PM narendra modi

11:20 - April 19, 2017

ఢిల్లీ : ఇక నుంచి ప్రతీ ఆదివారం పెట్రోల్‌ బంకులు పని చేయవు. మే 14న నుంచి దీనిని అమలు చేయనున్నట్లు పెట్రోల్‌ బంకు యజమానుల సంఘం తెలిపింది. పెట్రోలు వాడకాన్ని తగ్గించడం ద్వారా ఇంధన వనరులను కాపాడుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు దీనిని అమలు చేయనున్నామని వెల్లడించారు. మే 14 నుంచి ప్రతీ ఆదివారం ఎనిమిది రాష్ట్రాల్లో పెట్రోలు బంకులు పని చేయవు. వాటిలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలున్నాయి. 

 

21:59 - April 16, 2017
06:31 - February 5, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి వెళ్లాల్సిన అఖిలపక్షం పర్యటన కూడా వాయిదా పడింది. చివరి నిమిషంలో ప్రధాని అపాయింట్‌మెంట్‌ రద్దు చేసినట్లు సీఎం కార్యాలయానికి PMO సమాచారమిచ్చింది. ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఖరారైన తర్వాత మళ్లీ సమాచారమిస్తామని చెప్పడంతో.. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై రెండున్నరేళ్ల తర్వాత అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కేసీఆర్‌ భావించారు. ఆదివారం ఢిల్లీ వెళ్లి.. సోమవారం ప్రధాని మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారు. దీనికి పీఎంవో అంగీకరించడంతో ఢిల్లీ వెళ్లేందుకు కేసీఆర్‌ సిద్ధమయ్యారు. ఢిల్లీ రావాలని అఖిలపక్ష నేతలకు ఆహ్వానాలు కూడా పంపారు. ఢిల్లీకి వెళ్లేందుకు అందరూ సిద్ధమవుతున్న తరుణంలో మోదీ అపాయింట్‌మెంట్‌ క్యాన్సిల్‌ అయ్యిందంటూ పీఎంవో అధికారులు.. సీఎం కార్యాలయానికి మెసెజ్‌ పంపారు. అఖిలపక్షానికి అపాయింట్‌మెంట్‌ గురించి త్వరలో సమాచారమిస్తామని ప్రధాని కార్యాలయ అధికారులు తెలిపారు. దీంతో ఆఖరిక్షణంలో అఖిలపక్షం ఢిల్లీ టూర్‌ రద్దు అయ్యింది. పార్లమెంట్‌ సమావేశాలు, యూపీ ఎన్నికల నేపథ్యంలో అఖిలపక్షానికి ప్రధాని అపాయింట్‌మెంట్‌ రద్దు అయ్యినట్లు తెలుస్తోంది.

16:13 - January 30, 2017

ఢిల్లీ : లిక్కర్‌కింగ్‌ విజయ్‌ మాల్యాకు భారీగా రుణాలు ఇప్పించడంలో యూపీఏ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని బిజెపి ఆరోపించింది. మాల్యాకు రుణాలు మంజూరు చేయించడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వ్యక్తిగతంగా సహకరించారని బిజెపి ప్రతినిధి సంబిత్‌ పాత్ర ఆరోపించారు. 2011-2013 మధ్య మాల్యా మన్మోహన్‌, మాజీ ఆర్థికమంత్రి చిదంబరంకు రాసిన లేఖలను మీడియా ముందు విడుదల చేశారు..  కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు బ్యాంకులు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని మాల్యా విజ్ఞప్తి చేసినట్లు లేఖలో ఉంది. బిజెపి ఆరోపణలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. ఎన్నికల స్టంట్‌గా కాంగ్రెస్‌ కొట్టిపారేసింది. మాల్యా బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌ పారిపోయిన విషయం తెలిసిందే.

 

16:05 - January 30, 2017

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగిస్తారు. వచ్చే నెల 1న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2017-18 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. పార్లమెంటు బడ్జెట్‌ భేటీకి అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమయ్యాయి. ఈ సమావేశాలు వాడీవేడీగా జరుగనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు జరుగనున్న ఈ సమావేశాలను ఓటర్లకు సందేశాలు పంపే వేదికగా ఉపయోగిచుకోవాలని అధికార, ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కీలకమైన జీఎస్ టీ బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్, ఎస్ పీ, బీఎస్పీలు సిద్ధమవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై సభను స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయి. 

