pawan kalyan movies

14:19 - May 25, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' చిత్రం అనంతరం పలు సినిమాకుల సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే తివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. వీరి కాంబినేషన్ లో 'అత్తారింటికి దారేది' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. హారిక-హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'కీర్తి సురేష్', 'అను ఇమ్మాన్యుయెల్' లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. ఇందులో 'పవన్' సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్ర పోషిస్తున్నారని టాక్. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఇంతవరకు ప్రకటించలేదు. కానీ పలు టైటిల్స్ సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నాయి. తాజాగా 'చుట్టేద్దాం రండి' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు టాక్. ఈ చిత్రానికి అనిరుధ్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఏ టైటిల్ ను పెట్టబోతున్నారనేది తెలుస్తోంది.

21:18 - May 14, 2017

హైదరాబాద్ : ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడం ఖాయమని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. త్వరలో అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తానని ప్రకటించిన జనసేనాని ప్రజాసమస్యల కోసం అవసరమైతే సినిమాల్ని మానేస్తానని ప్రకటించారు. జనసేన సైనికులతో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. జనసేన పార్టీ కోసం స్పీకర్లు, కంటెంట్‌ రైటర్లు, అనలిస్టులుగా సేవలు అందించేందుకు అనంతపురం జిల్లా నుంచి వచ్చిన దాదాపు 150మందితో భేటీ అయ్యారు.. ఈ ప్రతినిధులంతా తమ ప్రాంతాల్లోని సమస్యలను పవన్‌కు వివరించారు... సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించిన పవర్‌స్టార్... ఉద్వేగభరితంగా వారు చేసిన ప్రసంగాలను విన్నారు.

తుది శ్వాసవరకూ..
తుది శ్వాసవరకూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని గబ్బర్‌ సింగ్ స్పష్టంచేశారు. తనను కొందరు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిని కాదని విమర్శిస్తున్నారనీ, అసలు పూర్తిస్థాయి రాజకీయ నాయకులు ఎవరున్నారో తెలియజేయాలని ఫైర్ అయ్యారు. ఒక్కో నాయకుడు వేల కోట్ల ఆదాయాన్ని రాజకీయాల్లో సంపాదించి ఇంట్లో కూర్చున్నారని ఆరోపించారు. తాను మాత్రం తన కుటుంబం కోసం, తనపై ఆధారపడిన సిబ్బంది కోసమే సినిమాల్లో నటిస్తున్నానని స్పష్టం చేశారు.. తనకు సినిమాలన్నా, సినీ పరిశ్రమ అన్నా అపారమైన గౌరవం ఉందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం మానేస్తానని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను అనంతపురం జిల్లా నుంచి పోటీచేయడం ఖాయమని పవన్‌ చెప్పారు. అనంతపురంలో నిర్వహించిన జనసేన శిబిరంలో పాల్గొన్న వారందరినీ కలిసేందుకు కొద్ది రోజుల్లో జిల్లాకు వస్తానని చెప్పారు. త్వరలో అనంత జిల్లాలో పాదయాత్ర చేస్తానని పవన్‌ చెప్పడంతో ప్రతినిధులంతా ఆనందం వ్యక్తంచేశారు.

18:07 - May 14, 2017

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్ వినిపించారు. ప్రజల కోసం సినిమాలు మానేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇటీవలే ఎంపికయిన జనసైనికులు పవన్ ను కలిశారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఖచ్చితంగా అనంతపురం నుండి పోటీ చేస్తానని చెప్పడంతో 2019 ఎన్నికల్లో పవన్ బరిలో ఉంటారని ఖాయమైంది. అంతేగాకుండా తాను త్వరలోనే అనంతలో పాదయాత్ర చేపడుతానని స్పష్టం చేశారు. తుదిశ్వాస వరకు ప్రజా సమస్యలపై పోరాడుతానని, తనను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాదని అంటున్నారని పవన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పూర్తిస్థాయి నాయకులు ఎవరున్నారని, నాయకులు రూ. కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చుకుంటున్నారని తెలిపారు. తనపై ఆధారపడిన వారి కోసమే సినిమాలు చేయడం జరుగుతోందని, అవసరమైతే ప్రజల కోసం సినిమాలు మానేస్తానని సంచలన ప్రకటన చేశారు.

