prof kodandaram

17:00 - July 7, 2018

నిజామాబాద్‌ : తెలంగాణలో భస్మాసుర పాలన కొనసాగుతుందని జనసమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రజలు ఓటు ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రాజెక్టుల పేరుతో జేబులు నింపుకుంటున్నారని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ, ధర్పల్లి, ప్రాజెక్టు రామడుగులో తెలంగాణ జన సమితి పార్టీ జెండాను కోదండరామ్‌ ఆవిష్కరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసి అధికారం సాధిస్తుందని కోదండరామ్‌ అన్నారు.
 

21:32 - June 30, 2018
17:09 - June 30, 2018

హైదరాబాద్ : పాలించడం చేతకాకనే ముందస్తు ఎన్నికలు అంటూ మాట్లాడుతున్నారని టీజేఎస్ వ్యవస్థాకుడు కోదండరాం పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే సంకేతాలపై టీజేఎస్ అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా కోదండరాంతో మాట్లాడింది. పాలించడం చేతకాక సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు టీజేఎస్ ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు. రైతు బంధు పథకంతో నిజమైన లబ్దిదారుడికి న్యాయం జరగడం లేదని, టీజేఎస్ క్షేత్ర స్థాయిలో నిజాలు బహిర్గతమయ్యాయని తెలిపారు. 

11:44 - June 25, 2018

హైదరాబాద్ : 2019 ఎన్నికల కోసం గ్రామం నుండి రాష్ట్రం వరకు పార్టీని పటిష్ట పరచాలని టీజేఎస్ నిర్ణయించింది. అందులో భాగంగా మల్లాపూర్ లో ఉప్పల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు కోదండరాం కమిటీల ఏర్పాటు..అవశ్యకతపై కార్యకర్తలకు దిశా..నిర్ధేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఎన్నికలకు పార్టీ నేతలు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేయాలన్నారు. 

11:11 - June 19, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటైన టీజేఎస్‌ నేతలపై... టీ కాంగ్రెస్‌ కన్ను పడిందా...? కోదండరామ్‌ నేతృత్వంలోని టీజేఎస్‌ నేతలను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందా...? టీజేఎస్‌లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే... అవుననే సమాధానం వస్తోంది. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భూసేకరణపై కేసులువేసి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన టీజేఎస్‌ నాయకురాలు, మహిళా న్యాయవాదిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ పావులుకదపడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

2019 ఎన్నికల్లో అటు అధికార టీఆర్‌ఎస్‌, ఇటు ప్రతిపక్షాలకు దీటైన జవాబు ఇవ్వాలనుకొంటున్న తెలంగాణ జనసమితికి టీ కాంగ్రెస్‌ నుంచి కొత్త సవాల్‌ ఎదురువుతోంది. టీజేఎస్‌లోని బలమైన నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రయత్నాలు కోదండరామ్‌ను కలవారానికి గురిచేస్తోంది. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై కేసులు వేసి... తెలంగాణ సర్కారును ముప్పతిప్పులు పెట్టిన న్యాయవాది రచనారెడ్డి  టీజేఎస్‌ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ వేదిక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రచనారెడ్డిని తమవైపు తిప్పుకొనేందుకు టీ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. మంచి వాద్దాటి  కలిగివున్న రచనారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టొచ్చనే ఉద్దేశంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు...ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... రచనారెడ్డిని కలిసి చర్చించినట్టు  అటు టీజేఎస్‌, ఇటు కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. 

ఇటీవల టీజేఎస్‌ తమ అధికార ప్రతినిధులతోపాటు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే ప్యానెల్‌కు రచనారెడ్డిని ఎంపిక చేసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న రచనారెడ్డి... కామారెడ్డి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డిలో పలుసార్లు పర్యటించి టీజేఎస్‌ తరుపున ప్రచారం కూడా చేశారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆమె టీజేఎస్‌కు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు.. టీజేఎస్‌ అధికార ప్రతినిధి, టీవీ చర్చా కార్యక్రమాల ప్యానెల్‌ నుంచి తన పేరు తొలగించాలని పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌కు లేఖ రాయడంపై ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. 

