Pawan Political Tour

13:06 - January 24, 2018
21:11 - January 23, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్న జనసేనానిని కాంగ్రెస్‌ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణ సమస్యల అధ్యయనం పేరుతో యాత్ర చేస్తూ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సామాజిక తెలంగాణ అంటున్న పవన్‌కు రైతులు, విద్యార్థులు, బీసీలు, ఎంబీసీలు, దళితులు, గిరిజనుల సమస్యలు పట్టవా అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌కు కేసీఆర్‌ పాలన అంతగా నచ్చితే జనసేన పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని సీఎల్‌పీ ఉప నేత జీవన్‌రెడ్డి సలహా ఇచ్చారు.

రోజు రోజుకూ పెరుగుతున్న ఇసుక మాఫియా
తెలంగాణలో రోజు రోజుకూ పెరుగుతున్న ఇసుక మాఫియా ఆగడాలు, కులవివక్ష, దళితులపై దాడులను ప్రశ్నించలేని పవన్‌ కల్యాణ్‌.. కేసీఆర్‌కు భజన చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెక్క భజన చేసే పవన్‌ కల్యాణ్‌కు రాజకీయ పార్టీ వేస్ట్‌ అని ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి విమర్శించారు.సినిమాల్లో సీన్‌ ముగియడంతో పవన్‌ రాజకీయాల్లోకి వచ్చారంటూ కాంగ్రెస్‌ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి పవన్‌ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌, చంద్రబాబులకు చెక్కభజన చేసేందుకే జనసేన పార్టీ ఉందన్న ఆయన యాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. పవన్‌ ప్రశ్నించే వారు కాదని చెక్కభజన చేసే కల్యాణ్‌ అని ఎద్దేవా చేశారు. అలాగే టీడీపీ, వైసీపీ పార్టీలు ఏపీ ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యారని తులసి రెడ్డి మండిపడ్డారు. జగన్‌కు క్విడ్‌ ప్రోకో, చంద్రబాబుకు ఓటుకు నోటు కేసుల భయం పట్టుకుందని విమర్శించారు. 

 

20:34 - January 23, 2018
17:40 - January 23, 2018

కరీంనగర్ : పవన్‌ రాజకీయ ప్రస్థానం మరోసారి ఊపందుకుంది. న్నిటిదాకా ప్రజాసమస్యలపై స్పందిస్తూ వస్తున్న పవన్‌.. ప్రస్తుతం తెలంగాణలో యాత్రను కొనసాగిస్తూ మరోసారి రాజకీయాలను ఆసక్తికరంగా మార్చారు. జగిత్యాలజిల్లా కొండగట్టులో పూజలు చేసిన పవన్‌..కరీంనగర్‌ జిల్లాతో తన అనుబంధాన్ని కొనసాగించారు. మొదటిసారిగా 2009లో కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన పవన్‌.. అప్పట్లో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. అప్పటి ప్రజారాజ్యం పార్టీకి అనుబంధ విభాగంగా ఏర్పడిన యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ ప్రచారాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో ఆయన పలు అవాంతరాలు ఎదుర్కొన్నారు. తన పర్యటనకు ఉపయోగించిన వాహనం మొరాయించడంతోపాటు చివరికి విద్యుత్‌షాక్‌కు గురై ప్రాణాలతో బయటపడటం లాంటి సంఘటనలు జరిగాయి, పవన్‌ కరీంనగర్‌జిల్లాతోపాటు కొండగట్టు క్షేత్రంతో తన అనుబంధాన్ని కొనసాగించడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

2009 జనవరి 20న కొండగట్టులో
ప్రజారాజ్యంపార్టీ ఆవిర్భావం తర్వాత 2009 జనవరి 20న కొండగట్టులో పవన్‌కల్యాణ్‌ పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో తన ప్రచార రథం మొరాయించడంతో పవన్‌ నానాఅవస్థలు పడ్డారు. చివరికి తన ప్రచార రథాన్ని తాడుతోకట్టి లాగించుకుంటూ మెకానిక్‌ షెడ్‌కు చేరుకోవాల్సివచ్చింది. వాహనం రిపేర్‌ అయ్యేంతవరకు దాదాపు 4గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి ప్రాచారం ప్రారంభించిన పవన్‌.. హుస్నాబాద్‌ పట్టణంలో తన ప్రచారరథం టాప్‌లో నిలుచుని ప్రచారం నిర్వహిస్తుండా 11కేవీ విద్యుత్‌ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన పవన్‌ను అప్పట్లో ఆయన కుటుంబసభ్యులు కూడా వచ్చి పరామర్శించారు. అయితే అప్పట్లో ఆయన వెంట ఉన్న వైద్య బృందం సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో అప్పటి యువరాజ్యం అధ్యక్షుడు, ఇప్పటి జనసేనాని ప్రాణాలతో బయటపడ్డారు.

