pulivendula

09:19 - January 12, 2017

కడప : ముఖ్యమంఏపీని నీటి భద్రత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని త్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామన్నారు. గండికోట ద్వారా పులివెందులకు నీళ్లు ఇచ్చి.. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని అన్నారు. కడప జిల్లాలో పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. 
పైడిపాలెంలో ఎత్తిపోతల పథకం ప్రారంభం
ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం కడప జిల్లాలో పర్యటించారు. పైడిపాలెంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. గండికోట లిఫ్ట్‌ రాయలసీమకు గుండెకాయ అని, ముచ్చుమర్రి జీవనాడి అన్నారు చంద్రబాబు. కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నామన్నారు. గండికోటను పూర్తి చేస్తే 26 టీఎంసీల నీరు ఉంటుందన్నారు. తాను సీఎం అయ్యాక తాగునీటి ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టిపెట్టానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నీటి భద్రత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. వర్షపు నీరును భూగర్భ జలాలుగా మారుస్తున్నామని చెప్పారు. పోలవరంను 2019 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. త్వరలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి.. కరువు రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు చంద్రబాబు.
వైసీపీ నేతలపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫైర్   
పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడం తాను సాధించిన తొలి విజయమన్నారు. దూరదృష్టి, అనుభవంతోనే ప్యాకేజీకి ఒప్పుకున్నానని, పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు సాధించామని సీఎం తెలిపారు. మరోవైపు... అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. జగన్ సీమకు అన్నిరకాలుగానూ అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బుద్ధి ఉన్నవారెవరైనా సీమకు ఉపయోగపడే పట్టిసీమను వద్దంటారా? అని జేసీ ప్రశ్నించారు. జగన్‌కు తన తాత రాజారెడ్డి గుణాలు వచ్చాయన్నారు. కులం, వర్గంతో పెట్టుకుంటే లాభం లేదని జగన్‌కు జేసీ సూచించారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిపైనా నిప్పులు చెరిగారు.
వైఎస్ ఆర్ ఆశయం నెరవేరిందన్న : ఎంపీ అవినాష్ రెడ్డి
పైడిపాలెం రిజర్వాయర్ ప్రారంభోత్సవంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం నెరవేరిందన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. పైడిపాలెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్‌ హయాంలోనే ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో కరెంటు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని, వెంటనే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా వారి కరెంటు బిల్లులు చెల్లించి, ఆయా కాలనీలకు విద్యుత్ సదుపాయం కల్పించాలని సీఎంను అవినాష్‌రెడ్డి కోరారు.
డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి జలదీక్ష విరమణ
కడప జిల్లాలోని సింహాద్రిపురం పైడిపాలెం చెరువులోకి నీళ్లు వస్తేనే గెడ్డం తీస్తానని శపథం చేసిన ఏపీ శాసన మండలి డిప్యూటీ  ఛైర్మన్ సతీష్ రెడ్డి తాను చేపట్టిన జలదీక్షను విరమించారు. చంద్రబాబు పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడంతో.. సతీష్‌రెడ్డి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. అనంతరం దీక్షలో భాగంగా పెంచిన తలనీలాలు తీయించుకున్నారు. 

 

15:55 - January 11, 2017

కడప : భవిష్యత్ లో పులివెందులలో టిడిపి అభ్యర్థిని గెలిపించుకుని మళ్లా ముఖ్యమంత్రిని చేయాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పులివెందుల ప్రజలకు పిలుపునిచ్చారు. . పులివెందుల బ్రాంచి కెనాల్ కు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ జేసీ మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు నాయుడికి చప్పట్లు అవసరం లేదని, 2019 వరకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పులివెందుల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని మళ్లా ముఖ్యమంత్రిని చేస్తే కృష్ణా నీళ్లు కాదు..గోదావరి నీళ్లు వస్తాయన్నారు. కన్న కలలు సాకారం కావాలంటే సపోర్టు చేయాల్సిందేనన్నారు. రెడ్ల కులం అధిపత్యంపై కూడా ఆయన మాట్లాడారు. కులం..వర్గం ఇవేమి పెట్టుకోవద్దని..బాబుకు సమస్యలు పెట్టే వారు ఎవరూ లేరని ఎంపీ జేసీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

