pro kodandaram

09:55 - October 9, 2017

సీఎం కేసీఆర్...ప్రతిపక్షాలు, కోదండరాం చేసిన వ్యాఖ్యలు సరికావని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత దుర్గాప్రసాద్, టీఆర్ ఎస్ నేత వేణుగోపాలచారి, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్థన్ రెడ్డి, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అహంకారపూరితంగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం మానుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:18 - October 7, 2017

కోదండరాం, ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, టీఆర్ ఎస్ నేత రాకేష్, టీకాంగ్రెస్ నేత బెల్లనాయక్ పాల్గొని, మాట్లాడారు. సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని..పద్ధతి మార్చుకోవాలని సూచించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే ఎలా అన్నారు. కేసీఆర్ తన తీరును మార్చుకోవాలని హితవుపలికారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:18 - August 12, 2017

మెదక్ : అమరుల స్ఫూర్తి యాత్రకు వరుసగా రెండోరోజు పోలీసులు అడ్డు తగిలారు. హైదరాబాద్‌ నుంచి యాత్రకు బయలుదేరిన తెలంగాణ జేఏసీ నేతల్ని తుప్రాన్‌ మండలం అల్లాపూర్‌దగ్గర పోలీసులు ఆపేశారు.. టోల్‌గేట్‌ దగ్గర కోదండరాం టీంను అరెస్ట్ చేసి పలు పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.. కోదండరాంను కౌడిపల్లి పీఎస్‌కు పంపారు.. అరెస్ట్ విషయం తెలుసుకున్న జేఏసీ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ముందు ఆందోళనకు దిగారు.స్ఫూర్తియాత్రకు ముందు... కోదండరాం.. నిజమాబాద్ జిల్లా పరిస్థితులపై మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి మార్గాన్ని అన్వేషించడం కోసమే అమరుల స్ఫూర్తి యాత్ర చేపట్టామని తెలిపారు. యాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అమరుల స్ఫూర్తి యత్రకు పోలీసులు అనుమతించలేదని.. అందుకే హాల్ మీటింగ్ నిర్వహించాలని తీర్మానించామని ప్రకటించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామని చెప్పారు.తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెంచేందుకు జేఏసీ స్ఫూర్తియాత్ర చేపట్టాలని రెండురోజులుగా ప్రయత్నిస్తోంది. శుక్రవారం కామారెడ్డి జిల్లాకు బయలుదేరిన జేఏసీ నేతల్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆపేశారు.. ఆ తర్వాత అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు పంపారు.. అరెస్టులకు భయపడమన్న జేఏసీ నేతలు... శనివారం మళ్లీ యాత్రకు వెళతామని ప్రకటించారు. ఈ సమాచారంతో శనివారం నిజామాబాద్‌కు వెళ్లే ప్రతి మార్గంలో తనిఖీలుచేసిన పోలీసులు... మళ్లీ జేఏసీ నేతల్ని అదుపులోకి తీసుకొని.. మళ్లీ హైదరాబాద్ తిప్పిపంపారు.

18:04 - August 12, 2017

మెదక్ : అమర వీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా నిజామాబాద్ వెళ్తున్న టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనను హైదరాబాద్‌ తరలిస్తున్నారు. మధ్యాహ్నం ఆయనను తూప్రాన్ టోల్ ఏట్ వద్ద అరెస్టు చేసి.. మెదక్‌ జిల్లా కౌడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై టీజేఏసీ నేతలు మండిపడుతున్నారు. 

16:51 - August 12, 2017

హైదరాబాద్ : అరెస్టుకు ముందు... టీ.జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం.. నిజమాబాద్ జిల్లా పరిస్థితులపై మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి మార్గాన్ని అన్వేషించడం కోసమే అమరుల స్ఫూర్తి యాత్ర చేపట్టామని తెలిపారు. యాత్రద్వారా ప్రజలను చైతన్యం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అమరుల స్ఫూర్తియత్రకు పోలీసులు అనుమతించలేదని.. అందుకే హాల్ మీటింగ్ నిర్వహించాలని తీర్మానించామని ప్రకటించారు.