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత..
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పవన్‌..మరోసారి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ అభిమానులు ఆనాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తనకు కొండగట్టు అంజన్న అంటే చాలా భక్తి భావం ఉందని పవన్‌ మరోసారి చాటారని అభిమానులు చెప్పుకుంటున్నారు. 2009నాటి పర్యటనలో కూడా కొండగట్టులో పూజలు నిర్వహించిన ప్రచారం నిర్వహించిన పవన్‌కళ్యాణ్‌కు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. అయినా మరోసారి కొండగట్టులో పూజలు నిర్వహించి.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారైనా పవన్‌కు అన్నీ కలిసిరావాలని జనసేనపార్టీ కార్యకర్తలు, పవర్‌స్టార్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

16:36 - January 23, 2018

చెన్నై : నాగబాబు కూతరు నిహారిక తెలంగాణలో పర్యటిస్తున్న బాబాయ్ పవన్ కల్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఆమె ఒరు నల్ల నాల్ పొత్తు సాల్రేవ్ తమిళ చ్రితంలో నటిస్తోంది.. ఈ చిత్రానికి అర్మిగ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిహరిక విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల చేస్తామని చెబుతున్నారు. తమిళంఓ నటించడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా బాబాయ్ కి ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

16:00 - January 23, 2018

కరీంనగర్ : జనసేన ఆకాంక్ష తెంగాణ యువత ఆకాంక్ష అన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. 2019 ఎన్నికల్లో పోటీలో ఉంటామని పవన్‌ అన్నారు. పార్టీ శక్తిసామర్థ్యాల మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తామన్నారు. రాబోయే ఎన్నికల సమరానికి సుదీర్ఘ యుద్ధం చేయడానికి కార్యకర్తలు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను స్మార్ట్‌సీఎం అంటే కాంగ్రెస్‌ నాయకులకు ఎందుకు కోపం అని పవన్‌ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉండి ప్రజలకోసం పోరాడే ఎవరినైనా తాను గౌవరవిస్తాన్నన్నారు. కాని కాంగ్రెస్‌వారిని మెప్పించడానికి తాను కేసీఆర్‌ను విమర్శించనని పవన్‌ స్పష్టంచేశారు. తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారని కేసీఆర్‌పై పవన్‌ మరోసారి ప్రశంశలు కురిపించారు. తనకు ప్రజాసేవలోనే సంతృప్తి ఉందన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి జనసేన కృషిచేస్తుందన్నారు. తాను పార్టీని చాలా బాధ్యతగా నడిపిస్తున్నానన్న పవన్‌ కల్యాణ్‌.. రాబోయే ఎన్నికల్లోజనసేన పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. జైతెలంగాణ నినాదంతో ప్రారంభించిన స్పీచ్‌ను అదే నినాదంతో ముగించారు. 

15:18 - January 23, 2018
15:13 - January 23, 2018

కరీంనగర్ : వందేమాతరం నినాదంతో సమనానమైనది జైతెలంగాణ నినాదం అన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. కరీంనగర్‌లో పార్టీకార్యకర్తలతో భేటీ సందర్భంగా జైతెలంగాణ అని నినదించి తన ప్రసంగా ప్రారంభించారు. సామాజిక న్యాయం అంటే కేవలం ఎన్నికల్లో సీట్లు కేటాయించడమేకాదన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. అభివృద్ధికి దూరంగా ఉన్న కులాలకు ఆర్థిక భద్రత కల్పించడమే సామాజిక న్యాయం అన్నారు. అటు దేశంలో పెరుగుతున్న మతతత్వ ధోరణులపై పవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విభజన సమయంలో మత ప్రాతిపధిక పాకిస్థాన్‌ ఏర్పడినా.. భారత్‌ను మాత్రం సెక్యులర్‌ రాజ్యంగా నిర్మించారని పవన్‌ అన్నారు. మతాల ప్రస్తావన లేని దేశనిర్మాణమే జనసేన లక్ష్యం అన్నారు. దేశంలో సెక్యులర్‌ వ్యవస్థ పరిరక్షణక జనసేన కృషిచేస్తుందన్నారు పవన్‌ కల్యాణ్‌. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రాంతీయభాషలను, యాసలను కాపాడేందుకు జనసేనపార్టీ లక్ష్యంగా పెట్టుంకుందన్నారు. 

Don't Miss

Subscribe to RSS - Pawan Political Tour