 

15:51 - January 11, 2017

కడప : భవిష్యత్ లో పులివెందులలో టిడిపి అభ్యర్థిని గెలిపించుకుని మళ్లా ముఖ్యమంత్రిని చేయాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పులివెందుల ప్రజలకు పిలుపునిచ్చారు. . పులివెందుల బ్రాంచి కెనాల్ కు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ జేసీ మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు నాయుడికి చప్పట్లు అవసరం లేదని, 2019 వరకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పులివెందుల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని మళ్లా ముఖ్యమంత్రిని చేస్తే కృష్ణా నీళ్లు కాదు..గోదావరి నీళ్లు వస్తాయన్నారు. కన్న కలలు సాకారం కావాలంటే సపోర్టు చేయాల్సిందేనన్నారు. రెడ్ల కులం అధిపత్యంపై కూడా ఆయన మాట్లాడారు. కులం..వర్గం ఇవేమి పెట్టుకోవద్దని..బాబుకు సమస్యలు పెట్టే వారు ఎవరూ లేరని ఎంపీ జేసీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

15:40 - January 11, 2017

కడప : 'నీ ఇంటికి వస్తా..నీ నట్టింటికి వస్తా' అనే డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా. అదే డైలాగ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలికితే ఎలా ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. ఎంపీ జేసీ తనదైన శైలిలో విమర్శలు..ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులివెందుల బ్రాంచి కెనాల్ కు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ జేసీ మాట్లాడుతూ..సీఎం బాబు చొరవతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనపై విమర్శలు చేసిన వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 'బూట్లు నాకే వ్యక్తి అని అయితే ఎప్పుడూ మంత్రిగా ఉండేవాడిని..మా ఇంట..వంట..సారాయి తాగే అలవాటు లేదు..నాలుక చీరుస్తావా..అంత మొగడివా..నీ ఇంటికి వస్తా..పులివెందులకు వస్తా' అంటూ డైలాగ్స్ పలికారు. 1981లో మొట్టమొదటిసారిగా తాడిపత్రికి పిలిపించి రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

15:40 - January 11, 2017

కడప : పైడిపాలెం ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబునాయుడు సాక్షిగా దివంగత రాజశేఖరరెడ్డిని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పొగిడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ శంకుస్థాపన చేసి, 650 కోట్లతో పనుల్ని ఇంచుమించు పూర్తిచేశారు. మిగిలిన పనులు టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయడంతో రాజశేఖరరెడ్డి కల నెరవేరిందని అన్నారు. అలాగే 2012-13 శనగపంట బీమా గురించి చాలా సార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. అలాగే ఎస్సీఎస్టీ కాలనీల్లో విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. వెంటనే సీఎం కల్పించుకుని, దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలో ఎస్సీఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఫ్రీగా విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని వెంటనే పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

