Pawan Telangana Tour
ఖమ్మం : తెలంగాణలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మూడురోజుల పర్యటన ముగిసింది. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు కొండగట్టు నుంచి ప్రారంభించిన రాజకీయ యాత్ర.. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొనసాగింది. ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయాల మార్పుపై దృష్టిపెట్టాలన్నారు. ఉడుకు నెత్తురుతో ఉన్న యువత తమతో కలిసి రావాలని కోరారు.
నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా ఓ కారణమని
తాను రాజకీయాల్లోకి రావడానికి నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా ఓ కారణమని పవన్ అన్నారు. బీఆర్ అంబేడ్కర్, ఫూలే విధానాలతో ముందుకెళ్తానని చెప్పారు. తనకు కులం, మతం లేదన్న పవన్.. మానవత్వం, జాతీయతను గౌరవిస్తానన్నారు. మన సమాజం కులవ్యవస్థతో ముడిపడి ఉందని.. కులవ్యవస్థను గౌరవించాలన్నారు. తనపై దాడులు చేసినా ఎదురుదాడి చేయనని పవన్ అన్నారు. ప్రజల కోసం ఏమైనా భరిస్తానని చెప్పారు. జనసేన ద్వారా ప్రజా సేవ చేసేందుకే ప్రజల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. 'జై తెలంగాణ' 'జైహింద్' అన్న నినాదాలు తనకెంతో ఇష్టమన్నారు. తెలంగాణ జిల్లాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు పరిష్కారాలు చూపేందుకు యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఏళ్లు గడిచినా నల్గొండ జిల్లావాసుల ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్నారు. ఫ్లోరైడ్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రజా సమస్యల కోసం వచ్చిన వ్యక్తిపై కొందరు దుందుడుకు స్వభావం ప్రదర్శిస్తున్నారని, అయితే తమకు పూర్తి సహనం ఉందన్నారు.
వ్యక్తి చెప్పుతో దాడి..
అంతకు ముందు పవన్ ఖమ్మం పట్టణంలోకి చేరుకోగానే.. గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఓపెన్‌టాప్ వెహికల్లో అభిమానులకు అభివాదం చేసుకుంటూ ర్యాలీ నిర్వహిస్తున్న పవన్‌పై ఓ ఆగంతకుడు చెప్పు విసిరాడు. అయితే అదృష్టవశాత్తూ అది కారు బ్యానెట్‌పై పడడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.అటు పవన్ సభ ముగింపు దశలో అభిమానుల తోపులాట చోటుచేసుకుంది. తమ అభిమాన నేతను చూసేందుకు అభిమానులు బారికేడ్లు దాటి ముందుకు దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. మొత్తానికి పవన్ పర్యటన అభిమానులు, జనసేన కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. మళ్లీ వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు వస్తానని పవన్ చెప్పడంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.

భద్రాద్రికొత్తగూడెం : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొత్తగూడెం నుంచి ఖమ్మం బయలుదేరారు. కాసేపట్లో ఖమ్మం పట్టణం ఆయన చేరుకోనున్నారు. ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలో సమావేశం అవుతారు. కొత్తగూడెంలో బయలుదేరే ముందు పవన్ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను అధ్యయనం చేసుకోవడానికే తాను యాత్ర చేపట్టినట్టు తెలిపారు. తనకు అద్భుత ఆథిత్యం ఇచ్చిన కొత్తగూడెం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారాయన.
