puducherry

15:56 - December 6, 2018

పుదుచ్చేరి : మన ఇంటిలోకి పాము వచ్చిందంటే కొట్టి చంపేస్తాం. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తాం. అంతే తప్ప ఏకంగా ముఖ్యమంత్రిగారికి ఫోన్ చేసి రక్షించండి అని అడగం కదా? ఏం ఎందుకు సీఎంను అడగకూడదు అనుకున్నాడో పాము బాధితుడు. పాము నుండి రక్షించండి సీఎంగారూ అంటు ఏకంగా ఫోన్ కొట్టాడు. 
పుదుచ్చేరి రాష్ట్రం, అరియాంకుప్పవలో రాజా అనే వ్యాపారి ఇంట్లోకి ఓ త్రాచుపాము వచ్చింది. భయపడిన రాజా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశాడు. స్పందించకపోవటంతో టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని ఏకంగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి ఫోన్ కొట్టాడు. ‘సార్.. మా ఇంట్లో పాము దూరింది. అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తడం లేదు. దయచేసి సాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా సీఎం నారాయణ స్వామి ఆయన అడ్రస్ తెలుసుకోవటమే కాకుండా రాజాకు ధైర్యం చెప్పారు. 
అంతేకాదు వ్యాపారి రాజా ఇంటికి వెంటనే వెళ్లాల్సిందిగా అధికారులను ఆదేశించి రాజా అడ్రస్ ను అటవీశాఖా అధికారులను తెలిపారు సీఎం నారాయణ స్వామి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబర్ 5వ తేదీన రాత్రి జరిగింది. సీఎంగారి ఆదేశాలతో రాజా ఇంటికి వెళ్లిన వారు పామును పట్టుకోవడంతో రాజా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

08:20 - October 27, 2018

చండీగఢ్ : సీబీఐలో నెలకొన్న ఇద్దరు డైరెక్టర్ల  ఆదిపత్యం పోరుతో వీధిన పడిన అధికారుల అవినీతి భాగోతంతో దేశం యావత్తు ఉలిక్కి పడింది. దీంతో ఆ ఇద్దరు డైరెక్టర్ల రాకేశ్ ఆస్థానా, అలోక్ వర్మలను విధులనుండి తాత్కాలికంగా కేంద్ర తొలగించింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అలోక్ వర్మను విధుల నుండి తొలగించటంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. 

Obsession of CBI offices across the countryపంజాబ్, హర్యానాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నినాదాలతో హోరెత్తించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కార్యాలయం వైపునకు దూసుకువస్తున్న కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. చండీగఢ్‌లోని సీబీఐ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. వాటర్ కేనన్‌లతో నిరసనకారుల్ని పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ మాట్లాడుతూ.. సీబీఐని కేంద్రం పంజరంలో బంధించిందంటూ విమర్శలు గుప్పించారు. పాట్నాలో సేవ్ సీబీఐ.. సేవ్ డెమోక్రసీ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని సీబీఐ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించారు. 

Image result for cbi office alok vermaభువనేశ్వర్‌లో నల్లరంగు టీ షర్టులు ధరించిన యువకులు సీబీఐ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో భద్రతాసిబ్బంది వారిని అడ్డుకుని చెదరగొట్టారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, హైదరాబాద్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, జమ్మూ, రాంచీ, విజయవాడ, గౌహతి, ధన్‌బాద్‌లలో ఆందోళనలు చేపట్టారు. సీపీఐ, లోక్‌తాంత్రిక్ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ ఆయా రాష్ర్టాల్లో కాంగ్రెస్‌తోపాటు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. ఈ నిరసన కార్యక్రమాలలో ఆయా రాష్ర్టాల్లో కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొనట విశేషం. 

