Public Talk

19:52 - August 11, 2018

'మారుతి' స‌మ‌ర్పణ‌లో శ్రీ శైలేంద్ర ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై 'ప్రభాక‌ర్.పి' ద‌ర్శక‌త్వంలో 'బ్రాండ్ బాబు' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ఎస్‌.శైలేంద్రబాబు నిర్మించారు. డైరెక్టర్ 'మారుతి' కథ అందించారు. ఈ మూవీలో సుమంత్ శైలేంద్ర‌, ఈషా రెబ్బా, పూజిత వ‌న్నోడ హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమా విడుదలైన సందర్భంగ టెన్ టివి 'ప్రభాకర్ పి'తో ముచ్చటించింది. ఆయన చిత్ర విశేషాలతో మరిన్ని ముచ్చట్లు తెలియచేశారు. ఆయన ఎలాంటి విశేషాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి. 

20:25 - August 5, 2018

చి''ల''సౌ'' మూవీ టీంతో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో సుశాంక్, హీరోయిన్ రుహానీ మాట్లాడుతూ సినిమా విషయాలను తెలిపారు. అంజలి లాంటి అమ్మాయి అయితే పెళ్లికి చేసుకోవడానికి ఆలోచిస్తానని సుశాంత్ అన్నారు. యాక్టర్ రాహుల్ రామకృష్ణన్ ప్రాంక్ కాల్ చేసి, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

22:02 - July 29, 2018

టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న  మూవీ '''హ్యాపి వెడ్డింగ్'' సుమంత్ అశ్విన్ హీరోగా, కొనిదెల వారి హీరోయిన్ నిహారిక హీరోయిన్ గా  ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నఈ మూవీని, యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ దర్శకత్వం వహించారు..

లవ్వర్ బాయ్ ఇమేజ్ మూవీస్ హీరో సుమంత్ అశ్విన్.. బారీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చి, క్యూట్ లవ్ స్టోరీ మూవీ చేసిన హీరోయిన్ నిహారిక కొనిదెల. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన  మెచ్యూర్డ్ మారేజ్ స్టోరీ హ్యాపీ వెడ్డిండ్.. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూద్దాం..

ల‌వ‌ర్‌, కేరింత లాంటి యూత్ ఫుల్ స్టోరీస్ తో, లవ్వర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సుమంత్ అశ్విన్.. యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌, అన్ని సినిమాలు అబో యావరేజ్ లాక్ తెచ్చుకున్నాడు..మరి ఈ మూవీతో సుమంత్ అశ్విన్ లైఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.. 

ఇక అచ్చ‌తెలుగు చీర‌క‌ట్టు తో ప‌ద‌హ‌ర‌ణాల తెలుగు పిల్లగా, ఒక మనసు మూవీతో తెలుగు తెర‌కి పరిచ‌య‌మై, ప్ర‌తి తెలుగు వారింటి ఆడ‌ప‌డుచులా, త‌న ప్లెజెంట్ న‌ట‌న‌తో ఆకట్టుకుంది నిహ‌రిక. మెగా ఫ్యామిలీలో దాదాపు తొమ్మింది మంది హీరోలు ఉండగా.. ఒకే ఒక్క హీరోయిన్ గా బయటకు వచ్చింది నిహారిక.. ఈ మూవీతో నిహారిక హీరోయిన్ గా సెటిల్ అయినట్టేనా లేదా అన్న విషయం తెలిసిపోతుంది..

హ్యాపి వెడ్డింగ్  ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ తో పాటు అన్ని కార్యక్రమాలు  గ్రాండ్ ప్లాన్ చేశారు. సుమంత్ అశ్విన్ బర్త్ డే స్పెషల్ గా  ట్రైలర్ రిలీజ్ చేస్తే  మంచి రెస్పాన్స్ వచ్చింది.. దాంతో పాటు మూవీకి  మంచి పబ్లిసిటీ కూడా చేశారు.. మారి ఇవన్నీ సినిమా పై ఎలాంటి ప్రభావంచూపిస్తాయో చూడాలి..

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన  ట్రైలర్, టీజర్స్, అండ్ ప్రమోషనల్ వీడియోస్ అన్ని ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.. ఇంతకు ముందు సినిమాల కంటే ఈ మూవీ డిఫరెంట్ గా ఉండబోతుందన్న సిగ్నెల్స్ ఇచ్చాయి.. అయితే మూవీ పై వీటి ప్రభావం ఎంత వరకు ఉంటుందో వేచి చూడాలి....

సుమంత్ అశ్విన్, నిహారికా కొనిదెల తో పాటు, అన్నపూర్ణమ్మ, నరేశ్, మురళీ శర్మ, పవిత్ర లోకేశ్, తులసి, ఇంద్రజ లాంటి సీనియర్ నటీనటులు ఈ సినిమాలో నటించారు.. భారి తారగణం ఉన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి..

సాంప్రదాయ పెళ్ళి వేడుక, పెళ్ళి తరువాత జీవితం, అనే అంశాలతో మన ముందుకు వస్తున్న ఈ మూవి.. ప్రేక్షకులకు నచ్చుతుందా, లేదా అనేది తెలియాలి.. హీరో హీరోయిన్ బ్యాగ్రైండ్స్ అలా ఉంచితే ఈ సినిమా కథ ఎంత వరకు ఆడియన్ కు రీచ్ అవుతుందో చూడాలి.. 

