property tax

15:55 - August 12, 2017

హైదరాబాద్ : నగర అభివృద్ధికి, కొత్త ప్రాజెక్ట్‌ల అమలుకు, జీతాల చెల్లింపులకు, రోజువారి మెయింటెనెన్స్‌కు అవసరమైన నిధులను సమీకరించేందుకు కొత్త వ్యూహాలకు బల్దియా పదును పెడుతోంది. ప్రాపర్టీ టాక్స్‌ వసూళ్లలో దూసుకెళ్లేందుకు క్షేత్రస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. అంతే కాకుండా అధికారులతో వీక్లీ రివ్యూ పెట్టి మరీ టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే సునామీ సర్వే.. ఆస్తి పన్నులో ఉన్న లోపాలను రివ్యూ చేసి పన్నులు పెంచేందుకు ప్లాన్ చేశారు. బల్దియా ఎన్నికల సమయంలో 1200 రూపాయల లోపు ఉన్న ఆస్తిపన్నును రద్దు చేశారు. అయితే వాటికి అసలు పన్ను ఎంత ఉంటుందని రివిజన్ చేసిన బల్దియా అధికారులు.

60 కోట్ల పన్ను
30 శాతం నుంచి 500 శాతం వరకు పన్నును విధించారు. దాంతో మొదట్లో రద్దైన పన్ను కంటే ఎక్కువ మొత్తంలో పన్ను డిమాండ్‌ను పెంచారు. దీంతో పాటు ఈ ఏడాది లెక్కలోకి రాని ఆస్తులు.. ఖాళీ స్థలాలను కూడా పన్ను పరిధిలోకి తీసుకువచ్చేందుకు బల్దియా తీవ్ర కసరత్తు చేస్తోంది. వాటిపై 60 కోట్ల పన్ను రాబట్టాలని ప్లాన్ చేస్తోంది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 1100 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేసిన బల్దియా.. ఈ ఏడాది 1450 కోట్ల వసూళ్లను టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఇప్పటికే 541 కోట్ల ఆస్తిపన్ను వసూలు అయ్యింది. మార్చి నాటికి 909 కోట్లు వసూలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ప్రతీ వారం పన్ను వసూళ్లపై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రతీ నెల 113 కోట్ల చొప్పున వసూలు చేయాలని టార్గెట్ ఫిక్స్‌ చేసుకున్నారు.

పన్నులు భారీగా పెంచనున్న జీహెచ్ఎంసీ
ఇక ట్రెడ్‌ లైసెన్స్‌ పన్ను ప్రకటనల పన్నులను కూడా భారీగా పెంచాలని ప్లాన్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ అందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో ఉన్న హోర్డింగుల నిర్వహణను స్ట్రీమ్‌ లైన్‌ చేయడం ద్వారా 100 కోట్ల ఆదాయం వస్తుంది. గతేడాది ట్రేడ్‌ లైసెన్స్‌ ద్వారా 50 కోట్ల ఆదాయం ఆర్జించిన జీహెచ్‌ఎంసీ ఈ ఏడాది దానిని 100 కోట్లకు పెంచాలని చూస్తోంది. ఇందులో ఉన్న లోపాలను సవరించేందుకు ఇటీవలే స్టాండింగ్‌ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో సిటీలో ఉన్న ప్రతీ వ్యాపారాన్ని లైసెన్స్ పరిధిలోకి తెచ్చి.. వారందరి నుంచి పన్ను రాబట్టాలని డిసైడ్ చేసింది. ఇక ప్రతీ యేటా టౌన్ ప్లానింగ్ ద్వారా వస్తున్న 600 కోట్ల ఆదాయాన్ని కూడా ఈ సారి భారీగా పెంచడానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. సిటీ డెవలప్‌మెంట్ కోసం పలు భారీ ప్రాజెక్ట్‌లను ముందేసుకున్న బల్దియా.. వాటిని కంప్లీట్ చేసేందుకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అన్ని రకాల ప్లాన్స్ వేస్తుంది. ఈ ఏడాది కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు షెడ్యూల్‌ ప్రకారం పూర్తవుతాయా.. లేదా అనేది మార్చి చివరికి తేలిపోనుంది. 