14:00 - August 4, 2016

ఢిల్లీ : విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న అసహన పరిస్థితులపై రాజ్యసభలో సిపిఐ ఆందోళన వ్యక్తం చేసింది. పుదుచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీలో స్డూడెంట్‌ కౌన్సిల్‌ రూపొందించిన సామాజిక మ్యాగజైన్‌ను బ్యాన్‌ చేయడంపై డి.రాజా అభ్యంతరం తెలిపారు. ఆ పత్రికలో రోహిత్‌ వేముల, సామాజిక కార్యకర్తలు దబోల్కర్, పన్సారే, కల్బుర్గి ఫొటోలు ప్రచురించడమే ఇందుకు కారణమన్నారు. దీనిపై స్థానిక ఏబివిపి ఆందోళన చేపట్టడం వల్లే మ్యాగజైన్‌ను బ్యాన్‌ చేయడంతో పుదుచ్చేరి యూనివర్సిటీలో అశాంతి నెలకొందని రాజా విమర్శించారు. హెచ్‌సియు, జెఎన్‌యులో జరిగినట్లే ఇక్కడ కూడా ఏబివిపి జోక్యంతోనే అసహన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దేశవ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే ఎలా సమర్థిస్తారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. 

19:55 - June 6, 2016

పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పాలనలో తన మార్క్ చూపుతున్నారు. వీఐపీల కార్లకు, వారి ఎస్కార్ట్, పైలట్ వాహనాలకు సైరన్లు వాడకంపై నిషేధం విధించారు. వీఐపీల వాహనాలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వరాదంటూ ట్రాఫిక్ పోలీసులకు కిరణ్ బేడీ ఆదేశాలు జారీ చేశారు. వీఐపీల కోసం ట్రాఫిక్ను ఆపరాదని, ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందేనని మాజీ ఐపిఎస్‌ ఆదేశించారు. అయితే సైరన్లు వాడకం విషయంలో అంబులెన్స్లు, ఫైర్ సర్వీసులు వంటి అత్యవసర సర్వీసులకు మినహాయింపునిచ్చారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తానంటూ  కిరణ్‌ బేటి ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. 

 

21:09 - May 30, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత వి.నారాయణస్వామి పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడిని కలుసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని ఆయన గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో నారాయణస్వామితో పాటు పాండిచ్చేరి కాంగ్రెస్‌ చీఫ్‌ నమశివాయం , డిఎంకె నేతలు కూడా ఉన్నారు. పుదుచ్చేరి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా నారాయణ స్వామి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడీ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. పుదుచ్చేరిలో మొత్తం 30 సీట్లకు గాను కాంగ్రెస్-డిఎంకెలు 17 సీట్లు గెలుచుకున్నాయి.

21:32 - May 28, 2016

పుదుచ్చేరి : ఎట్టకేలకు పుదుచ్చేరి కొత్తసీఎంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నారాయణసామి ఎన్నికయ్యారు. ఆ పార్టీ శాసనసభపక్ష సమావేశం పుదుచ్చేరి కార్యాలయంలో జరిగింది. ఇందులో కాంగ్రెస్ అధిష్టానం దూతగా సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ తరపున ఎన్నికైన శాసన సభ్యులంతా పాల్గొన్నారు. సభ్యలు అభిప్రాయం మేరకు నారాయణసామిని పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్నిక చేస్తున్నట్లు షీలాదీక్షిత్ తెలిపారు.

18:49 - May 22, 2016

పుదుచ్చేరి : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఢిల్లీ ఎన్నికలకు ముందు కిరణ్ బేడీ... బీజేపీలో చేరారు. ఆ పార్టీ సీఎంగా అభ్యర్థిలో బరిలో దిగి ఓడిపోయారు. 

 

21:51 - May 19, 2016

కోల్ కతా : పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మే 27న దీదీ రెండోసారి బెంగాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారు.
తృణమూల్‌ విజయం
పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ భారీ విజయం సాధించింది. 2011 అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దీదీ అదే జోరును ప్రదర్శించారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను టిఎంసి 211 స్థానాలను కైవసం చేసుకుంది.  సిపిఎం 32, కాంగ్రెస్‌ 44, బిజెపి 6, ఇండిపెండెంట్‌ ఒకరు గెలుపొందారు. 2011లో టిఎంసికి 184 స్థానాలు వచ్చాయి. ఎన్నికల్లో టిఎంసి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి.
సీపీఎం కార్యాలయంపై తృణమూల్ కార్యకర్తల దాడి  
విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్న తృణమూల్ కార్యకర్తలు రెచ్చిపోయారు. అసన్సోల్‌లో సీపీఎం కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను తగులబెట్టారు. లెఫ్ట్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం గమనార్హం.
రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మమత 
టిఎంసి విజయంతో మమతా బెనర్జీ.. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 27న ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారయింది. తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు జరిగినా, అభివృద్ధే తనకు తిరిగి అధికారాన్ని కట్టబెట్టిందని ఈ సందర్భంగా మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమని, అయితే అసత్య ప్రచారాలు చెయ్యడం సరికాదని మమత అన్నారు.
ప్రజాతీర్పును గౌరవిస్తాం : సిపిఎం 
పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తామని సిపిఎం పేర్కొంది. ఎన్నికల ఓటమిపై సమీక్ష జరుపుతామని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. నారద స్టింగ్‌ ఆపరేషన్, శారదా స్కాం, కోల్‌కతాలో ఫ్లై ఓవర్ కూలి 27 మంది మృతి చెందిన అంశాలు ఎన్నికల్లో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఇవేవి పట్టించుకోని ప్రజలు టిఎంసికే పట్టం కట్టారు.