టీజేఎస్‌లోని బలమైన నేతలను తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు టీ కాంగ్రెస్‌ నేతలు తెరతీసిన ఆపరేషన్‌ ఆకర్ష్‌... ఇంతటితోనే ఆగుతుందా... లేక ఇంకా ఎవరిపైనా లక్ష్యాన్ని గురిపెడతారా.. అన్న అంశం తెలంగాణ జనసమితి నాయకులను కలవరానికి గురిచేస్తున్నట్టు కనిపిస్తోంది. భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.  
-----------------------------------------------

18:12 - June 9, 2018

హైదరాబాద్ : ఎన్నో ఉద్యమాలు త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్నిచోట్లా నిరాశే ఎదురైందని తెలంగాణ జనసమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.. హైదారాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు,.. వయోపరిమితిపై సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నలుమూల నుంచి భారీ సంఖ్యలో విద్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం వయోపరిమితిని పెంచితే.... పేద నిరుద్యోగులకు ఉపయోగంగా ఉంటుందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు..

 

17:13 - June 6, 2018

హైదరాబాద్ : ఉద్యమ ఆంకాంక్షలు నెరవేర్చుకునే లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ జనసమితిలో కొత్త నాయకులతో తలనొప్పులు మొదలయ్యాయి..వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో టి.జె.యస్ కు వలసలు వెల్లువెత్తాయి..దీంతో పాత వారికి ప్రాధాన్యత తగ్గుతుందంటూ కొందరు టి.జె.యస్ నేతలు వాపోతున్నారు...పార్టీ బలోపేతంలో బి.జీగా ఉన్న పార్టీ అధీనేత..పాత వారినికి ప్రాధాన్యత తగ్గిస్తున్నారా.. వాచ్‌ దిస్‌ స్టోరీ.. 
తెలంగాణ పుననిర్మాణ లక్ష్యంగా ఆవిర్భవించిన టీజేఎస్‌ 
తెలంగాణ పుననిర్మాణమే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితిలో  వివిధ పార్టీల చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టి.జె.యస్ లోకి చేరుతున్నారు.  దీనితో కొత్త నేతలకు ప్రాధాన్యత క్రమంగా పెరుగుతుందని....  ఉద్యమం సమయం నుంచి  కొదండరామ్ ను నమ్ముకుని ఉన్న నేతలు దీగాలు చెందుతున్నారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి..తెలంగాణ జనసమితిగా మారి పోవడంతో ఉద్యమ సమయంలో కొదండరామ్ తో కలిసి పని చేస్తున్న నాయకులందరు తెలంగాణ జనసమితి జెండా నిడలోకి వచ్చిచేరారు..
సభ్యత్వ నమోదులో ముందున్న జనసమితి 
తెలంగాణ జనసమితి  సభ్యత్వ నమోదులో ముందు వరుసలోఉంది..ఇంత వరకు బాగానే ఉంది..కానీ అసలు తలనొప్పి ఇక్కడే మొదలైంది..  కొత్తగా వచ్చిన నాయకులు వచ్చి రావడంతోనే సార్వత్రిక ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా ఆయా ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు..అయితే టి.జాక్ లో కొదండరామ్ తో కలిసి పని చేసిన నేతలకు టీజేఎస్‌పార్టీ ఆవిర్భవించిన నాటినుంచి క్రమక్రమంగా పార్టీలో స్ధానం  తగ్గుతూ వస్తుండడం..గతంలో పొల్చకుంటే తాజాగా పార్టీలో అనుకున్నంత ప్రాధాన్యత లేక పోవడంతో చాలా కీనుకుగా ఉన్నట్లు కొందరు నేతలు బాహాటంగా పెదవి విరుస్తున్నారు.. ఇప్పుడే పార్టీలో పరిస్ధితి ఇలా ఉంటే.. భవిష్యత్తులో తమ పరిస్ధితి ఏంటో అన్ని ఆవేదన లో ఉన్నారు..కొందరు నేతలు. ఉద్యమ సమయంలో టి.జాక్ ఎంతో బాగుడుందేని, కులాలుప్రాంతాలనే బేధాలు లేకుండా అందరు ఒక తాటిపై పని చేసేవారిమని..కానీ టి.జె.యస్ పార్టీగా ఆవిర్భవించిన తరువాత పరిస్ధితులు తారుమార అవుతున్నాయని వారంటున్నారు. ఉద్యమం నుంచి  కొదండరామ్‌తో తాము పని చేస్తున్నామని కానీ గత కొద్ది రోజులుగా పార్టీలో పరిస్ధితులు మారుతున్నాయని కొదండరామ్ దగ్గరగా ఉండే నేతలు కొందరు తన స్ధాయిని తగ్గిస్తున్నారని వారు వాపోతున్నారు.