15:39 - February 10, 2017

సినిమా ఇండస్ట్రీ అంటేనే అవకాశాల కోసం ఎదురుచూడటం .ఒక్క చిన్న ఛాన్స్ వస్తే చాలు తామేంటో నిరూపించుకోవాలని ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటారు. పట్టు విడువకుండా అవకాశాల కోసం పరిగెడుతుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ డం ఉన్న హీరో పిలిచి అవకాశం ఇస్తే కాదన్నాడు ఒక అప్కమింగ్ రైటర్. పవన్ కళ్యాణ్ ...సినిమా హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్ ఉన్న హీరో. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే స్థాయిలో ఉన్న హీరో. అటు రాజకీయంగాను ఇటు హీరోగాను తానేంటో చూపిస్తున్న పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ట్రైలర్ తో యూట్యూబ్ రికార్డులకు రీచ్ అయ్యాడు. సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఒక ట్రైలర్ కి ఆ రేంజ్ లో వ్యూస్ రావడం గొప్ప విషయం. కబాలి ట్రైలర్ తరువాత అదే స్థాయిలో వ్యూస్ వర్షం కురిపించిన ట్రైలర్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ట్రైలర్. 

అమృతం సీరియల్...
కాటమరాయుడు సినిమాతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు టీఎన్ నీశన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. తమిళ హిట్ ‘వేదాలం’కు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆల్రెడీ ప్రారంభోత్సవం కూడా జరిపారు. తమిళ్ లో సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వేదలమ్' సినిమా లో అజిత్ నటించారు. ఈ సినిమాకి యాక్షన్ సన్నివేశాలు ఎంత ముఖ్యమో మాటలు కూడా అంతే ముఖ్యం దానికోసం రీసెంట్ గా హిట్ సినిమాలకి మాటలు రాసిన డైలాగ్ రైటర్ తో పవన్ మాట్లాడాడు ఆ రైటర్ మాత్రం నో అని చెప్పేసాడు. 'పవన్ కళ్యాణ్' లాంటి పెద్ద హీరో అవకాశం ఇస్తే ఎవరన్నా వద్దంటారా? అమృతం సీరియల్ తో యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ టర్న్డ్ రైటర్ హర్షవర్ధన్ మాత్రం ఆ అవకాశాన్ని వద్దనుకున్నాడు.

డైరెక్టర్ అవ్వాలని..
ఇష్క్.. గుండెజారి గల్లంతయ్యిందే.. మనం లాంటి సినిమాలతో రచయితగా మంచి పేరు సంపాదించిన హర్షవర్ధన్ డైరెక్టర్ అవ్వాలని కొన్ని సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నాడు. అతడి ప్రయత్నం ఎట్టకేలకు ఈ ఏడాదే ఫలించింది. కొన్ని రోజుల కిందటే దర్శకుడిగా హర్షవర్ధన్ తొలి సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. ఐతే ఈ సినిమా సన్నాహాల్లో ఉండగానే.. హర్షవర్ధన్ కు పవన్ కళ్యాణ్ సినిమాకు రాసే అవకాశం వచ్చిందట. డైరెక్టర్ అవ్వాలని ఆశతో ఉన్న హర్ష వర్ధన్ పవన్ కళ్యాణ్ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసాడు. ప్రస్తుతం హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ఒక డిఫరెంట్ జోనర్ లో వెళ్తుందట. ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖి తో పాటు మరో మెయిన్ లీడ్ గా హర్షవర్ధన్ నటిస్తుండడం విశేషం.  