 

20:23 - May 19, 2016

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అసో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకుడు నగేష్ కుమార్, సీపీఎం కేంద్రకార్యదర్శి వర్గసభ్యులు వి.శ్రీనివాసరావు, ఎపిసీసీ అధికార ప్రతినిధి గౌతమ్, బీజేపీ నేత రాకేష్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను బట్టి ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. ఈ ఎన్నికలు మోడీ పాలనకు ఏమాత్రం రిఫరెండం కాదని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం..

 

14:17 - May 19, 2016

ఎన్నికలు..ఫలానా పార్టీ గెలుస్తుందని..ఫలానా పార్టీ పరాజయం చెందుతుందని..ఆ నేత ఘోరంగా ఓడిపోతారని ఎన్నికల అనంతరం ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తుంటాయి. ఇవి కొన్ని సందర్భాల్లో నిజం కాగా కొన్నిమార్లు తప్పని తేలింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలకు ఇటీవలే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలు వెలువడ్డాయి. కానీ ఈ పోల్స్ పరాజయం చెందాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి తప్పుడు అంచనాలను వేసిన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా సరైన అంచనాలు వేయలేకపోయాయి. సర్వేలు వాస్తవ ఫలితాలకు బోలెడంత దూరంలో నిలిచాయి. అసలు ఫలితాలకు, వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ కూ ఏ మాత్రం సంబంధం కనపడటం లేదు. తమిళనాడు విషయంలో సర్వేలు చెప్పిన వివరాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అక్కడ మరోసారి అధికార మార్పు తప్పదని.. అమ్మకు భంగపాటే అని ఈ సర్వేలు తేల్చి చెప్పాయి. కరుణానిధి పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ ఇవన్నీ తప్పని తేలిపోయాయి. ఫలితాల్లో 'అమ్మ' సత్తా కనిపించింది. మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి ముందుకు దూసుకపోయింది. పూర్తి మెజార్టీ సాధించిన 'అమ్మ' ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ఇక బెంగాల్ లో మమత ప్రభుత్వం ఏర్పడటం ఖాయమే అని పోస్ట్ పోల్ సర్వేలు చెప్పాయి. అయితే గత ఎన్నికల్లో కన్నా మమతకు ఈ సారి సీట్లు తగ్గుతాయని ఈ సర్వేలు పేర్కొన్నాయి. ఐదేళ్ల కిందట 294 సీట్లలో 180 వరకూ సాధించిన మమత ఈ సారి 170 చిల్లర సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ తృణమూల్ కాంగ్రెస్ 210 సీట్లకు పైస్థాయిలో దూసుకుపోతోంది. మమతకు మెజారిటీ తగ్గుతుందని వేసిన అంచనాలు తలకిందలయ్యాయి.

ఇక కేరళలో ఎల్డీఎఫ్ కూటమికి కూడా తక్కువ సీట్లు వస్తాయని సర్వేలు పేర్కొన్నాయి. అంచనాలకు మించిన స్థాయిలో ఈ కూటమికి సీట్లు సంపాదించుకొంటోంది. కాంగ్రెస్ కూటమి ఎగ్జిట్ పోల్స్ ను అందుకోలేకపోయింది. అలాగే అస్సాంలో కాంగ్రెస్ పరువు అంతో ఇంతో నిలబడుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ అవి తప్పని ఫలితాల అనంతరం వెల్లడైంది. సర్వేలు జనం నాడిని సరిగా పట్టలేకపోయాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - puducherry