 

13:36 - June 6, 2018
13:58 - June 1, 2018

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో తమ బలం... బలగం నిరూపించుకునేందుకు తెలంగాణ జనసమితి సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం జూన్‌లో జరిగే లోకల్‌బాడీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. తమ పార్టీ బలాన్ని చూపించేందుకు ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ఇప్పటికే క్యాడర్‌ను పెంచుకునే పనిలో బిజీబిజీగా ఉన్న జేఎస్‌పీ... పంచాయతీ ఎన్నికల్లో గెలుపుగుర్రాలను బరిలో నిలబెట్టి సత్తాచాటేందుకు రెడీ అవుతోంది. 

లోకల్‌బాడీ ఎన్నికలను తెలంగాణ జన సమితి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో తమ క్యాడర్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఆవిర్భావ సభ నుంచే పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు తెరవెనుకు ప్రయత్నాలు షురూ చేసింది. ఓ వైపు గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీ క్యాడర్‌ను సమకూర్చుకుంటూనే.... మరోవైపు పార్టీ అనుబంధ సంఘాల ఏర్పాటుపై ప్రత్యేకదృష్టి సారించింది. తెలంగాణలోని కొత్త జిల్లాల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడితోపాటు రాష్ట్ర నాయకత్వం విస్తృత పర్యటనలు చేస్తూ పార్టీ సభ్యత్వంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే గ్రామీణ, మండల స్థాయిల్లో క్యాడర్‌ను పార్టీకి ఆహ్వానిస్తూనే... గ్రామీణ, మండల, జిల్లా స్థాయి సారథులను నియమించుకుంటూ క్యాడర్‌ను పెంచుకునే పనిలో జనసమితి నేతలు ముమ్మరప్రయత్నాలు చేస్తున్నారు.

జూన్‌ మొదటివారంలోగానీ... రెండో వారంలోగానీ తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావొచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో లోకల్‌బాడీ ఫైట్‌కు టీజేఎస్‌ కసరత్తు చేస్తోంది. ఆ బాధ్యతలను ఇప్పటికే పార్టీ నియమించిన వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. పంచాయతీ పోరులో నిలబడే అభ్యర్థుల జాబితాను సైతం తయారు చేశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఏర్పడిన అనతికాలంలోనే తమ బలం నిరూపించుకునేందుకు లోకల్‌బాడీ రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే జనసమితిపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఇంటెలీజెన్స్‌ బ్యూరో ఓ రిపోర్టు తయారు చేసింది.  దీంతో ఎలాగైనా లోకల్‌బాడీ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని తమ బలాన్ని నిరూపించుకోవాలని టీజేఎస్‌ భావిస్తోంది.

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదు. ఈలోపు గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుని.. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అయ్యేందుకు ఈ లోకల్‌బాడీ ఎన్నికలు ఉపయోగపడుతాయని ఆ పార్టీనేతలు భావిస్తున్నారు. లోకల్‌బాడీ ఎన్నికల ద్వారా పార్టీ క్యాడర్‌, లీడర్‌షిప్‌ను అంచనావేయవచ్చని, పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏది ఏమైనా లోకల్‌బాడీ ఎన్నికలతో పార్టీ బలాన్ని బేరీజు వేసుకోవచ్చని నేతలు  చూస్తున్నారు.

15:57 - May 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఏకం చేసేందుకు జేఏసీ ఎంతో కృషి చేసిందని జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. కొత్తగా పార్టీని స్థాపించిన నేపథ్యంలో... టీ.జేఏసీ చైర్మన్‌ పదవికి కోదండరామ్‌ చేసిన రాజీనామాను ఆమోదించారు. జేఏసీలో తనకు ఇన్నాళ్లు సహకరించిన వారందరికీ కోదండరామ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా నియామకమైన కమిటీ సభ్యులకు కోదండరామ్‌ అభినందనలు తెలిపారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - prof kodandaram