15:10 - August 12, 2017

మెదక్ : టీజేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారు. అమర వీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా నిజామాబాద్ వెళ్తున్న కోదండరాంను తూప్రాన్ టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను జిల్లాలోని కౌడిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. కోదండరాం అరెస్టు సమయంలో పోలీసులు, టీజేఏసీ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.ఆయన అరెస్టుపై టీజాక్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:42 - August 12, 2017

మెదక్ : టీజేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారు. అమర వీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా నిజామాబాద్ వెళ్తున్న కోదండరాంను తూప్రాన్ టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను జిల్లాలోని కౌడిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. కోదండరాం అరెస్టు సమయంలో పోలీసులు, టీజేఏసీ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:33 - August 12, 2017

కామారెడ్డి : జిల్లాలో ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రజా, విద్యార్ధి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడం.. కామారెడ్డి మున్సిపాల్ ఆఫీసు ముందు సభ టెంట్‌ ధ్వంసం చేయడం సిగ్గు చేటని సీఐటీయు నేతలన్నారు. అధికార పార్టీ అహంభావంతో దాడి చేయడం సరి కాదన్నారు. దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయకుండా.. దాడికి గురైనవారిని అరెస్ట్‌ చేయడంపై మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిద్ధిరాములు అన్నారు. 

06:33 - August 12, 2017

హైదరాబాద్ : ఉద్యమంలో కలిసి పనిచేసిన రెండు సంఘాల మధ్య వార్ మొదలైంది. తెలంగాణ కోసం అందర్నీ ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరించిన టీజేఏసీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధానికి దిగుతోంది. కోదండరాం చేస్తున్న అమరుల స్ఫూర్తి యాత్రను నిజామాబాద్ లో గులాబీ నేతలు అడ్డుకోవడంపై టీజాక్ మండిపడుతోంది. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీ చెప్పినట్లు నిర్ణయాలు తీసుకుందని విమర్శలు ఎదుర్కొన్న.....టీజాక్ ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తుండడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల క్రితం వరకు ప్రభుత్వ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆచి తూచి స్పందించిన జాక్....ఆ తర్వాత రూటు మార్చుకుంది. ప్రభుత్వ విధానాలను ఎండగడుబడుతూ వచ్చింది. టీజేఏపీ చైర్మన్‌ కోదండరాం... గులాబీ బాస్ కెసిఆర్ కు మధ్య రోజురోజుకు అంతరం పెరుగుతూ వచ్చింది. ఇటీవలి కాలంలో టీజేఏసీ నేతలు ముఖ్యమంత్రిపై నేరుగా ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. అధికార పార్టీ నేతలు కూడా కోదండరాం... కాంగ్రెస్ ఏజెంట్ అని విమర్శిస్తూ రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీజాక్ చైర్మన్ కోదండరాం గులాబీ పార్టీ కీలక నేతల నియోజకవర్గాలనే టార్గెట్ గా చేసుకున్నారు. అమరుల స్ఫూర్తి యాత్రలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీకి ఎన్నికైన సిద్దిపేట, ముఖ్యమంత్రి తనయుడు, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోకవర్గాల్లో కోదండరాం యాత్ర పూర్తయింది. కామారెడ్డి జిల్లాలో మొదలైన యాత్రకు పోలీసులు బ్రేకులు వేయడంతో పాటు గులాబీ దళాలను నుంచి ప్రతిఘటన ఎదురైంది. టీజాక్ ఏర్పాటు చేసుకున్న టెంట్లు పీకేయడం టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల పనేనని ఆరోపిస్తన్నారు. ప్రభుత్వం పోలీసులతో తమను అడ్డుకునే ప్రయత్నం చేసినా తాము యాత్రలను మాత్రం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పోలీసుల ఓవర్ యాక్షన్ తో అవస్థలు పడుతున్న అధికార పార్టీ టీజాక్ యాత్రను కూడా అడ్డుకోవడం చర్చనీయంశంగా మారుతోంది.

