padayatra

21:12 - January 12, 2018

హైదరాబాద్ : విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుల అవినీతి ఆరోపణలపై సీబీఐ లేదా సీవీసీ విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు వెనక్కతగ్గిన టీఆర్‌ఎస్‌ నేతల వైఖరిపై కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌ రెడ్డి మండిప్డడారు. విద్యుత్‌ ప్రాజెక్టు టెండర్ల కాంట్రాక్టుల్లో ముఖ్యంత్రి కేసీఆర్‌కు భారీగా ముడుపులు ముట్టాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను నిరూపించకపోతే హైదరాబాద్‌ అబిడ్స్‌ చౌరాస్తాలో ముక్కు నేలకు రాస్తానని రేవంత్‌ మరోసారి సవాల్‌ విసిరారు. యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణ టెండర్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ సవాల్‌ విసిరారు. దీనిని రేవంత్‌ స్వీకరించడంతో ఆత్మరక్షణలో పడ్డ టీఆర్‌ఎస్‌ నేతలు.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. రేవంత్‌కు విశ్వసనీయతలేదంటూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ చర్చకు రావాలని మెలిక పెట్టారు. అయినా రేవంత్‌రెడ్డి వెనక్కితగ్గకుండా బహిరంగ చర్చకు సిద్ధమై, తన అనుచరులతో కలిసి అసెంబ్లీ సమీపంలోని గన్‌ పార్క్‌ వద్దకు వచ్చారు. విద్యుత్‌ ప్రాజెక్టుల టెండర్లలో అవినీతి బయటపడుతుందనే భయంతోనే బహిరంగ చర్చకు రాకుండా టీఆర్‌ఎస్‌ నేతలు తోక ముడిచారని రేవంత్‌ మండిపడ్డారు. టెండర్లు పిలువకుండా 30,400 కోట్ల పనులను బీహెచ్‌ఈఎల్‌కు ఎలా అప్పగించారాలో టీఆర్‌ఎస్‌ నేతలు సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సీవీసీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్న రేవంత్‌రెడ్డి, వీటిని ప్రజల ముందువుంచి, ముఖ్యమంత్రిని ప్రగతి భవన్‌ నుంచి చర్లపల్లి జైలుకు పంపిస్తాని హెచ్చరించారు. 

14:14 - January 12, 2018
21:55 - December 14, 2017

అనంతపురం : లంచల కోసమే ఎఫ్ సీఐ గోదాములు మూశారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ఆయన ప్రజాసంకల్ప యాత్రకు స్వల్ప విరామన్ని ఇచ్చారు. రేపు కోర్టుకు హాజరుకవాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

19:45 - November 2, 2017

విశాఖపట్టణం : వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతం కావాలని వైసిపీ యువజన విభాగం ఆధ్వర్యంలో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ వన్‌ టౌన్‌ నుంచి సంపత్‌ వినాయక దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కొండ రాజీవ్‌ గాంధీ పాల్గోన్నారు. ఈ నెల 6 నుంచి ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకూ 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర సాగనుంది. 

12:40 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ టిడిపిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి తలపెట్టిన టిడిఎల్పీ సమావేశాన్ని పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ వాయిదా వేశారు. పార్టీ నియావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధ్యక్షుడి హోదాలో రేవంత్ ను బాధ్యతలను పక్కన పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలపై ఎల్.రమణ టెన్ టివితో మాట్లాడారు. 17వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ ను రేవంత్ కలిసినట్లు వార్తలు వెలువడ్డాయని, కుంతియా వచ్చినప్పుడు ఓ ప్రకటన చేయడం..డీకే అరుణ వ్యాఖ్యలు చేయడం పట్ల రేవంత్ ను సమగ్ర వివరణ కోరడం జరిగిందన్నారు. రేవంత్ వల్ల పార్టీ పరువు బజారున పడుతుందని..పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీని నడిపించాలన్నారు. అనేక సందర్భాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని..అందులో తాత్కాలికంగా రేవంత్ ను బాధ్యతల నుండి తప్పించడం జరిగిందన్నారు. కానీ టీడీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు రేవంత్ ప్రకటించారని, తనకు అధికారం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోందని దీనిపై వివరాలు అడుగుతున్నట్లు తెలిపారు. అధికారం ఉందా ? లేదా ? అనేది నియావళిలో ఉంటుందని..పార్టీ లైన్ ఉల్లంఘిస్తే ఊరుకోరని పేర్కొన్నారు. టిడిఎల్పీ సమావేశం కొనసాగిస్తానని..రేవంత్ పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. 

