President Award

12:53 - September 14, 2018

హర్యానా : దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. భారతదేశంలో ఎక్కడో ఒక చోట దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని ఘటనలు కలిచివేస్తున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులు రెచ్చిపోతునే ఉన్నారు. తాజాగా హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 19 ఏళ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. 

హర్యానా రాష్ట్రం మహేందర్‌ఘర్ జిల్లాలో కోచింగ్ సెంటర్‌కు వెళ్తున్న యువతిని కారులో వచ్చి  ఎత్తుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతికి మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని బస్‌స్టాప్ సమీపంలో పడేసి వెళ్లిపోయారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది.  దారుణ ఘటనకు పాల్పడిన వారు తమ గ్రామానికి చెందిన వారేనని పేర్కొన్నట్లు సమాచారం. అత్యాచారానికి గురైన బాధితురాలు... ఇంటర్‌ ఎగ్జామ్స్‌లో  ఐదేళ్ల క్రితం  టాపర్‌గా నిలిచింది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో టాపర్‌గా నిలిచి.. రాష్ట్రపతి అవార్డు కూడా అందుకుంది. 

09:43 - January 21, 2018

ఢిల్లీ : పలు రంగాల్లో ప్రతిభావంతులైన 112 మంది మహిళామణులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఘనంగా సన్మానించారు. వివిధ రంగాల్లో తొలిసారి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన 227 మంది మహిళల పేర్లను సేకరించిన మహిళా శిశు సంక్షేమ శాఖ వారిలో 112 మందిని సత్కారానికి ఎంపిక చేసింది. తొలి మిసైల్‌ప్రాజెక్ట్‌ హెడ్‌, శ్మశానం నిర్వహిస్తున్న తొలిమహిళ, తొలి ఒలింపిక్‌ పతకం సాధించినవారు.. ఇలా వివిధ రంగాల్లోకి తొలిసారి అడుగులేసిన మహిళల వివరాలను సేకరించి ఈ గౌరవానికి ఎంపికచేశారు. ఇందులో తెలుగురాష్ట్రాలకు చెందిన పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, వంకదారత్‌ సరిత, సైనా నెహ్వాల్‌, టెస్సీ థామస్‌, కెప్టెన్‌ శోభా, కె.మిథాలీరాజ్‌, సాజిదాఖాన్‌, సానియామీర్జా, శోభనాకామినేని , గాయని కేఎస్‌చిత్ర అవార్డులు అందుకున్నారు.

 

06:57 - January 21, 2018

ఢిల్లీ : రాష్ట్రపతి చేతుల మీదుగా మొదటి మహిళ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తోన్న సరిత తెలిపారు. సరిత తెలంగాణ ఆడబిడ్డ. ఢిల్లీలో బస్సును నడుపుతున్న తొలి మహిళా డ్రైవర్‌. దీంతో ఆమెకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఫస్ట్‌ లేడీస్‌ అవార్డును అందుకున్నారు. స్వరాష్ట్రమైన తెలంగాణలో తనకు గుర్తింపులేదని... పలువురు అధికార పెద్దలను కలిసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తనకు అవకాశం ఇస్తే.. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సును నడుపుతానంటోన్న మహిళా బస్సు డ్రైవర్‌ సరిత ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss

Subscribe to RSS - President Award