Presidential Election

21:25 - July 26, 2017

హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిసారించారు. ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ రెండో రోజూ ఇదేపనిపై పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు. మోదీతో భేటీ అయిన కేసీఆర్‌... అసెంబ్లీ స్థానాల పెంపు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులపై చర్చించారు. ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను వరుసగా కలిశారు. మొదటగా ఏన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడితో కేసీఆర్‌ సమావేశమయ్యారు. కేసీఆర్‌ తనను మర్యాదపూర్వకంగానే కలిశారని.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తనకు మద్దతిస్తోందని వెంకయ్య అన్నారు.

అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లిన కేసీఆర్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈభేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రక్షణ భూముల అంశం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు సహా ఆరు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపుపైనా కేసీఆర్‌ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక బైసన్‌ పోలో గ్రౌండ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అంశంతోపాటు రక్షణ భూముల్లో ప్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.

జైట్లీతో..
సాయంత్రం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై ఆయనతో చర్చించారు. జీఎస్టీ నుంచి గ్రానైట్‌ రంగాన్ని మినహాయించాలని కేసీఆర్‌ కోరారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన దాదాపు 450 కోట్ల నిధులను త్వరగా విడుదల చేయాలని విన్నవించారు. మిషన్‌ భగీరథ, జల వనరులశాఖకు సంబంధించిన ఆర్థిక అంశాలను జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తానికి కేసీఆర్‌ తన ఢిల్లీ టూర్‌లో తెలంగాణలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. 

17:31 - July 26, 2017

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.... కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. ఆర్థికపరమైన అంశాలపై చర్చించారు. జీఎస్టీ నుంచి గ్రానైట్‌ రంగాన్ని సడలించాలని అరుణ్‌జైట్లీని కేసీఆర్‌ కోరారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 450 కోట్ల నిధులను త్వరగా విడుదల చేయాలన్నారు. మిషన్‌ భగీరథ, జల వనరులశాఖు సంబంధించిన పలు ఆర్థిక అంశాలను అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్‌ మీటింలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని అరుణ్‌జైట్లీ హామీనిచ్చారు.

17:02 - July 26, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన ప్రసంగంపై రాజ్యసభలో దుమారం రేగింది. కోవింద్‌ జాతిపిత మహాత్మాగాంధీతో సమానంగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయను పోల్చడంపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిజెపి మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూలను అవమానమించిందని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎలా ప్రశ్నిస్తారని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఆనంద్‌శర్మ వ్యాఖ్యలను రికార్డులో నుంచి తొలగించాలని డిప్యూటి చైర్మన్‌ కురియన్‌ను కోరారు. టీవీలో కనిపించడానికే కాంగ్రెస్‌ నేతలు రాద్దాంతం చేస్తున్నారని జైట్లీ మండిపడ్డారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కలిగే సమాజ నిర్మాణం కోసం గాంధీ, దీన్‌దయాల్‌ కన్న కలలను సాకారం చేయాలని రాష్ట్రపతి అన్నారు.

17:15 - July 25, 2017

ఢిల్లీ : స్పూర్తి గౌరవంతో రాష్ట్రపతి పదవిని స్వీకరిస్తున్నానని నూతన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. 14వ రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగిందని గుర్తు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ లో అడుగు పెట్టిన సమయంలో గత అనుభవాలు గుర్తుకొచ్చాయన్నారు. తాను చిన్న గ్రామంలో..మట్టి ఇంట్లో జన్మించడం జరిగిందన్నారు.

వేలాది మంది పోరాట యోధుల ఫలితంతో స్వాతంత్ర్యం వచ్చిందని, 21వ శతాబ్దపు భారతదేశం నాలుగో పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతుందన్నారు. ఈ దేశ మట్టి, నీరు, సంస్కృతి, శ్రమజీవనంపై గౌరవం ఉందన్నారు. సమానత్వం..ఆర్థిక స్వాతంత్ర్యం లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల ద్వారానే జాతి నిర్మాణం సాధ్యం కాదని, సైనికులు..పోలీసులు..రైతులు..శాస్త్రవేత్తలు జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. స్టార్టప్ ఏర్పాటు చేసిన ఉద్యోగాలు ఇస్తున్న యువత కూడా జాతి నిర్మాతేనని..ఇంటి పనులు, ఉద్యోగాలు చేసుకుంటూ తమ పిల్లల్ని ఆదర్శ పౌరులుగా తయారు చేస్తున్న మహిళలు కూడా జాతి నిర్మాతలేనన్నారు.

భిన్న సంస్కృతులు, భాషలున్నా మనమంతా భారతీయులమని,  125 కోట్ల మంది భారతీయుల ఆశలు..ఆంక్షాలు నెరవేరుస్తానని తెలిపారు. ఇప్పటి వరకు పని చేసిన రాష్ట్రపతుల బాటలోనే తాను కూడా నడుస్తానన్నారు. ఆర్థిక నాయకత్వం, నైతిక ఆదర్శం ఇవ్వగలిగే దేశంగా భారత్ ఎదగాలని, భారత్ ను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాదు..నైతిక విలువలు పెంపొందించాల్సి ఉందన్నారు. తనపై ఉంచిన విశ్వాసం వమ్ము చేయనని తెలిపారు. ఆయన పూర్తి ప్రసంగం పాఠం వినాలంటే వీడియో క్లిక్ చేయండి..

17:13 - July 25, 2017

ఢిల్లీ : భారత దేశ 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ నియమితులయ్యారు. కాసేపటి క్రితం పార్లమెంట్ సెంట్రల్ హౌస్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధానులు, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ఎంపీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తదితరులు పాల్గొన్నారు. ఎన్డీయే పక్ష రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్, విపక్షాల అభ్యర్థిగా మీరా కుమార్ పోటీ పడిన సంగతి తెలిసిందే.