14:25 - January 11, 2017

కడప : కృష్ణ జలధార పులివెందులకు ప్రాణాధారం అవుతోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు క‌డ‌ప‌ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌.. జిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల ప‌థ‌కాన్ని ఆయ‌న ప్రారంభించి పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీరు విడుద‌ల చేసిన అనంత‌రం మాట్లాడారు. 2018కి గ్రావిటీతో నీరు ఇవ్వాలని సంకల్పించానని ఈ ఏడాది కృష్ణా కి నీరు రాలేదని... గోదావరి నుంచి 500 టీఎంసీల నీటిని తెచ్చుకోగలగితే రాయలసీమ రతనాల సీమే అవుతుందన్నారు. రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ‌గా మార్చ‌డ‌మే త‌న‌ ధ్యేయమ‌ని నాయుడు అన్నారు. రాయ‌ల‌సీమ‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు వేగంగా నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. పోల‌వ‌రం ముంపున‌కు గుర‌య్యే ఏడు మండ‌లాల‌ను ఏపీలో క‌ల‌పాల‌ని అడిగాన‌ని, లేదంటే తాను ప్ర‌మాణ స్వీకారం చేయ‌నని, త‌న‌కి ఈ ప‌ద‌వి అవ‌స‌రం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వంతో అన్నాన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. చివ‌రికి ఆ ఏడుమండ‌లాలను ఏపీలో క‌లిపార‌ని, లేదంటే ఇప్పుడు పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ముందుకు సాగక‌పోయేవ‌ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కరవు అనే సమస్యే ఉండబోదని చెప్పారు. కరువు రహిత రాష్ట్రంగా చేయాలని సకల్పించినట్లు స్పష్టం చేశారు. నీరందని సమయంలో రైతన్నలు నిరాశపడకుండా ప్రత్యామ్నాయ పంటలకు వారిని ప్రోత్సహించారు. ఇప్పుడు పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా 41 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్‌, జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, ముఖ్య అధికారులు తదితరులు హాజరయ్యారు. కాగా పులివెందుల ప్రజల చిరకాల స్వప్నం సాకారం కావడంతో మండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి చేపట్టిన జలదీక్షను విరమించారు.

06:52 - January 9, 2017

కడప : జిల్లాలో నీళ్ల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైఎస్సార్‌కు పెట్టనికోట అయిన కడపలో పాగా వేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పులివెందులకు కృష్ణానీళ్లు తరలిచ్చేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఈనెల 11న ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు.

వైసీపీకి శత్రుదుర్బేద్యమైన కోట....

కడప జిల్లా పులివెందుల. ఇది వైసీపీకి శత్రుదుర్బేద్యమైన కోట. అలాంటి కోటలో అడుగుపెట్టేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం నీటి సమస్యను అస్త్రంగా వాడుకుంటోంది. జిల్లాలో నీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టులు అరకొరగా ఉన్న నేపథ్యంలో గాలేరు-నగరి ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులను టీడీపీ పూర్తి చేసింది. దీంతోపాటు పులివెందులలోని పైడిపాలెం రిజర్వాయర్‌ పనులను కూడా పూర్తయ్యాయి. వీటిద్వారా నీళ్లు అందిస్తే సాగునీటి అవసరాలు తీరడమే కాకుండా.. పులివెందులలో తాము పాగా వేసేందుకు అవకాశం దక్కుతుందనే లక్ష్యంతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు.

వైఎస్‌ కుటుంబాన్ని టీడీపీ నేత సతీష్‌రెడ్డి ఢీ ...

పులివెందులలో మొదటినుంచి వైఎస్‌ కుటుంబాన్ని టీడీపీ నేత సతీష్‌రెడ్డి ఢీ కొడుతున్నారు. ఎలాగైనా పులివెందుల ప్రజల మనసుల్లో చోటు సంపాదించాలని తహతహలాడుతున్నారు. అందుకోసం ఎలాగైన పులివెందులకు కృష్ణా నీళ్లు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పులివెందులకు నీళ్లు తరలించే వరకు తన గడ్డం, మీసాలు తీయనని 2015లో ప్రతిజ్ఞ పూనారు. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రాజెక్టుల పనులపై దృష్టి సారించి పూర్తి చేయించారు. తాజాగా గంటికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈనెలలో సీఎం చంద్రబాబు గండికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేయనున్నారు.

టీడీపీ నేతల వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్న వైసీపీ...

అయితే.. వైసీపీ నేతలు టీడీపీ నేతల వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. గాలేరు-నగరి, గండికోట రిజర్వాయర్‌ పనులన్నీ వైఎస్‌ హయాంలోనే పూర్తయ్యాయని.. కేవలం 10 శాతం పనులు పూర్తి చేసిన టీడీపీ ఇది తమ ఘనతగా చెప్పుకుంటుందని విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండే.. గండికోట రిజర్వాయర్‌లో దాని కెపాసిటీ మేర నీటి నిల్వ ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గండికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు నీళ్లు వస్తే..

గండికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు నీళ్లు వస్తే.. పులివెందుల బాగుపడడం అటుంచితే.. సతీష్‌రెడ్డికి గడ్డం, మీసాల బాధ తీరుతుందని జిల్లావాసులు సరదాగా చెప్పుకుంటున్నారు. ఏదిఏమైనా పులివెందులకు నీళ్లు ఇచ్చి బలం పెంచుకోవాలని టీడీపీ చూస్తుండగా.. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైసీపీ నేతలంటున్నారు. అయితే.. ప్రజలకు ప్రభుత్వం ఏ మేరకు నీళ్లుస్తుంది ? అవి ఎంతమేరకు ఉపయోగపడతాయో దాన్ని బట్టి అధికార పార్టీ వ్యూహం సఫలమా ? విఫలమా ? తేలుతుందని విశ్లేషకులంటున్నారు.

10:42 - December 29, 2016

విజయవాడ :ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రహదారులు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనల్లో విశాఖ జిల్లాలో ఇద్దరు.. కడప జిల్లాలో ముగ్గురు.. కర్నూలులో ముగ్గురు చనిపోయారు. విశాఖ జిల్లాలో లారీని.. స్కార్పియో వాహనం ఢీకొనగా.. కడపలో గొర్రెల మందపై లారీ దూసుకెళ్లింది.. కర్నూలులో ట్రాక్టర్‌ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదాల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆర్టీసి బస్సు బీభత్సం: ఇద్దరి మృతి

కడప : ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పులివెందుల మండలం.. తుమ్మలపల్లిలో గొర్రెల మందపైకి ఓ ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గొర్రెల కాపర్లు మృతి చెందారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరిరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయారు. ఈ ప్రమాదంలో వంద గొర్రెలు కూడా మృత్యవాతపడ్డాయి. చనిపోయిన గొర్రెలను రోడ్డుపై వేసి స్థానికులు ఆందోళనకు దిగారు. చీకటి.. మంచు కారణంగా ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

