‌ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు. ‘నాన్నకు ప్రేమతో’ తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు.

Don't Miss

Subscribe to RSS - ntr ghat