20:49 - July 20, 2017
19:32 - July 20, 2017

ఢిల్లీ : రామ్‌నాథ్‌ కోవింద్‌ 14 వ రాష్ట్రపతిగా ఈ నెల 25 న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ రాజ్యసభ సభ్యులుగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా, బీహార్‌ గవర్నర్‌గా... సేవలందించారు. దళిత, వెనకబడ్డ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారు. నిరాండంబర జీవితాన్ని గడిపిన రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి అవుతానని మాత్రం ఎన్నడూ అనుకోలేదు..
దళిత కుటుంబంలో జననం 
భారతదేశానికి 14 వ రాష్ట్రపతిగా ఎంపికైన 72 ఏళ్ల రామ్‌నాథ్‌ కోవింద్‌ మారుమూల గ్రామం నుంచి వచ్చినవారే. అక్టోబర్‌ 1, 1945లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని పరాంఖ్‌ గ్రామంలోని దళిత కుటుంబంలో జన్మించారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ కాన్పూర్‌ యూనివర్సిటీ నుంచి బి.కాం., ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే మేధావిగా పేరు తెచ్చుకున్న ఆయన  న్యాయవాది వృత్తిని చేపట్టడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1971లో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఢిల్లీలో కోవింద్‌ పేరు నమోదు చేయించుకున్నారు.
మొరార్జీ దేశాయ్‌ వద్ద ప్రత్యేక అధికారిగా 
1977లో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ వద్ద ప్రత్యేక అధికారిగా పనిచేశారు. 1977 నుంచి 79 వరకు ఢిల్లీ హైకోర్టులో సెంట్రల్‌ గవర్నమెంట్‌ అడ్వకేట్‌గా పనిచేశారు. 1978లో సుప్రీంకోర్టులో అడ్వకేట్‌ రికార్డ్‌గా పనిచేశారు.  1980 నుంచి 93 వరకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో 16 ఏళ్లు పనిచేశారు. 1998 నుంచి 2002 వరకు బిజెపి దళిత మోర్చా అధ్యక్షునిగా పనిచేశఆరు.
1991లో బిజెపిలో చేరిక 
రామ్‌నాథ్‌ కోవింద్‌ 1991లో బిజెపిలో చేరారు. అప్పటి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. బిజెపి దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు 1994లో తొలిసారిగా ఎంపికయ్యారు. 2006 వరకు రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్‌కు చెందిన అనేక కమిటీల్లో ఆయన సభ్యునిగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ, హోంశాఖ, సామాజిక న్యాయం, లా అండ్‌ జస్టిస్, తదితర కమిటీల్లో సభ్యునిగా ఉన్నారు. పార్లమెంట్‌ కమిటి చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఎంపి కోటాలో తనకు కేటాయించిన నిధులను యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో పాఠశాలల నిర్మాణానికి, అభివృద్ధికి కృషి చేశారు.
అనుకోకుండానే కోవింద్‌ నియామకం 
బిహార్‌ గవర్నర్‌గా రామ్‌నాథ్‌ కోవింద్‌ నియామకం అనుకోకుండానే జరిగింది. ఆయన నియామకాన్ని అధికార జెడియు తీవ్రంగా వ్యతిరేకించింది. రామ్‌నాథ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్నాయి. రాంనాథ్‌కు భార్య సవితా కోవిద్‌,  ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను ప్రజలకు, తన గ్రామ అభివృద్ధికి ఇచ్చేయడం ద్వారా యూపీలో గుర్తింపు పొందారు.

 

19:27 - July 20, 2017

ఢిల్లీ : భారత 14వ రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నికయ్యారు. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌పై.. 65.6శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈనెల 17న ఓటింగ్‌ జరగగా.. ఈరోజు ఉదయం నుంచి ఎనిమిది రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగింది. 7 లక్షల 2 వేల 44 ఓట్లతో రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపొందినట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనూప్‌ మిశ్రా అధికారికంగా ప్రకటించారు. ఇక ఈనెల 24తో ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. 25వ తేదీన రామ్‌నాథ్‌ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతిగా గెలిచిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రధాని మోదీతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి భ‌వ‌న్‌లో తాను అడుగుపెట్టడం భార‌త ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శమన్నారు భార‌త 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్. ఇది త‌న‌కు చాలా భావోద్వేగాలతో కూడుకున్న క్షణమన్నారు. త‌న విజ‌యాన్ని కాంక్షించిన శ్రేయోభిలాషులకు కోవింద్ కృత‌జ్ఞతలు తెలిపారు.
కోవింద్‌కు మీరాకుమార్‌ శుభాకాంక్షలు 
రాష్ట్రపతిగా విజయం సాధించిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. పోటీలో తనకు సహకరించిన వారికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

 

16:25 - July 20, 2017

ఢిల్లీ : భారత 14 వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. 66.65 శాతం ఓట్లతో ఎన్ డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ గెలిచారు. కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈనెల 25న రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:29 - July 20, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఎంపీల ఓట్ల లెక్కింపు ముగిసింది. సాయంత్రం 5గంటలకు ఫలితాలు బయటకు తెలుపుతారు. మొత్తం నాలుగు టేబుళ్లలో 8 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటగా పార్లమెంట్ బ్యాలెట్ బాక్స్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అనంతరం రాష్ట్రాల బ్యాలెట్ బాక్సు ఓట్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెక్కిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 771ఎంపీలు, 4109ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss

Subscribe to RSS - Presidential Election