06:48 - April 1, 2017

హైదరాబాద్: నెలరోజులుగా ఆస్తి పన్ను వసూళ్లలో బిజీబిజీగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మొత్తానికి టార్గెట్ రీచ్ అయ్యారు. 1200 కోట్ల రూపాయల ఆస్తిప‌న్ను వ‌సూలు చేసి రికార్డు నెల‌కొల్పింది బ‌ల్దియా.

జీహెచ్ఎంసీ ప్రధాన ఆదాయవ‌న‌రు ఆస్తిప‌న్ను...

జీహెచ్ఎంసీ ప్రధాన ఆదాయవ‌న‌రు ఆస్తిప‌న్ను. దీంతో నెలరోజులుగా బిల్ క‌లెక్టర్ మొద‌లుకుని క‌మిష‌న‌ర్ వ‌ర‌కూ అంద‌రూ ట్యాక్స్ క‌లెక్షన్లలో మునిగిపోయారు. గ‌తేడాది 1020కోట్ల రూపాయల ఆస్తిపన్ను వ‌సూలు చేసిన జీహెచ్‌ఎంసీ ఈసారి 1200కోట్ల రూపాయలు వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది.

గ్రేటర్ ప‌రిధిలో ఆస్తిపన్ను చెల్లింపులుదారులు 14ల‌క్షల 24వేలు....

గ్రేటర్ ప‌రిధిలో 14ల‌క్షల 24వేల‌మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో క‌మ‌ర్షియ‌ల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ 2లక్షల 34వేలు ఉండగా రెసిడెన్షియ‌ల్, క‌మ‌ర్షియ‌ల్ ఆస్తులు 17వేలు ఉన్నాయి. వీట‌న్నింటి ద్వారా 1112 కోట్ల రూపాయల ఆస్తి పన్ను రావాల్సి ఉంది. దీంతో మొదటి నుంచి పక్కా ప్లాన్ ప్రకారం పన్ను వసూలు చేయడం ద్వారా టార్గెట్ రీచ్ అయ్యామంటున్నాయి బ‌ల్దియా వ‌ర్గాలు.

టౌన్ ప్లానింగ్ ద్వారా ఈ ఏడాది రూ. 735కోట్లు....

బ‌ల్దియా ఖ‌జానాకు చేరాల్సిన ప్రధాన ఆదాయం ప‌ర్మిష‌న్ ఫీజు. టౌన్ ప్లానింగ్ ద్వారా ఈ ఏడాది 735కోట్ల రూపాయల ఆదాయం వ‌చ్చింది. వీటిలో బిల్డింగ్ ప‌ర్మిష‌న్ ద్వారా 530కోట్లు ఆదాయం రాగా, ఎల్ ఆర్ ఎస్ ద్వారా 200కోట్లు వ‌చ్చింది. 2015-16లో కేవ‌లం 42,836 ట్రేడ్స్ మాత్రమే ఉండ‌గా ఈ ఏడాది క్షేత్రస్థాయిలో స‌ర్వే చేసిన అధికారులు 76,620 ట్రేడ్స్ ఉన్నట్లుగా గుర్తించారు. దాంతో వసూళ్లు 28కోట్ల నుంచి 42కోట్లకు పెరిగింది.

ఎర్లీ బ‌ర్డ్ ప‌థ‌కం ద్వారా గతేడాది రూ.177కోట్లు....

ఇక ఏప్రిల్ నెల‌లో ప్రక‌టించిన ఎర్లీ బ‌ర్డ్ ప‌థ‌కంలో గ‌డిచిన ఏడాది 177కోట్లు రాగా ఈ ఏడాది 212కోట్లు వ‌చ్చింది. మే,జూన్ మాసాల్లో పెట్టిన ల‌క్కి డ్రా స్కిమ్ ద్వారా కూడా బ‌ల్దియా ఖ‌జానాకు భారీగా ఆస్తిప‌న్ను జ‌మ అయ్యింది. ఇక పెద్ద నోట్ల ర‌ద్దును త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలోనూ స‌క్సెస్ అయ్యింది. టైమ్ టు టైమ్ మానిట‌రింగ్ చేయడం ద్వారా టార్గెట్ రీచ్ అయ్యామని జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్థన్ రెడ్డి తెలిపారు. మొత్తమ్మీద ముందస్తు ప్లాన్‌తో ఈ ఏడాది టార్గెట్‌ను జీహెచ్ఎంసీ అధికారులు అందుకున్నారు.

