Ozone Layer

16:59 - April 22, 2017

అమరావతి: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఉదయం ఏడున్నర ఎనిమిది గంటల నుంచే ప్రచండ భానుడి భగభగలు మొదలవుతున్నాయి. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు రోడ్లపైకి రావడానికే జంకుతున్నారు.

ఉక్కపోత, వడగాడ్పులతో...

ఇళ్లల్లోనే ఉందామనుకున్నా.. ఉక్కపోత, వడగాడ్పులు ప్రజలను నానా అవస్థలకూ గురి చేస్తున్నాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఎండలకు తాళలేక కొంతమంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు.

ఎండలు ఈ స్థాయిలో నమోదవడంపై ప్రజలు కలవరం...

రాష్ట్రంలో ఏప్రిల్‌ మాసంలోనే ఎండలు ఈ స్థాయిలో నమోదవడంపై ప్రజలు కలవరపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, రాబోయే మే నెల రోహిణి కార్తెలో ఎండలు ఇంకెలా ఠారెత్తిస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. జూన్ మొదటి వారంలో వరుణుడు కరుణించేవారకూ ఎండ తీవ్రతను తట్టుకోవడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే, జూన్ లలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని...44 నుంచి 47 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

ఏసీలు, ఫ్లాన్లకు ఫుల్ డిమాండ్ ...

ఎండలు అధికంగా ఉండడంతో ఏపీలో ఏసీలు, ఫ్లాన్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనానికి శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఎండాకాలంలో అన్ని వయస్సుల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా, వీలైనంత ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడాలంటున్నారు. ఎండా కాలం ముగిసేంత వరకూ పిల్లలు, పెద్దలు , గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

20:37 - April 19, 2017

హైదరాబాద్: ఎండలు మండుతున్నాయ్ ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు అని వుంటారు... ఎన్ని సార్లు విని వుంటారు. అవును మామూలుగా కాదు మధ్యాహ్నాం రోడ్ల పైకి వెళితే నిప్పుల కొలిమిలో మొహం పెట్టినట్లు, అగ్ని వర్షం కురుస్తున్నట్లు గా అనిపించడం లేదు. ఇంతా రొటీన్ సమ్మర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కాదు. నాగరికంగా మారుతున్న మానవరహిత సమాజ స్వయం కృతాపరాధం అంటే సందేహం అనవసరం. మరి ఏప్రిల్ లోనే ఇలా వుంటే! మే పరిస్థితి ఏంటి? ఇదే నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

11:35 - April 15, 2017

గుంటూరు : ఏపీలో వేసవి ఎండలు ఠారెత్తిస్తున్నాయి.భానుడు భగభగ మండిపోతున్నాడు. మాడు పగిలే ఎండ, వేడిమితో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వడగాల్పులను తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు విలవిల్లాడుతున్నారు. ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రతపై 10 టీవీ ప్రత్యేక కథనం.

రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు..
ఏపీలో వేసవి తాపం రోజు రోజుకు పెరుగుతోంది. విజృంభిస్తున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు మండిపోతోండటంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేక జనం బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదువుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోయాయి. దీంతో గాలిల్లో తేమ శాతం తగ్గిపోతూ, ఉక్కబోత పెరుగుతోంది. దీంతో వివిధ పనులపై వీధుల్లోకి వస్తున్న జనం చెమటతో తడిచిముద్దవుతున్నారు. శరీరంలోని నీరు స్వేదం రూపంలో బయటకు పోతుండటంతో నీరసించిపోతున్నారు. వడగాల్పులు ఈడ్చికొడున్నాయి. ఏప్రిల్‌లోనే ఈస్థాయిలో ఎండలు ఉంటే, ఇక మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకుంటూ భయాందోళనకు గురవుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో ఇలాంటి ఎండలను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు.