22:02 - August 11, 2017

కామారెడ్డి : జిల్లాలో టీ జేఏసీ అమరుల స్ఫూర్తియాత్రకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. గులాబీ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడిచేయగా... పోలీసులు జేఏసీ నేతల్ని పోలీస్‌ స్టేషన్‌లోనే నిర్భందించారు.పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదంటూ జేఏసీ అమరవీరుల స్ఫూర్తియాత్ర చేపట్టింది. యాత్రను కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌లో ప్రారంభించేందుకు జేఏసీ నేతలంతా అక్కడికి చేరుకున్నారు.. అక్కడినుంచి టీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల హంగామా మొదలైంది.. జేఏసీ నేతల్ని గులాబీ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. బస్వాపూర్‌ గ్రామస్టేజీ నుంచి అరకిలోమీటర్ దూరంలోనే.. జాతీయ రహదారిపై కోదండరాం యాత్రను ఆపేశారు. అయితే ముందు అనుకున్న ప్రకారం అక్కడ కోదండరాం జెండాను ఎగురవేయాల్సిఉంది.. టీఆర్‌ఎస్‌ నేతల హడావుడితో జెండా ఎగురవేయకుండానే బిక్కనూరుకువచ్చారు.. అక్కడ పోలీసులు ఎంటరయ్యారు. ఎక్కువ వాహనాలకు అనుమతి లేదంటూ యాత్రను ఆపేశారు.. తమకు అనుమతి ఉందంటూ జేఏసీ నేతలు చెప్పినా వినకుండా జేఏసీ నేతల్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.. బయటకువెళ్లేందుకు ప్రయత్నించినా గేటువేసి నిర్భందించారు..

స్టేషన్‌లోనే ఆందోళన
పోలీసుల తీరుపై ఆగ్రహించిన టీజేఏసీ నేతలు... స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. వీరిని పోలీసులు అడ్డుకొని పక్కకు తోసేశారు.. మహిళలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.జేఏసీ నిరసనను ఏమాత్రం పట్టించుకోని పోలీసులు మధ్యాహ్నం కోదండరాంను భోజనం చేయాలని సూచించారు.. తాను ఆహారం తీసుకోనన్న కోదండరాం.. అక్కడే నిరాహారదీక్ష చేపట్టారు.అటు కామారెడ్డిలో జేఏసీ తలపెట్టిన బహిరంగసభ దగ్గరా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రెచ్చిపోయారు.. సభదగ్గర టెంట్‌ను ధ్వంసం చేశారు.. సభకోసం ఏర్పాట్లు చేస్తున్న విద్యార్థి సంఘాలపై టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు.. ఈ ఘటనలో 30మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.. ఇందులో పృథ్వీరాజ్‌ అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.. అతన్ని హైదరాబాద్‌కు తరలించారు.. మిగతావారికి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు.

పలువురి మద్దతు
కోదండరాం అరెస్ట్‌కు నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.. బాన్సువాడ అంబేద్కర్‌ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, టీజీవీపీ, జీవీఎస్ విద్యార్థి సంఘాలు టీఆర్‌ఎస్‌ నేతల దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.. సిపిఐయంఎల్ న్యూడెమోక్రసి నేతలు కూడా సీఎం దిష్టిబొమ్మను దహనంచేసి నిరసన తెలిపారు.స్ఫూర్తియాత్రను అడ్డుకోవడంపై కోదండరాం సీరియస్‌గా స్పందించారు.. టీఆర్‌ఎస్‌ నేతలు గుండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారు.. గతంలో ఉద్యమ సమయంలో ఇలాగే దాడులు చేశారని గుర్తుచేశారు.. ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఇదే తరహాదాడులు చేయడం సిగ్గుచేటన్నారు.. టీఆర్‌ఎస్‌ ఎన్నిసార్లు దాడులుచేస్తే అంత బలం పెరుగుతుందని చెప్పారు.జేఏసీ నేతల్ని సాయంత్రం నాలుగు గంటలవరకూ నిర్భందించిన పోలీసులు.. ఆ తర్వాత వారందరినీ హైదరాబాద్‌కు తరలించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - pro kodandaram