Pawan Fan Bandla Ganesh

14:01 - November 19, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది..ఎన్నికల్లో పోటీ చేస్తా..అంటూ ఇటీవలే పార్టీలో పలు వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్‌ పోటీపై సందిగ్ధత తొలగిపోయిందా ? ఇటీవలే ఏఐసీసీ అధ్యక్షడు రాహుల్ గాంధీ సమక్షంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈయన జూబ్లిహిల్స్ స్థానం లేదా షాద్ నగర్ లేదా రాజేంద్రనగర్ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఆయ స్థానాలకు కాంగ్రెస్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. షాద్ నగర్‌లో సి.ప్రతాపరెడ్డికి..జూబ్లిహిల్స్‌లో పి.విష్ణువర్ధన్ రెడ్డికి టికట్ కేటాయించిన సంగతి తెలిసిందే. దీనితో బండ్ల గణేష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ఊరడించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా బండ్ల గణేష్‌ను టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమించింది. నవంబర్ 19వ తేదీ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

11:20 - September 14, 2018

ఢిల్లీ : తనకు సినిమా అంటే ప్రాణం...కానీ ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలని అనిపించిందని..అందుకని కాంగ్రెస్ లో చేరానని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల్లో వలసలు...చేరికలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య వలసలు జోరందుకుంటున్నాయి. పలువురు టికెట్ లు ఆశిస్తూ ఆయా పార్టీలో చేరుతున్నారు. తాజాగా సిని నిర్మాత బండ్ల గణేష్, ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు పార్టీ కండువాలు కప్పుకున్నారు. 

శుక్రవారం ఢిల్లీకి వచ్చిన బండ్ల గణేష్, ఇతర నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్  సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. అనంతరం బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అంటే త్యాగాల పార్టీ అని అభివర్ణించారు. తాను ఎప్పటి నుండో పార్టీ అభిమానినని పేర్కొన్నారు. సినిమాల్లో నటించడం...నిర్మించడం తాను చేయడం జరిగిందని, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. పవన్ తండ్రిలాంటి వారని..గురువు..కానీ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమని పేర్కొన్నారు. జూబ్లిహిల్ నియోజకవర్గం నుండి టికెట్ పోటీ చేయనున్నారా ? అని మీడియా ప్రశ్నించగా పార్టీ ఎక్కడి నుండి పోటా చేయాలని ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేస్తానని చెప్పారు. 

Don't Miss

Subscribe to RSS - Pawan Fan Bandla Ganesh