 

14:25 - January 26, 2017
11:28 - January 26, 2017

ఢిల్లీ : హస్తినలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ పథ్ లో జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అబుదాబి యువరాజు మహ్మద్ జహేద్ హాజరయ్యారు. తేజస్ యుద్ధ విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ ఆయుధ సత్తా ప్రదర్శిస్తున్నాయి. తొలిసారిగా కవాతులో యూఏఈ జావాన్లు పాల్గొన్నారు. అమర జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. 
వివిధ రాష్ట్రాల శకటాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:24 - January 26, 2017

ఢిల్లీ : హస్తినలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణతంద్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అబుదాబి యువరాజు మహ్మద్ జహేద్ హాజరయ్యారు. తేజస్ యుద్ధ విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ ఆయుధ సత్తా ప్రదర్శించనుంది. తొలిసారిగా కవాతులో యూఏఈ జావాన్లు పాల్గొన్నారు. ప్రధాని మోడీ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. 

 

21:19 - January 24, 2017

ఢిల్లీ: నోట్ల రద్దుపై అధ్యయనం చేసి తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన బృందం తమ మధ్యంతర నివేదికను ప్రధాని మోదీకి సమర్పించింది. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఈ బృందం ప్రధాని మోదీని కలిసి ఈ నివేదికను సమర్పించింది. డిజిటల్‌ కరెన్సీపై ఎలాంటి రుసుం వసూలు చేయకూడదని వీలైతే రాయితీ ఇవ్వాలని నివేదికలో సూచించారు. అలాగే.. స్మార్ట్‌ ఫోన్‌కు, బయోమెట్రిక్‌ డివైజ్‌కు వెయ్యి రూపాయల సబ్సిడీ ఇవ్వాలని కోరారు. డిజిటల్‌ లావాదేవీల్లో ఇన్సూరెన్స్‌ విధానం అమలు చేయాలన్నారు. వీటితో పాటు 50 వేల రూపాయల పైన డబ్బులు డ్రా చేస్తే క్యాష్‌ హ్యాండ్లింగ్‌ ఛార్జీలు వేయాలని నివేదికలో సూచించినట్లు చంద్రబాబు తెలిపారు. డిజిటల్‌ లావాదేవీలతో అవినీతి అంతమవుతుందన్నారు. పీఎంను కలిసిన వారిలో మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ అరవింద్ పనగరియా తదితరులు ఉన్నారు.

15:45 - January 20, 2017

బడ్జెట్‌ అనే పదం బౌగెటీ అనే ఫ్రెంచి పదం నుంచి ఏర్పడింది. దాని అర్థం సంచీ. ఢిమాక్‌ అనే అర్థిక వేత్త బడ్జెట్‌ అంటే ఒక నిర్ణీత కాలంలోని ఆదాయ వ్యయాల సమతూకమైన అంనచా అని నిర్వచించారు. భారత ప్రభుత్వం లేక ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సబంధించిన ఆర్థిక సంవత్సరపు అంచనా వేయబడిన ఆదాయ వ్యయాల ద్రవ్య పట్టికే బడ్జెట్‌ అని భారత ర్యాజ్యాంగంలో వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగా గురువారం 'హల్వా' వంటకంలో జైట్లీ, అధికారులు పాల్గొన్నారు. 2017-18 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాదిస్తున్న మూడో పూర్తి స్థాయి బడ్జెట్‌.

బడ్జెట్ పత్రాలు సిద్ధమయ్యాక...
ఈ బడ్జెట్ పత్రాలు సిద్ధమయ్యాక పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో 'హల్వా' హడావుడి మొదలవుతుంది. చివరి అంకం ఈ మిఠాయితో ఆరంభం అవుతుంది. ప్రింటింగ్ కు పంపించే ముందు బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన అధికారులందరూ 'హల్వా' తింటారు. ఇది తిన్న తరువాత బడ్జెట్ పత్రాలను ముద్రించడంలో నిమగ్నమౌతారు. అత్యంత కట్టుదిటమైన భద్రత మధ్య ఈ పత్రాలను ప్రింటింగ్ చేస్తారు. బడ్జెట్ పత్రాలు మాత్రం పార్లమెంట్ లోని నార్త్ బ్లాక్ లోని ఒక ప్రత్యేకమైన ముద్రాణాలయంలో వీటిని ముద్రించడం జరుగుతుంది. బడ్జెట్ పత్రాల్లోని సమాచారం ఏ మాత్రం లీక్ కాకుండా జాగ్రత్త పడుతారు. అత్యాధునిక సౌకర్యాలతో హాల్ ఉంటుంది. ఆర్థిక శాఖకు చెందిన 100 మందికి పైగా అధికారులు పార్లమెంటులో ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం ముగిసే వరకు బడ్జెట్‌ ముద్రణ జరుగుతున్న ప్రెస్‌లోనే బస చేయాల్సి ఉంటుంది. కుటుంబసభ్యులతో సంబంధం లేకుండా ఉండాలి. అందుకే వారికి తీపి తినిపించడం ప్రధాన లక్ష్యం. ఈ సమయంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఫోన్ లో కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. బడ్జెట్ పత్రాల సమాచారం తెలియకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - PM narendra modi