19:09 - July 27, 2018

హాయ్ ఆల్ ..వెల్కమ్ టు రివ్యూ అండ్ రేటింగ్ ప్రోగ్రాం నేడే విడుదల . రిలీజ్ ఐన సినిమాల రివ్యూ ఇస్తూ రేటింగ్ ని అనలైజ్ చేసే నేడే విడుదల ఈరోజు కూడా రీసెంట్ సినిమాల రిలీజ్ తో మీ ముందుకు వచ్చింది. టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న మూవీ '''సాక్ష్యం'' బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'సాక్ష్యం'. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మాతగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బెల్ల కొండ సాయి శ్రీనివాస్ మూడు సినిమాల అనుభవంతో నాలుగోవ సినిమాతో ఈ రోజు థియోటర్ లోకి వచ్చాడు. భారీ బడ్జెట్‌తో టెర్రిఫిక్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా విడుదలవుతుంది... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముందు సినిమా 'జయ జానకి నాయక' బాక్సాఫీసు వద్ద ఫర్వలేదనిపించింది. అదే హొప్ తో హీరోగ తనలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చాడు. బెల్లంకొండ..

మూడే మూడు సినిమాలు అన్ని సినిమాలకు భారీగానే బడ్జెట్ పెట్టారు.. స్టార్ హీరోయిన్లతో పాటు, స్టార్ యాక్టర్స్ అందరూ ఆ మూడు సినిమాల్లో ఉన్నారు.. దాంతో బెల్లంకొండ మూడు సినిమాలు యావరేజ్ టాక్ సాధించుకున్నాయి.. అయితే ఇప్పుడు ముందు సినిమాలనుమించిపోయే యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో 'సాక్ష్యం' మూవీని తెరకెక్కించారు.

లక్ష్యం, లౌక్యం.. రామరామ కృష్ణ కృష్ణ, డిక్టెటర్ లాంటి వెరైటీ కాన్సెప్ట్ మూవీస్ ను డైరక్ట్ చేసిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకుడు.. అంతే కాదు బలయ్యసినిమాను డైరక్ట్ చేసిన బోయపాటి సాయి శ్రీనివాస్ తో జయజానకీ నాయకా తీస్తే.. అదే బాలయ్యతో డిక్టేటర్ చేసిన శ్రీవాస్ ఇప్పుడు సాక్ష్యంతో మన ముందకు వచ్చాడు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్స్, అండ్ ప్రమోషనల్ వీడియోస్ అన్ని ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.. ఇంతకు ముందు సినిమాల కంటే ఈ మూవీ డిఫరెంట్ గా ఉండబోతుందన్న సిగ్నెల్స్ ఇచ్చాయి..

బెల్లంకోండ సాయి శ్రీనివాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గావచ్చిన ఈ మూవీలో శరత్ కుమార్ జగపతిబాబు, మీన, రావు రమేజ్, అషితోష్ రాణ, వెన్నెల కిశోర్, రవికిషన్.. బ్రహ్మాజీ, జయప్రకాశ్, సమీర్, పవిత్ర లోకేష్ లాంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాకు వర్క్ చేశారు.

అర్జున్ రెడ్డి మూవీకి అద్భతమైన బాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన హర్షవర్థన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.. చిరంజీవి చిన్నల్లుడు హీరోగా పరిచయం అయిన విజేత చిత్రానికి కూడా సంగీతం అందించాడు రామేశ్వర్..

మరి ఈ మూవీ ఆ టీమ్ కి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.. అంతే కాదు ఈ వీక్ ఎండ్ లో ఈ మూవీతో పాటు మెగా హీరోయిన్ హ్యాపి వెడ్డింగ్ కూడా లైన్ లో ఉంది.. ఇటు సాక్ష్యం.. అటు హ్యాపీ వెడ్డింగ్ రెండు సినిమాలు మంచి బ్యాగ్రౌండ్ తోనే వస్తున్నాయి.. ఈ రెండు సినిమాలకు మంచి బజ్ ఉంది.

ప్రేక్షకుల స్పందనతో పాటు టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ కూడా తీసుకున్న తర్వాత "" సాక్ష్యం’ " సినిమాకి 10టీవీ ఇచ్చే రేటింగ్ ఇది....రేటింగ్..

20:21 - July 21, 2018

'ఆటకదరా శివ' మూవీ టీంతో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో ఉదయ్, డైరెక్టర్ చంద్రసిద్ధార్థ, నటుడు చంటి మాట్లాడుతూ తమ సినిమా అనుభవాలను తెలిపారు. డైరెక్టర్ దశరథ్, గేయి రచయిత చైతన్య ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:59 - June 1, 2018

కింగ్ నాగార్జున - ఆర్జీవీ క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'ఆఫీసర్' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు 'శివ' చిత్రం అనంతరం నాగ్..రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో ఈ చిత్రం రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక వరుస ఫ్లాప్‌లలో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని చాలా శ్రద్దగా, జాగ్రత్తగా తెరకెక్కించారని ప్రచారం జరిగింది. ఈ మూవీలో 'నాగార్జున' సరసన ముంబై మోడల్ 'మైరా సరీన్' జోడీ కట్టింది. తెలుగులో ఆమెకు తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మరి చిత్రం ఎలా ఉంది ? టెన్ టివి ఇచ్చే రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:34 - May 15, 2018

దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే అమ్మ, నాన్న తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్‌మెన్‌ లాంటి చిత్రాలు కళ్లముందు కదలాడుతాయి. ఆయన డైలాగ్స్, టేకింగ్ ప్రేక్షకులను మైమరిపిస్తాయి. పూరీ చెప్పిన ప్రేమకథలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించే విలక్షణ దర్శకుడు పూరీని సక్సెస్‌లు పలకరించి చాలా కాలమయ్యింది. ఈ క్రమంలో ఆకాష్ పూరీని హీరోగా, నేహా శర్మ అనే అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ పూరీ రూపొందించిన చిత్రం మెహబూబా. మరి మెహబూబా సినిమా టీమ్ తో 10టీవీ స్పెషల్ చిట్ చాట్..

Don't Miss

Subscribe to RSS - Public Talk