10:39 - February 10, 2017

హైదరాబాద్ : నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేస్తున్న సెల్‌ టవర్లపై సీపీఎం ఆందోళన బాట పట్టింది. బల్దియాకు రావాల్సిన ఆదాయానికి గండిపడడంతో జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. దీంతో దిగొచ్చిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌.. సెల్‌ టవర్ల అక్రమాలపై విచారణకు ఆదేశించారు. 
నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు 
హైదరాబాద్‌ నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న సెల్‌ టవర్ల నిర్మాణంపై సీపీఎం ఆందోళన బాట పట్టింది. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నిబంధనలకు నీళ్లు వదిలి సెల్‌ టవర్లకు అనుమతులు ఇస్తున్నారని సీపీఎం నేతలు మండిపడ్డారు. అధికారుల పర్యవేక్షణలోపంతో విచ్చలవిడిగా సెల్‌ టవర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. నగరంలో కేవలం 969 టవర్లకు మాత్రమే లైసెన్స్‌ ఉండగా.. అనధికారికంగా 6 వేల సెల్‌ టవర్లు నిర్మించారన్నారు. 
బల్దియా అనుమతి తప్పనిసరి 
సెల్‌ టవర్ ఏర్పాటు చేయాలంటే బల్దియా అనుమతి తప్పనిసరి. బిల్డింగ్‌ యజమాని పర్మిషన్‌తో పాటు ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా అనుమతులు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి అనుమతి కోసం లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. కొన్ని సెల్‌ కంపెనీలు 10 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తామంటూ స్టే తెచ్చుకుని ఇష్టారీతిగా టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ స్టేను వెకేట్‌ చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. 
బల్దియా ఆదాయానికి గండి 
ఎలాంటి అనుమతులు లేకుండా సెల్‌ టవర్లు ఏర్పాటు చేయడంతో బల్దియాకు ఆదాయం రాకుండా పోతుందంటున్నారు. అధికారుల చర్యలతో ఇప్పటివరకు 50 కోట్ల మేర నష్టం జరిగిందంటున్నారు. అదేవిధంగా సెల్‌ టవర్ల నుండి ఆస్తిపన్ను వసూలు చేయకపోవడంతో.. ఖజానాకు భారీ గండి పడుతుందని సీపీఎం నేతలంటున్నారు. 
స్పందించిన కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి
సీపీఎం ఆందోళనపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి స్పందించారు. సెల్‌ టవర్లపై విచారణకు ఆదేశించారు. టౌన్‌ ప్లానింగ్‌ చీఫ్‌ దేవేందర్‌రెడ్డిని విచారణాధికారిగా నియమించారు. నగరంలోని అన్ని సెల్‌ టవర్ల వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఇందుకోసం రెవెన్యూ విభాగం నుండి.. టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల నుంచి రెండు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇష్టారీతిని వెలుస్తున్న సెల్‌ టవర్ల నిర్మాణాలకు ఇప్పటికైనా అడ్డుకట్ట పడుతుందో.. లేదో కొద్దిరోజుల్లో తేలనుంది. 

 

15:42 - February 9, 2017

హైదరాబాద్: జీహెచ్ఎంసీ లో సెల్‌టవర్లపై కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు.. విచారణ అధికారిగా టౌన్‌ప్లానింగ్‌ చీఫ్ ఆఫీసర్‌ దేవేందర్‌ రెడ్డిని నియమించారు.. అలాగే రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌ విభాగాలతో రెండు యాక్షన్‌టీంలు ఏర్పాటు చేశారు... గ్రౌండ్‌లెవల్లో పరిస్థితిని విచారించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.. అవసరమైతే అనధికారికంగాఉన్న సెల్‌ టవర్లను తొలగించాలని ఆదేశించారు..