ఉపశమనం కోసం శీతల పానీయాలు..
ఎండలను తట్టుకోలేని ప్రజలు ఉపశమనం కోసం శీతల పానీయాలు, చెరకు రసం, కొబ్బరి బొండాలు, పుచ్చకాయ ముక్కలను ఆశ్రయిస్తున్నారు. ముఖాలకు స్కార్ఫ్‌లను కట్టుకుకోనిదే ప్రయాణం చేసే అవకాశం లేకుండా పోయింది. స్కార్ఫ్‌లు లేనిదే ముఖం మాడిపోవడంతోపాటు, ముక్కులు మండిపోయే పరిస్థితి ఉంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరాణాలు నేరుగా భూమిని తాకుతోండటంతో ఎండలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నేరుగా నేలకు చేరుతున్న అల్ర్టావైలెట్‌ రేస్‌ శరీరం మీద పడితే కంది, కమిలిపోయే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. వీటి నుంచి రక్షణ పొందేందుకు దేహం మొత్తం కవరయ్యేలా కాటన్‌ దుస్తులు ధరించడం మంచిదని సూచిస్తున్నారు. అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని చెబుతున్నారు. గర్భిణిలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కడుపులోని బిడ్డకు అతినీలలోహిత కిరణాలు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

13:36 - April 13, 2017

శ్రీకాకుళం : జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండలతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వాతవరణ కాలుష్యం కారుణంగా ఎండలు పెరిగాయని స్థానికులు పేర్కొంటున్నారు. అన్నారు.చిన్న పిల్లలు ఎండల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి స్కూల్ టైమింగ్ మధ్యాహ్నం 12 గంటలకు కాకుండా ఉదయం 11 గంటల వరకే ఉండాలని అన్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30వరకు బయటకు ఎవరు వెళ్లడం లేదని తెలిపారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

18:29 - April 11, 2017

నిజామాబాద్‌ : జిల్లాలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజలు వడగాలులతో సతమతమవుతున్నారు. పగటిపూట రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. చల్లదనం కోసం రకరకాల మార్గాలను వెతుక్కుంటున్నారు.
నిప్పుల కుంపటిగా నిజామాబాద్
భానుడు విజృంభించడంతో నిజామాబాద్‌ జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి జిల్లాలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. పదో తేదీన గరిష్టంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. మే నెలలో 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
ప్రజలు నానా అవస్థలు
ఎండలతో పాటు వడగాలులు వీయడంతో పనుల కోసం బయటకొచ్చే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం కోసం శీతలపానీయాలు...కొబ్బరి బోండాలు తాగుతూ... సేద తీరుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారులు తమ దుకాణాలు మూసివేస్తున్నారు. పెరుగుతున్న ఎండల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు.. చిన్న పిల్లలు ఎండకు తిరగరాదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే.. తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి ముందుగానే అవగాహనను పెంచుకుని ఉండాలని చెబుతున్నారు.
ఏప్రిల్‌ నెలలోనే ఎండలు
మొత్తానికి ఏప్రిల్‌ నెలలోనే ఎండలు ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో.. ఏ విధంగా ఉంటుందోనని నిజామాబాద్‌ జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.

 

06:54 - April 2, 2017

హైదరాబాద్ : అసలే మండుటెండలు, అపై భానుడి భగభగలు. వెరసి నిప్పుల కొలిమిలాంటి ఎండలో విధులు నిర్వహించాలంటే కత్తిమీద సాములాంటిది. అలాంటిది మండుటెండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల కష్టాలు వర్ణాణాతీతంగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో భానుడు రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీంతో నిప్పుల కొలిమి లాంటి మండుటెండల్లో ట్రాఫిక్ పోలీసుల విధులు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే సాధారణ సమయాల్లో ట్రాఫిక్ విదులు నిర్వహించడం ఒక ఎత్తైతే మండు టెండల్లో విధులు నిర్వహిచడం మరో ఎత్తు. దీంతో దినదిన గండంగా విధులు నిర్వహిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఉదయం నుంచి రెండు షిఫ్ట్‌లలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట దాటితే ట్రాఫిక్ విధులు పెద్ద సవాలుగా మారుతున్నాయి. నిప్పులు గక్కె మండుటెండల్లో కనీసం కూర్చోడానికి, సేదతీరేందుకు ట్రాఫిక్ జంక్షన్స్ వద్ద సదుపాయాలు లేకపోవడంతో పోలీసుల ఇక్కట్లు కష్టతరంగా మారాయి.

