police station

18:40 - April 25, 2018

కరీంనగర్‌ : జిల్లాలో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెంలో కౌలురైతు మల్లారెడ్డి.. 20ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న వేశారు. అయితే మొక్కజొన్న పంటలో పూర్తిగా నష్టపోవడంతో అప్పులపాలైన మల్లారెడ్డి.. పురుగల మందుతాగి ప్రాణం తీసుకున్నాడు. ప్రభుత్వం న్యాయం చేయాలంటూ అలుగునూరు చౌరస్తాలో మృతదేహంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్‌...వరంగల్‌ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. భారీగా వాహనాలు నిలిచపోయాయి.  

06:31 - April 15, 2018

హైదరాబాద్ : సినీనటి శ్రీరెడ్డి హుమాయూన్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి, సత్యాచౌదరిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈనెల 4న ఓ టీవీచానల్‌లో డిబేట్‌ సందర్భంగా తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో పెర్కొంది శ్రీరెడ్డి. పైగా తనను చంపుతామని బెదిరిస్తున్నారని కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన హుమాయూన్‌గన్‌ ఇన్‌స్పెక్టర్‌ టీవీ డిబేట్‌ను పరిశీలించిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని చెప్పారు. 

20:21 - March 5, 2018

హైదరాబాద్ : సికింద్రబాద్‌లోని రేతిఫైల్‌ బస్టాండ్‌ ఎదురుగా ఇద్దరు కాలేజి అమ్మాయిలను ఓ ఆటో డ్రైవర్‌ వేధించాడు. రెండు కిలో మీటర్ల దూరం నుండి వెక్కిలి చేష్టలు చేస్తూ, రేతిఫైల్‌ బస్టాండ్‌ వద్దకు రాగానే ఇద్దరు అమ్మాయిల చేతులను పట్టుకుని లాగాడు. అమ్మాయిలు కేకలు వేయడంతో పక్కనే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌.. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీసులకు అప్పగించాడు. 

 

17:54 - February 20, 2018

ఆదిలాబాద్ : గ్రామానికి ఆదర్శంగా ఉండాల్సిన సర్పంచ్ దారి తప్పాడు. ఓ మైనర్ బాలికను మోసం చేశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మణ చాంద మండలం మల్లాపూర్ సర్పంచ్ గా శ్రీనివాస్ ఉన్నాడు. అదే గ్రామంలో తల్లిదండ్రులు..లేని ఓ మైనర్ బాలికపై సర్పంచ్ కన్నేశాడు. మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు. పెళ్లి మాట ఎత్తగానే సర్పంచ్ ఆ బాలికను కొట్టి వెళ్లగొట్టాడు. దీనితో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. కానీ నిందితుడిని అరెస్టు చేయకపోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 

07:34 - January 25, 2018

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగింది. నగర శివార్లలోని జవహర్‌నగర్‌కు చెందిన మహేందర్‌, సోనీ ప్రేమించుకున్నారు. విషయం సోనీ కుటుంబ సభ్యులకు తెలియడంతో మాట్లాడేందుకని మహేందర్‌ను పిలిపించారు. భరత్‌నగర్‌లోని ఓ రూములో బంధించి చిత్రహింసలకు గురిచేయడంతో తప్పించుకుని ఆస్పత్రిలో చేరాడు. సోని కుటుంబ సభ్యులు మహేందర్‌పై హత్యాయత్నం చేశారని బాధితుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

18:00 - November 19, 2017

నిజామాబాద్ : దళితులపై దాడి చేసిన భరత్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. నిజామాబాద్ జిల్లా, ఆబందపట్నం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఓయూ జేఏసీ, దళిత జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భరత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. 

17:15 - November 2, 2017

హైదరాబాద్ : ఇల్లును ఖాళీ చేయరా...? అంటూ ఓ యజమాని ఏకంగా ఇల్లునే కూల్చివేశాడు. ఇంట్లో ఉన్న సామానును బయటకు విసిరేసి ఇంటిని కూల్చేయడంతో నిడువనీడ లేదని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటన కేపీహెచ్ బి కాలనీలో చోటు చేసుకుంది. కేపీ హెచ్ బీ కాలనీలో ఓ ఇంటిని ప్రసాద్ దగ్గర నుండి మోహన్ రెడ్డి కిరాయి కోసం అగ్రిమెంట్ చేసుకున్నాడు. పది సంవత్సరాల క్రితం ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కానీ ఈ ఇంటిని శ్రీహరికి ప్రసాద్ విక్రయించాడు. తాను ఇంటిని కొనడం జరిగిందని..ఇళ్లు ఖాళీ చేయాలని శ్రీహరి..మోహన్ రెడ్డికి ఆదేశించాడు. కానీ తమకు ఈ విషయం తెలియదని..పది సంవత్సరాల వరకు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగిందని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై తాము కోర్టుకు వెళ్లడం జరిగిందని బాధితులు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొంతమంది రౌడీషీటర్లతో ఇంటికి వచ్చిన శ్రీహరి ఇంటిలో ఉన్న సామానును బయటకు విసిరేసి ఇంటిని కూల్చివేయించాడు. ఎవరూ స్పందించలేదని, పీఎస్ లో ఫిర్యాదు చేసినా ఇంటిని కూల్చివేసిన అనంతరం వారు వచ్చారని వాపోయారు. 

16:23 - October 25, 2017

సూర్యాపేట : జిల్లా నూతనకల్‌ మండలం వెంకెపల్లిలో అర్ధరాత్రి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామ అభివృద్ధి జరగలేదంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ చేపట్టిన పల్లె నిద్రను గ్రామస్తులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే.. నిరసనకారులపై పోలీసులతో ఉక్కుపాదం మోపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కిశోర్ కాన్వాయిని అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మహిళలపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు. పలువురిని అరెస్ట్ చేసి నూతనకల్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి బందోబస్తు మధ్య ఎమ్మెల్యే కిశోర్ పల్లె నిద్రను కొనసాగించారు. నిరసన తెలిపిన తమపై అకారణంగా పోలీసులతో దాడి చేయించి, అర్ధరాత్రి వరకు స్టేషన్‌లో బంధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు కోరుతున్నారు. 

16:19 - October 25, 2017

విశాఖ : ప్రజా సంఘాలు- పోలీసుల మధ్య పోస్టర్స్‌ వార్‌ జరుగుతోంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళ, గిరిజన సమస్యలపై చైతన్య మహిళా సంఘం ధర్నా చేపట్టింది. సీఎంఎస్‌ ధర్నాకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అమాయక గిరిజనులను ఉద్యమాల వైపు నడిపిస్తున్నారంటూ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లను చైతన్య మహిళా సంఘం సభ్యులు తగలబెట్టారు. తమకు వ్యతిరేకంగా పోలీసులే పోస్టర్లను.. గిరిజనులతో ర్యాలీలను చేయిస్తున్నారంటూ రోడ్డు పై బైటాయించారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తతగా మారింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:56 - October 23, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - police station