Prabhas movies

15:55 - November 2, 2017

సినిమా : హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాహుబలి1,2 సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. బాహుబటి సినిమాలతో తర్వాత ప్రభాస్ మరో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఆ చిత్రమే ''సాహో'’ ఈ సినిమాను దాదాపు రూ.150కోట్లతో తెరకెక్కిస్తున్నారు. చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో చేస్తున్నారు. సాహో ఫస్ట్ లుక్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. త్వరలో ఈ చిత్ర షూటింగ్ యూఏఈకి షిప్ట్ అవుతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుంది. 

12:33 - August 19, 2017

ఇట్స్‌ షూట్‌ టైమ్‌.. నాలుగన్నరేళ్ల బాహుబలి ప్రయాణం తర్వాత సాహో అనే యాక్షన్‌ ప్రపంచంలోకి ఎంటర్ కావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని హీరో ప్రభాస్ ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. బాహుబలి2 తర్వాత రకరకాల పిక్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు నటుడు ప్రభాస్. ఆయన నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ ‘సాహో’ శుక్రవారం మొదలైంది. ప్రస్తుతం షూట్‌ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు సమాచారం. హాలీవుడ్‌కి చెందిన నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారని, యాక్షన్‌ సన్నివేశాల్ని ఫారెన్‌లో తెరకెక్కించేలా డైరెక్టర్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సుజీత్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌లో ప్రభాస్ పక్కన శ్రద్ధాకపూర్ హీరోయిన్ నటిస్తున్నారు.

11:16 - August 16, 2017

'బాహుబలి'..'బాహుబలి-2' సినిమాల అనంతరం 'ప్రభాస్' నటిస్తున్న న్యూ ఫిల్మ్ 'సాహో' చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. చిత్రం షూటింగ్ ప్రారంభం కాకముందే చిత్ర టీజర్ విడుదలయిన సంగతి తెలిసిందే. కానీ సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రం బయటకు పొక్కడం లేదు. 'ప్రభాస్' సరసన హీరోయిన్ ఎవరు నటిస్తారనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. 

'ప్రభాస్' సరసన నయనతార, అనుష్క, కాజల్ నటిస్తారని, బాలీవుడ్ హీరోయిన్స్ లను ఎంపిక చేస్తారని టాక్ వినిపించింది. దీనికంతటికీ ఫుల్ స్టాప్ పడింది. 'సాహో' లో హీరోయిన్ గా 'శ్రద్ధాకపూర్' నటించబోతోంది. 'ఆషికి-2'తో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పేరే తెచ్చుకుంది. ఆమె తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం 'సాహో' కావడం విశేషం.

సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చిత్రం నిర్మితమౌతోంది. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నిపుణులు పనిచేస్తున్నట్లు టాక్. యాక్షన్ కి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ స్టైలిష్ గా ఇదివరకటి కంటే భిన్నంగా తెరపై కనిపించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. 

12:07 - June 13, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్'..టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' లు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది ? అటు సల్మాన్..ఇటు ప్రభాస్ అభిమానులకు పండుగే పండుగ కదా. బాక్సాపీస్ వద్ద రికార్డులు నెలకొంటాయి కదా..ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ దర్శక..నిర్మాత కరణ్ జోహార్ కూడా 'ప్రభాస్' తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'ప్రభాస్' నటించిన 'బాహుబలి 2' సినిమా ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. హిందీలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. తాజాగా 'ప్రభాస్' సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 'సల్మాన్' 'ట్యూబ్ లైట్' చిత్రంలో నటిస్తున్నాడు. రంజాన్ పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది. మరి సల్మాన్..ప్రభాస్ లు కలిసి నటిస్తారా ? లేదా ? అనేది త్వరలోనే తెలియనుంది.

