prakash karat

15:52 - March 9, 2018

ఢిల్లీ : త్రిపురలో వామపక్ష కార్యకర్తలు, ప్రజలపై జరుగుతున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులను ఆపాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్‌ డిమాండ్‌ చేశారు. త్రిపురలో శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వారం రోజులుగా సీపీఎం కార్యాలయాలు, కార్యకర్తలపై యథేచ్చగా దాడులు జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దాడులపై విచారణ కూడా జరపడం లేదన్నారు. త్రిపురలో దాడులను నిరసిస్తూ ఢిల్లీలో 6 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి హాజరైన ప్రకాశ్‌కారత్‌... ఇప్పటి వరకు ఆరువందలకుపైగా వామపక్ష కార్యకర్తల ఇళ్లపై దాడులు జరిగాయని.. ఇందులో 700 మంది గాయపడ్డారన్నారు. ఇదే ర్యాలీలో పాల్గొన్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు... బీజేపీ త్రిపురలో గెలిచిన తర్వాత విధ్వంసం సృష్టిస్తోందని మండిపడ్డారు. విగ్రహాలను కూలదోయడం నాగరికత ఏమాత్రం అనిపించుకోదన్నారు. దాడులతో వామపక్ష కార్యర్తలను భయపెట్టాలనుకోవడం అమాయకత్వమే అవుతుందన్నారు. త్రిపురలో జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సీపీఎం నేత వి. శ్రీనివాసరావు కోరారు. 

21:03 - February 12, 2018

పశ్చిమగోదావరి : పేద వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమే లక్ష్యమని సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహాసభలు స్పష్టం చేశాయి. వామపక్ష, అభ్యుదయ శక్తుల ఐక్యతతో బడుగులకు రాజ్యాధికారాన్ని సాధించే దిశగా.. కొత్త శకానికి నాంది పలుకుతామని మహాసభలు ప్రతినబూనాయి. మూడు రోజుల పాటు సాగిన మహాసభల చివరిరోజైన నేడు.. పి.మధును రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో జ‌రుగుతున్న సిపిఎం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌లు సోమవారం ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన సమావేశాల్లో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశాల చివరి రోజైన సోమవారం... పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా.. పి. మ‌ధును మహాసభ రెండోసారి ఎన్నుకుంది. ఆయనతో పాటు.. 14 మంది స‌భ్యుల‌తో కార్యద‌ర్శివ‌ర్గాన్ని, 60 మంది సభ్యుల‌తో రాష్ట్ర కార్యవ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. వీరితోపాటు.. 10 మంది స‌భ్యుల‌తో ఆహ్వానితుల క‌మిటీని ఏర్పాటు చేశారు.

మూడు రోజుల పాటు సాగిన మహాసభల్లో.. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై విస్తృత చర్చ సాగింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు, రైల్వే జోన్‌ ఏర్పాటు, ఉక్కు పరిశ్రమ నిర్మాణం వంటి హామీలు నెరవేర్చాలని మహాసభ కేంద్ర, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి నిధులు, బడ్జెట్‌ లోటు భర్తీకి నిధుల విడుదల వంటి హామీలను అమలు చేయకుండా బిజెపి రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించిందని మహాసభ అభిప్రాయపడింది. బిజెపికి మిత్ర పక్షంగా ఉంటూ విభజన హామీలను సాధించడంలో టిడిపి ఘోరంగా విఫలమైందని కూడా మహాసభ అభిప్రాయపడింది.

సామాన్య రైతుల భూములను, అసైన్డ్‌ భూములను బలవంతంగా గుంజుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్‌ వర్గాలకు వత్తాసు పలుకుతోందని.. మహాసభలో నేతలు ఆరోపించారు. పారిశ్రామిక రంగంలో మూసివేతలు పెరుగుతున్నాయని, కార్మిక హక్కులను కాలరాసే చట్టాలు చేస్తున్నారని, విద్య, వైద్య రంగాల్లో కార్పొరేట్లకు అండగా ప్రభుత్వాలు నిలుస్తున్నాయని నేతలు విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన నామమాత్రంగా ఉందని, విద్య, వైద్యం, మానవాభివృద్ధి సూచికలలో రాష్ట్రం బాగా వెనకబడి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి పాలనలో అగ్రకుల దురహంకార దాడులు, దళిత, ఆదివాసీ, బలహీనవర్గాలపై పెరుగుతున్నాయని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక నవరత్నాల పేరుతో ఓట్లకోసం ప్రజాకర్షక వాగ్దానాలను గుప్పించడం తప్ప మౌలిక విధానాలలో వైసిపికీ, ఇతర పాలక పార్టీలకూ తేడా లేదని సీపీఎం మహాసభలు అభిప్రాయపడ్డాయి. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిని ఉపయోగించుకుని మతోన్మాద శక్తులు బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి, అభ్యుదయ, లౌకిక విధానాలతో ప్రజలకు ఊరట కలిగించగలిగే ప్రత్యామ్నాయం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం అన్నారు. ఈదిశగా.. ఇప్పటిదాకా చేపట్టిన ఉద్యమాలకు మించిన కార్యాచరణను రూపొందిస్తున్నామని పార్టీ కార్యదర్శిగా మళ్లీ ఎన్నికైన మధు వెల్లడించారు. తెలుగు ప్రజల సమైక్యతకోసం నిలిచిన ఘన చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఉందన్న నేతలు.. అలాంటి ఘన వారసత్వాన్ని కొనసాగించి.. తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల చేతికి అధికారం వచ్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. 