గంటల తరబడి..
ఎండల్లో గంటల తరబడి నిల్చొని ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ఉంటారు. దీంతో వాయుకాలుష్యానికి తోడు ధ్వని కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నారు. హైదరాబాద్ లోని ప్రతి ఏరియాలో దాదాపు 8 ప్రధాన జంక్షన్ల వద్ద తప్పని సరిగా ట్రాఫిక్ విధులు నిర్వహించాల్సిందే. ప్రతి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో 50మంది మాత్రమే పోలీసులు విధులు నిర్వహిస్తుండగా 30 మందికి పైగా హోం గార్డులు సేవలు అందిస్తున్నారు.  వాస్తవానికి వేసవికాలానికి ముందే ట్రాఫిక్ పోలీసులు, హోంగార్డులకు సేఫ్టీ మెడికల్ కిట్టులను అధికారులు అందజేయాలి. అందులో వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్, గ్లూకోస్ పాకెట్స్, ఫేస్ మాస్క్ తో పాటు ఎండ నుంచి రక్షణ కవచంగా గాగూల్స్ ను అందజేయాలి. కాని అధికార యంత్రాంగం ట్రాఫిక్ పోలీసులకు తగిన వసతులు కల్పించలేకపోతోంది. వేసవికాలంలో తప్పనిసరిగా రెండు సార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. తక్షణమే ట్రాఫిక్ పోలీసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి కిట్టులను అందజేయాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.

18:29 - March 31, 2017

నిజామాబాద్ : భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండవేడిమిని  భరించలేక జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మధ్యహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 40 డిగ్రీలు దాటుతున్న  ఉష్ణోగ్రతలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి.
3డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు
సూరీడు మండుతున్నాడు. రికార్డు స్తాయిలొ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.  గత నాలుగురోజుల్లోనే  మూడు డిగ్రీలు  పెరిగిన ఎండల తీవ్రత జనాన్ని భయపెడుతోంది. రాబోయె రోజుల్లో ఎండలు మరింతగా మండుతాయని అటు  వాతావరణశాఖా చెబుతోంది.
మార్చి 26న 41.2 డిగ్రీల ఎండ 
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిన్నమొన్నటిదాకా సాధారణంగా ఉన్న ఎండలు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి. ఈ నెల 26 నాడు ఏకంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.   
వడగండ్లతో కొద్దిగా ఉపశమనం పొందిన ప్రజలు
ఉదయం 9 గంటల నంచే సుర్రుమంటున్న ఎండ ..   మధ్యాహ్నానికి నిప్పుల కుంటపటిని తలపిస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం ఐదు గంటలవరకు కూడా ఎండమంటలు చల్లారడంలేదు.  ఇటీవల జిల్లాలో అక్కడక్కడా పడిన వడగండ్ల వానలు కొంత ఉపశమనాన్ని ఇచ్చినా.. మళ్లీ ఒకటి రెండురోజుల్లోనే నేల పొగలు కక్కుతోంది. ప్రజలు  కొబ్బరిబొండాలు, నిమ్మరసం తాగుతూ వేసవి తాపం తీర్చుకుంటున్నారు. 
రికార్డుస్థాయిలో ఎండల తీవ్రత
గత మూడు సంవత్సరాల నుంచి నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్తాయిలొఉష్నొగ్రతలు నమోదు అవుతున్నాయి. 2013 మేలో 45.6 డిగ్రీలు, 2014 మార్చిలో  43.6. , 2015 లో 46.5. , 2016 లో ఏప్రిల్‌లో 44.4.డిగ్రీల  గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఇక ఈ ఏడాది  మార్చి 13న  36 డిగ్రీలు నమోదు కాగా.. 26 తేదీనాటికి  41.2.  డిగ్రిలకు చేరుకుని సెగలు కక్కుతున్నాయి. మార్చిలోనే ఇలా ఉంటే.. రాబోయే రెండున్నర నెలలు ఎలా గడుస్తుందోనని ప్రజల్లో  ఆందోళన నెలకొంది. 