11:39 - April 21, 2017

చెన్నై : హీరో ధనుష్ పై తుది తీర్పు వెల్లడైంది. ధనుష్ తమ కొడుకేనని..తమ బాగోగులు చేసుకోవడం లేదని మేలూర్ కు చెందిన కదిరేషన్ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మద్రాసు హైకోర్టు శుక్రవారం తుదితీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో ధనుష్ కు ఊరట లభించినట్లైంది. కదిరేషన్ దంపతులు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
తాను 1983లో జులై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులకు జన్మించానని...అప్పట్లో తన పేరు వెంకటేశ్ ప్రభు అని, సినిమాల్లోకి వచ్చాక ధనుష్‌ కే రాజాగా పేరు మార్చుకున్నానని మద్రాస్ హైకోర్టులో ధనుష్ పిటిషన్ దాఖలు చేశారు. 1985 నవంబర్7న మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జన్మించాడని తమ వద్ద ఆధారాలున్నాయని కదిరేషన్ వృద్ధ దంపతులు కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇరువురు జనన ధృవీకరణ, విద్యా సంబంధ పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తుది తీర్పును వెల్లడించింది.

11:07 - April 21, 2017

ఒక సినిమా కోసం హీరో..హీరోయిన్లు ఎంతో కష్టపడుతుంటారు. పాత్రలో లీనమై పోవాలని వారు భావిస్తుంటారు. అందుకనుగుణంగా శిక్షణలను సైతం తీసుకుంటుంటారు. అందులో హీరోయిన్లు కూడా శిక్షణలను పొందుతుండడం గమనార్హం. ఇటీవలే వచ్చిన 'బాహుబలి', ‘రుద్రమదేవి' చిత్రాల్లో 'అనుష్క' యుద్ధ విద్యలలో శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. తరువాత 'సంఘమిత్ర' కోసం 'శృతి హాసన్' ఏకంగా కత్తి విన్యాసాలు నేర్చుకొంటోంది. తాజాగా 'సమంత' ఇందులో చేరింది. ఈమె కర్రసాము నేర్చుకొంటోంది. ‘సమంత' చేస్తున్న కర్రసాము వీడియో సోషల్ మీడియాలో వైరల అవుతోంది. ప్రస్తుతం 'రాజు గారి గది -2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా 'రామ్ చరణ్' - ‘సుకుమార్' కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో కూడా 'సమంత' నటిస్తోంది. కర్రసాము ఏ చిత్రంలో ఉండనుందో తెలియరావడం లేదు. ‘నాకు సవాళ్లంటే ఇష్టం..కర్రసాము నేర్చుకోవడం ఓ సవాల్ గా తీసుకున్నా..ఇప్పుడు దీనితోనే నా సహవాసం' అంటూ సమంత పేర్కొంది. మరి ఆమె సమంత కర్రసాము ఎలా చేసిందో..ఏ చిత్రంలో చేసిందో చూడాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

10:50 - April 21, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' నటించిన 'బాహుబలి -2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానుంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అనంతరం 'ప్రభాస్' తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. గత ఎన్ని ఏళ్లుగా ఒక్కచిత్రానికే ప్రభాస్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. ఈ చిత్రానికి 'సాహో' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్. చిత్ర టీజర్..మొదటి లుక్స్ పై చిత్ర యూనిట్ సన్నాహాలు కూడా చేస్తోంది. సినిమాకు సంబంధించిన పోస్టర్ ఏప్రిల్ 23నే విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ రోజున మొదటి లుక్ ఉండదని ప్రచారం జరుగుతోంది. దీనితో ప్రభాస్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇక 'బాహుబలి -2' సినిమా విడుదలైన థియేటర్స్ లలో 'సాహో' టీజర్ ను ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. ఈ టీజర్ పై అందరిలోను మరింతగా ఆసక్తి పెరగాలనే ఉద్దేశంతో, ఫస్టులుక్ లాంచ్ ను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలన్నిటిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

16:55 - April 19, 2017

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తన తదుపరి చిత్రం కోసం వేగం పెంచాడు. గత కొన్ని సంవత్సరాలుగా 'బాహుబలి', ‘బాహుబలి-2’ సినిమా కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యలో ఎలాంటి చిత్రాలు చేయలేదు. ఒక్క సినిమా కోసమే తాను పని చేయడం జరిగిందని ఆ తరుణంలో ఎలాంటి కథలు వినలేదని 'ప్రభాస్' ఈ మధ్య చెప్పారు. ఇటీవలే 'బాహుబలి -2’ సినిమాకు చిత్ర యూనిట్ గుమ్మడి కాయ కొట్టడంతో ప్రభాస్ ఫ్రీ అయ్యారు. ఏప్రిల్ 28వ తేదీన చిత్రం విడుదల కానుంది. అనంతరం తన నెక్ట్స్ సినిమాపై దృష్టి సారించారు. ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో 'ప్రభాస్' నటిస్తున్నాడు. ఈ సినిమాకు 'సాహో' అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఏప్రిల్ 23వ తేదీన రిలీజ్ చేయనున్నారని సోషల్ మాధ్యమాల్లో పోస్టు చేశారు. టీజర్ కు సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. లుక్ తో పాటు చిత్ర టైటిల్ ను కూడా రివీల్ చేయనున్నారు. తరువాత 'బాహుబలి 2’ సినిమాతో పాటు టీజర్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 'బాహుబలి' రిలీజ్ అవుతున్న తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ప్రభాస్ 19 టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు.