18:42 - February 12, 2018

పశ్చిమగోదావరి : భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు కాసేపటి క్రితం ముగిశాయి. గత మూడు రోజులుగా జరిగిన ఈ మహాసభల్లో జాతీయ, రాష్ట్రీయ..ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చివరి రోజైన సోమవారం పార్టీ కార్యదర్శి..ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రెండోసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధు ఎంపికయ్యారు. 60 మంది సభ్యులతో రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక కాగా 14 మంది సభ్యులతో కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు. 10 మంది సభ్యులతో ఆహ్వానితుల కమిటీగా రాష్ట్ర కార్యవర్గం రూపొందింది. 

పశ్చిమగోదావరి : ఏపీ రాష్ట్రంలో రానున్నకాలంలో పోరాటాలు..ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి ఎన్నికైన పెనుమల్లి మధు తెలిపారు. కాసేపటి క్రితం భీమవరంలో జరుగుతున్న ఏపీ సీపీఎం రాష్ట్ర 25వ మహాసభలు ముగిశాయి. ఈ సందర్భంగా మధుతో టెన్ టివి ముచ్చటించింది. ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా..విభజన చట్టం తదితర సమస్యలు ఎన్నో ఉన్నాయని, ఈ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం జరపాల్సినవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై పునరంకితం కావాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. కౌలు రౌతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని..ఎన్నో సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాలని, ప్రజల పక్షం నిలవాలని మహాసభ పిలుపునివ్వడం జరిగిందన్నారు. 14వ తేదీన ఉదయం వామపక్షాల సమావేశం జరుగుతుందని, ఇప్పటిదాక కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి భవిష్యత్ కార్యాచరణనను రూపొందిస్తామన్నారు. ప్రత్యేక హోదా కోసం చాలా కాలంపాటు పోరాటం చేస్తున్నామని..వివిధ జిల్లాల్లో విభజన హామీల కోసం పోరాటం చేస్తామని తమను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పోరాటం చేయాలి ? ఎవరెవరిని కలుపుకొని పోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భం కాదని..ప్రజా ఉద్యమాల సందర్భమని..వామపక్ష ప్రజాతంత్ర శక్తులను సమీకరిస్తామన్నారు. గతంలో ఎలాంటి పోరాటాలు చేశామో అంతకంటే ఉధృతంగా పోరాటం చేస్తామని, తొందరలో పోరాట కార్యచరణనను ప్రకటిస్తామని మధు తెలిపారు. 

14:07 - February 11, 2018

ప.గో : ఏపికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాని సీపీఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ డిమాండ్‌ చేశారు. ఇందుకోసం కేంద్రంతో తాము పోరాడుతామన్నారు. బీజేపీ ప్రభుత్వంతో పొత్తుపెట్టుకున్న టీడీపీ... కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ భవిష్యత్‌ కార్యాచణేంటో ప్రజలకు చెప్పాలంటున్న ఏచూరితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. 

 

13:25 - February 11, 2018

పశ్చిమగోదావరి : విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ విమర్శించారు. జిల్లాలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానన్న కేంద్రం.. వాటిని విస్మరించిందన్నారు. 

 

15:38 - October 8, 2017

కృష్ణా : ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హిందుత్వ అజెండాకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఐక్య ఉద్యమానికి సీపీఎం పొలిట్‌ బ్యూరో ప్రకాశ్‌ కరత్‌ పిలుపు ఇచ్చారు. హిందుత్వవాదంతోపాటు సరళీకరణ విధానాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడలోని ఎంబీ భవన్‌లోజరిగిన కమ్యూనిస్టు ఉద్యమం నేత మోటూరి హనుమంతరావు శతజయంతి సభకు కరత్‌ హాజరయ్యారు. ఉదారవాద, నియంతృత్వ, మతతత్వ విధానాలు-ప్రత్యామ్నాయం అన్న అంశంపై కరత్‌ ప్రసంగించారు. 