 

17:34 - March 31, 2017

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే  40 డిగ్రిల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ జనాన్ని భయపెడుతున్నాయి. నిప్పులు కక్కుతున్నఎండల నుంచి ఉపశమనం కోసం జనం శీతల పానియాలు ఆశ్రయిస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతండడంతొ మద్యాహ్నం వరకు  రోడ్లన్ని నిర్మానుష్యం మారుతున్నాయి. 
విలవిల్లాడుతున్న ప్రజలు 
నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలకు ఉమ్మడి కరీంనరగ్‌ జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. పనులమీద బయటికి వెళ్లక తప్పని పరిస్థితుల్లో..తెల్లవారుజామునుంచి పనులు మొదలు పెడుతూ.. మధ్యాహ్నం 12గంటలకల్లా ఇళ్లుచేరుకుంటున్నారు. దీంతో పగటిపూట పట్టణప్రాంతాల్లో జనసంచారం కనిపించడంలేదు.  
నిప్పులు కురిపిస్తున్న భానుడు
కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో  భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. సాధారణంగా మార్చి నెలలో 40 డిగ్రిల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా.. ఈ యేడాది మాత్రం ఎండల తీవ్రత జన్నాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.   
రామగుండంలో ఏరియాలో అధిక ఉష్ణోగ్రతలు
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ప్రాంతంలో అధికం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో సింగరేణి సంస్థలో మద్యాహ్నం షిప్ట్ లో కార్మికుల హజరు శాతం తక్కువగా ఉంటోంది. అటు పట్టణ కేంద్రాల్లో ఆయా కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్రూట్‌ జూస్‌, కొబ్బరి బొండాలు, కూల్‌డ్రింక్స్‌ తదితర వాటిని తాగి దాహం తీర్చుకుంటున్నారు. ఇక చిన్నారులైతే.. స్థానికంగా ఉన్న స్విమ్మిపూల్స్‌లో ఈతలు కొడుతూ సేదతీరుతున్నారు. 
కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
అటు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల లో 39, నుంచి 40డిగ్రిల తీవ్రతతో ఎండలు మంటపుట్టిస్తున్నాయి.   మధ్యాహ్నం అయిందంటే ప్రజలు రోడ్ల పై కనిపించడం లేదు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా పళ్లరసాలు, కొబ్బరిబోండాలు, మజ్జిగ సేవించాలని సూచిస్తున్నారు. చల్లధనంకోసం ప్రజలు  ఏసిలు, ప్రిజ్ లతోపాటు   కూలర్లు, రంజన్లు కోనుగోలు  చేస్తుండడంతో మార్కెట్లో వీటికి డిమాండ్  బాగా పెరిగింది. ఈసారి ఎండల తీవ్రత అధికాంగా ఉండటంతో.. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. జనం వరడదెబ్బభారిన పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు.  

 

21:37 - February 28, 2017

మాములుగా గాలి పీల్చకపోతే చస్తారు..కానీ ఇక్కడ గాలి పీల్చినందుకు చస్తున్నారు..ఇది మామూలు గాలి కాదు.. ఊపిరితిత్తులను రోజుకింత కొరుక్కుతినేస్తుంది. ఇది ఏ ఒక్క ప్రదేశానికో.. నగరానికో పరిమితం కాలేదు. దేశంలోని పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న స్థాయి పట్టణాల వరకు ఇదే పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే వాయు కాలుష్యం అంతులేకుండా పెరుగుతోంది. ప్రాణాంతకంగా మారుతోంది. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ చూద్దాం... మరిన్ని వివరాలను వీడియోలో చూడండి...

Don't Miss

Subscribe to RSS - Ozone Layer