14:42 - February 14, 2017

తెలుగు సినిమా బడ్జెట్ లు పెరుగుతున్నా కానీ కొత్త దర్శకులకి మాత్రం ఫిలిం మేకింగ్ కి ఎక్కువ బడ్జెట్ ఇచ్చే ధైర్యం చెయ్యలేక పోతున్నారు ప్రొడ్యూసర్స్. కామన్ గా బడ్జెట్ ని కథమీద నమ్మకంతో అండ్ డైరెక్టర్ స్టామినాతో ముడిపెట్టి రిలీజ్ చేస్తారు. అంటే బడ్జెట్ ని నిర్ణయించేది డైరెక్టర్ కేపబిలిటీ అన్నమాట . బాహుబలి లాంటి పెద్ద సినిమాలకి బడ్జెట్ ఎక్కువే పెడతారు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ వెనక ఉంది వరస హిట్స్ తో ఫామ్ లో ఉన్న డైరెక్టర్ రాజమౌళి కాబట్టి. బాహుబలి సినిమా రిలీజ్ తరువాత తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. ఒక్క మనదేశంలోనే కాకుండా అబ్రాడ్ లో కూడా రికార్డులు సృష్టించింది. మంచి కలక్షన్స్ తో ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించిన ఘనత బాహుబలిది. ఆసినిమాతో లాక్ అయిపోయిన ప్రభాస్ సంవత్సరాలు సంవత్సరాలు అదే ప్రాజెక్ట్ కోసం టైం స్పెండ్ చెయ్యాస్లి వచ్చింది. బాహుబలి టు తరువాత ప్రభాస్ తన నెక్ట్స్ ఫిలింని యు వి క్రియేషన్స్ తో ప్లాన్ చేసుకున్నాడు. గతం లో ప్రభాస్ తో మిర్చి సినిమా చేసిన యు వి క్రియషన్స్ మల్లి ప్రభాస్ తో సినిమాకి రెడీ అయ్యారు. ఈ సినిమా కి గాను బడ్జెట్ ని అక్షరాలా 150 కోట్లుగా నిర్ణయించారు.

సుజిత్ డైరెక్షన్ లో..
ఇంత పెద్ద బడ్జెట్ తో సినిమా తీసేది ఏ పెద్ద డైరెక్టర్ అనుకుంటే పొరపాటే. రన్ రాజా రన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రో ఇచ్చిన యంగ్ డైరెక్టర్ సుజిత్. యు వి క్రియషన్స్ తో ఇంతకు ముందు సినిమా రన్ రాజా రన్ డైరెక్ట్ చేసిన సుజిత్ తన నెక్ట్స్ సినిమా స్టోరీని కూడా యు వి వాళ్ళకి వినిపించడం ఆ స్టోరీ ప్రభాస్ కి బాగా నచ్చడంతో ఈ చిన్న డైరెక్టర్ కి పెద్ద బడ్జెట్ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ లో 40 కోట్లతో ప్లాన్ చెయ్యాల్సిన ఈ సినిమా కధలో జరిగిన మార్పుల వాళ్ళ బడ్జెట్ 150 కోట్లకు వెళ్ళింది. షార్ట్ ఫిలింలతో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు 150 కోట్ల బడ్జెట్ సినిమాని డీల్ చెయ్యబోతున్నాడు. అదీ ప్రభాస్ తో. టాలెంట్ కి టైం రావడం అంటే ఇదే. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెయినర్ జోనర్ లో ఈ మూవీ ఉంటుందని అయితే షూటింగ్ ప్రారంభానికి మరో రెండు నెలలు పట్టొచ్చని తెలుస్తోంది.

Don't Miss

Subscribe to RSS - Prabhas movies