06:43 - May 29, 2017

నెల్లూరు : గోహింస పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆహార అలవాట్లపై ఆంక్షలు విధిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. ఈ చర్చ దుర్మార్గమని మండిపడ్డారు. ముస్లింలు, దళితులపై దాడి చేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రని ఆరోపించారు. నేటి వర్తమాన రాజకీయాల పరిస్థితి-సీపీఎం పాత్ర అన్న అంశంపై నెల్లూరులో జరిగిన సదస్సులో కారత్‌ ప్రసంగించారు. ప్రధాని మోదీ మూడేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని కరత్‌ విమర్శించారు.

19:14 - March 10, 2017

నల్గొండ :ఎన్నికలకుముందు సీఎం కేసీఆర్ ఎన్నో హామీలిచ్చాడని... అందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని... సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.. 14వందల గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులు చూసిన తర్వాతే ఈ విమర్శలు చేస్తున్నామని తెలిపారు.. సీపీఎం పాదయాత్ర వల్లే సర్కారులో కొంత చలనం వచ్చిందని.. గుర్తుచేశారు.. నల్లగొండ జిల్లాలో సీపీఎం పాదయాత్ర 146వరోజు కొనసాగుతోంది.. వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న పాదయాత్ర బృందం సభ్యులు అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు..  

13:54 - March 10, 2017

నల్గొండ : తెలంగాణ రాష్ట్రం వస్తే కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ రాష్ట్రం వచ్చిన తర్వాత కళాకారులను మర్చిపోయారని డప్పు కళాకారులు ఆరోపించారు. డప్పు కొడుతూ పాటలు పాడుతూ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తమను విస్మరించడం దారుణమని చెప్పారు. తమ సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 146వ రోజుకు చేరుకుంది. ఇవాళ నల్గొండ జిల్లాలోని పానగల్ మీదుగా ఉదయసముద్రం ప్రాజెక్టును సందర్శిస్తారు. అనంతరం దండంపల్లి స్టేజీ, కట్టంగూరు, ముత్యాలమ్మగూడెం,ఏపీ లింగోటం, నార్కెట్‌పల్లిలో పాదయాత్ర బృందం పర్యటించనుంది. 

 

10:21 - March 10, 2017

నల్గొండ : కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గుళ్లు, గోపురాలకు ఖర్చు చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అన్నారు. ప్రజల భూముల్ని లక్కొంటున్న కేసీఆర్‌ సర్కార్‌ పేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఆమె అన్నారు. 
ప్రజల జీవితాలను విచ్చిన్నం చేయడానికే  నోట్ల రద్దు : బృందాకరత్
యూపీ ఎన్నికల్లో మత తత్వ ఎజెండాతో ముందుకు పోతున్న మోదీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అన్నారు. ప్రజల జీవితాలను విచ్చిన్నం చేయడానికే  మోదీ నోట్ల రద్దు చేశారని ఆమె ఆరోపించారు. తాను ప్రధాని అన్న విషయాన్ని కూడా మరిచి మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో మాట్లాడుతున్నారని బృందా కరత్‌ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోట్ల రూపాయల ప్రజా ధానాన్ని గుళ్లు, గోపురాలకు వృధాగా ఖర్చు చేస్తున్నారని బృందా కరత్‌ విమర్శించారు. ప్రజలకు కోపం వస్తే కేసీఆర్‌ను ఏ దేవుడూ కాపాడలేరని ఆమె హెచ్చరించారు. ప్రజల భూముల్ని లాక్కొంటున్న కేసీర్‌ కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. 
అప్పుడే సామాజిక న్యాయం సాధ్యం : తమ్మినేని 
సబ్బండ వర్ణాలు, కులాలకు సమాన అవకాశాలు దక్కినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమైనట్లని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్ర మొదలైన తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చిందని తమ్మినేని అన్నారు. సీపీఎం పాదయాత్ర వల్లే కేసీఆర్‌ ఎంబీసీల గురించి ఆలోచిస్తున్నారని తమ్మినేని తెలిపారు. ఎంబీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాలని మొదట ప్రతిపాదించింది సీపీఎం పార్టీ అని తమ్మినేని తెలిపారు. మాటల గారడీలు చేయడంలో కేసీఆర్‌ దిట్ట అని తమ్మినేని విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రయోజనం కలిగేలా బీసీ సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. 
ఉత్సాహంగా మహాజన పాదయాత్ర 
సీపీఎం మహాజన పాదయాత్ర నల్లగొండ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. నేటితో పాదయాత్ర 145 రోజులు పూర్తి చేసుకుంది. నల్లొండ జిల్లాలోని బుడిమర్లపల్లి, కనగల్‌, ధర్వేసిపురం, కొత్తపల్లి, నల్లగొండలో తమ్మినేని బృందం పర్యటించింది. రాష్ట్రంలోని హమాలీల సమస్యలపై , మర్రిగూడ మండలం చెర్లగూడెం రిజర్వాయర్‌ నిర్వాసితుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. నిర్వాసితుల సమస్యలు తీర్చి వారిని ఆదుకోవాలని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - prakash karat