13:29 - December 27, 2016

కడప : జిల్లా పులివెందులలో నీళ్ల రాజకీయం మొదలైంది. ఒకవైపు అధికార టీడీపీ, మరోవైపు ప్రతిపక్ష వైసీపీ...  పులివెందులకు నీటి కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. జగన్‌ కోటను బద్దలు కొట్టాలన్నదే టార్గెట్‌గా  టీడీపీ పావులు కదుపుతోంది. అధికార పార్టీ ఎత్తుల్ని చిత్తు చేసేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు.  దీంతో పులివెందుల నీటి రాజకీయం రసకందాయంలో పడింది.
కడప జిల్లా వైసీపీకి పెట్టని కోట
కడప జిల్లా వైసీపీకి  పెట్టని కోట. ఇక పులివెందులైతే వైఎస్‌ కుటుంబానికి శత్రుదుర్భేద్యమైనదిగా  చెప్పుకుంటారు.  అవసరమైతే తన మనుషుల్నే ప్రత్యర్ధులుగా చెలామణి చేసే రాజకీయ చాణక్యం వైఎస్‌ కుటుంబానిది.  పులివెందుల నియోజకవర్గంలో  రాజకీయంగా  దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబానిదే పైచేయి. ప్రత్యర్ధికి డిపాజిట్లు కూడా దక్కని ఓటుబ్యాంక్‌ వైఎస్‌ కుటుంబానికుంది. ఒక రకంగా చెప్పాలంటే పులివెందులలో వైఎస్‌ కుటుంబం చెప్పిందే శాసనం.
వైఎస్‌ కుటుంబం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ వ్యూహాలు
శత్రుదుర్భేద్యమైన వైఎస్‌ కుటుంబం కోటను బద్దలు కొట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు  కృత నిశ్చయంతో ఉన్నారు. సాధ్యమైనంతగా వైఎస్‌ పాపులారిటీని తగ్గించాలని చూస్తున్నారు.  కడప జిల్లాకు ఆయన వచ్చినప్పుడల్లా  వైఎస్‌ కుటుంబంపై ఒంటికాలిమీద లేస్తున్నారు.  కడప జిల్లా వెనుకబాటుకు రాజశేఖరరెడ్డి కుటుంబమే కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిననాటి నుంచే పులివెందులకు నీరు ఇస్తామనే రాగం ఎత్తుకున్నారు.  గండికోట రిజర్వాయర్‌ ద్వారా చిత్రావతి , పైడిపాలెం రిజర్వాయర్‌కు నీళ్లిచ్చి పులివెందులను నీటితో తడుపుతామని చెబుతున్నారు. ఇప్పటికే గండికోట ముంపు గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.  త్వరలోనే గండికోట రిజర్వాయర్‌ను నీటితో నింపనున్నారు.  ఎన్నోఏళ్లుగా వైఎస్‌ కుటుంబం చేయలేని అభివృద్ధిని తాము చేసి చూపిస్తామన్న కృత నిశ్చయంలో చంద్రబాబు ఉన్నారు.
టీడీపీ వ్యూహాలను ఎదుర్కొనేందుకు జగన్‌ ప్రతివ్యూహాలు
కడప జిల్లాలో పట్టు సాధించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న టీడీపీ వ్యూహాలను తిప్పి కొట్టేందుకు ప్రతిపక్షనేత జగన్‌ ప్రతివ్యూహాలను  రచిస్తున్నారు. పులివెందులకు నీళ్లిస్తామన్న చంద్రబాబు  హామీలను జగన్‌  ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు.  అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లైనా ఇంత వరకు పులివెందులకు నీరు ఎందుకు ఇవ్వలేదో  చెప్పాలని నిలదీస్తున్నారు. నీటి కోసం పులివెందుల తహసీల్దార్‌ కార్యాలయం ముందు వైసీపీ నిర్వహించిన ధర్నాలో జగన్‌ పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
గండికోట నిర్వాసితులకు రూపాయి ఇవ్వలేదు : జగన్  
గండికోట నిర్వాసితులకు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదని జగన్‌ ఆరోపించారు. తుంగభద్ర నీళ్లు ఏమాత్రం పులివెందుల ప్రజలకు సరిపోవడం లేదన్నారు. చంద్రబాబు మాటలు చెబుతారు కానీ నిధులు ఇవ్వరని విమర్శించారు. ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలైనా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని ఎద్దేవా చేశారు. మొత్తానికి పులివెందుల నీటి రాజకీయాలు అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం వ్యూహ ప్రతివ్యూహాలతో రసకందాయంలో పడ్డాయి. ఇంతకీ పులివెందులకు నీరు వస్తుందా రాదా అన్న ప్రశ్న   స్థానిక ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.

 

12:39 - December 26, 2016

కడప : పులివెందులలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేపట్టారు. పులివెందులకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్ తహశీల్దార్ కార్యాలయం ముందు జగన్ ఈ ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతు..తలా తోకా లేని..అవగాహన లేని పాలన వల్లనే నీటి కొరత ఏర్పడుతోందని జగన్ ఎద్దేవా చేశారు. చిత్రావతి, శ్రీశైలంలో నీరున్నా పులివెందులకు నీరు ఎందుకివ్వటంలేదని ప్రశ్నించారు. పులివెందులకు సరిపడేంత నీరు తుంగభద్రలోలేవనీ..దీంతో ఈ ప్రాంతంలో సాగునీటి కొరత తీవ్రంగా వుందన్నారు. గండి కోట ప్రాజెక్టు కట్టనందువల్లనే ఈ దుస్థితి దాపురించిందన్నారు. పట్టిసీమ నీరు రాయలసీమకు ఇస్తానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ..ఎటువంటి స్టోరేజ్ లేకుండా ఈ ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. 16 వందల కోట్ల రూపాయలను మిగతా ప్రాజెక్టులపై పెట్టి వుంటే ఈ దుస్థితి దాపురించేది కాదన్నారు. డబ్బు పిచ్చి పట్టిన చంద్రబాబుకు రైతుల సమస్యల ఏమాత్రం పట్టటం లేదని తీవ్ర విమర్శలు చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - pulivendula