17:14 - November 10, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో బల్దియాకు భారీగా ఆదాయం తగ్గింది. మరోవారం పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. రోజువారిగా బిల్లులు, ట్యాక్స్ లు వసూలు చేసే సంస్థలకు రాబడులు తగ్గాయి. జీహెచ్ ఎంసీకి ప్రతిరోజూ వచ్చే ఆదాయం కంటే 2 రెట్లు తక్కువగా ఆదాయం వస్తుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:13 - May 28, 2016

మెదక్ : సుదీర్ఘీ విరామం తరువాత సిద్ధిపేట మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం జరిగింది. మున్సిపల్ లో విలీనం చేసిన ఆరు పంచాయతీలపై చర్చ జరిగింది. అనంతరం పన్నులను పెంచే విషయాన్ని అధికారులు తెలిపారు. దీనిని బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్లకార్డులు ప్రదర్శింస్తూ బైఠాయించారు. అసలు అభివృద్ధి చేయకుండానే పన్నులు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. దీనితో టీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆస్తి పన్నుల పెంపు ఆలోచన ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 

06:53 - March 30, 2016

హైదరాబాద్: గ్రేటర్‌లో అధికారులు బిజీ అయ్యారు.. ఎవ్వరిని కదిలించినా ఆస్తి పన్ను వసూళ్ల మాటే వినిపిస్తోంది. టార్గెట్‌ను రీచ్ కావడం కోసం స్పెషల్ టీమ్స్ రంగలోకి దిగాయి. రేపటితో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. మరి ఈలోపే జీహెచ్‌ఎంసి ఆస్తిపన్ను లక్ష్యాన్ని రీచ్ అవుతుందా?...
ఇంకా ఒక్కరోజే..
బిల్లు కలెక్టర్ మొదలుకొని కమిషనర్ వరకు అందరూ టాక్స్ కనెక్షన్లలో మునిగిపోయారు. గత ఏడాది ఇదే సమయానికి 920 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి, ఈ ఏడాది 850కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కొన్ని సర్కిళ్లలో పన్నులు బాగా వసూలైతే, మరికొన్ని ప్రాంతాల్లో చాలా మందకొడిగా  సాగుతోంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి నేటితో కలుపుకుని రేపొక్కరోజే మిగిలి ఉండటంతో అధికారులంతా ఉరుకులు పరుగులు మీద టాక్స్ వసూళ్లు చేస్తున్నారు.
అందుకే ఫోకస్ తగ్గిందా?
ఆస్తి పన్ను వసూలు కోసం సర్కిల్ వారీగా టార్గెట్స్‌ ఫిక్స్ జీహెచ్‌ఎంసీ చేసింది. రికార్డు స్థాయిలో గత ఏడాది 1120 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈసారి 1200 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. అందుకోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. తొలి దశలో రెడ్ నోటీసులు అధికారులు అందించారు. ప్రాపర్టీ టాక్స్ చెల్లించని వారి ఆస్తులను సీజ్ చేస్తున్నారు. అయితే 80 కోట్ల రూపాయలు మైనస్‌ కావడానికి మరోకారణముంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు తాయిలంగా ప్రభుత్వం ఆస్తి పన్నును 1200 రూపాయలు చెల్లించేవారందరికీ 101 రూపాయల వరకు తగ్గించింది. దీంతో ఆ ఎఫెక్ట్ పడిందని అధికారులు చెబుతున్నారు. మరో వైపు రెండు నెలలు బల్దియా ఎన్నికల వల్ల కూడా పన్ను వసూళ్లపై ఫోకస్ చెయ్యకపోవడానికి కారణమైందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరికొన్ని గంటల్లో అధికారులు 250 కోట్ల వసూళ్ల టార్గెట్‌ను రీచ్ అవుతారా.. లేక వచ్చినకాడికే సర్దుకుపోతారా అనేది చూడాలి. 