కరీంనగర్ : పవన్ రాజకీయ ప్రస్థానం మరోసారి ఊపందుకుంది. న్నిటిదాకా ప్రజాసమస్యలపై స్పందిస్తూ వస్తున్న పవన్.. ప్రస్తుతం తెలంగాణలో యాత్రను కొనసాగిస్తూ మరోసారి రాజకీయాలను ఆసక్తికరంగా మార్చారు. జగిత్యాలజిల్లా కొండగట్టులో పూజలు చేసిన పవన్..కరీంనగర్ జిల్లాతో తన అనుబంధాన్ని కొనసాగించారు. మొదటిసారిగా 2009లో కరీంనగర్ జిల్లాలో పర్యటించిన పవన్.. అప్పట్లో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. అప్పటి ప్రజారాజ్యం పార్టీకి అనుబంధ విభాగంగా ఏర్పడిన యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో ఆయన పలు అవాంతరాలు ఎదుర్కొన్నారు. తన పర్యటనకు ఉపయోగించిన వాహనం మొరాయించడంతోపాటు చివరికి విద్యుత్‌షాక్‌కు గురై ప్రాణాలతో బయటపడటం లాంటి సంఘటనలు జరిగాయి, పవన్ కరీంనగర్‌జిల్లాతోపాటు కొండగట్టు క్షేత్రంతో తన అనుబంధాన్ని కొనసాగించడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
2009 జనవరి 20న కొండగట్టులో
ప్రజారాజ్యంపార్టీ ఆవిర్భావం తర్వాత 2009 జనవరి 20న కొండగట్టులో పవన్‌కల్యాణ్ పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో తన ప్రచార రథం మొరాయించడంతో పవన్ నానాఅవస్థలు పడ్డారు. చివరికి తన ప్రచార రథాన్ని తాడుతోకట్టి లాగించుకుంటూ మెకానిక్ షెడ్‌కు చేరుకోవాల్సివచ్చింది. వాహనం రిపేర్ అయ్యేంతవరకు దాదాపు 4గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి ప్రాచారం ప్రారంభించిన పవన్.. హుస్నాబాద్ పట్టణంలో తన ప్రచారరథం టాప్‌లో నిలుచుని ప్రచారం నిర్వహిస్తుండా 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన పవన్‌ను అప్పట్లో ఆయన కుటుంబసభ్యులు కూడా వచ్చి పరామర్శించారు. అయితే అప్పట్లో ఆయన వెంట ఉన్న వైద్య బృందం సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో అప్పటి యువరాజ్యం అధ్యక్షుడు, ఇప్పటి జనసేనాని ప్రాణాలతో బయటపడ్డారు.
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత..
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పవన్..మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ఆనాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తనకు కొండగట్టు అంజన్న అంటే చాలా భక్తి భావం ఉందని పవన్ మరోసారి చాటారని అభిమానులు చెప్పుకుంటున్నారు. 2009నాటి పర్యటనలో కూడా కొండగట్టులో పూజలు నిర్వహించిన ప్రచారం నిర్వహించిన పవన్‌కళ్యాణ్‌కు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. అయినా మరోసారి కొండగట్టులో పూజలు నిర్వహించి.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారైనా పవన్‌కు అన్నీ కలిసిరావాలని జనసేనపార్టీ కార్యకర్తలు, పవర్‌స్టార్ అభిమానులు కోరుకుంటున్నారు.
చెన్నై : నాగబాబు కూతరు నిహారిక తెలంగాణలో పర్యటిస్తున్న బాబాయ్ పవన్ కల్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఆమె ఒరు నల్ల నాల్ పొత్తు సాల్రేవ్ తమిళ చ్రితంలో నటిస్తోంది.. ఈ చిత్రానికి అర్మిగ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిహరిక విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల చేస్తామని చెబుతున్నారు. తమిళంఓ నటించడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా బాబాయ్ కి ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కరీంనగర్ : జనసేన ఆకాంక్ష తెంగాణ యువత ఆకాంక్ష అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల్లో పోటీలో ఉంటామని పవన్ అన్నారు. పార్టీ శక్తిసామర్థ్యాల మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తామన్నారు. రాబోయే ఎన్నికల సమరానికి సుదీర్ఘ యుద్ధం చేయడానికి కార్యకర్తలు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను స్మార్ట్‌సీఎం అంటే కాంగ్రెస్ నాయకులకు ఎందుకు కోపం అని పవన్ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉండి ప్రజలకోసం పోరాడే ఎవరినైనా తాను గౌవరవిస్తాన్నన్నారు. కాని కాంగ్రెస్‌వారిని మెప్పించడానికి తాను కేసీఆర్‌ను విమర్శించనని పవన్ స్పష్టంచేశారు. తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారని కేసీఆర్‌పై పవన్ మరోసారి ప్రశంశలు కురిపించారు. తనకు ప్రజాసేవలోనే సంతృప్తి ఉందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి జనసేన కృషిచేస్తుందన్నారు. తాను పార్టీని చాలా బాధ్యతగా నడిపిస్తున్నానన్న పవన్ కల్యాణ్.. రాబోయే ఎన్నికల్లోజనసేన పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. జైతెలంగాణ నినాదంతో ప్రారంభించిన స్పీచ్‌ను అదే నినాదంతో ముగించారు.
Pages
Don't Miss