20:00 - February 4, 2017

హైదరాబాద్ : పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు టీజర్ రిలీజైంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో పవన్ సరసన శృతి హసన్ నటిస్తోంది. గోపాలా గోపాలా మూవీ డైరెక్టర్ కిశోర్ కుమార్ పార్థసాని... ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

 

13:37 - January 24, 2017

విజయవాడ : దేశ్ బచావో మ్యూజికల్ ఆల్బమ్ ను జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఆల్బమ్ లోని తొలిపాటను పవన్ రిలీజ్ చేశారు. యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. దేశభక్తి, స్ఫూర్తిదాయకమైన పాటలు రూపొందించామని ఆయన తెలిపారు. దేశ రాజకీయ పరిస్థితులపై పాటలు ఉంటాయన్నారు. డీజే పృథ్వీ పాటలను రూపొందించారని తెలిపారు. ఆరు పాటలతో మ్యూజికల్ ఆల్బమ్ రూపొందించారు. ఈరోజు నాలుగు పాటలను పవన్ విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

13:26 - January 24, 2017

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. అందులో 'డీజే పృథ్వీ సాయి' ఒకరు. టాలీవుడ్ కు ఇతను సరికొత్త మ్యూజిక్ టేస్టును అందించాడు. రీమేక్ లే తెలిసిన నేపథ్యంలో ఇతను రీ ట్రాక్ రుచి చూపించాడు. ఇతను అతిచిన్న వయస్సు కావడం విశేషం. డబ్ స్టెప్ నేర్పి కొత్త నడకను అద్దాడు. తాజాగా 'పవన్' 'దేశ్ బచావో' అంటూ ఓ మ్యూజిక్ ఆల్బంను రూపొందించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని..అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు ద్వారా జనసేన తన గొంతుకను వినిపిస్తుందని జనసేన పేర్కొంటోంది. ఈ ఆల్బంకు డీజే పృథ్వీసాయి మ్యూజిక్ అందించారని స్వయంగా 'పవన్' ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. కాసేపటి క్రితం మొదటి సాంగ్ విడుదలైంది. 'తమ్ముడు' సినిమాలోని ఓ పాట..పవన్ డైలాగ్స్ తో కొత్తగా పాటను రూపొందించారు. గతంలో కూడా 'తమ్ముడు' సినిమాలోని ఫన్నీ డైలాగ్స్..ఇష్టమైన సన్నివేశాలు..వయ్యారి భామ పాటను వాడుకుని కొత్త ఆల్బమ్ ను క్రియేట్ చేశాడు. కనిపించే దృశ్యాలకు తోడు వినిపించే పాటలో ప్రత్యేకత ఉండడమే ఇతని హైలెట్.

13:23 - January 24, 2017

విజయవాడ : కాసేపట్లో దేశ్ బచావో మ్యూజికల్ ఆల్బమ్ విడుదల కానుంది. జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఆల్బమ్ ను విడుదల చేయనున్నారు. ఆరు పాటలతో రూపొందించిన మ్యూజికల్ ఆల్బమ్ రూపొందించారు. ఈరోజు నాలుగు పాటలను పవన్ విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:14 - January 24, 2017

హైదరాబాద్ : జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏపీకి ప్రత్యేకహోదా ఉద్యమానికి మద్దతు ఇచ్చేందుకు టాలీవుడ్ ముందుకు వచ్చింది. ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు పెరుగుతోంది. జల్లికట్టు ఉద్యమం తరహాలో ఉద్యమించేందుకు సినీ తారాగనం సిద్ధమవుతున్నారు. ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26న విశాఖ బీచ్ లో యువత నిరసన తెలిపితే మద్దతు ఇస్తానని జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. పవన్ ట్వీట్స్ కు హీరోలు సాయిధరమ్ తేజ్, నవదీప్, మంచు మనోజ్, సంపూర్ణేష్ బాబు, శివబాలాజీలు స్పందించారు. యువత ఉద్యమానికి అండగా ఉంటామని ప్రకటించారు. అయితే అగ్ర హీరోలు మాత్రం స్పందింకపోవడం గమనార్హం. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమానికి తమిళ సినీ పరిశ్రమ పూర్తిగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. 

 

10:40 - January 24, 2017

విజయవాడ : జనసేన అధినేత మరో అస్త్రం వేయనున్నారు. కాసేపట్లో దేశ్‌ బచావో మ్యూజికల్‌ ఆల్బమ్‌ను యూట్యూబ్‌ ఛానల్ ద్వారా విడుదల చేయనున్నారు. హత్యారాజకీయాలను ఫోకస్‌ చేస్తూ ఈ ఆల్బమ్‌ను రూపొందిచినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Pages

Don't Miss

Subscribe to RSS - pawan kalyan movies