11:54 - March 29, 2016

వరంగల్ : అవును పన్ను కట్టలేదని మున్సిపల్ అధికారులు ఇళ్లకు ఉన్న తళుపులను విరగ్గొట్టి తీసుకెళ్లారు. ఇది మరెక్కడో కాదు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. ఇంటి పన్ను బాకీ ఉన్నారన్న కారణంతో.. ఇంటి తలుపులు విరగొట్టి లాక్కెళ్లారు. రెండు వేల రూపాయలకు మించి  బకాయిలు ఉన్న వారి ఇంటి తలుపులు తీసుకెళుతున్నారు. అయితే మార్చి 31వ తేదీ వరకు గడువున్నా అధికారులు మాత్రం బలవంతపు వసూళ్లకు  పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరోవైపు కమర్షియల్, షాపింగ్ ఎలాంటి ప్రామాణికత లేకుండా పన్నులు విధిస్తున్నారని ఆరోపించారు. అయితే మాల్యాలాంటి వాళ్లు ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతుంటే తమ లాంటిపట్ల ఇలా వ్యవహరించడం పై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

17:27 - February 22, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేసే యోచనలో జీహెచ్‌ఎంసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీగా ఆస్తి పన్నులు బకాయిలు పేరుకుపోవడంతో.. మొండి బకాయిలను వసూలు చేసే ప్లాన్‌ను గ్రేటర్‌ కార్పొరేషన్‌ రూపొందిస్తోంది. బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తే దాదాపు రు.550 కోట్ల రూపాయల వరకు బకాయిదారులకు లబ్ది చేకూరుతుంది.

07:03 - February 17, 2016

హైదరాబాద్ : ఆస్తిపన్ను వసూలుపై జీహెచ్ ఎంసీ దృష్టి పెట్టింది. అధికారులకు రోజువారీ లక్ష్యాలు నిర్ణయించారు. టార్గెట్లకు చేరుకునేందుకు వీలుగా ఇళ్ల యజమానులపై బిల్లు కలెక్టర్లు ఒత్తిడి పెంచుతున్నారు. పాత బకాయిలతోపాటు ఆస్తిపన్ను వసూలు చేసేందుకు సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు.

ఆస్తి పన్నే ప్రధాన ఆదాయం

బల్దియా ఎన్నికల హడావుడి ముగియడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పుడు ఆస్తి పన్ను వసూలు మొదలు పెట్టారు. నగరపాలక సంస్థలకు ఆస్తి పన్నే ప్రధాన ఆదాయవనరు కావడంతో... ఈ పనిలో అధికారులు, సిబ్బంది బిజీ అయ్యారు. మెరుగైన పౌరసదుపాయాల కల్పనకు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించాలంటూ ప్రజలకు కోరుతున్నారు.

గ్రేటర్‌లో పన్ను చెల్లింపుదారులు 14.10 లక్షల మంది .....

జీహెచ్‌ఎంసీ ఈసారి భారీగా ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. గ్రేటర్‌లో 14.10 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులున్నారు. వీరి నుంచి 11 వందల కోట్ల పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. టార్గెట్లకు చేరుకునేందుకు వీలుగా వసూళ్లను పర్యవేక్షించేందుకు సర్కిళ్లవారీగా ప్రత్యేక అధికారులను నియమించారు.

దీర్ఘకాల బకాయిదారులు 2,400 మంది .....

పన్ను బకాయిదారులను విడిచిపెట్టరాదని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. గ్రేటర్‌ పరిధిలో 1700 కోట్ల రూపాయల ఆస్తిపన్ను బకాయిలు ఉన్నాయి. దీర్ఘకాలంగా బకాయిలున్న 2,400 మంది జాబితా తయారు చేశారు. వీరి నుంచి 412 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది. నగరంలోని 24 సర్కిళ్లు ఉన్నాయి. ప్రతి సర్కిల్‌ పరిధిలో అత్యధిక మొత్తంలో పన్ను బకాయిపడ్డ వందమందిని గుర్తించారు. బకాయిల వసూలు కోసం ఆరుగురు పర్యవేక్షకులతో ప్రత్యేక బృందాన్ని నియించారు. ఆస్తిపన్ను వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందిస్తున్నారు. టీవీ, రేడియో, హోర్డింగ్స్‌ ద్వారా ప్రచారానికి సిద్ధమయ్యారు. ఆస్తిపన్ను వసూలు చేయడంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఏ మేరకు లక్ష్యాన్ని సాధిస్తారో చూడాలి. 

Don't Miss

Subscribe to RSS - property tax