12:34 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్పీకర్ అనారోగ్య కారణాల రీత్యా బీఏసీ సమావేశానికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. మరి కాసేపట్లో బీఏసీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ను ఖరారు చేయనుంది. శుక్రవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. బీఏసీ సమావేశానికి స్పీకర్ మధుసూధానచారి అనారోగ్య కారణాల రీత్యా హాజరు కావడం లేదని ప్రచారం జరుగుతోంది. దీనితో డిప్యూటి స్పీకర్ దేవేందర్ రెడ్డి అధ్యక్షతనలో ఈ సమావేశం జరుగనుంది. టిడిఎల్పీలో హాట్ హాట్ గా రాజకీయాలు నడుస్తున్నాయి. టిడిపి నుండి

సండ్ర వెంకట వీరయ్య హాజరు కానున్నారు. ఇక సీఎల్పీ నుండి జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు..ఎంఐఎం, బీజేపీ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. ఇక ఈ బీఏసీ భేటీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న దానిపై చర్చ జరుగనుంది. మూడు నుండి నాలుగు వారాల పాటు సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ నెల రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమావేశంలో ఏ ఏజెండాను ఖరారు చేయనున్నంది కాసేపట్లో తేలనుంది.

11:34 - October 26, 2017

హైదరాబాద్ : వైసీపీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. పదో తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందు అంటే నవంబర్ 6వ తేదీన పార్టీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర చేయాలని యోచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా ? వద్దా ? అనే దానిపై వైసీపీ తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర నేపథ్యంలో అసెంబ్లీకి హాజరు కాకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతాయని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సభకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సభకు హాజరవుతే రెండు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యలు..ప్రత్యేక హోదా అంశాలను ప్రధానంగా అసెంబ్లీలో లేవనెత్తాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు జరిగే భేటీలో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

06:35 - October 26, 2017

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ రెడీ అవుతోంది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారు. జగన్ పాదయాత్రతోపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ నేతలు ఎలా వ్యవహరించాలనే అంశంపై అధినేత దిశా నిర్దేశం చేయనున్నారు.

మరోవైపు నవంబర్ 6వ తేదీ నుంచి మొదలయ్యే పాదయాత్ర ప్రారంభం అవుతోంది. పాదయాత్రకు ప్రాధాన్యత తగ్గించడానికే .. టీడీపీ వ్యూహం పన్నినట్టు వైసీపీ భావిస్తోంది. జగన్‌ పాదయాత్రకు కౌంటర్‌గానే టీడీపీ ప్రభుత్వం ఇపుడు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అయిందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాన్ని వైసీపీ అధినాయకత్వం రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

పాదయాత్ర మొదలైతే శాసనసభా సమావేశాలకు హాజరు కావాలా, వద్దా అన్న అంశం కూడా పార్టీలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే అధికార పార్టీ నుంచి మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది. ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ విషయంపై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. జగన్‌ పాదయాత్రనే ప్రాధాన్యతగా భావిస్తే అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభా ఉపనేతలుగా ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలనే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

సభలో ప్రభుత్వ వైఖరిని మాత్రం ఎండగట్టేందుకు కూడా వ్యూహాన్ని రచిస్తున్నట్లు సమాచారం. విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పొందు పరిచిన పలు అంశాలను సభలో లేవనెత్తడానికి తమ ఎమ్మెల్యేలు సిద్ధం అవుతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. మొత్తానికి పాదయాత్రతో అటు ప్రజాక్షేత్రంలో దూసుకుపోవడంతో పాటు ఇటు చట్టసభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ద్విముఖ వ్యూహానికి వైసీపీ సిద్ధం అవుతోంది.  

18:34 - October 23, 2017

విజయవాడ : ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ తీరు మార్చుకోవాలని ఏపీ మంత్రి సోమిరెడ్డి ఉచిత సలహా ఇచ్చారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ వెంటనే ప్రతిపక్ష నేతగా తప్పుకోవాలని..పార్టీ బాధ్యతలు కూడా వేరే వారికి అప్పగిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. జగన్ వైఖరితో రాజకీయ నేతలంటే సమాజంలో చిన్న చూపు ఏర్పడుతోందని తెలిపారు. 

18:16 - October 23, 2017

విజయవాడ : అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు వైసీపీ విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు మాసంలో నిర్వహించాల్సిన వర్షాకాల సమావేశాలు..నవంబర్ నెలలో నిర్వహించడం..జగన్ పాదయాత్ర చేయతలపెట్టిన సమయంలో ఈ సమావేశాలు నిర్వహించడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

పాదయాత్ర నిమిత్తం హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీనితో వైసీపీ అధినేత జగన్ కీలక నేతలు..అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం..పాదయాత్ర అంశాలపై చర్చించారు.

ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ సమావేశం కొనసాగింది. అసెంబ్లీకి హాజరు కావాలా ? వద్దా ? అనే దానిపై కూలంకుశంగా చర్చించారు. ఆగస్టు మాసంలో జరగాల్సిన సమావేశాలు నవంబర్ లో నిర్వహించడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని జగన్ దృష్టికి నేతలు తీసుకెళ్లారు. దీనితో సమావేశాలకు వెళ్లేందుకు పార్టీ నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సమావేశాలకు వెళ్లాలా ? వద్దా ? అనే దానిపై జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 26వ తేదీన జరిగే పార్టీ సమావేశంలో జగన్ నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - padayatra